'కుమారుడికి విషమిచ్చి.. తానూ తాగింది' | woman suicide with son | Sakshi
Sakshi News home page

'కుమారుడికి విషమిచ్చి.. తానూ తాగింది'

Aug 10 2015 4:42 PM | Updated on Sep 2 2018 4:37 PM

కుటుంబ కలహాలతో ఓ తల్లి బిడ్డకు విషమిచ్చింది.

ఎమ్మిగనూరు: కుటుంబ కలహాలతో ఓ తల్లి బిడ్డకు విషమిచ్చింది. అనంతరం తానూ తాగింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద సంఘటన కర్నూలు జిల్లా ఎమ్మినగూరులో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. ఎమ్మినగూరులోని ఎస్పీఎం కాలనీకి చెందిన బొజ్జమ్మ(30) తన భర్త రెండో వివాహం చేసుకున్నాడని మనస్తాపంతో ఐదేళ్ల వయస్సు ఉన్న కొడుకుకు విషం తాపింది. అనంతరం తాను కూడా తాగి బలవన్మరణానికి పాల్పడింది. దీంతో ఇద్దరు ప్రాణాలొదిలారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  కాగా,  ఈ సంఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement