ఎంసీఐ నిర్ణయం సబబే! | medical council of india Decision Correct | Sakshi
Sakshi News home page

ఎంసీఐ నిర్ణయం సబబే!

Jan 12 2015 11:59 PM | Updated on Sep 2 2017 7:36 PM

డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (డీఏం), ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషాలటీ కోర్సులో ప్రవేశం పొందేందుకు నిర్ణయించిన కనీస అర్హతల జాబితా నుంచి ఎండీ(బయో కెమిస్ట్రీ)ని తొలగిస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది.

అర్హతల జాబితా నుంచి.. ఎండీ బయో కెమిస్ట్రీ తొలగింపును సమర్థించిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్: డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (డీఏం), ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషాలటీ కోర్సులో ప్రవేశం పొందేందుకు నిర్ణయించిన కనీస అర్హతల జాబితా నుంచి ఎండీ(బయో కెమిస్ట్రీ)ని తొలగిస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. కనీస అర్హతల జాబితా నుంచి ఎండీ బయో కెమిస్ట్రీ తొలగింపు ఎంసీఐ నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకే జరిగిందని, వైద్య వృత్తిలో నిపుణులైన డాక్టర్ల బృందం అన్నీ ఆలోచించి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏ విధంగానూ తప్పుపట్టలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.

ఎండీ(బయోకెమిస్ట్రీ) తొలగింపు సవరణ వల్ల తమకు ఎండీ(ఎండోక్రైనాలజీ) కోర్సును చేయలేకపోతున్నామన్న పిటిషనర్ల వాదన ఆధారంగా ఎంసీఐ సవరణను కొట్టేయలేమని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement