పెళ్లికి రెండు గంటల ముందు పెళ్లికొడుకు కుటుంబం, పెళ్లికొడుకు పరారయ్యారు.
మెదక్: పెళ్లికి రెండు గంటల ముందు పెళ్లికొడుకు కుటుంబం, పెళ్లికొడుకు పరారయ్యారు. జగదేవ్‌పూర్ మండలం అంగడి కిష్టాపూర్‌లో ఈ ఘటన జరిగింది.
జగదేవ్‌పూర్ మండలం అంగడి కిష్టాపూర్‌కు చెందిన యువతికి హైదరాబాద్‌కు చెందిన విజయ రెడ్డికి పెళ్లి కుదిరింది. ఈ రోజు పెళ్లి చేయాలని ఇరువైపుల పెద్దలు నిర్ణయించారు. అయితే పెళ్లికి ఇంకా రెండు గంటలు సమయం ఉందనగా పెళ్లికొడుకుతోపాటు అతని కుటుంబ సభ్యులు అందరూ చెప్పాపెట్టకుండా పారిపోయారు.