ఏపీలో కొత్తగా 47 కరోనా కేసులు | Coronavirus Cases Rises To 2561 In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 47 కరోనా కేసులు

May 23 2020 1:00 PM | Updated on May 23 2020 1:05 PM

Coronavirus Cases Rises To 2561 In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో శనివారం కొత్తగా 47 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2561కు చేరింది. గడిచిన 24 గంటల్లో 9,136 మంది సాంపిల్స్‌ పరీక్షించగా 47 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణయింది. కాగా శుక్రవారం కొత్తగా 47 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 1778కి చేరింది. కరోనాతో ఇవాళ కృష్ణా నుంచి ఒకరు మరణించడంతో మృతుల సంఖ్య 56కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 727 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 
(క‌రోనా కేసుల్లో బ్రెజిల్ రికార్డ్)
('క్షమించండి.. అది కావాలని చేయలేదు')

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement