ధర్మాడి సత్యంను సన్మానించిన సీఎం జగన్

సాక్షి, తూర్పు గోదావరి: కచ్చులురు వద్ద ప్రమాదానికి గురైన బోటును వెలిసి తీసిన ధర్మాడి సత్యంను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సన్మానించారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గురువారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన సత్యం, ఆయన బృందానికి సీఎం వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. బోటు వెలికి తీసినందుకు సీఎం అభినందించారు. కాగా సత్యం బృందాన్ని ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం సత్కరించిన విషయం తెలిసిందే. బోటు వెలికితీయడం కష్టం అని నిపుణులు నిర్ధారణకు వచ్చినప్పటికీ ధర్మాడి సత్యం తన బృందం సభ్యులతో బోటును వెలికితీశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి