United States of America
-
వైట్‌హౌస్‌లో కోనసీమ వాసికి కీలక బాధ్యత
ఐ.పోలవరం: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల భద్రతా సంస్థకు డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా తెలుగు వ్యక్తి డాక్టర్ గొట్టుముక్కల మధు (Gottumukkala Madhu) నియమితులయ్యారు. మధు తల్లిదండ్రులు గొట్టుముక్కల వెంకట సూర్య సత్యనారాయణరాజు (కొండరాజు), సత్యవాణి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రు (Kesanakurru) గ్రామానికి చెందినవారు. మధు కాకినాడలో ఇంటర్ చదువుకొని ఏలూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఎంఎస్, ఎంబీఏ చేశారు. మోటోరోలా, శాంసంగ్ కంపెనీల్లో పనిచేశారు. ప్రస్తుతం అమెరికన్ సైబర్ సెక్యూరిటీ విభాగం (CISA)లో డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.చదవండి: అమరావతి ఐకానిక్.. అమాంతం పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం -
అమెరికా వీసాలు.. కొందరి అదృష్టం
వాషింగ్టన్: అమెరికా వీసా విధానంపై కఠిన వైఖరిని విదేశాంగ మంత్రి మార్కో రూబియో సమర్థించుకున్నారు. ‘‘అమెరికా వీసాలు (US Visas) హక్కు కాదు. కొందరికి మాత్రమే లభించే అదృష్టం. మా చట్టాలు, విలువలను గౌరవించే వారికే అమెరికాలో ప్రవేశం ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. వలస నిబంధనలను మరింత కఠినతరం చేస్తామన్నారు. అమెరికా వర్సిటీల్లోని పాలస్తీనా (Palestine) అనుకూల విద్యార్థులపై చర్యల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.వీసాదారులంతా తమ అర్హత ప్రమాణాలను నిరంతరం అందుకుంటూ ఉండాల్సిందేనన్నారు. లేదంటే వాటిని రద్దు చేయాల్సి రావచ్చని హెచ్చరించారు. ‘‘అమెరికాకు ఎవరు రావచ్చో, ఎవరు రాకూడదో చట్టాలు స్పష్టంగా ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారమే ప్రతి వీసా దరఖాస్తునూ పరిశీలిస్తారు. ఉగ్రవాద కార్యకలాపాలను సమర్థించేవారు, అందుకు ఇతరులను ఒప్పించే వ్యక్తులు సైతం యూఎస్ వీసాలకు అనర్హులు’’ అన్నారు.గతేడాది అమెరికా (America) వర్సిటీల క్యాంపస్‌లలో జరిగిన ఘటనలను మార్కో రూబియో (Marco Rubio) ప్రస్తావించారు. అమెరికాలో 11 లక్షలకు పైగా విదేశీ విద్యార్థులున్నారు. ‘‘నిరసనల సందర్భంగా వారిలో పలువురు క్యాంపస్‌లను మూసేశారు. యూదు విద్యార్థులను వేధించారు. రహదారులను దిగ్బంధించారు. భవనాలనూ ముట్టడించారు’’ అని రూబియో చెప్పుకొచ్చారు. ‘‘ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. వీసా ఉల్లంఘనల విషయంలో విదేశీయులకు రాజ్యాంగ రక్షణ వర్తించదు’’ అన్నారు. చదవండి: అమెరికాలో కొత్త టెన్షన్.. వారి వీసా రద్దు -
ట్రంప్ చర్యలతో అమెరికాకు అతి పెద్ద నష్టం ఇదే!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలవల్ల ఆ దేశానికి జరుగుతున్న అతి పెద్ద నష్టం ఏమిటి? స్టాక్ మార్కెట్ సూచీలు పడిపోవటమా? బాండ్స్ మార్కెట్ దెబ్బ తినటమా? డాలర్ విలువ తగ్గుతుండటమా? ఇవేవీ కావు. అన్నింటికన్న ముఖ్యమైనది విశ్వసనీయతకు కలుగుతున్న నష్టం. స్టాక్స్‌ను, బాండ్లను, కరెన్సీ విలువను దిద్దుబాటు చర్యలతో పునరుద్ధరించుకోవచ్చు. కానీ విశ్వసనీయత (credibility) మౌలికమైనది. అది ఒకసారి దెబ్బతినటం మొదలైతే కోలుకునేందుకు చాలా సమయం తీసుకుంటుంది. అమెరికాకు ఇది అన్నింటికి మించిన నష్టమవుతున్నది. మరొకవైపు బహుళ ధ్రువ ప్రపంచ బలోపేతానికి దోహదపడుతున్నది. ఇది అమెరికా (America) కోరుకోని ఫలితం.డాలర్ బాండ్ల సంక్షోభందీనంతటికీ ఆరంభం దిగుమతి సుంకాలను ఒకేసారి 184 దేశాలపై హెచ్చించటమన్నది తెలిసిందే. సుంకాల చెల్లింపులు గతంలోనూ ఉన్నవే. అమెరికాయే గాక ఇతరులూ అప్పుడప్పుడు చేస్తుండినవే. ట్రంప్ ఒక కొత్త పద్ధతిని అనుసరిస్తూ ఒకేసారి అందరిపై ఒకే విధంగా అన్ని సరకులపై 10 శాతం పెంచి, కొద్ది రోజుల తర్వాత ఆ యా దేశాలతో వాణిజ్య లోటు అనే మొత్తాలపై 50 శాతం పెంచారు. కానీ బాండ్ల మార్కెట్‌కు, డాలర్ విలువకు నష్టాలు మొదలు కావటం జరిగింది. ఆ మాట ఆయన బహిరంగంగానే అంగీకరిస్తూ, 50 శాతం సుంకాల హెచ్చింపును అమలుకు తెచ్చిన కొద్ది గంటలలోనే ఆ చర్యను 90 రోజులపాటు వాయిదా వేయవలసి వచ్చింది.ఇందులో బాండ్ల మార్కెట్ నష్టాలు అతి తీవ్ర మైనవి కావటం ఎందుకంటే, అమెరికన్ డాలర్ విలువ అతి సుస్థిరమైనదనీ, డాలర్ బాండ్లు కొన్న ట్లయితే తమ డబ్బుకు లభించే వడ్డీ ఆదాయం, దీర్ఘకాలిక భద్రత సురక్షితమనీ నమ్మేవారు ప్రపంచం అంతటి నుంచీ డాలర్ బాండ్లలో మదుపు చేస్తారు. ఆ విధంగా చైనా సైతం ఒక ట్రిలియన్ డాలర్లకుపైగా బాండ్లు ఖరీదు చేసిందంటే పరిస్థితిని ఊహించవచ్చు. ఎన్నడూ లేని విధంగా ఇపుడు ట్రంప్ ధోరణితో డాలర్ పట్ల, అమెరికా పట్ల విశ్వాసం దెబ్బతింటుండటంతో సామాన్య ప్రజల నుంచి ఆయా దేశాల వరకు ఆ బాండ్లను అమ్మడం మొదలైంది. అమెరికాకు అతి సన్నిహితమైన జపాన్ (Japan) ప్రభుత్వం సైతం వందలాది బిలియన్ల బాండ్లు సత్వరంగా విక్రయించిందంటే సమస్య తీవ్రతను గమనించవచ్చు. మరొకవైపు కొత్త బాండ్ల అమ్మకాలు ఆగిపోయాయి. ఈ ధోరణి కొనసాగితే, అమెరికా ఆర్థిక వ్యవస్థ అనేక తీవ్ర సమస్యలను ఎదుర్కొంటుంది. దీనికితోడు డాలర్ విలువ (Dollar Value) తగ్గుదల సరేసరి. ఈ పరిణామాల కారణంగానే సుంకాలను 90 రోజులు వాయిదా వేయక తప్పలేదు. అంత చేసినా విశ్వసనీయతకు నష్టం జరగనే జరిగింది.లొంగని చైనా సుంకాలకు బెదిరి అమెరికాతో చర్చలకు కొన్ని దేశాలు సిద్ధపడటం నిజమే అయినా – కెనడా, యూరప్, చైనా (China) వంటి బలమైన ఆర్థిక వ్యవస్థలు అందుకు నిరాకరిస్తూ ఎదురు సుంకాలు విధించటం, అమెరికాకు అవసరమైన కీలకమైన ముడిసరకుల రవాణాను నిలిపివేయటం మొదలుపెట్టాయి. ఇది కూడా అమెరికన్ స్టాక్స్‌ను, బాండ్ల మార్కెట్‌ను, డాలర్ విలువను, ప్రజల నిత్యావసర సరకుల ధరలను ప్రభావితం చేయటం మొదలైంది.తమకు అన్నివిధాలా సవాలుగా మారిన చైనాను ఆర్థికంగా, ఇతరత్రా కూడా కట్టడి చేసేందుకు రిపబ్లికన్, డెమోక్రటిక్ ప్రభుత్వాలు రెండూ ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాయి. ఆ విధానాలు ఇప్పుడు ట్రంప్ రెండవ హయాంలో పరాకాష్ఠకు చేరుతున్నాయి. దీనంతటి నిజమైన ఉద్దేశం అమెరికా ఆర్థిక ప్రయోజనాల కన్నా తమను దీర్ఘకాలం పాటు దెబ్బతీయటమే అని భావిస్తున్న చైనా, ఎన్ని నష్టాలనైనా భరిస్తాముగానీ ఎటువంటి ఒత్తిడికైనా లొంగబోమని, చివరికంటా పోరాడుతామని ఒకటికి నాలుగు సార్లు స్పష్టం చేసింది.పేరు మోసిన ఆర్థిక నిపుణులంతా ట్రంప్ బృందానికి ఆర్థిక విషయాలపై అవగాహన లేదని వ్యాఖ్యానిస్తుండటం కూడా అమెరికా విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య ఆసక్తికరమైన దౌత్యనీతి ఛాయలు కనిపించటం మొదలైంది. అమెరికన్ మీడియా (American Media) వెల్లడించిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి: ట్రంప్ అధికారులు చైనా అధికారులకు ఫోన్ చేసి, తాము పెంచిన సుంకాలకు పోటీగా చైనా ఇక పెంచవద్దనీ, అది చైనాకే నష్టదాయకమనీ కోరారు. కానీ చైనా ఆ మాటను లెక్కచేయక మరిన్ని సుంకాలు పెంచింది. ఆ వెనుక ట్రంప్ అధికారులు మరొకసారి చైనా అధికారులకు ఫోన్ చేసి, ఒకసారి జిన్‌పింగ్ (Xi Jinping) చేత ట్రంప్‌తో మాట్లాడించమని కోరారు. అందుకు చైనా అధ్యక్షుడు నిరాకరించారు. మరొకవైపు అమెరికా నష్టాలు కొనసాగటం, సుంకాలను 90 రోజులు వాయిదా వేసినా మార్కెట్లకు నమ్మకం ఏర్పడక ఒక రోజు విరామం తర్వాత తిరిగి పతనమవుతుండటం, బాండ్ల సమస్య, ఉత్పత్తులకు కొరతలు, ధరల పెరుగుదలలు కొనసాగటంతో పరిస్థితి అర్థమైంది. దానితో, సుంకాలు పెంచిన ఈ నెల 2వ తేదీ నుంచి సరిగా 10 రోజులు గడిచి 12వ తేదీ వచ్చేసరికి, చైనా నుంచిదిగుమతి అయ్యే సెల్ఫోన్లు, పలు ఎలక్ట్రానిక్, కంప్యూటర్ సామగ్రిపై సుంకాల పెరుగుదలను ట్రంప్ నిలిపి వేశారు.చదవండి: ట్రంప్ సుంకాల సంక్షోభం.. అనూహ్య పరిణామాలుఇదిట్లుండగా, తన కొత్త విధానాల వల్ల అమెరికన్, తదితర పరిశ్రమలు అమెరికాకు తరలి రాగలవనే ట్రంప్ ఆశాభావానికి ఎవరి నుంచీ సుముఖత కనిపించటం లేదు. చట్టబద్ధత లేని వలస కార్మికులను పారదోలటంతో వ్యవసాయం, హోటళ్ల వంటి రంగాలు దెబ్బ తింటుండటంతో, వారి కొనసాగుదలకు యజమానులు దరఖాస్తు చేసుకోవచ్చునన్నది ఇదే 12వ తేదీ నాటి మరో ఉత్తర్వు. పోతే, విద్యా వైద్య రంగాలలో కుదింపులు, విదేశీ సహాయాల (యూఎస్ ఎయిడ్ ద్వారా) రద్దు పేద దేశాలల్లో కలిగిస్తున్న హాని, ఆగని గాజా మారణకాండ వంటి ఇతర అనేక చర్యలు కూడా ట్రంప్ పట్ల, అమెరికా పట్ల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఇది వారికి ఆర్థికానికి మించిన దీర్ఘకాలిక నష్టం.- టంకశాల అశోక్ సీనియర్ సంపాదకుడు -
యూఎస్.. డబుల్ ఇస్మార్ట్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: శత్రువు కనిపిస్తే చాలు.. తేరుకునేలోగా మెరుపుదాడి చేసే వార్‌షిప్ ఒకటైతే.. దొంగచాటుగా దెబ్బతీయాలనుకున్న వారిపై దాడి చేసి మట్టుబెట్టే యుద్ధ నౌక ఇంకోటి. వైరి దేశాలపై బరిలో దిగితే వార్ వన్‌సైడ్ అని డిసైడ్ చేసే అగ్రరాజ్యం అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలు వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ వద్ద మోహరించాయి. కదన రంగంలో ఎంతటి భయంకరంగా శత్రువును భయపెడతాయో.. విపత్తుల సమయంలో సహాయ సహకారాలు అందించడంలోనూ అంతే గంభీరంగా వ్యవహరిస్తాయి ఈ వార్‌షిప్స్.వీటిలో ఒకటి అమెరికా నౌకాదళంలో తొలిసారిగా పురుషులు, మహిళా నావికులతో కూడిన యుద్ధ నౌక యూఎస్ఎస్ కామ్‌స్టాక్ (ఎల్ఎస్డీ–45) కాగా.. మరోటి మెరుపు వేగంతో దాడి చేసి మృత్యువును పరిచయం చేసే (స్విఫ్ట్ సైలెంట్ డెడ్లీ) యుద్ధనౌకగా పేరున్న యూఎస్ఎస్ రాల్ఫ్ జాన్సన్ (డీడీజీ–114). ఒక యుద్ధ నౌకలో రాత్రిళ్లు కూడా గ్రెనేడ్లతో దాడి చేసేఅవకాశం ఉన్న లాంచర్లు.. ఏకంగా 8,200 అడుగుల దూరంలోని శత్రువును కూడా మట్టుబెట్టగలిగే సామర్థ్యం ఉన్న రైఫిల్ ఉన్నాయి. మరోదానికి శత్రువుపై 2 సీ హాక్ హెలికాప్టర్ల ద్వారా దాడి చేసే సామర్థ్యం ఉంది. చాటుగా దెబ్బతీసేందుకు శత్రు దేశాలు అమర్చిన మైన్లను గుర్తించి నాశనం చేసే సాంకేతిక పరిజ్ఞానమూ ఉంది. ఇవి భారత్–అమెరికా దేశాల త్రివిధ దళాలతో టైగర్ ట్రయాంఫ్–25 నాలుగో ఎడిషన్ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. ఈ నౌకల విశేషాలను యూఎస్ఎస్ రాల్ఫ్ జాన్సన్ కమాండింగ్ ఆఫీసర్ జాక్ సీజర్, కామ్‌స్టాక్ కమాండింగ్ ఆఫీసర్ బి.స్టాక్స్ వివరించారు. యూఎస్ఎస్ కామ్‌స్టాక్ (ఎల్ఎస్డీ–45)» జల ప్రవేశం – 1990, ఫిబ్రవరి 3 »తరగతి, రకం – విడ్బీ ఐల్యాండ్–క్లాస్ డాక్ ల్యాండింగ్ షిప్ » బరువు – 16,190 టన్నులు » పొడవు – 609 అడుగులు(186 మీటర్లు) » వెడల్పు – 84 అడుగులు (26 మీటర్లు) »వేగం – 20 నాట్స్ (37 కిమీ/గం) » సిబ్బంది సామర్థ్యం– 450 ఆయుధ సామర్థ్యం 2‘‘25 ఎంఎం, ఎంకే 38 కెనాన్స్, 2‘‘20 ఎంఎం ఫాలాన్కస్ సీఐడబ్ల్యూస్ మౌంట్స్, 6‘‘50 కాలిబర్ ఎంఈహెచ్బీ మెషిన్ గన్స్, 2 రామ్స్ » యూఎస్ఎస్ కామ్‌స్టాక్ యూఎస్ నేవీలో ఒక డాక్ ల్యాండింగ్షిప్ » జలమార్గంలో నిర్దేశిత ప్రాంతాలకు రక్షణ దళాలు, యుద్ధ సామగ్రి తరలింపులో కీలక పాత్ర పోషిస్తోంది. » ఉభయచర కార్యకలాపాల సమయంలో శత్రువులపై గగనతలం నుంచి విరుచుకుపడేందుకు వీలుగా ఈ నౌకపై హెలికాప్టర్ లాంచింగ్ సౌకర్యముంది. » ఈ నౌకలో నాలుగు ఎయిర్‌క్రాఫ్ట్ ల్యాండింగ్ సదుపాయాలతో పాటు మూడు రకాల మెషిన్ గన్లు, రెండు రోలింగ్ ఎయిర్‌ఫ్రేమ్ మిస్సైల్స్ మౌంట్స్ ఉన్నాయి. » పూర్తి స్థాయిలో వైద్య సౌకర్యాలతో పాటు అధునాతన సాంకేతికతతో ఈ నౌక యుద్ధ సమయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. » 1992లో సోమాలియాలో ‘ఆపరేషన్ రిస్టోర్ హోప్’ పేరుతో ఐక్యరాజ్య సమితి చేపట్టిన సహాయ కార్యక్రమంలో పాలుపంచుకుంది. యూఎస్ఎస్ రాల్ఫ్ జాన్సన్ (డీడీజీ–114)» జల ప్రవేశం: 2018, మార్చి 24 » తరగతి, రకం: ఆర్లీగ్ బర్కీ–క్లాస్ డిస్ట్రాయర్ » బరువు–9217 టన్నులు » పొడవు– 513 అడుగులు (156 మీటర్లు) » వెడల్పు– 66 అడుగులు (20 మీటర్లు) » వేగం– 30 నాట్స్ (56 కిమీ/గం) » సిబ్బంది సామర్థ్యం– 300 ఆయుధ సామర్థ్యం » 8 రకాల లైట్, మెషిన్, కాలిబర్ గన్నులు ఉన్నాయి. » ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించేందుకు 96 సెల్స్‌తో క్షిపణులు, నాలుగు రకాల టార్పిడోలు, 2 సీహాక్ హెలికాప్టర్లు, డబుల్ హ్యాంగర్, హెలీప్యాడ్ సౌకర్యాలు ఉన్నాయి. » యూఎస్ఎస్ రాల్ఫ్ జాన్సన్ నౌక యుద్ధ క్షేత్రంలో 9 రకాల పోరాట వ్యవస్థలను కలిగి ఉంది. » ఈ నౌకను అమెరికా 7వ నౌకాదళానికి చెందిన డిస్ట్రాయర్ స్క్వాడ్రన్ 15కు కేటాయించారు. » ఇందులో సమీకృత వాయు, క్షిపణి రక్షణ వ్యవస్థ (ఐఎంఎండీ)తో పాటు బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. » వెర్టికల్ లాంచింగ్ సిస్టం ద్వారా 96 సెల్స్ నుంచి క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం దీని సొంతం. » అంతర్జాతీయ జలాల్లో యూఎస్ నౌకాదళ శక్తి సామర్థ్యాలు చాటిచెప్పేలా కార్యకలాపాలను కొనసాగిస్తోంది. » దాడి కోసం శత్రుదేశాలు వ్యూహాత్మకంగా మోహరించిన మైన్లను కనుగొని నాశనం చేసే సాంకేతిక పరిజ్ఞానం ఈ యుద్ధ నౌక సొంతం. » ఏ మాత్రం రాజీలేని, వెనుదిరగని యుద్ధ నౌకగా దీనికి పేరుంది. ఎం–320 గ్రెనైడ్ లాంచర్ యూఎస్ఎస్ కామ్‌స్టాక్ (ఎల్ఎస్డీ–45) యుద్ధ నౌకలో ఉండే ఎం–320 గ్రెనైడ్ లాంచర్ అన్ని సమయాల్లో శత్రువులపై గ్రెనైడ్లతో దాడికి ఉపయోగిస్తారు. పగటి వేళలోనే కాక తక్కువ కాంతి ఉన్న సమయాలు, రాత్రిళ్లు కూడా ఇది గ్రెనైడ్లతో దాడి చేస్తుంది. ఏకంగా 36.. 40 ఎంఎం గ్రెనైడ్లను ఈ లాంచర్‌తో తీసుకెళ్లే వీలుంది. ప్రధానంగా రాత్రిళ్లు శత్రువులపై దాడికి దీనిని ఉపయోగిస్తారు. కార్ల్ గుస్తఫ్ రైఫిల్ యూఎస్ఎస్ కామ్‌స్టాక్ (ఎల్ఎస్డీ–45) యుద్ధ నౌకలో ఉన్న మరో ముఖ్య ఆయుధం. స్వీడన్ తయారుచేసిన ఈ రైఫిల్‌ను పట్టుకునేందుకు రెండు గ్రిప్ పాయింట్లు ఉన్నాయి. కదులుతున్న వాహనం నుంచి 350–400 మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించవచ్చు. నిలబడిన సమయంలో మాత్రం 500 మీటర్ల దూరంలోని లక్ష్యంపై కూడా దాడి చేసే వీలుంటుంది. 8,200 అడుగుల దూరంలోని శత్రువుపై కూడా ఈ రైఫిల్‌లో లేజర్ గైడెడ్ మందుగుండును ఉపయోగించి మట్టుబెట్టొచ్చు. ఒకే వ్యక్తి ఉపయోగించేందుకు వీలుగా కూడా తయారుచేశారు. ఫైర్ చేసే సమయంలో భుజంపై వెనక్కి తన్నే ఒత్తిడి తక్కువగా ఉండడం దీని ప్రత్యేకత. -
యూఎస్ ప్లస్ నినాదంతో ముందుకు!
భారత్ నుంచి గత ఏడాది 87.4 బిలియన్ డాలర్ల విలువైన వస్తు, సేవలు అమెరికాకు ఎగుమతి అయ్యాయి. అయితే, ఈ కాలంలో అమెరికా నుంచి భారత్‌కు అయిన దిగుమతులు 41.8 బిలియన్ డాలర్లు మాత్రమే కావడం గమనార్హం. అంటే అగ్రరాజ్యంతో వ్యాపారంలో మనదే పైచేయి అన్నమాట. యూఎస్‌లో పాగా వేసిన భారత్.. ప్రస్తుత మార్కెట్లలో మరింత చొచ్చుకుపోవడంతోపాటు కొత్త మార్కెట్లకు విస్తరించే సమయం ఆసన్నమైంది.అయితే ట్రంప్ ప్రతీకార సుంకాలు ప్రపంచ వాణిజ్యాన్ని ఒక కుదుపు కుదపడం.. అమెరికాలో ఆర్థిక మాంద్యం తప్పదన్న అంచనాల నేపథ్యంలో భారత్ ముందు సవాళ్లు లేకపోలేదు. ఈ సవాళ్లను అవకాశంగా మలుచుకోవాలని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనికోసం యూఎస్ ప్లస్ నినాదాన్ని అందిపుచ్చుకొని ప్రపంచ మార్కెట్‌కు నమ్మదగిన ఆకర్షణీయ, ఆర్థిక భాగస్వామిగా అవతరించాలని అంటున్నాయి. - సాక్షి, స్పెషల్ డెస్క్చూపు భారత్ వైపు.. రిస్క్ ను తగ్గించడానికి లేదా కొత్త మార్కెట్ల కోసం చూస్తున్న గ్లోబల్ కంపెనీలు సుంకం లేని లేదా తక్కువ సుంకం కలిగిన కేంద్రంగా భారత్‌లో ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. చైనా ఉత్పత్తులపై అధిక సుంకం కారణంగా భారత్‌కు అతిపెద్ద ప్రయోజనం చేకూరవచ్చని బోరా మల్టీకార్ప్ ఎండీ ప్రశాంత్ బోరా తెలిపారు. అలాగే, వియత్నాం, బంగ్లాదేశ్, ఇండోనేషియా వంటి దేశాలపై అమెరికా విధిస్తున్న పరస్పర సుంకాలు భారత ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తాయని అంటున్నారు. వచ్చే 2–3 ఏళ్లలో భారతీయ ఎగుమతిదార్లకు 50 బిలియన్ డాలర్లకుపైగా అదనపు వ్యాపార అవకాశాలు లభిస్తాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ అంచనా వేస్తోంది. విశ్వసనీయ భాగస్వామిగా.. భారత్ త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందనే వాస్తవాన్ని చాలా మంది విస్మరిస్తున్నారు. అపార దేశీయ వినియోగం, బలమైన స్వ దేశీ సరఫరా వ్యవస్థ దృష్ట్యా మన దేశం సా పేక్షంగా మంచి స్థానంలో ఉంది. ట్రంప్ సుంకాలు భారత్‌కు అపార అవకాశాలను తేవొచ్చు. పరిస్థితిని సద్వినియోగం చేసుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉ న్న దేశాలకు అత్యంత విశ్వసనీయ ఆర్థిక భాగస్వామిగా మా రడానికి గల అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవడాని కి వేగంగా అనుసరించాల్సిన విధానాలను రూపొందించాలి. – ఆనంద్ మహీంద్రా, చైర్మన్, మహీంద్రా గ్రూప్ వ్యూహాత్మక స్థానంగా.. ప్రతీకార సుంకాల నేపథ్యంలో కంపెనీలు తమ దృష్టిని భారత్‌పైకి మళ్లించవచ్చు. భారీ, పెరుగుతున్న వినియోగదారుల కేంద్రంగా విదేశీ సంస్థలకు వ్యూహాత్మక స్థా నంగా మన దేశం మారొచ్చు. వివిధ దేశాలకు విస్తరించాలని చూస్తున్న కంపెనీలకు ఆకర్షణీయ ప్రత్యామ్నాయంగా భారత్ నిలుస్తుంది. ప్రపంచ ఎల్రక్టానిక్స్ తయారీదారులకు ప్రాధాన్యత గమ్యస్థానంగా మారే చాన్స్ ఉంది. ఏఐ, పునరుత్పాదక శక్తి వంటి విభాగాల్లో ఆవిష్కరణ, ఆర్అండ్డీ కేంద్రంగా అవతరించడానికి భారత్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. – డి.విద్యాసాగర్, ఎండీ, ఎస్ఈసీ ఇండస్ట్రీస్ప్రత్నామ్నాయం లేదు.. జనరిక్ డ్రగ్స్ విషయంలో భారత్‌కు ప్రత్నామ్నాయ దేశం లేదు. టారిఫ్‌లకు సంబంధించి అమెరికాతో బ లంగా చర్చించే స్థానంలో ఉన్నాం. యూఎస్ తన ఆర్థిక బలాన్ని ప్రద ర్శిస్తే.. జనరిక్స్‌లో యూఎస్‌కు అతిపెద్ద సరఫరాదారుగా మన స్థానాన్ని మనం ఉపయోగించుకోవాలి. అలాగే పూర్తిగా అమెరికా మార్కెట్‌పై ఆధారపడకుండా దీర్ఘకాలంలో కొత్త మార్కెట్లకు విస్తరించాలి. ఇందుకు యూఎస్ ప్లస్ విధానం సరైన పరిష్కారం. – రవి ఉదయ్ భాస్కర్మాజీ డైరెక్టర్ జనరల్, ఫార్మెక్సిల్ కొత్త మార్కెట్లకు విస్తరించాలి.. ఇప్పటివరకు వివిధ దేశాలు చైనాపై ఆధారపడకూడదని చైనా ప్లస్ నినాదం అందుకున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎగుమతుల విషయంలో యూఎస్ ప్లస్ నినాదంతో ముందుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. 2024లో భారత్ నుంచి ఎగుమతులు 5.58 శాతం ఎగిసి 814 బిలియన్ డాలర్లకు చేరుకోగా.. ఇందులో యూఎస్ వాటా 10.74 శాతం మాత్రమే. అంటే సింహభాగం ఎగుమతులు ఇతర దేశాలకు జరుగుతున్నాయన్న మాట. ఎగుమతుల పరంగా యూఎస్‌పై ఆధారపడటం తగ్గించి కొత్త మార్కెట్లకు విస్తరించాలని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. అలాగే ప్రపంచ మార్కెట్లు అంత మెరుగ్గాలేవని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునే పనిలో దేశాలు నిమగ్నమవుతాయి. నాణ్యమైన వస్తువులు తక్కువ ధరకు లభించే మార్కెట్‌వైపు దృష్టిసారిస్తాయి. ఈ పరిస్థితిని భారత్ అవకాశంగా మలుచుకోవాలి. దీర్ఘకాలంలో భారత్ తన ఉత్పాదకతను మెరుగుపరచాలి. డిమాండ్ పెంచేందుకు తయారీ ఖర్చులను తగ్గించాలి. భారత్‌లో ఉత్పత్తులు ఖరీదు ఎక్కువన్న భావన తొలగేలా చేయాలి. దీనికోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకాన్ని బలోపేతం చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం సూచించింది.2024లో భారత్ –అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ: 129.2 బిలియన్ డాలర్లుభారత్ నుంచి యూఎస్‌కు ఎగుమతులు: 87.4 బిలియన్ డాలర్లు. వృద్ధి 4.5 శాతం యూఎస్ నుంచి భారత్‌కు దిగుమతులు: 41.8 బిలియన్ డాలర్లు. వృద్ధి 3.4 శాతం వాణిజ్య లోటు: 45.7 బిలియన్ డాలర్లు. వృద్ధి 5.4 శాతం 2005తో పోలిస్తే ప్రపంచ ఎగుమతుల్లో భారత్ వాటా 2023 నాటికి రెండింతలై 2.4 శాతానికి చేరిక -
ఆక్వా రంగం ఉక్కిరిబిక్కిరి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పది నెలలుగా రొయ్యల ధరలు తగ్గడమే గానీ పెరిగిన దాఖలాలే లేవు. అంతకు ముందు అంతర్జాతీయ మార్కెట్ ధరలు ఎలా ఉన్నా సరే కనీసం 15 రోజులు పాటు ఒకే ధర కొనసాగేది. ఒకసారి నిర్దేశించిన ధర 15 రోజుల్లో పెరగడమే తప్ప తగ్గే అవకాశం ఉండేది కాదు. అయితే గత పది నెలల్లో ఎప్పుడు ఏ ధర ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్న తరుణంలో మూలిగే నక్కపై తాటి కాయ పడ్డట్లు అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే ఆహార ఉత్పత్తులపై సుంకాల పెంపు వ్యవహారం రాష్ట్రంలోని ఆక్వా రంగాన్ని కుదిపేస్తోంది.అమెరికా టాక్స్ సాకుతో రొయ్యలు కొనుగోలు చేసే కంపెనీలు సిండికేట్‌గా మారి.. కిలోకు రూ.20 నుంచి రూ.40 వరకు తగ్గించేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుండడం పట్ల ఆక్వా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అమెరికాకు 35 శాతం ఎగుమతులుజాతీయ స్థాయిలో 2023–24లో కోటి 84 టన్నుల మత్స్య ఉత్పత్తుల దిగుబడులు నమోదు కాగా, 51.58 లక్షల టన్నుల ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్... దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో ఉత్పత్తయ్యే రొయ్యల్లో 76 శాతం, చేపల్లో 28 శాతం వాటా ఏపీదే. వ్యవసాయ అనుబంధ రంగాల స్థూల ఆదాయ నిష్పత్తిలో 9.15 శాతం ఆక్వా రంగం నుంచే వస్తోంది. దేశం నుంచి 2023–24లో రూ.60 వేల కోట్ల విలువైన 17.82 లక్షల టన్నులు ఎగుమతి అయితే, దాంట్లో దాదాపు 35 శాతం (రూ.20 వేల కోట్లు) ఉత్పత్తులు ఒక్క అమెరికాకే ఎగుమతి అయ్యాయి. ఆ తర్వాత 19 శాతం చైనాకు ఎగుమతి అవుతున్నాయి. మరో వైపు జాతీయ స్థాయిలో ఎగుమతి అయ్యే మత్స్య ఉత్పత్తుల్లో మూడో వంతు ఏపీ నుంచే జరుగుతున్నాయి. ఏపీలో రొయ్యల దిగుబడులు 10 లక్షల టన్నులు ఉంటే.. అందులో 3.27 లక్షల టన్నులు (2023–24) అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి.20–50 కౌంట్ రొయ్యల కొనుగోళ్లు నిలిపివేత అమెరికా సుంకాల పెంపు సాకుతో కొన్ని కంపెనీలు సిండికేట్‌గా మారి దోపిడీకి పాల్పడుతున్నా పట్టించుకునే వారు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే కౌంట్‌కు రూ.20 నుంచి రూ.40 చొప్పున తగ్గించేశాయి. మరొక పక్క అమెరికాకు ఎగుమతి అయ్యే 20–50 కౌంట్ (కిలోకు వచ్చే రొయ్యల సంఖ్య) రొయ్యల కొనుగోలును నిలిపి వేశాయి. కొన్ని కంపెనీలు సిండికేట్‌గా మారి దోపిడీకి తెరతీయగా, మరికొన్ని కంపెనీలు విభేదిస్తున్నాయి.. ఇప్పటికిప్పుడు ధరలు తగ్గించడం సరికాదని, రానున్న వారం పది రోజుల వరకు ఈ నెల 1వ తేదీన నిర్ణయించిన ధరలనే కొనసాగించాలని సూచిస్తునాయి. పైగా ఈ దిగుమతి సుంకం భారాన్ని అమెరికాలోని బయ్యర్లు భరించేలా ఒత్తిడి తీసుకురావాలని సూచిస్తున్నాయి. దేశీయంగా ధరలు తగ్గిస్తే ఆక్వా రైతులు మరింత సంక్షోభంలో కూరుకు పోతారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కంపెనీల తీరుపై రైతుల మండిపాటుఅమెరికా ట్యాక్స్ విధానంలో మార్పు రాగానే ఆగమేఘాల మీద రొయ్యల ధరలు తగ్గించేస్తున్న కంపెనీలు.. తొమ్మిది నెలల క్రితం హరిత విప్లవం పేరిట రొయ్య మేతలో కలిపే ఉత్పత్తులపై ట్యాక్స్‌లు భారీగా తగ్గించినప్పటికీ దేశీయంగా ఒక్క రూపాయి కూడా మేత ధర తగ్గించలేదు. ఈ విషయమై ఆక్వా రైతులు ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్ల క్రితం సోయా రేటు కిలో రూ.85 ఉన్నప్పుడు టన్ను మేత ధర రూ.15 వేలకు పెంచారు. కానీ అదే సోయా రేటు ధర నేడు కిలో రూ.23కే అందుబాటులో ఉన్నప్పటికీ మేత «ధర పైసా కూడా తగ్గించిన పాపాన పోలేదు. అమెరికాకు 20–50 కౌంట్ రొయ్యలు మాత్రమే ఎగుమతి అవుతాయి. అలాంటప్పుడు 50–100 కౌంట్ ధరలు తగ్గించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.నాడు వైఎస్ జగన్ సర్కారు భరోసా అమెరికాలో దిగుమతి సుంకాల పెంపు ప్రభావంతో మన దేశంలో ఎగుమతులు ఏమాత్రం మందగించినా రాష్ట్రంలోని ఆక్వా రంగం కుప్పకూలే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తునారు. గతంలో ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం జోక్యం చేసుకొని అండగా నిలిచింది. మంత్రులతో ఆక్వా సాధికారత కమిటీని ఏర్పాటు చేసి అప్సడా ద్వారా ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తూ అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ధరలు క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలు రైతులకు దక్కేలా కృషి చేసింది.కరోనా సమయంలో కూడా ఇదే రీతిలో కంపెనీలు సిండికేట్‌గా మారి ధర లేకుండా చేసిన సందర్భంలో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా మద్దతు ధర దక్కేలా కృషి చేసిన విషయాన్ని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. కానీ నేడు ఈ సంక్షోభ సమయంలో కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.క్రాప్ హాలిడే ఒక్కటే దిక్కుఅమెరికా ట్యాక్స్ విధానం వల్ల కంపెనీలు సిండికేట్‌గా మారి దోపిడీకి గురిచేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గత పది నెలల్లో రైతులతో పాటు ప్రాసెసింగ్, ఎక్స్‌పోర్టర్స్‌తో ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రాంతాల వారీగా పంట విరామం ప్రకటించడం తప్ప మాకు వేరే మార్గం కనిపించడం లేదు. – నాగభూషణం, ఏపీ ఆక్వా ఫెడరేషన్ సలహాదారు -
ఈ సుంకాలతో లాభనష్టాలు
భారత్ ఎగుమతులపై అమెరికా 26 శాతం దిగుమతి సుంకాన్ని విధించడం ఆర్థిక ఆందో ళనలకు దారి తీసింది. భారత్‌తో పోల్చిన ప్పుడు అధికంగా చైనాపై 40–60 శాతం (కొన్ని ఉత్పత్తులపై 100 శాతం వరకు), వియత్నాంపై 30–45 శాతం, థాయ్‌లాండ్‌పై 35–50 శాతం దిగుమతి సుంకాలను అమె రికా విధించింది. భారత్‌కన్నా తక్కువగా యూరోపియన్ యూనియన్‌పై 20 శాతం, జపాన్‌పై 24 శాతం, దక్షిణ కొరియాపై 25 శాతం దిగుమతి సుంకాలను అమెరికా విధించింది.అమెరికా వాదన2024లో అమెరికాకు సంబంధించి భారత్ ఎగుమతుల విలువ 91.23 బిలియన్ డాలర్లు. భారత్ మొత్తం ఎగుమతుల విలువలో అమెరికా వాటా 18 శాతం. ఇదే సంవత్సరం అమెరికా ఉత్పత్తుల దిగుమతులలో భారత్ వాటా 2.6 శాతం. మొత్తంగా భారత్‌తో వాణి జ్యానికి సంబంధించి అమెరికా వాణిజ్య లోటు 2023–24లో 45.7 బిలియన్ డాలర్లు కాగా, 2024–25 (జనవరి వరకు) 22.9 బిలియన్ డాలర్లుగా నమోదయింది. అమెరికాకు సంబంధించిన పాసింజర్ వాహనాలపై 70 శాతం, యాపిల్స్‌పై 50 శాతం, ఆల్కహాల్‌పై 100 –150 శాతం దిగుమతి సుంకాలను భారత్ విధిస్తున్నప్పుడు, ప్రస్తుతం భారత్‌పై అమెరికా విధించిన 26 శాతం దిగుమతి సుంకం సమంజసమేనని అమెరికా వాదిస్తున్నది. ప్రపంచ స్వేచ్ఛా వాణిజ్య నియమావళికి విరుద్ధంగా భారత్ వ్యవహరిస్తున్నదని అమెరికా భావిస్తున్నది.దిగుమతి సుంకాల పెంపు కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50తో పాటు చైనా, థాయ్‌లాండ్‌కు సంబంధించిన ముఖ్య సూచీల లోనూ క్షీణత ఏర్పడింది. 2023–24లో అమెరికాతో వాణిజ్యంలో చైనా మార్కెట్ వాటా 21.6 శాతం కాగా, వియత్నాం వాటా 19.3 శాతంగా, భారత్ వాటా 6 శాతంగా నిలిచింది. వివిధ దేశాలపై అమె రికా దిగుమతి సుంకాల పెంపు కారణంగా చైనా, వియత్నాంలతో పోల్చినప్పుడు భారత్ ఎగుమతులలో పోటీతత్వం పెరుగుతుందని భావించవచ్చు.సగటు అమెరికా దిగుమతి సుంకాల కారణంగా– భారత్‌లో రొయ్యలు, వస్త్రాలు, స్టీల్ రంగాలపై; చైనాలో సోలార్ పానల్స్, సెమీ కండక్టర్, స్టీల్, ఎలక్ట్రిక్ వాహనాలపై; వియత్నాంలో ఫుట్‌వేర్, ఎల క్ట్రానిక్స్, ఫర్నీచర్‌పై; థాయ్‌లాండ్‌లో ఆటో పరికరాలు, రబ్బరు ఉత్పత్తులపై ప్రభావం ఉంటుందని అంచనా.భారత్‌పై ప్రభావంప్రాథమిక కేటగిరీకి సంబంధించిన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరిక రాలు, ఫార్మా ఉత్పత్తులు, విలువైన రాళ్ళు భారత్ నుండి అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. మార్చి 2025లో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకొనే చర్యలో భాగంగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై భారత్ దిగుమతి సుంకాన్ని తగ్గించడం వలన రెండు దేశాలకు పరస్పర ప్రయోజనం చేకూరుతుంది. ఆసియా ఖండంలోని ఇతర దేశాలతో పోల్చినప్పుడు సౌరవిద్యుత్, ఫార్మాసూటికల్స్, టెక్స్టైల్స్ – అప్పారెల్ రంగాలలో భారత్‌కు అధిక ప్రయోజనం ఉంటుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా టెక్స్టైల్ – అప్పారెల్ రంగాలకు సంబంధించి పోటీ వాతావరణం నెలకొన్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుత దిగు మతి సుంకాల నిర్ణయం కారణంగా అమెరికా మార్కెట్లో ఆ యా ఉత్పత్తులకు సంబంధించి భారత్‌కు పోటీ తగ్గుతుంది. చైనాకుసంబంధించిన సౌర ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకం కారణంగా చైనా సౌర ఉత్పత్తుల ధరలు పెరగడం వలన భారత్‌కు ప్రయోజనం చేకూరుతుంది. చైనాపై అమెరికా అధికంగా ఆధార పడటం తగ్గి భారత్ – అమెరికా వాణిజ్య సంబంధాలు మరింత పటిష్ఠమయ్యే అవకాశం ఉంది.భారత్ నుండి రొయ్యల ఎగుమతుల విలువ రూ. 22,000 కోట్లు కాగా, ఈ మొత్తంలో అమెరికా వాటా 44 శాతంగా ఉంది. ప్రస్తుతం అధిక సుంకాల కారణంగా భారత్ నుండి అమెరికా రొయ్యల ఎగుమతుల విలువలో తగ్గుదల ఏర్పడవచ్చు. భారత్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులకు సంబంధించి అమెరికాలో భారత్ మార్కెట్ వాటా తగ్గుతుంది. వజ్రాలు, ఆభరణాల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. భారత్‌లో అనేక సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలు హ్యాండిక్రాఫ్ట్ గార్మెంట్స్ ఎగుమ తులపై అధికంగా ఆధారపడ్డాయి. అధిక సుంకాల నేపథ్యంలోఎం.ఎస్.ఎం.ఇ. సంస్థల ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతుంది. తద్వారా ఆ యా సంస్థలలో లే ఆఫ్ కారణంగా ఉత్పత్తి సామర్థ్యం కూడా తగ్గుతుంది.సిద్ధించే ప్రయోజనాలుఅమెరికా దిగుమతి సుంకాలను ముఖ్యంగా వస్తువులపై విధించినందువలన భారత్‌లో పటిష్ఠంగా ఉన్న ఐటీ, సేవల రంగంపై ఈ ప్రభావం ధనాత్మకంగా ఉంటుంది. భారత్ నుండి సాఫ్ట్వేర్ సర్వీ సులు, ఫైనాన్షియల్ టెక్నాలజీ, బిజినెస్ అవుట్ సోర్సింగ్‌కు సంబంధించి ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. ఇంజినీరింగ్ వస్తువులకు సంబంధించి భారత్‌తో పోల్చినప్పుడు చైనా, యూరప్లపై అధిక సుంకాలు విధించిన కారణంగా అమెరికా కొనుగోలుదారులు భారత్ ఇంజినీరింగ్ ఉత్పత్తులపై దృష్టి సారించే వీలుంది. దానివల్ల భారత్ ఎగుమతులలో పెరుగుదల ఏర్పడుతుంది.చైనా ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకాల కారణంగా బహుళ జాతి సంస్థలు తమ ఉత్పత్తిని భారత్‌లో చేపట్టే అవకాశం ఉంది. తద్వారా భారత్ అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించే అవ కాశం ఉంటుంది. భారత్‌లో ఇప్పటికే అమలులో ఉన్న ‘ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెన్టివ్ స్కీమ్’ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం) కారణంగా ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, సెమీ కండక్టర్లకు సంబంధించిన సంస్థలు భారత్‌లో అధికంగా ఏర్పాటవుతాయి. తద్వారా భార త్లో పెట్టుబడులు, ఉపాధి, ఉత్పత్తి, ఎగుమతుల విలువలో పెరుగు దల కనబడుతుంది. అది స్థూల దేశీయోత్పత్తిలో కూడా పెరుగు దలగా ప్రతిఫలిస్తుంది.అమెరికా దిగుమతి సుంకాల కారణంగా ఇతర దేశాల వ్యవ సాయ ఉత్పత్తుల ధరలలో పెరుగుదల ఏర్పడుతుంది. తద్వారా భారత్ నుండి బియ్యం, సుగంధ ద్రవ్యాలు, ప్రాసెస్డ్ ఫుడ్‌కు అమెరికా మార్కెట్లో డిమాండ్ పెరగడంతోపాటు భారత్ ఎగుమతుల విలువలో పెరుగుదల ఏర్పడుతుంది. ఎగుమతుల పరంగా ఇబ్బంది ఎదుర్కొనే నేపథ్యంలో (కొన్ని ఉత్పత్తులకు సంబంధించి) భారత్ లోని ఉత్పత్తి స్వదేశీ డిమాండ్‌ను తీర్చడానికి ఉపకరిస్తుంది. ఈ స్థితి దేశంలో కొన్ని ఉత్పత్తుల కొరతను నివారించడం ద్వారా సాధారణ ధరల స్థాయి తగ్గుదలకు దారితీస్తుంది.చేయాల్సిందిఅయితే, అమెరికా ఆటో పరికరాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలనే ఒత్తిడిని భారత్ సమీప భవిష్యత్తులో ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందుకే అమెరికాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించు కోవాలి. ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాలతో భారత్ నూతన వాణిజ్య భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలి.-వ్యాసకర్త ప్రొఫెసర్ అండ్ డీన్, ఇక్ఫాయ్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఐ.ఎఫ్.హెచ్.ఇ., హైదరాబాద్- డా‘‘ తమ్మా కోటిరెడ్డి -
‘పెద్దన్న’తో విన్యాసాలు
సాక్షి, విశాఖపట్నం: అమెరికాతో సత్సంబంధాలు మెరుగుపడేలా.. దాయాది దేశాల్లో వేళ్లూనుకుంటున్న ఉగ్రవాదానికి హెచ్చరికలు జారీ చేసేలా 2019 నుంచి నిర్వహిస్తున్న త్రివిధ దళాల సంయుక్త విన్యాసాలకు విశాఖ నగరం మరోసారి ఆతిథ్యమిస్తోంది. ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమయ్యే విన్యాసాల్లో భారత్ తరఫున ఐఎన్ఎస్ జలాశ్వ యుద్ధ నౌక ప్రాతినిధ్యం వహిస్తోంది. వరుసగా నాలుగో పర్యాయం విశాఖలోనే నిర్వహిస్తుండటం విశేషం.ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ త్రివిధ దళాల విన్యాసాలను ‘టైగర్ ట్రయాంఫ్’ గా పిలుస్తుంటారు. 2019 నుంచి ప్రారంభం భారత్, అమెరికాల్లో సైనిక, వైమానిక, నౌకాదళ విన్యాసాలు వేర్వేరుగా జరిగాయి. కానీ 2019లో తొలిసారిగా..మూడు విభాగాలు కలిపి విన్యాసాల్లో ప్రప్రథమంగా పాల్గొనడంతో అన్ని దేశాలూ భారత్–అమెరికా మధ్య బంధం గురించి చర్చించుకున్నాయి. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగు, భద్రతా పరమైన అంశాల్లో పరస్పర సహకారం, విపత్తు సమయంలో ఒకరికొకరు సాయం చేసుకునేందుకు అవసరమైన విధానాలను బలోపేతం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ విన్యాసాల్లో పాలుపంచుకుంటున్నాయి. అనుమానాలను పటాపంచలు చేస్తూ.. ఈ ఏడాది జనవరిలో ఇరుదేశాల రక్షణ శాఖల అధికారులు సమావేశమై విన్యాసాలపై చర్చించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో..టైగర్ ట్రయాంఫ్ జరగదేమో అనుకున్నారంతా. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ‘టైగర్ ట్రయాంఫ్’– 4 ప్రారంభం కానుండటంతో ప్రధాన దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.టైగర్ ట్రయాంఫ్వేదిక: విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంఎడిషన్: 4 ప్రారంభం: ఏప్రిల్ 02, 2025 లక్ష్యం » ఇండో పసిఫిక్ సాగర జలాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడం » ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడంలో భాగంగా ఆయుధ సంపత్తి సత్తా చాటడం » ఇండో–పసిఫిక్ జలాల్లో అక్రమ రవాణా, చోరీలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట. విన్యాసాలు చేసేది.. వీళ్లే » అమెరికా తరపున మెరైన్స్, సెయిలర్స్, ఎయిర్మెన్లు » భారత్ సైనిక దళం, నావికులు, ఎయిర్మెన్లు » భారత్ తరపున ఐఎన్ఎస్ జలాశ్వ » అమెరికా యుద్ధ నౌకలు -
Trump: న్యాయవ్యవస్థను బేఖాతరు చేయబోతున్నారా?
అమెరికా న్యాయవ్యవస్థ కంటే తమకు అసాధారణ అధికారాలు దఖలుపడ్డాయనే భావన డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంలో గూడుకట్టుకుపోయిందనే వార్త ఇప్పుడు అమెరికాలో చర్చనీయాంశమైంది. సోమవారం యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జేమ్స్ ఇ.బోస్బర్గ్ ఇచ్చిన ఆదేశాలను ట్రంప్ సర్కార్ పూచికపుల్లలాగా తీసిపక్కన పడేయడమే ఇందుకు ప్రధాన కారణం. వలసదారులను వెనిజులాకు చెందిన నేరాల గ్యాంగ్ సభ్యులుగా ఆరోపిస్తూ దేశ బహిష్కరణ (deportation) చేయడం సబబుకాదని జడ్జి బోస్బర్గ్ ఆగ్రహం వ్యక్తంచేయడం తెల్సిందే. ఎల్ సాల్వెడార్‌కు వలసదారులను విమానాల్లో తరలించడం తక్షణం ఆపేయాలని కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వాన్ని జడ్జి ఆదేశించారు. అయితే ఆ సమయానికే రెండు విమానాలు బయల్దేరాయని, గాల్లో ఉన్నాయని ప్రభుత్వ న్యాయవాదులు చెప్పారు. అయితే విమానాలను వెంటనే వెనక్కి తిప్పాలని జడ్జి ఆదేశించారు. అయినాసరే ప్రభుత్వ న్యాయవాదులు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరించడం వెనుక ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యధోరణి దాగుందని తెలుస్తోంది. పైగా దేశ అధ్యక్షుడి నిర్ణయాన్ని కేవలం ఒక జిల్లా జడ్జి ప్రశ్నించేంత సాహసం చేస్తారా? అన్న దురహంకారం అధికారయంత్రాంగంలో ఎక్కువైందని వార్తలొచ్చాయి.తానే సర్వశక్తివంతుడినంటున్న ట్రంప్ యుద్ధకాలంలో ప్రయోగించాల్సిన కఠిన చట్టాలు, నిబంధనలను శాంతికాలంలో ఉపయోగించాల్సిన అవసరం ఏమొచ్చిందని పలువురు న్యాయనిపుణులు వాదిస్తున్నారు. అక్రమ వలసదారులను తరిమేసేందుకు ఏకంగా 18వ శతాబ్దంనాటి విదేశీ శత్రుచట్టాన్ని హఠాత్తుగా అమలుచేయాల్సిన పనేముందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే తాను మాత్రమే అమెరికాను కాపాడగలనన్న విశ్వాసంతో రెండో దఫా భారీ మెజారిటీతో తనను ప్రజలు గెలిపించారన్న అతివిశ్వాసం ట్రంప్‌లో పెరిగిందని, అందుకే సర్వశక్తివంతుడినన్న ధీమాతో అసాధారణ నిర్ణయాలు తీసుకుంటున్నారని వార్తలొచ్చాయి. సొంత పార్టీలో తన వ్యతిరేకవర్గాన్ని పూర్తిగా అణిచేసి, విపక్ష డెమొక్రాట్ల చేతిలో ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వరంగంలోని ఏ విభాగం లేకుండా చేసి ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని ఏలాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇదే ధోరణి ఆయన పాలనాయంత్రాంగంలోని సీనియర్ సభ్యుల్లోనూ కనిపిస్తోంది.సోమవారం సీఎన్ఎన్ ‘కేసీ హంట్’ కార్యక్రమంలో శ్వేతసౌధం (White House) సీనియర్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ సైతం ట్రంప్‌లాగా మాట్లాడారు. ‘‘అమెరికాలోకి విదేశీయుల చొరబాట్లను అడ్డుకునే, వారిని తరిమేసే సర్వాధికారం అధ్యక్షుడికే ఉంటుంది. ఈ అంశాన్ని సమీక్షించే హక్కు కోర్టులకు లేదు. అందులోనూ ఒక జిల్లా జడ్జికి అస్సలు లేదు’’అని ఆయన అన్నారు. ట్రంప్ సైతం జడ్జి బోస్బర్గ్ను తిడుతూ ‘ట్రూత్‌సోషల్’ ఖాతాలో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘ఆ జడ్జిని అభిశంసించాల్సిందే. ఆయన పెద్ద సమస్యగా తయారయ్యారు. నిరసకారుడిగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. గత ఏ డాది ఎన్నికల్లో మొత్తం 7 స్వింగ్ రాష్ట్రాల్లో పాపులర్ ఓటు సాధించి నా నాయకత్వం, నా నిర్ణయం ఎంత సరైనవో నిరూపించుకున్నా. అధ్యక్షుడిగా నేను తీసుకున్న నిర్ణయాల చట్టబద్ధతను సమీక్షించే అధికారం జడ్జి కంటే నాకే ఉందని తాజా ఎన్నికలు నిరూపించాయి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు జిల్లా జడ్జిని తిడుతూ అధ్యక్షుడు ట్రంప్ బహిరంగంగా ఒక పోస్ట్పెట్టడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ మంగళవారం స్పందించారు. ‘‘గత రెండు శతాబ్దాల చరిత్రను గమనిస్తే కోర్టుల నిర్ణయాన్ని విబేధించేందుకు కార్యనిర్వాహణ వ్యవస్థ ‘అభిశంసన’ అనే విధానాన్ని ప్రయోగించడం ఎంతమాత్రం సబబు కాదు’’ అని వ్యాఖ్యానించారు. చదవండి: పుతిన్.. ఎవరి మాటా వినని సీతయ్య! జడ్జీలపై కన్నెర్ర పాలక రిపబ్లికన్లు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు చెప్పే జడ్జీలను సాగనంపాలని చూస్తున్నారు. బూస్బర్గ్కు వ్యతిరేకంగా అభిశంసన తెస్తే బాగుంటుందని ఇప్పటికే ఇద్దరు దిగువసభ రిపబ్లికన్ సభ్యులు వ్యాఖ్యానించారు. ట్రంప్‌కు సంబంధించన కేసులో ఆయనకు వ్యతిరేకంగా తీర్పులిచ్చిన జడ్జీలు అమీర్ అలీ, పౌల్ ఈగల్ మేయర్లను అభిశంసించాలని దిగువసభలో గతంలో వ్యాఖ్యానించారు. 2019 జూలైలో అధ్యక్షుడిగా ట్రంప్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘అధ్యక్షుడిగా నాకేం కావాలన్నా నచ్చినట్లు చేసుకునే హక్కు రాజ్యాంగంలోని రెండో ఆర్టికల్ నాకు ప్రసాదించింది’’అని వ్యాఖ్యానించడం తెల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చిగురిస్తున్న డాలర్ కల..
భారతీయుల అమెరికా కలలు మళ్లీ చిగురిస్తున్నాయి. విద్య, పర్యాటక వీసాల విషయంలో భారత్ పై అగ్రరాజ్యం కాస్త సానుకూల దృక్పథంతో ఉండటం కలిసొచ్చే అంశం. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత వివిధ దేశాలపై కఠిన ఆంక్షలు మొదలయ్యాయి. అక్రమ వలసల పేరుతో వేట కొనసాగుతోంది. తాజాగా 41 దేశాలపై ఉక్కుపాదం మోపేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ దేశాలను మూడు కేటగిరీలుగా విభజించి పర్యాటక వీసాలపై ఆంక్షలు పెట్టాలని నిర్ణయించినట్టు అమెరికన్ మీడియా పేర్కొంది. ఈ మూడు జాబితాల్లోనూ భారత్ ప్రస్తావన లేకపోవడంతో మనవాళ్లు ఊపిరి పీల్చుకుంటున్నారు. పాత రోజులు మళ్లీ రాబోతున్నాయని కన్సల్టెన్సీ సంస్థలు భావిస్తున్నాయి. ఉన్నత విద్య కోసం వెళ్లే భారతీయ విద్యార్థుల్లోనూ ఆశలు పెరుగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో తాత్కాలిక ఉద్యోగాలపై కూడా భారతీయులకు ఊరట లభిస్తుందని ప్రవాస భారతీయులూ అంచనా వేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్41 దేశాలు... మూడు కేటగిరీలు 41 దేశాల నుంచి వచ్చే పర్యాటక, విద్యాపరమైన వీసాలపై ఆంక్షలు విధించాలని అమెరికా నిర్ణయించింది. ఈ దేశాలను రెడ్, ఆరెంజ్, ఎల్లో కేటగిరీలుగా విభజించారు. రెడ్ కేటగిరీలో అమెరికాకు అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్న 11 దేశాలను చేర్చారు. వాణిజ్య మైత్రి కొనసాగుతున్న ఉగ్రవాద ప్రేరేపిత, ఆర్థిక ఆంక్షలున్న దేశాలను ఆరెంజ్ కేటగిరీలో పెట్టారు. ఈ కేటగిరీలో పాకిస్తాన్, రష్యా సహా 10 దేశాలున్నాయి. వీటిపై కొంత సమయం తీసుకుని ఆంక్షలు విధిస్తారు. వైరిపక్ష దేశాలతో సంబంధాలున్నప్పటికీ, హెచ్చరికలు, చర్చల ద్వారా దారికొచ్చే 22 దేశాలను ఎల్లో కేటగిరీలో చేర్చారు. వీటిపై దశల వారీగా ఆంక్షలు విధించాలని భావిస్తున్నారు. మనవాళ్ల అవసరం ఉండబట్టే.. అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 11.26 లక్షలు. వారిలో 29% భారతీయులే. సాఫ్ట్వేర్ రంగంలో కీలకమైన ఉద్యోగాల్లోనూ భారతీయుల పాత్ర కీలకం. అమెరికాలో గతంలో చైనా విద్యార్థులు ఎక్కువగా ఉండేవాళ్లు. ఈ స్థానాన్ని భారత్ అధిగమించింది. ఈ కారణంగానే ఈ రెండు దేశాల విద్యార్థుల వీసాలపై ఆంక్షలు విధించే సాహసం అమెరికా చేయడం లేదనేది కన్సల్టెన్సీల అభిప్రాయం. అమెరికాకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రూపొందించిన ఓపెన్ డోర్స్ రిపోర్టులోనూ ఇదే వెల్లడైంది. పోస్టు గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య గత ఏడాది 10% పెరిగి 1,96,567కు చేరింది. అండర్ గ్రాడ్యుయేట్ల సంఖ్య 13% పెరిగి 36,053కు చేరింది. అమెరికాలోనే ఉపాధి పొందాలని భావిస్తూ.. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) తీసుకుంటున్న భారతీయుల సంఖ్య 97,556 (2024లో 41% ఎక్కువ)కు చేరింది. ఇతర దేశాలపై ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో ఐటీ సెక్టార్లో పనిచేసే సామర్థ్యం భారతీయులకే ఉందని ఓపెన్ డోర్స్ రిపోర్టు పేర్కొంది. దీంతో భవిష్యత్‌లోనూ భారతీయ వీసాలపై పెద్దగా ఆంక్షలు ఉండవనే సంకేతాలు వస్తున్నాయని ప్రవాసులు అంటున్నారు.శుభ సంకేతాలేఆంక్షల విషయంలో భారత్‌ను కొంత సానుకూలంగా చూడటం శుభ పరిణామం. అయితే, తాత్కాలిక ఉద్యోగాల విషయంలో ఇంకా ఇబ్బందులు తొలగలేదు. నిబంధనలకు విరుద్ధంగా చదువుకుంటూ పార్ట్‌టైం ఉద్యోగం చేయాలనే ఆలోచనలో విద్యార్థులు ఉండొద్దు. ఇప్పటికీ అమెరికాలో ఇలాంటి వారిని గుర్తించేందుకు ట్రంప్ సర్కార్ ప్రయత్నిస్తోంది. అయితే, వాణిజ్యపరంగా చూస్తే, ఆంక్షల వల్ల మానవవనరుల కొరత ఉంది. కాబట్టి ఎక్కువ కాలం ఆంక్షలు ఉండకపోవచ్చు. కొన్ని దేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులను ఏరేసిన తర్వాత భారతీయులకు కొంత స్వేచ్ఛ ఉండే వీలుంది. –వి.నరేష్, అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉన్న భారతీయుడుకొంత ఊరట లభించినట్టేమూడు కేటగిరీల్లో భారత్ లేకపోవడం ఆశాజనకం. అమెరికాలో విద్యకు వెళ్లే ప్రతీ విద్యార్థి అక్కడ తాత్కాలిక ఉపాధి కోసం యత్నిస్తారు. మనవాళ్లకు కష్టపడి పనిచేసే స్వభావం ఉంది. అమెరికన్ కంపెనీలు ఈ విషయాన్ని గుర్తిస్తాయి. కాబట్టి ఇప్పుడున్న భయాలు భవిష్యత్‌లో తొలగిపోతాయని భావిస్తున్నాం. – ఈవీఎల్ఎన్ మూర్తి (కన్సల్టెంట్ సంస్థ ఎండీ, హైదరాబాద్)వీసాలపై అమెరికా ఆంక్షలు విధించే 3 కేటగిరీ దేశాలురెడ్ జోన్: అఫ్గానిస్తాన్, భూటాన్, క్యూబా, ఇరాన్, లిబియా, ఉత్తరకొరియా, సోమాలియా, సూడాన్, సిరియా, వెనెజువెలా, యెమన్ఆరెంజ్ జోన్: బెలారస్, ఎరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, పాకిస్తాన్, రష్యా, సియెరాలియోన్, సౌత్ సూడాన్, తుర్క్మెనిస్తాన్ఎల్లో జోన్: అంగోలా, ఆంటిగ్వా అండ్ బార్బుడా, బెనిన్, బుర్కినా ఫాసో, కంబోడియా, కామెరాన్, కేప్‌వెర్డ్, చాడ్, కాంగో, డీఆర్ కాంగో, డొమినీసియా, గునియా, గాంబియా, లైబేరియా, మాలావి, మాలి, మారింటానియా, సెయింట్ కిట్స్ అండ్ నెవీస్, లూసియా, సావో టామ్ అండ్ ప్రిన్సిప్, వనువాటు, జింబాబ్వే -
ఇండియాకు వెళ్తా: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్
వాషింగ్టన్: అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ (Tulsi Gabbard) త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఇండో–పసిఫిక్ దేశాల సందర్శనలో భాగంగా తనకు బాగా పరిచయమున్న భారత్‌కు వెళ్లనున్నట్లు ఆమె సోమవారం వెల్లడించారు. ఆయా దేశాలతో సంబంధాల బలోపేతానికి, అధ్యక్షుడు ట్రంప్ లక్ష్యాలైన శాంతి, స్వేచ్ఛల సాధనే ఈ పర్యటన ఉద్దేశమని చెప్పారు. జపాన్, థాయ్‌లాండ్, భారత్‌లలో పర్యటించడంతోపాటు తిరుగు ప్రయాణంలో ఫ్రాన్స్‌లో ఆగుతానని చెప్పారు.విమానంలో అడుగుపెడుతున్న ఫొటోను ఆమె ‘ఎక్స్’లో షేర్ చేశారు. మొదటగా ఆమె హనొలులులో ఆగుతారు. అక్కడున్న యూఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ ప్రధాన కార్యాలయానికి వెళతారు. కాగా, ప్రధాని మోదీ (PM Modi) ఆహ్వానంపై భారత్‌కు వస్తున్న తులసీ 18న ఢిల్లీలో ‘రైజినా డైలాగ్’ కార్యక్రమంలో ప్రసంగిస్తారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. చావెజ్ నియామకానికి సెనేట్ ఆమోదం అమెరికా కార్మిక మంత్రిగా ట్రంప్ నామినీ లోరీ ఛావెజ్ డీరెమర్ నియామకానికి సెనేట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు మంచి వేతనాలు, సురక్షిత పని పరిస్థితులు, రిటైర్మెంట్ ప్రయోజనాలకోసం పాటుపడతానని అనంతరం చావెజ్ ప్రకటించారు. అమెరికా కార్మికులను ప్రనపంచంలోనే తొలి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. వేలాదిమంది ప్రభుత్వోద్యోగులు తమ తొలగింపును కోర్టుల్లో సవాలు చేసిన వేళ ఆమె ఈ ప్రకటన చేయడం విశేషం.చదవండి: భారత విద్యార్థుల చూపు.. ఆ దేశాలవైపు!ఆమె నియామకాన్ని ఇంటర్నేషనల్ బ్రదర్హుడ్ ఆఫ్ టీమ్స్టర్స్తో సహా ప్రముఖ కార్మిక సంఘాలు స్వాగతించాయి. అమెరికా కార్మిక శాఖలో దాదాపు 16 వేల మంది ఫుల్‌టైమ్ ఉద్యోగులున్నారు. ఉద్యోగుల తొలగింపుకు ట్రంప్ ప్రభుత్వమే ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కార్మిక మంత్రిగా చావెజ్ ఏ మేరకు స్వేచ్ఛగా పని చేయగలరన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
భారత విద్యార్థుల చూపు.. ఆ దేశాలవైపు!
ఉన్నత విద్య కోసం అగ్ర రాజ్యాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. అమెరికా, కెనడా, బ్రిటన్లకు వెళ్తున్న వారి సంఖ్యలో భారీ తగ్గుదల నమోదైంది. ప్రత్యామ్నాయ దేశాలైన రష్యా, జర్మనీ, ఉజ్బెకిస్తాన్లకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటం విశేషం! మొత్తంగా విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతోంది. 2023లో 8,92,989 మంది భారత విద్యార్థులు (Indian Students) విదేశీ బాట పట్టగా 2024లో ఏకంగా 7,59,064కు తగ్గారు! అంటే దాదాపు 15 శాతం తగ్గుదల!!ఆ మూడు దేశాల్లో... 2024లో ఉన్నత విద్య కోసం వెళ్లిన అమెరికా, కెనడా, బ్రిటన్లకు వెళ్లిన భారత విద్యార్థుల సంఖ్య 27 శాతం తగ్గినట్టు ఇమిగ్రేషన్ బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఒక్క ఏడాదిలోనే ఏకంగా 1,64,370 తగ్గుదల! 2023లో కెనడాకు 2,33,532 మంది భారత విద్యార్థులు వెళ్లగా 2024లో 1,37,608కు తగ్గారు. అంటే 41 శాతం తగ్గుదల. బ్రిటన్‌కు 27 శాతం, అమెరికాకు 13 శాతం తగ్గుదల నమోదైంది. కఠినమైన వీసా నిబంధనలు, అధిక ఆర్థిక డిమాండ్లు, ఎక్కువ తిరస్కరణలు, దౌత్య సమస్యల వంటివి ఇందుకు కారణమని గణాంకాలు చెబుతున్నాయి.ఉద్రిక్తతలు... ప్రధానంగా కెనడాతో భారత్‌కు దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరగడంతో ఉన్నత విద్యకు ఆ దేశాన్ని ఎంచుకునే భారతీయుల సంఖ్య బాగా తగ్గింది. సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, అందులో భారత ప్రమేయం ఉందని కెనడా (Canada) ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలతో 2023 నుంచి పరిస్థితి దిగజారుతూ రావడం ఇందుకు కారణమైంది. వీటికి తోడు కెనడా తన వీసా, స్టూడెంట్ పర్మింట్ నిబంధనలను కఠినతరం చేసింది. చదవండి: తెలుగు అమ్మాయి సుదీక్ష మిస్సింగ్.. కిడ్నాపైందా? బ్రిటన్‌లో నిబంధనలే అడ్డంకిగా మారాయి. పీజీ రీసెర్చ్, ప్రభుత్వ నిధులతో నడిచే పథకాల్లోని వారు మినహా ఇతర విదేశీ విద్యారులు (Foreign students) తమ కుటుంబీకులను బ్రిటన్‌కు తీసుకురావడానికి వీల్లేదంటూ 2023లో నిబంధనలు తెచ్చింది. దాంతో ఉన్నత చదువులకోసం యూకేను ఎంచుకునే విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఆ దేశాలవైపు చూపు కొత్త దేశాలపై భారత విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. 2024లో అత్యధిక మంది విద్యార్థులు రష్యాకు వెళ్లారు! 2023తో పోలిస్తే 34 శాతం పెరుగుదల నమోదైంది. 2024లో జర్మనీకి 34,702 విద్యార్థులు పెరిగారు. ఉజ్బెకిస్తాన్‌కు 9,915 మంది, బంగ్లాదేశ్‌కు 8,864 మంది అధికంగా వెళ్లారు. కోవిడ్ తర్వాత విదేశాల్లో చదువుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గడం ఇది రెండోసారి. -
ఈ ఏడాది హెచ్1బీ వీసాలు కష్టమే
సాక్షి, అమరావతి: అమెరికా వీసాల్లో అత్యధిక డిమాండ్ ఉన్న హెచ్1బీ వీసాలు (H1B visas) ఈ ఏడాది పొందడం చాలా కష్టంగా తయారయ్యింది. అధిక నైపుణ్యంతో దీర్ఘకాలం పనిచేయడానికి ఉపయోగపడే హెచ్1బీ వీసాలు పొందడంలో మల్టీ నేషనల్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత హెచ్1బీ వీసాల జారీపై కఠిన ఆంక్షలు విధించింది. దీనితో నైపుణ్యం కలిగిన మానవ వనరులను బహుళజాతి కంపెనీలు ఇతర దేశాల నుంచి తెచ్చుకోలేక అష్ట కష్టాలు పడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా అమెరికా ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 85,000 మందికి మించి హెచ్1బీ వీసాలు జారీ చేయకూడదన్న పరిమితిని విధించింది. మార్చి7న ప్రారంభమైన వీసాల జారీ ప్రక్రియ మార్చి 24తో ముగియనుంది. ఈ వీసాల కోసం ఇప్పటికే 4,23,028 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇందులో మూడు లక్షలకు పైగా దరఖాస్తులు తిరస్కరణకు గురి అవుతాయన్న అంచనాలను నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికా పాలసీ తాజాగా విడుదల చేసిన నివేదిక వెలువరించింది.కంపెనీలపై తీవ్ర ప్రభావంప్రస్తుత నిబంధనల ప్రకారం చూస్తే దరఖాస్తు చేసుకున్నవారిలో 20 శాతంకు మించి హెచ్1బీ వీసాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. విదేశాల్లో జన్మించిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఇతర అధిక నైపుణ్యం కలిగిన నిపుణులను దీర్ఘకాలం పనిచేసే విధంగా ఈ వీసా ద్వారా కంపెనీలు నియమించుకుంటాయి. తాజా కఠిన నిబంధనల వల్ల 3 లక్షలకు పైగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను అమెరికా కోల్పోతోందని, ఈ నిర్భంధ నిబంధనలు కంపెనీ యాజమాన్యాలకు తీవ్ర సమస్యలను తీసుకు వస్తున్నాయని ఫోర్బ్స్ తన నివేదికలో వ్యాఖ్యానించింది.ఇతర వీసాల జారీ సులభంహెచ్1బీ వీసాకంటే ఇతర వీసాలు మంజూరు సులభంగా ఉంటోందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. 2024లో దరఖాస్తు చేసుకున్న వారిలో సందర్శకులు కోటాలో జారీ చేసే బీ1/బీ2 వీసాలు 72 శాతం మందికి జారీ అయ్యాయి. వేసవి కార్మికులు, పరిశోధకుల కోటాలో జారీ అయ్యే జే1 వీసాలు 89 శాతానికి ఇమిగ్రేషన్ అధికారుల ఆమోదముద్ర పడింది. అమెరికాలో హెచ్1బీ వీసాలు కింద పనిచేసే ఉద్యోగులకు సగటున నెలకు భారతీయ కరెన్సీల్లో రూ.9 లక్షల నుంచి రూ.10 లక్షలపైనే వేతనం లభిస్తుంది. అందుకే ప్రతీ భారతీయుడు హెచ్1బీ వీసా కింద అమెరికాకు వెళ్లి పనిచేయాలనుకుంటాడు. అయితే మారిన పరిస్థితులు స్థానిక యువత ఆశలకు గండికొట్టిందని ఎంఎన్సీ కంపెనీలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
వీసా గోల్డెన్ చాన్సేనా?
గోల్డ్ కార్డ్ వీసా.. ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసిన టాపిక్ ఇది. అత్యంత గౌరవంగా భావించే అమెరికా పౌరసత్వం (US Citizenship) కోసం ట్రంప్ సర్కార్ తెచ్చిన ఈ కొత్త విధానం ఎంత మందిని ఆకట్టుకుంటుంది? అమెరికన్ కంపెనీలు ఈ పథకాన్ని ఉపయోగించి భారతీయులు సహా విదేశీ విద్యార్థులను, ప్రతిభావంతులను నియమించుకోవచ్చని ట్రంప్ అన్నారు. ట్రంప్ కేవలం పౌరసత్వ కలను అమ్ముకోవడం ద్వారా లాభం పొందాలని కోరుకోవడం లేదు. అమెరికన్ కంపెనీలు మంచి నిపుణులను నియమించుకోవడానికి వీలవుతుందని అంటున్నారు. వ్యాపారం పరంగా ఈ ఆఫర్ అమెరికన్ కంపెనీలకు ఆకర్షణీయమేనా? భారతీయులకు ప్రయోజనం చేకూరుస్తుందా? ఒక కోటి గోల్డ్ కార్డులు అమ్మడం ద్వారా అమెరికా (America) అప్పులు తొలగిపోతాయని ట్రంప్ పేర్కొంటున్నారు. కానీ రూ.43.7 కోట్ల విలువైన వీసాను కొనగలిగే అతి ధనవంతులు అమెరికా వెలుపల ఎంతమంది ఉన్నారనేదే ఇక్కడ ప్రశ్న. మరోవైపు పౌరసత్వం సరే.. పన్ను నిబంధనలపై అనిశ్చితి కారణంగా గోల్డ్‌కార్డు (Gold Card)ను తీసుకునేవారు తక్కువగా ఉంటారని నిపుణులు అంటున్నారు. – సాక్షి, బిజినెస్ బ్యూరోట్రంప్ లక్ష్యం అంత సులభమేమీ కాదు..ఒక కోటి గోల్డ్ కార్డుల అమ్మకాలు అమెరికా రుణభారాన్ని తుడిచిపెట్టగలవని ట్రంప్ అంటున్నారు. కానీ ఏకంగా రూ.43.7 కోట్లు వెచ్చించగల స్తోమత ఉన్న ధనవంతులు అమెరికా వెలుపల ఎంత మంది ఉన్నారు? క్రెడిట్ స్విస్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా 5–10 మిలియన్ డాలర్ల సంపద పరిధిలోని ధనికుల సంఖ్య 51 లక్షలు. ఇందులో 10 మిలియన్ డాలర్లకుపైగా ఉన్నవారు 28లక్షల మంది. ఇలాంటప్పుడు ఒక కోటి మంది గోల్డ్‌కార్డ్ కొనుగోలుదారులను పొందడం సాధ్యమయ్యేదేనా? అన్న సందేహాలు వస్తున్నాయి. రష్యా, చైనా, ఆగ్నేయాసియా నుంచి ధనవంతులు డబ్బు సంచులతో అమెరికాకు వస్తారని ట్రంప్ ఆశిస్తున్నారేమోగానీ.. విదేశీ బిలియనీర్లు గోల్డ్ కార్డ్‌ను తీసుకుంటారా? అని ఇమిగ్రేషన్ నిపుణులే పేర్కొంటున్నారు. గోల్డ్కార్డ్పై తలెత్తుతున్న ప్రశ్నలెన్నో.. » ఈ కార్యక్రమం ద్వారా అమెరికన్ పౌరసత్వాన్ని అమ్మకానికి పెట్టడం, యోగ్యత కంటే డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివాటిని ప్రతిభావంతులైన నిపుణుల ఖర్చుతో ధనవంతుల అవసరాలను తీర్చడంగా చూడవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. » గోల్డ్ కార్డుల వల్ల బలమైన నియంత్రణ, తనిఖీలు లేనప్పుడు పెట్టుబడి అంశంతో కూడిన ఇమిగ్రేషన్ కార్యక్రమాలు మనీలాండరింగ్‌కు, విదేశాల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇది రష్యన్ సామ్రాజ్యవాదులకు అమెరికా తలుపులు తెరుస్తుందా అని అడిగినప్పుడు ట్రంప్ ఉదాసీనంగా సమాధానమిచ్చారు. ‘అవును. నాకు కొందరు రష్యన్ సామ్రాజ్యవాదులు తెలుసు. వారు చాలా మంచి వ్యక్తులు’అని పేర్కొన్నారు. » ఉద్యోగాలను సృష్టించే సంస్థలలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా గోల్డ్ కార్డ్ వస్తే.. చాలా మంది ధనవంతులు యూఎస్ ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి తోడ్పాటు ఏమీ ఇవ్వకుండా నివాసం ఉండవచ్చనే ఆందోళనలు ఉన్నాయి. » కెనడాలో ఇలాంటి కార్యక్రమాన్ని తక్కువ పెట్టుబడితోనే ప్రారంభించారు. కానీ అది విపరీతంగా దుర్వినియోగం కావడంతో రద్దు చేశారు. ముందున్న సవాళ్లు రెండు.. ప్రతినిధుల సభ కాంగ్రెస్‌లో.. వలస విధానంలో ఏదైనా ముఖ్య మార్పును అమెరికా ప్రతినిధుల సభ కాంగ్రెస్ ఆమోదించాలి. ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ కి ఉభయ సభలలో మెజారిటీ ఉంది. కానీ అమెరికన్ పౌరసత్వాన్ని అమ్ముకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అందరు రిపబ్లికన్లు సమర్థించకపోవచ్చు. డెమొక్రాట్లు ఈ ప్రతిపాదనను దాదాపుగా వ్యతిరేకిస్తారు. కోర్టులలో..అమెరికాలో చాలా చట్టపరమైన సవాళ్లు వీసా కార్యక్రమాల నిర్వహణ నుంచే ఉత్పన్నమవుతాయి. ట్రంప్ గోల్డ్ కార్డ్ ఎలాంటి చట్టపర సవాళ్లను ఎదుర్కొంటుందో ఊహించడం కష్టమేనని నిపుణులు అంటున్నారు. భారతీయులు–గోల్డ్ కార్డ్..కాన్సులర్ ప్రాసెసింగ్ ఉపయోగించి 2022–23లో ఈబీ–5 కార్యక్రమం ద్వారా 631 మంది భారతీయులు మాత్రమే యూఎస్ గ్రీన్‌కార్డులను పొందారు. ఈ పథకానికి రూ.9.17 కోట్లు పెట్టుబడి మాత్రమే అవసరం. అలాంటిది రూ.43.7 కోట్లపైన చెల్లించి గ్రీన్‌కార్డ్ కొనాలనే ఆలోచన చాలా మంది భారతీయులకు ఆకర్షణీయంగా కనిపించే అవకాశం లేదని యూఎస్ న్యాయవాది, అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ సభ్యురాలు రవనీత్ కౌర్ బ్రార్ అభిప్రాయపడ్డారు. గోల్డ్ కార్డ్ వీసా అంటే? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ను ఈ వారమే ఆవిష్కరించారు. ఇది విదేశీ పెట్టుబడిదారులకు అమెరికా పౌరసత్వం పొందేందుకు రాచమార్గం. అమెరికా గ్రీన్కార్డ్కు ఖరీదైన ప్రత్యామ్నాయం కూడా. గోల్డ్ కార్డ్ కోరుకునేవారు యూఎస్ ప్రభుత్వానికి 5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.43.7 కోట్లు) చెల్లించాలి. ఈ వీసా విధివిధానాలు రెండు వారాల్లో వెలువడనున్నాయి. గోల్డ్ కార్డ్ హోల్డర్లు అమెరికా వెలుపల సంపాదించిన ఆదాయంపై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. దేశీయంగా (యూఎస్‌లో) ఆర్జించే ఆదాయాలపై పూర్తి పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. గోల్డ్‌కార్డుల విక్రయం ద్వారా పెద్ద పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగ సృష్టికర్తలు అమెరికాకు సమకూరుతారని ట్రంప్ అన్నారు. అప్పుల భారం తగ్గించుకునేందుకు.. గోల్డ్ కార్డ్ విధానం అమెరికా రుణాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘మేం కోటి కార్డులు అమ్మితే 50 ట్రిలియన్ డాలర్లు (రూ.43,70,00,000 కోట్లు) సమకూరుతుంది. మాకు 35 ట్రిలియన్ డాలర్ల (రూ.30,59,00,000 కోట్లు) అప్పు ఉంది’’అని ఆయన పేర్కొన్నారు. అసాధారణ ప్రతిభ ఉన్న దరఖాస్తుదారులను స్పాన్సర్ చేయడం కోసం కంపెనీలను అనుమతించే నిబంధనలను గోల్డ్ కార్డ్‌లో చేర్చవచ్చని ట్రంప్ చెప్పారు. యాపిల్ వంటి సంస్థలు తాము నియమించుకోవాలనుకునే అగ్రశ్రేణి ప్రతిభావంతులకు గోల్డ్ కార్డులను స్పాన్సర్ చేయవచ్చన్నారు. ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఇదే.. ప్రస్తుత ఈబీ–5 వీసా స్థానంలో గోల్డ్ కార్డ్ రానుంది. యూఎస్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ నిర్వహించే ఈబీ–5 ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్‌ను 1990లో అమెరికా ప్రజాప్రతినిధుల సభ అయిన కాంగ్రెస్ రూపొందించింది. విదేశీ పెట్టుబడిదారుల ద్వారా అమెరికాలో ఉద్యోగ సృష్టి, మూలధన పెట్టుబడి ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు దానిని అమలు చేస్తున్నారు. ఈబీ–5 వీసా కోసం 10,50,000 డాలర్ల (రూ.9.17 కోట్లు) పెట్టుబడి అవసరం. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో అయితే 8,00,000 డాలర్లు (రూ.6.99 కోట్లు) పెట్టుబడి పెట్టినా సరిపోతుంది. దీనికితోడు కనీసం 10 మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలి. దీనిద్వారా సాధారణంగా 3–5 ఏళ్లలో గ్రీన్‌కార్డ్ అందుకోవచ్చు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న 2019లో ఈ పరిమితిని 9,00,000 డాలర్లకు (రూ.7.8 కోట్లకు) పెంచాలన్న ప్రయత్నం జరిగింది. కానీ ఫెడరల్ కోర్టు అడ్డుకుంది. అమెరికా ఏటా 10,000 ఈబీ–5 వీసాలను జారీ చేస్తోంది. ప్రతి దేశానికి గరిష్టంగా 7% వీసాలు ఇస్తారు. ఈబీ–5 వీసా కావాల్సినవారు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అదే కొత్త గోల్డ్ కార్డ్ అయితే ఒకసారి కొనుక్కుంటే చాలు. పెట్టుబడి, ఉద్యోగ కల్పన భారం ఉండదు. దశాబ్దంలో 3,800 మంది.. హెచ్–1బీ, ఈబీ–2, లేదా ఈబీ–3 వీసాలపై యూఎస్‌లో ఉన్న భారతీయ వలసదారులు గోల్డ్ కార్డ్ వీసా కోసం దరఖాస్తు చేసుకుని అక్కడి పౌరసత్వాన్ని అందుకోవచ్చు. వర్క్ వీసాలు, ముఖ్యంగా హెచ్–1బీ వీసాల కోసం భారత్ నుంచి అత్యధిక డిమాండ్ ఉంది. గోల్డ్ కార్డ్ వీసా హోల్డర్ల రాక వల్ల.. ఇతర వీసా హోల్డర్లు గ్రీన్‌కార్డుల కోసం వేచిఉండాల్సి వస్తుందనే ఆందోళన ఉంది. అమెరికాలో గ్రీన్‌కార్డ్ (శాశ్వత చట్టపర నివాస అనుమతి) కోసం వేచి ఉండే సమయం భారతీయులకు చాలా ఎక్కువ. కొన్నిసార్లు దశాబ్దాల సమయం పడుతోంది. అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులకు ఓ–1 వీసా మెరుగైన ప్రత్యామ్నాయమని.. దానిద్వారా సులభంగా ఈబీ–1 గ్రీన్కార్డ్లోకి మారవచ్చని ఇమిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు. ఇది ఇతర ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ విభాగాల్లా కాకుండా తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉంటుందని పేర్కొంటున్నారు. ఇక వ్యాపార సంస్థల యజమానులు, కీలక స్థానాల్లో ఉన్న ఉద్యోగులు ఎల్–1 వీసాను పరిగణించవచ్చు. ఈబీ–5 వీసా కోసం చూస్తున్నవారు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో.. దానిని రద్దు చేయడానికి ముందే త్వరపడాలనే ఆత్రుత కనిపిస్తోంది. అయితే ఈబీ–5 వీసా రద్దు చేయాలంటే అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం అవసరమని ఇమిగ్రేషన్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గత దశాబ్దంలో దాదాపు 3,800 మంది భారతీయులు ఈబీ–5 వీసాతో అమెరికా వెళ్లారని అంచనా. 100కుపైగా దేశాల్లో సంపన్నులకు గోల్డెన్ వీసాలు ప్రపంచవ్యాప్తంగా 100కుపైగా దేశాలు సంపన్నులకు గోల్డెన్ వీసాలు ఇస్తున్నాయి. యూరప్, ఇతర ప్రాంతాల్లోని చాలా దేశాలు పెట్టుబడి కార్యక్రమాల ద్వారా పౌరసత్వాన్ని ఆఫర్ చేస్తున్నాయి. తమ దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడే వారికి మాల్టా పౌరసత్వాన్ని అందిస్తోంది. ఆ విధానం ఉత్తమమైనదని హ్యాన్లీ సిటిజన్‌షిప్ ప్రోగ్రామ్ ఇండెక్స్ పేర్కొనడం గమనార్హం. మాల్టా పౌరసత్వం పొందాలంటే కనీసం €6,00,000 యూరోల (రూ.5.45 కోట్లు) పెట్టుబడితోపాటు అక్కడ కనీసం 36 నెలల పాటు నివాసం ఉండాలి. లేదా 12 నెలలు అక్కడ నివసించిన తర్వాత €7,50,000 యూరోలు (రూ.6.82 కోట్లు) ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. హ్యాన్లీ ఇండెక్స్ టాప్–10 జాబితాలో ఆ్రస్టియా, గ్రెనాడా, యాంటీగ్వా అండ్ బాబూడా, నౌరూ, సెయింట్ కిట్స్ ఉన్నాయి. తమ లాభాలను పెంచుకోవాలని చూస్తున్న అంతర్జాతీయ వ్యాపారులకు ఇవి ఆకర్షణీయ పన్ను స్వర్గధామాలు (ట్యాక్స్ హెవెన్స్) కూడా. ఇక హ్యాన్లీ గ్లోబల్ రెసిడెన్స్ ప్రోగ్రామ్ ఇండెక్స్ జాబితాలో గ్రీస్ అగ్రస్థానంలో ఉంది. తరువాతి స్థానాన్ని స్విట్జర్లాండ్ కైవసం చేసుకుంది. సంపన్న భారతీయులకు ఇష్టమైన గమ్యస్థానంగా నిలిచిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కనీసం 5,45,000 డాలర్ల (రూ.4.76 కోట్లు) పెట్టుబడితో గోల్డెన్ వీసా రెసిడెన్స్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తోంది. -
దూకుడు ఫలితం.. ట్రంప్ క్రేజ్‌కు బీటలు..?
వాషింగ్టన్: రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత వరుస దూకుడు నిర్ణయాలతో ట్రంప్‌కు అమెరికాలో క్రేజ్ తగ్గుతోందా..? ఆయన విధానాలతో అగ్ర దేశ ప్రజలు అంత సంతోషంగా లేరా..? అంటే తాజాగా వెల్లడైన పాపులర్ పోల్ సర్వే ఫలితాలు అవునేనే చెబుతున్నాయి. మంగళవారం(ఫిబ్రవరి 25)తో ముగిసిన రాయిటర్స్/ఇప్సోస్ తాజా పోల్‌లో ట్రంప్‌కు 44 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. జనవరి చివరి వారంలో నిర్వహించిన పోల్‌లో కంటే ట్రంప్‌కు మద్దతు పలికేవారి సంఖ్య కాస్త తగ్గింది. జనవరిలో వరుసగా ట్రంప్‌నకు 47 శాతం మంది అనుకూలంగా ఓటు వేయగా ప్రస్తుతం ఇది 44 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో ట్రంప్‌ను వ్యతిరేకించే వారి సంఖ్య జనవరితో పోలిస్తే ఏకంగా 10 శాతం పెరిగి 51 శాతానికి చేరింది. జనవరిలో నిర్వహించిన సర్వేలో ట్రంప్‌ను కేవలం 41 శాతం మంది మాత్రమే వ్యతిరేకించారు. ట్రంప్ వలస విధానానికి అత్యధికంగా 47 శాతం మంది మద్దతు పలుకుతుండగా అమెరికా ఆర్థిక వ్యవస్థను ట్రంప్ తిరోగమనం దిశగా తీసుకెళుతున్నారని ఏకంగా 53 శాతం మంది భావిస్తున్నారు.జనవరిలో ట్రంప్ ఆర్థిక విధానాలను కేవలం 43 శాతం మంది మాత్రమే వ్యతిరేకించగా ఇప్పుడు ఆ సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇదే సమయంలో ట్రంప్ ఇతర దేశాలపై విధిస్తున్న టారిఫ్ పన్నులు, ఇతర ఆర్థిక విధానాలను కేవలం 39 శాతం మంది మాత్రమే బలపరుస్తున్నారు. ట్రంప్ హయాంలో ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని అమెరికన్లు భావిస్తుంటారు. ఇదే గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రధానంగా ఎన్నికల్లో ఆయనకు కలిసొచ్చిన అంశం. అయితే రెండో టర్ము మొదలై రెండు నెలలు కూడా కాకముందే ట్రంప్ ఈ విషయంలోనే ప్రజల మద్దతు కోల్పోతుండడంపై చర్చ జరుగుతోంది. చైనా కాకుండా ఇతర దేశాల వస్తువులపై ట్రంప్ దిగుమతి సుంకాలు విధించడాన్ని 54 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. అయితే చైనాపై టారిఫ్‌ల విధింపు అంశంలో మాత్రం ట్రంప్‌కు 49 శాతం మంది మద్దతు లభించింది. చైనాపై టారిఫ్‌లను కూడా 47 శాతం మంది వ్యతిరేకిస్తుండడం గమనార్హం. రాయిటర్స్,ఇప్సోస్ నిర్వహించిన తాజా పోల్‌లో మొత్తం 4145 మంది పాల్గొన్నారు. -
హీరోలా ఎగిరే జీరో..
ట్రాఫిక్‌జామ్‌లకు భయపడి కారును బయటకు తీయాలంటేనే భయపడుతున్నారా? అయితే మీ లాంటి వారి కోసమే ఓ ఎగిరే కారు సిద్ధమవుతోంది. అమెరికాకు చెందిన అలెఫ్ ఏరోనాటిక్స్ అనే ఆటోమోటివ్, ఏవియేషన్ సంస్థ సరికొత్త ఫ్యూచర్ కారును అభివృద్ధి చేస్తోంది. రోడ్డుపై రయ్యిమని దూసుకెళ్లగలగడంతోపాటు అవసరమైనప్పుడు అమాంతం పైకి ఎగిరి వెళ్లగల కారును సిద్ధం చేస్తోంది.తాజాగా మోడల్ జీరో అనే కారును ప్రయోగాత్మకంగా కాలిఫోర్నియాలోని ఓ రోడ్డుపై విజయవంతంగా పరీక్షించింది. అందుకు సంబంధించిన వీడియోను సంస్థ నెటిజన్లతో పంచుకుంది. ఆ వీడియోలో మోడల్ జీరో కారు రోడ్డుపై కాస్త దూరం ప్రయాణించి ఆపై నిట్టనిలువుగా టేకాఫ్ అయి ముందున్న కారు పైనుంచి ఎగురుతూ ముందుకు సాగింది. అనంతరం మళ్లీ రోడ్డుపై దిగి ముందుకు కదిలింది. –సాక్షి, సెంట్రల్ డెస్క్ఎలా సాధ్యమైంది?సాధారణ కార్లలో బానెట్‌లో ఇంజన్ ఉంటే మోడల్ జీరో కారులో మాత్రం నాలుగు చిన్న ఇంజన్లను వాటి చక్రాల వద్ద కంపెనీ అమర్చింది. వాటి సాయంతో సాధారణ ఎలక్ట్రిక్ కారులాగానే ఈ కారు రోడ్డుపై దుసుకెళ్తోంది. ఇక ఖాళీగా ఉన్న బానెట్, డిక్కీలలో మొత్తం ఎనిమిది ప్రొపెల్లర్లను సంస్థ ఏర్పాటు చేసింది. వేర్వేరు వేగములతో వేటికవే విడివిడిగా పరిభ్రమించగలగడం ఈ ప్రొపెల్లర్ల్ల ప్రత్యేకత. ఫలితంగా కారు ఏ దిశలో అయినా ఎగరడం సాధ్యం అవుతోంది. ఇందుకోసం డిస్ట్రిబ్యూటెడ్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ టెక్నాలజీని కంపెనీ ఉపయోగించింది. కారు ఫ్రేమ్ కోసం కార్బన్ ఫైబర్ వాడటంతో బరువు 385 కిలోలకే పరిమితమైంది. ప్రస్తుత నమూనా గాల్లో సుమారు 177 కి.మీ. దూరం ప్రయాణించగలదని.. రోడ్డుపై మాత్రం 56 కి.మీ. దూరం వెళ్లగలదని అలెఫ్ ఏరోనాటిక్స్ వివరించింది. రెండు సీట్లుగల మోడల్ ఏ రకం కారు రోడ్డుపై సుమారు 320 కి.మీ. దూరం ప్రయాణించగలదని.. గాల్లో 177 కి.మీ. దూరం వెళ్లగలదని తెలిపింది. ఫ్లయింగ్ కార్లకన్నా భిన్నమైనది..ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అభివృద్ధి దశలో ఉన్న ఫ్లయింగ్ కార్లకన్నా తాము రూపొందిస్తున్న కారు భిన్నమైనదని అలెఫ్ ఏరోనాటిక్స్ తెలిపింది. ఈవీటాల్ ఫ్లయింగ్ ట్యాక్సీల వంటి కార్లు టేకాఫ్ కోసం రోడ్డును రన్ వేలాగా ఉపయోగిస్తాయని.. కానీ తాము అభివృద్ధి చేస్తున్న కారు మాత్రం రోడ్డుపై నిట్టనిలువుగా టేకాఫ్ తీసుకోగలదని పేర్కొంది. సాధారణ ప్రజలు ఈ కారును వాడటం ఎంతో సులువని.. కేవలం 15 నిమిషాల్లో కారులోని కంట్రోల్స్‌పై పట్టు సాధించొచ్చని కంపెనీ సీఈఓ జిమ్ డకోవ్నీ పేర్కొన్నారు. ‘రైట్ బ్రదర్స్ విమాన వీడియో తరహాలో మా కారు ప్రయోగ వీడియో మానవాళికి సరికొత్త రవాణా సాధ్యమని నిరూపిస్తుందని భావిస్తున్నా’అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ధర ఎక్కువే..మోడల్ ఏ రకం కారుపై కంపెనీ ఇప్పటికే ప్రీ ఆర్డర్లు తీసుకుంటోంది. రోల్స్ రాయిస్, బెంట్లీ, ఆస్టన్ మార్టిన్ వంటి లగ్జరీ కార్ల తరహాలోనే ఈ కారు ధరను సుమారు రూ. 2.57 కోట్లుగా కంపెనీ ఖరారు చేసింది. అయితే భవిష్యత్తులో భారీ స్థాయిలో ఉత్పత్తి చేపట్టి సామాన్యులకు అందుబాటు ధరలో ఉండేలా సుమారు రూ. 27.35 లక్షలకు కారును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. -
అమెరికా సాయం వివాదం..ఎవరీ వీణారెడ్డి..?
న్యూఢిల్లీ:భారత్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు అమెరికా చేసిన సాయం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. బీజేపీ,కాంగ్రెస్ పార్టీల మధ్య ఈ వివాదంపై విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. భారత్‌కు రూ. 186 కోట్ల ఓటర్ టర్నవుట్ సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.భారత్‌లో ఏదో ఒక పార్టీకి ఎన్నికల్లో సాయం చేయడానికే బైడెన్ ఈ సాయం చేసి ఉంటారని ట్రంప్ వ్యాఖ్యానించడం కూడా సంచలనమైంది.అయితే ఈ వ్యవహారంలో తాజాగా వీణారెడ్డి తెరపైకి వచ్చింది. వీణారెడ్డి యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూఎస్ఎయిడ్)ఇండియాకు 2021-24 మధ్య డైరెక్టర్‌గా వ్యవహరించారు.భారత్‌కు ఓటర్ టర్నవుట్ విషయంలో సాయం చేయడంలో వీణారెడ్డి కీలకంగా వ్యవహరించారన్న ప్రచారం జరుగుతోంది. ఈమె 2021లో భారత్‌కు వచ్చి 2024 లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత తిరిగి అమెరికా వెళ్లారు. వీణారెడ్డి పాత్రపై విచారణ జరపాలని బీజేపీ ఎంపీ మహేష్ జెఠ్మలానీ తాజాగా ట్వీట్ చేయడంతో ఆమె పేరు వెలుగులోకి వచ్చింది.So #DOGE has discovered that #USAID allocated $21million for “voter turnout” in India ,a euphemism for paying voters to cast their votes to effect regime change. #VeenaReddy was sent to India in 2021 ( ominous?) as head of USAIDs Indian mission . Post #loksabha elections 2024 (…— Mahesh Jethmalani (@JethmalaniM) February 16, 2025వీణారెడ్డి యూఎస్ఎయిడ్ డైరెక్టర్‌గా ఉన్నపుడు అమెరికా నుంచి భారత్‌కు అందే సాయం గణనీయంగా పెరిగినట్లు సమాచారం.అమెరికా సాయంతో భారత్‌లో ఓటర్ టర్నవుట్ పెరిగితే అది కచ్చితంగా అధికార పార్టీకి అయితే మేలు చేయదని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్య ఇప్పటికే ఎక్స్(ట్విటర్)లో పోస్టు పెట్టడం గమనార్హం. -
వలసదారులకు సంకెళ్లు.. వైట్‌హౌజ్ వివాదాస్పద వీడియో
వాషింగ్టన్: అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి అవమానకరంగా పంపిస్తున్నారని భారత్‌తో సహా ఇతర దేశాల్లో అమెరికాపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా భారత్‌లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో విమర్శలు గుప్పిస్తోంది. అమెరికా ఇప్పటివరకు భారత్‌కు పంపించిన వలసదారుల చేతులు, కాళ్లకు సంకెళ్లు వేసి అవమానకర రీతిలో తీసుకువచ్చారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.ఈ ఆరోపణలకు ఊతమిచ్చేలా వైట్‌హౌజ్ తాజాగా ఓ వివాదాస్పద 41 నిమిషాల నిడివి గల వీడియోను సోషల్‌మీడియాలో పోస్టు చేసింది. అక్రమ వలసదారులను విమానం ఎక్కించేముందు వారికి సంకెళ్లు వేస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. అలాగే వారికి వేయడానికిగాను గొలుసులను పోలీసులు సిద్ధం చేస్తుండడం వీడియోలో కనిపిస్తోంది. అయితే విమానం ఎక్కుతున్న అక్రమ వలదారుల ముఖాలు మాత్రం వీడియోలో కనిపించలేదు. ASMR: Illegal Alien Deportation Flight 🔊 pic.twitter.com/O6L1iYt9b4— The White House (@WhiteHouse) February 18, 2025కాగా, అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులకు సంకెళ్లు వేసి తరలిస్తున్న అంశంలో ఇటీవలే అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీ కూడా ఏమీ చేయలేకపోయారని కాంగ్రెస్ మండిపడుతోంది. ఇంతకుముందు ఇదే విషయమై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందిస్తూ మహిళలకు, పిల్లలకు సంకెళ్లు వేయడం లేదని సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. -
భారత్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
వాషింగ్టన్:భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అందిస్తున్న 21 మిలియన్ డాలర్ల సాయాన్ని ఇటీవల అమెరికా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లపై ట్రంప్ మంగళవారం(ఫిబ్రవరి 18) సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ భారత్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఇండియాకు 21 మిలియన్ డాలర్ల సాయం ఎందుకివ్వాలి. వాళ్ల దగ్గరే చాలా డబ్బులున్నాయి. అమెరికాపై వాళ్లు భారీగా పన్నులు వేస్తున్నారు. నాకు భారత దేశం అన్నా, ఆ దేశ ప్రధాని అన్నా గౌరవం ఉంది’అని ట్రంప్ అన్నారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే వాహనాలపై ఏప్రిల్ 2 నుంచి 25 శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇటీవల ప్రధాని మోదీ అమెరికాలో పర్యటన ముగిసిన వెంటనే బిలియనీర్ ఇలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డీవోజీఈ) భారత్‌కు సాయాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. కేవలం భారత్‌కే కాకుండా బంగ్లాదేశ్,పాకిస్తాన్ తదితర దేశాలకు అందించే సాయాన్ని కూడా అమెరికా ప్రభుత్వ ఖర్చులు తగ్గించడంలో భాగంగా డీవోజీఈ ఆపివేసింది. -
ఎవరినీ వదిలేది లేదు: ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్: అమెరికా వాణిజ్య విధానం ఇచ్చిపుచ్చుకునే విధంగా న్యాయంగా ఉంటుందని దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కొత్త టారిఫ్ విధానంపై సోమవారం(ఫిబ్రవరి 17) ఆయన ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. తమ వాణిజ్య విధానంలో ఎక్కువ, తక్కువలకు చోటుండదన్నారు. అందరూ సమానమేనన్నారు.ఆయా దేశాలు తమ వస్తువులపై ఎంత సుంకాలు విధిస్తాయో తామూ అంతే విధిస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా ఎక్కువ సుంకాలు విధిస్తోందని ఏ దేశమైనా భావిస్తే ముందు ఆ దేశం అమెరికా వస్తువులపై సుంకాలను తగ్గించుకోవాలి లేదా పూర్తిగా తీసేయాలని ట్రంప్ సూచించారు. అమెరికాలో ఉత్పత్తి, వస్తువుల తయారీ చేపడితే సుంకాలు ఉండవని తెలిపారు.సుంకాల విషయంలో అమెరికా మిత్ర,శత్రు దేశాలు చాలా కాలంగా అన్యాయంగా వ్యవహరిస్తున్నాయని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రంప్ అధ్యకక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాతో వాణిజ్యం నిర్వహించే దేశాలకు చెందిన వస్తువులపై దిగుమతి సుంకాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. -
బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్.. అమెరికాలో కొండెక్కిన కోడిగుడ్డు
వాషింగ్టన్:బర్డ్‌ఫ్లూ ఇక్కడే కాదు అగ్రదేశం అమెరికానూ భయపెడుతోంది. ఒకవైపు బర్డ్‌ఫ్లూ వల్ల మన దేశంలో చికెన్,గుడ్లు తినాలంటే భయపడుతుండడంతో చికెన్,గుడ్ల అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. అమెరికాలో బర్డ్‌ఫ్లూ దెబ్బకు కోడిగుడ్ల ధరలు రోజురోజుకు కొండెక్కుతున్నాయి. అమెరికాలో గుడ్లను ప్రోటీన్లు అందించే ఆహారంగా భావిస్తారు. దీంతో అక్కడ గుడ్లకు భారీగా డిమాండ్ ఉంటుంది.ఇదే సమయంలో బర్డ్‌ఫ్లూ కారణంగా గుడ్లు పెట్టే కోళ్లు చనిపోతుండడంతో వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ కారణంతో గుడ్ల ఉత్పత్తి ఒక్కసారిగా పడిపోయింది. ఈ ఎఫెక్ట్ గుడ్ల ధరలపై పడింది. ప్రస్తుతం అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో డజను గుడ్ల ధర ఏకంగా పది డాలర్లు(రూ.867)కు చేరిందంటే పరిస్థితి ఎలాఉందో అర్థం చేసుకోవచ్చు.గత ఏడాది జనవరి నుంచి అమెరికాలో గుడ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి.అప్పటి నుంచి ఇప్పటివరకు డజను గుడ్ల ధర ఏకంగా 65 శాతం పెరిగింది. గుడ్ల ఉత్పత్తి పడిపోవడంతో కొన్ని సూపర్ మార్కెట్లలో కస్టమర్లకు అమ్మే గుడ్లపై పరిమితులు విధించారు. ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా లేదా బర్డ్‌ఫ్లూ కోళ్లలో శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. దీని వ్యాప్తి నివారించడానికి లక్షల్లో కోళ్లను అధికారులు చంపుతున్నారు. బర్డ్‌ఫ్లూ ప్రభావం ఫామ్‌లలో పెరిగే కోళ్ల మీద కంటే దేశీయంగా పెరిగే నాటుకోళ్లపై అధికంగా ఉంటుందని తేలింది. -
బలపడిన మైత్రీబంధం!
ఎవరి అంచనాలకూ అందని తన ఆచరణతో, మాటలతో దిగ్భ్రమపరిచే డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి స్వీకరించి నెల్లాళ్లు కాకుండానే ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాన్ని సందర్శించారు. మోదీ రెండు రోజుల అమెరికా పర్యటనపై మన దేశంలో మాత్రమే కాదు, అనేక దేశాల అధినేతలు సైతం ఎంతో ఉత్కంఠ కనబరిచారు. అందుకు కారణం ఉంది. వేరే దేశాలు తమ ఉత్పత్తులపైఎంత సుంకం విధిస్తాయో తామూ వారి ఉత్పత్తులపై అదే స్థాయిలో ప్రతిచర్యాత్మక సుంకం వసూలు చేస్తామని ట్రంప్ చెబుతున్నారు. అదే అమలైతే అన్ని దేశాల వ్యాపార, వాణిజ్యాలుతీవ్రంగా ప్రభావితమవుతాయి. ట్రంప్ తొలి ఏలుబడిలో ఆయనతో మోదీకున్న సాన్నిహిత్యం ఎవరికీ తెలి యనిది కాదు. చర్చల్లో ఆయన సుంకాల విషయంలో ట్రంప్‌ను ఒప్పిస్తే, తాము కూడా భారత్ కిచ్చిన వెసులుబాట్లను చూపి గండం నుంచి గట్టెక్కవచ్చని వారి ఆశ. ప్రమాణస్వీకారం చేసింది మొదలుకొని సన్నిహిత మిత్రులా... ‘నువ్వా నేనా’ అని పోటీపడే ప్రత్యర్థులా అనే విచక్షణ లేకుండా అందరికీ సుంకాల వడ్డింపు తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు. అయితే ఈ అంశంపై ఇరుదేశాల మధ్యా అధికారుల స్థాయి చర్చలు జరిగితే గానీ స్పష్టత రాదు. అధినేతలిద్దరూ నాలుగు గంటల సుదీర్ఘ చర్చల అనంతరం నిర్వహించిన మీడియా సమావేశం గమనిస్తే వారిద్దరి మధ్యా గతం మాదిరే సౌహార్ద సంబంధాలున్నాయని అర్థమవుతుంది. మోదీ ‘చాలా ప్రత్యేకమైన వ్యక్తి’ అని అభివర్ణించటంతో పాటు 2020లో భార్యాసమేతంగా భారత్ వెళ్లినప్పుడు ఆయన ఇచ్చిన ఆతిథ్యం మరువలేనని ట్రంప్ అన్నారు.మోదీ సైతం ‘మీతో ఉన్న అతి గొప్ప స్నేహబంధాన్ని ఇప్పటికీ మా ప్రజలు గుర్తు చేసుకుంటార’ని చెప్పారు. బైడెన్ హయాంలో రెండు దేశాల సంబంధాలకూ నష్టం కలిగే రీతిలో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని ట్రంప్ అనటం గమనించదగ్గది. అయితే మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందే సుంకాల పెంపుదల ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. దీన్నిబట్టే అంచనాలకు దొరకని ట్రంప్ మనస్తత్వాన్ని గ్రహించవచ్చు. ప్రతిచర్యాత్మక సుంకాలపై ట్రంప్ అభీష్టం నెరవేరితే సంపన్న రాజ్యాల మధ్య అవగాహన ఫలితంగా దాదాపు 80 ఏళ్ల నుంచి ప్రపంచ వ్యాపార, వాణిజ్యాల్లో కొనసాగుతూ వస్తున్న విధానాలకు తిలోదకాలిచ్చినట్టవుతుంది. మధ్యలో ప్రపంచ దేశాల మధ్య సుంకాలు, వాణిజ్యాలపై కుదిరిన గాట్ ఒప్పందం, అటు తర్వాత ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనల కింద వర్థమాన దేశాలకు సుంకాల విషయంలో వెసులుబాట్లు లభించాయి. ఫలితంగా వాటి ఉత్పత్తులపై సంపన్న దేశాల్లో తక్కువ సుంకాలున్నాయి. అదే సమయంలో సంపన్న దేశాల ఉత్పత్తులపై వర్ధమాన దేశాలు అధిక సుంకాలు విధించగలిగాయి. ఇందువల్ల అమెరికా, ఇతర సంపన్న దేశాలకు కలిగిన నష్టమేమీ లేదు. ఎందుకంటే ఆ దేశాల కంపెనీలకు పరిశ్రమల స్థాపన కోసం నామమాత్ర ధరకు భూములు, అనేక ఇతర సదుపాయాలు లభించాయి. వాటి యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఇతరేతర రక్షణ ఉత్పత్తులు వర్ధమాన దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. ఒకచోట కనిపించే లోటు మరోచోట భర్తీ అవుతోంది. వాటి వ్యాపార వాణిజ్యాలు వందల రెట్లు పెరుగుతున్నాయి. కానీ ట్రంప్‌కు ఇవేం పట్టవు. అమెరికాలోని సంపన్న రైతులకు భారీ సబ్సిడీలిస్తున్న కారణంగా వారి సాగు ఉత్పత్తులు కారుచౌకగా ఉంటాయి. ఆ ఉత్పత్తులు భారత్ మార్కెట్లో అడుగుపెడితే మన ఉత్పత్తు లకు గిరాకీ పడిపోతుంది. అందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. ట్రంప్ తరచు చెప్పే అత్యంత ఖరీదైన హార్లీ–డేవిడ్ సన్ బైక్‌కి కూడా ఇది వర్తిస్తుంది. చవగ్గా లభించే విదేశీ ఆహారోత్పత్తులూ, విలాసవంతమైన వస్తువులూ కొనడానికి జనం ఎగబడితే మన విదేశీ మారకద్రవ్యమూ కరిగిపో తుంది. మన ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తుంది. కనుకనే మనం భారీ సుంకాలు విధించాల్సి వస్తుంది.సుంకాల సంగతలా వుంచితే ఇరు దేశాలకూ అనేక అంశాల్లో భావసారూప్యత ఉంది. ఉమ్మడి లక్ష్యాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉగ్రవాదాన్ని అదుపు చేయటం, చైనా దుందు డుకు పోకడలను నియంత్రించటం అందులో ముఖ్యమైనవి. మన దేశం నుంచి చట్టవిరుద్ధంగా 7,25,000 మంది అమెరికాకు వలస పోయారని గణాంకాలు చెబుతున్నాయి. వీరందరినీ వెనక్కి పంపితే తమకు అభ్యంతరం లేదని మోదీ అమెరికాకు స్పష్టంగా చెప్పారు. ఇక మన ప్రయోజ నాలకు ఎంతగానో తోడ్పడే ఇరాన్‌లోని చాబహార్ పోర్టుతో తెగతెంపులు చేసుకోవాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. పాకిస్తాన్‌తో ప్రమేయం లేకుండా అఫ్గాన్‌కు చేరడానికి, పశ్చిమాసియా దేశా లతో వాణిజ్యం నెరపడానికి దోహదపడుతుందని చాబహార్ పోర్టు నిర్మాణంలో మన దేశం భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇరాన్ తమ శత్రువు గనుక ఆ పోర్టును వదులుకోవాలని ట్రంప్ చెబుతున్నారు. ఇన్నాళ్లుగా భారత్‌కి స్తున్న మినహాయింపు రద్దు చేశారు. ఇదెక్కడి న్యాయం! మోదీ పర్యటన వల్ల అమెరికా తయారీ ఎఫ్–35 ఫైటర్ జెట్ విమానాల కొనుగోలు, చమురు, సహజవాయు కొనుగోళ్లు, కృత్రిమ మేధ, ఇతర సాంకేతికతలు, అంతరిక్ష అన్వేషణ, అణు ఇంధనం వగైరా అంశాల్లో సహకారం పెంపుపై అవగాహన కుదిరింది. పరస్పర ప్రయోజనకరంగా ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకోవటం, ఇరు దేశాల మధ్య వాణిజ్యం మరింత పెరగనుండటం బల పడుతున్న మైత్రీబంధానికి చిహ్నం. అయితే అసంబద్ధమైన సుంకాలతో, అడ్డగోలు విధానాలతో ఈ బంధాన్ని దెబ్బ తీయరాదని అమెరికా గ్రహించాలి. మోదీ పర్యటన అందుకు దోహదపడాలని అందరూ కోరుకుంటారు. -
ఆ విమానాలు అమృత్సర్కే ఎందుకు..?
అమృత్సర్: అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను తీసుకువస్తున్న విమానాలు పంజాబ్‌లోని అమృత్సర్కే ఎందుకు వస్తున్నాయి. గుజరాత్,హర్యానా, దేశ రాజధాని ఢిల్లీకి ఎందుకు వెళ్లడం లేదు. ఇప్పుడు ఈ విషయం మీదే రాజకీయ వివాదం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం కావాలనే ఆ విమానాలను అమృత్‌సర్‌కు పంపిస్తోందని పంజాబ్ సీఎం భగవంత్మాన్సింగ్ విమర్శించారు.పంజాబ్ పేరు చెడగొట్టేందుకే బీజేపీ ఉద్దేశపూర్వకంగా విమానాలను అమృత్సర్ పంపిస్తోందని మాన్ ఆరోపించారు. శనివారం(ఫిబ్రవరి15) రానున్న మరో విమానంలోని వారికి భగవంత్‌మాన్ స్వయంగా స్వాగతం పలకనున్నారు. ఇందుకుగాను ఆయన ఇప్పటికే అమృత్సర్ చేరుకున్నారు. కాంగ్రెస్ కూడా కేంద్రంపై మాన్ తరహాలోనే ఆరోపణలు చేస్తోంది. అయితే బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది.ఈ అంశాన్ని రాజకీయం చేయడం మంచిదికాదని హితవు పలుకుతోంది. ఆదివారం(ఫిబ్రవరి16) కూడా భారతీయులతో కూడిన మరో విమానం అమెరికా నుంచి రానుంది. ఇప్పటికే అమెరికా నుంచి వచ్చిన తొలి విమానంలో అమెరికాలో అక్రమంగా ఉంటున్న 104 మంది భారతీయులు తిరిగి వచ్చారు. తొలి విమానం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోనే ల్యాండ్ అయింది. -
మస్క్ టీమ్‌లోకి నిఖిల్ రాజ్‌పాల్..ఎవరంటే..
వాషింగ్టన్:డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజుకో సంచలన నిర్ణయం తీసకుంటున్నారు. ట్రంప్ తన సన్నిహితుడైన బిలియనీర్ ఇలాన్‌మస్క్‌కు అమెరికా ప్రభుత్వ పాలన వ్యవస్థ(డోజ్)ను ప్రకక్షాళన బాధ్యత అప్పగించారు. మస్క్ నేతృత్వంలోని డోజ్ నుంచి కూడా అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల సమర్థత పెంపుపై రోజుకు ఒక కొత్త నిర్ణయం వెలువడుతోంది.ఈ క్రమంలోనే డోజ్‌లో మస్క్ టీమ్‌లో ఎంతమంది పనిచేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మస్క్ టీమ్‌లో 19నుంచి24 ఏళ్ల వయసున్న ఆరుగురు ఇంజినీర్లు ఉన్నారు. వీరికి తోడు కొత్తగా నిఖిల్ రాజ్‌పాల్ అనే 30 ఏళ్ల భారతీయ యువకుడు డోజ్‌లో మస్క్ టీమ్ సభ్యుడిగా చేరారు.ఇప్పటికే మస్క్ టీమ్‌లో ఉన్న ఆకాష్బొబ్బ కూడా భారతీయ యువకుడే కావడం గమనార్హం. అయితే కొత్తగా చేరిన నిఖిల్ రాజ్‌పాల్ కంప్యూటర్ ఇంజినీర్. మస్క్‌కు చెందిన కంపెనీలు టెస్లా,ఎక్స్(ట్విటర్)లో కూడా నిఖిల్ కీలక బాధ్యతల్లో పనిచేశారు.తాజాగా డోజ్‌లో చేరిన నిఖిల్ అమెరికా ప్రభుత్వ పాలన వ్యవస్థ ప్రక్షాళనలోనూ కీలక పాత్ర పోషించనున్నట్లు చెబుతున్నారు. -
‘రెడ్‌బుక్’ ఎఫెక్ట్..! కాష్పటేల్కు సెనేట్ షాక్
వాషింగ్టన్:అమెరికాలోనూ కక్ష సాధింపు రాజకీయాల కాలం నడుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉన్నట్లుగానే అక్కడా రిపబ్లికన్లు ఒక ‘రెడ్‌బుక్’ రాసి పెట్టుకున్నారు. అందులో వారు టార్గెట్‌గా చేసుకున్న ప్రత్యర్థుల పేర్లు రాసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరిపై ఎలా కక్ష తీర్చుకోవాలనేది ముందే డిసైడయ్యారు. ఈ కక్ష సాధించే సంప్రదాయమే ట్రంప్ 2.0లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) చీఫ్‌గా నామినేట్ అయిన కాశ్‌పటేల్ మెడకు చుట్టుకుంది. తాము కక్ష తీర్చుకోవాల్సిన డెమోక్రాట్లు చాలా మంది ఉన్నారని కాష్ పటేల్ గతంలో వ్యాఖ్యానించారు. కాష్ మాట్లాడిన ఈ మాటలే ప్రస్తుతం ఆయన ఎఫ్‌బీఐ చీఫ్‌గా పదవి చేపట్టేందుకు అడ్డంకిగా మారింది.ఈ మాటల వల్లే కాష్ పటేల్ నామినేషన్‌ను గత వారం అమెరికా ఎగువ సభ సెనేట్ ఆమోదించలేదు. కాష్ను ఎఫ్‌బీఐ చీఫ్‌గా నియమించడాన్ని డెమోక్రాట్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తానన్న కాష్ను ఎఫ్‌బీఐ చీఫ్‌గా నియమిస్తే అది రాజకీయ నియామకమే అవుతుందని వారు పేర్కొన్నారు.కాష్ పటేల్ రెడ్‌బుక్‌లో పలువురు డెమోక్రాట్ నేతలతో పాటు ట్రంప్ కేసులు వాదించిన ప్రాసిక్యూటర్లు, బైడెన్ హయాంలో కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. భారత సంతతికి చెందిన కాష్ను ఎఫ్‌బీఐ చీఫ్‌గా ట్రంప్ గతేడాది అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన వెంటనే నామినేట్ చేయడం గమనార్హం. -
త్వరలో అమెరికా నుంచి వచ్చే జాబితాలో ఎంతమంది..?
న్యూఢిల్లీ:అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను అక్కడి ప్రభుత్వం వెనక్కి పంపిస్తోంది. ఇప్పటికే మిలిటరీ విమానంలో 104 మంది భారతీయులను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే విమానంలో వచ్చిన వారికి సంకెళ్లు వేసి తీసుకురావడంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం(ఫిబ్రవరి7) ఒక కీలక ప్రకటన చేసింది. త్వరలో మరో 487 మంది భారతీయ పౌరులను దేశం నుంచి తరలించాలన్న ఆదేశాలున్నాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ విషయాన్ని తమకు అమెరికా ప్రభుత్వ వర్గాలు తెలిపాయని మిస్రీ చెప్పారు.అక్రమ మార్గాల ద్వారా దేశంలోకి ప్రవేశించిన వారిని తొలుత అమెరికా తిప్పి పంపిందన్నారు. వారంతా అమెరికా భద్రతకు ముప్పుగా పరిణమించారని అక్కడి ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. అయితే భారతీయులను మిలిటరీ విమానంలో అవమానించే తరహాలో తీసుకురావడంపై దేశంలో రాజకీయ దుమారం రేపింది. కాగా, బుధవారం అమెరికా నుంచి అమృత్‌సర్‌కు వచ్చిన సైనిక విమానంలో 105 మంది వలసదారులున్నారు. వీరిలో హరియాణా రాష్ట్రానికి చెందిన వాళ్లు 33 మంది ఉన్నారు. గుజరాత్(33), పంజాబ్(30), మహారాష్ట్ర(3), ఉత్తరప్రదేశ్(3), చండీగఢ్(2) రాష్ట్రాల వాళ్లూ ఉన్నారు.అమెరికా తిరిగి పంపిన వారిలో 19 మంది మహిళలు, నాలుగేళ్ల బాలుడు, ఐదేళ్లు, ఏడేళ్ల వయసున్న బాలికలున్నారు. ఇక్కడికొచ్చాక భారత అధికారులు పోలీసు వాహనాల్లో ఈ వలసదారులను స్వస్థలాలకు తరలించారు. -
భారతీయులపై తీవ్ర వ్యాఖ్యలు..మస్క్ టీమ్ సభ్యుడు రాజీనామా
వాషింగ్టన్:ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ నేతృత్వం వహిస్తున్న అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డీవోజీఈ) టీమ్ నుంచి ఓ ఇంజినీర్ రాజీనామా చేశాడు. 25 ఏళ్ల మార్కో ఇలెజ్ అనే ఇంజినీర్ భారతీయులపై సోషల్‌మీడియాలో గతంలో చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు తాజాగా వైరల్ అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంలో దుమారం రేగింది. ముఖ్యంగా భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలోనే ఇలెజ్ తన పోస్టుకు రాజీనామా చేయాల్సి వచ్చింది.ఇలెజ్ రాజీనామాపై అమెరికా మీడియా కథనాలు ప్రచురించింది. అతడు గతంలో ‘నార్మలైజ్ ఇండియా హేట్’ అనే పోస్టుతో పాటు ఇండియా నుంచి వచ్చిన హెచ్-1బీ వీసాదారులను ఉద్దేశించి ‘గోయింగ్ బ్యాక్ డోంట్ వర్రీ’ అనే వివాదాస్పద పోస్టులు పెట్టాడు. ఈ పోస్టులపై తీవ్ర వ్యతిరేకత రావడంతో డీవోజీఈ ట్రెజరీ డిపార్ట్మెంట్కు ఇలెజ్ రాజీనామా చేశాడు. ఈ పోస్టు ఖాలీ అయినట్లు ప్రభుత్వం ఇప్పటికే నోటిపై చేసింది. ఇలెజ్ డీవోజీఈ కంటే ముందు ఎక్స్(ట్విటర్)లోనూ ఇలాన్ మస్క్‌తో కలిసి పనిచేయడం గమనార్హం.కాగా, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత భారతీయులతో సహా పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారులను అమెరికా నుంచి సైనిక విమానాల్లో పంపివేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు సన్నిహితుడైన ఇంజినీర్ భారతీయులకు వ్యతిరేకంగా చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు వెలుగులోకి రావడం చర్చనీయాంశమవుతోంది. -
అమెరికా విమానంలో.. ఆ రాష్ట్రాల వారే ఎక్కువ..!
అమృత్సర్:అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యల్లో భాగంగా అమెరికా పంపించిన ప్రత్యేక విమానంలో భారత్‌కు తిరిగి వచ్చిన వలసదారుల్లో ఎవరెవరున్నారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బుధవారం(ఫిబ్రవరి5) మధ్యాహ్నం 1.45గంటలకు అమృత్‌సర్‌లోని గురురామ్దాస్జీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో వలసదారులతో వచ్చిన అమెరికా విమానం ల్యాండ్ అయిన విషయం తెలిసిందే.విమానంలో మొత్తం 205 మంది భారతీయలను అమెరికా నుంచి పంపించి వేశారని ప్రచారం జరిగింది. అయితే విమానంలో 104 మంది మంది భారతీయులే ఉన్నారు. 45 మంది దాకా అమెరికా అధికారులు కాగా, 11 మంది విమాన సిబ్బంది ఉన్నారు. అయితే 104మంది భారతీయుల్లో మొదటి స్థానంలో గుజరాత్,హర్యానాకు చెందిన వారు ఎక్కువగా ఉండగా తర్వాతి స్థానంలో పంజాబ్‌కు చెందిన వారు ఉన్నారు.విమానంలో వచ్చిన వారిలో 4 ఏళ్ల వయసున్న చిన్నారి కూడా ఉండడం గమనార్హం. అమెరికా నుంచి అందరు భారతీయులకు స్వాగతం పలికామని, మన దేశానికి చెందిన వారిని ఇలా పంపించి వేయడం దురదృష్టకరమని పంజాబ్ డీజీపీ వ్యాఖ్యానించారు. అమెరికాలో భారత అక్రమ వలసదారుల ఏడున్నర లక్షల మంది దాకా ఉన్నట్లు ఫ్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా. ఈ లెక్కన మెక్సికో, ఎల్ సాల్వడోర్ తర్వాత అత్యధికంగా అలా ఉంటోంది భారతీయులే. వీళ్లందరినీ వెనక్కి పంపించే ప్రక్రియ కొనసాగుతుందని అక్కడి అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో సుమారు 18 వేల మంది భారతీయులతో కూడిన జాబితాను అక్కడి ఇమ్మిగ్రేషన్ & కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలో భారత ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఆ సమయంలో ట్రంప్‌తో ఆయన ఈ అంశంపైనా చర్చించే అవకాశాలున్నాయి -
వలసదారుల విమానాలకు అంత ఖర్చా..?
వాషింగ్టన్:డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులను ప్రత్యేక విమానాల్లో వారి దేశాలకు తిప్పి పంపుతున్నారు. ఈ విమాన ప్రయాణాల కోసం అమెరికా భారీ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.పౌర విమానాల్లో కాకుండా వలసదారులను అమెరికా ప్రత్యేక సైనిక విమానాల్లో తరలిస్తుండటంతోనే ఎక్కువగా ఖర్చవుతోందన్న వాదన వినిపిస్తోంది. తాజాగా 205 మంది భారతీయులతో కూడిన మిలిటరీ విమానం బయల్దేరింది. ఈ విమాన ఖర్చు గంటకు కొన్ని వేల డాలర్లని అమెరికా అధికారులు చెబుతున్నారు.వలసదారులను వెనక్కి పంపే కేంద్ర ప్రభుత్వ వర్గాల సమన్వయం కూడా ఉన్నట్లు సమాచారం. గతంలోనూ వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.అయితే భారత్ విషయంలో మాత్రం అమెరికాకు ఇదే తొలి అడుగు.వచ్చే వారం భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపే అంశంపైనా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. -
పనిగంటలపై మస్క్ సంచలన ట్వీట్
వాషింగ్టన్:ఇన్ఫోసిస్ నారాయణమూర్తి పనిగంటల పెంపు వ్యాఖ్యల వివాదం అమెరికాను తాకింది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డీవోజీఈ) చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రముఖ బిలియనీర్ ఇలాన్‌మస్క్ ఈ విషయంలో నారాయణమూర్తి కంటే చాలా అడుగులు ముందుకు వేశారు. తాను తన డీవోజీఈ డిపార్ట్మెంట్ సిబ్బంది ఏకంగా వారానికి 120 గంటలు పనిచేస్తున్నామని చెప్పారు.ఇదే సమయంలో అమెరికా ఉన్నతస్థాయి అధికారులు వారానికి కేవలం 40 గంటలు మాత్రమే పనిచేస్తున్నారని అందుకే పౌరులు చెల్లిస్తున్న పన్ను సొమ్ము వృథా అవుతోందని మస్క్ తెలిపారు. ఈ మేరకు మస్క్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థపై డీవోజీఈ చేస్తున్న ఆడిట్లో సంచలన విషయాలు బయట పడుతున్నాయని, ప్రజల డబ్బు ఎలా దుర్వినియోగమవుతోందో తెలుస్తోందని మస్క్ అన్నారు. DOGE is working 120 hour a week. Our bureaucratic opponents optimistically work 40 hours a week. That is why they are losing so fast. https://t.co/dXtrL5rj1K— Elon Musk (@elonmusk) February 2, 2025 అయితే డీవోజీఈ ఆడిట్లపై ఉద్యోగుల సంఘాలు మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ రాజకీయ దురుద్దేశాలతో చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికా బ్యూరోక్రసీని సమర్థవంతంగా తయారుచేసేందుకు ట్రంప్ డీవోజీఈ చీఫ్‌గా మస్క్‌ను నియమించిన విషయం తెలిసిందే. కాగా, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తితో పాటు ఎల్అండ్టీ చీఫ్ సుబ్రమణియన్ తదితరులు ఎక్కువ పనిగంటల విధానమే మేలని వ్యాఖ్యానించి వివాదానికి కారణమయ్యారు. అయితే భారత ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఆర్థిక సర్వే మాత్రం 60 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని పేర్కొనడం గమనార్హం. -
అక్కడే పడుకుంటున్నా!: మస్క్ ఆసక్తికర కామెంట్స్
వాషింగ్టన్:అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డీవోజీఈ)కి సంబంధించి ఆ సంస్థ హెడ్, ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖల్యు చేశారు. డీవోజీఈ హెడ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తాను ఆ సంస్థ ఆఫీసులోనే పడుకుంటున్నానని మస్క్ తన సన్నిహితులతో అన్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి.ఫెడరల్ ప్రభుత్వ బ్యూరోక్రసీ వ్యవస్థపై పట్టు సాధించేందుకు తన ఆఫీసునే బెడ్రూమ్గా మార్చుకున్నానని మస్క్ చెప్పారు.డీవోజీఈ ఆఫీసు వైట్‌హైజ్ పక్కనే ఉన్న ఇసెన్హొవర్ భవనంలో ఉంది. ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టక ముందే ట్రంప్‌ను డీవోజీఈ చీఫ్‌గా నియమించిన విషయం తెలిసిందే. అయితే మస్క్‌కు గొప్ప హార్డ్ వర్కర్‌గా పేరుంది. ఆయన గతంలో బిజీ సమయాల్లో తన టెస్లా కంపెనీకి చెందిన ఫ్యాక్టరీ నేలపైనే నిద్రపోయినట్లు వార్తలొచ్చాయి. టెస్లా ఫ్యాక్టరీయే తన మొదటి ఇల్లు అని 2022లో మస్క్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. తాజాగా డీవోజీఈ ఆఫీసు విషయంలోనూ మస్క్ ఇదే తరహా విషయాన్ని వెల్లడించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. -
ట్రంప్‌కు కోర్టు మరో షాక్
వాషింగ్టన్:అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు నిర్ణయాలకు అక్కడి కోర్టులు వరుస బ్రేకులు వేస్తున్నాయి. ఉదార కార్యక్రమాలకు అమెరికా ప్రభుత్వ సాయాన్ని నిలిపివేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై వాషింగ్టన్ జిల్లా కోర్టు తాజాగా స్టే ఇచ్చింది. ట్రంప్ ఆదేశాలపై తాత్కాలిక స్టే విధించిన కోర్టు విచారణను వారంపాటు వాయిదా వేసింది.ట్రంప్ ఆదేశాల చట్టబద్ధతను విచారణ సందర్భంగా జడ్జి ప్రశ్నించారు. విదేశాలు, స్వచ్ఛంధ సంస్థలు,పలు కార్యక్రమాల కింద సాయాన్ని మంగళవారం సాయంత్రం నుంచి నిలిపివేయాలని ట్రంప్ ఆదేశాలిచ్చారు.ఈ ఆదేశాలపై వాషింగ్టన్ కోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయి. కాగా అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కోర్టుల నుంచి చుక్కెదురవడం ఇది రెండోసారి. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ట్రంప్ జారీ చేసిన జన్మతఃపౌరసత్వ హక్కు రద్దు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను అక్కడి ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ ఆదేశాలను కోర్టు రాజ్యాంగ విరుద్ధ చర్యగా అభివర్ణించడం గమనార్హం. -
ట్రంప్.. విద్యార్థుల జంప్!
సాక్షి, అమరావతి: అమెరికాలోని డల్లాస్‌లో చదువుకుంటున్న సురేష్‌ది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ మారుమూల పల్లె. ఏటా రూ.40 లక్షలు ఖర్చవుతుండగా కొంత అప్పు చేసి, పార్ట్ టైం ఉద్యోగం (Part time job) చేస్తూ ఫీజులు కడుతున్నాడు. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన నిబంధనలు సురేష్ కు పిడుగుపాటులా మారాయి. యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థులు పార్ట్ టైం జాబ్స్ చేస్తూ పట్టుబడితే వీసా రద్దు (Visa Cancel) చేస్తామని హెచ్చరించడంతో హతాశుడయ్యాడు. పార్ట్ టైం జాబ్ చేయకుండా చదువుకు అయ్యే ఖర్చులెలా సమకూర్చుకోవాలో తెలియక, మధ్యలో చదువు వదిలేసి స్వదేశానికి తిరిగి రాలేక తల పట్టుకుంటున్నాడు.కరిగిపోతున్న కల..అమెరికాలో ఉన్నత విద్య చదువుకోవడమనేది మన విద్యార్థుల కల. తమ పిల్లలను అప్పు చేసైనా సరే అమెరికా పంపాలని ఎంతో మంది తల్లిదండ్రులు ఆరాట పడుతుంటారు. సంపన్న కుటుంబాలు దీన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటాయి. కానీ అక్కడికి వెళ్లిన తరువాత మన విద్యార్ధులు పడే అగచాట్లు సాధారణంగా బయటకు రావు. ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా భరిస్తుంటారు. దూరపు కొండలు నునుపు అన్నట్లు అమెరికా చదువులు, ఉద్యోగాలు దూరం నుంచి చూసేవారికి అందంగానూ, గొప్పగానూ కనిపిస్తుంటాయి. ట్రంప్ రాకతో వాస్తవాలు బయటకు వస్తున్నాయి.ఇంటి అద్దెకూ చాలవు..ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం.. అమెరికాలో ప్రస్తుతం దాదాపు 3 లక్షల మంది భారతీయ విద్యార్ధులు (Indian Students) ఉండగా వీరి సంఖ్య ఏటా 35 శాతం పెరుగుతోంది. చైనాను కూడా ఈ విషయంలో మనవాళ్లు వెనక్కు నెట్టేశారు. అయితే అమెరికా వెళ్లే విద్యార్థుల్లో అధిక శాతం అప్పులు చేసి విమానం ఎక్కుతున్నారు. ఆ అప్పులను తీర్చడం కోసం అమెరికాలో గ్యాస్ స్టేషన్లు, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు తదితర చోట్ల పార్ట్‌టైమ్ జాబ్స్ చేస్తుంటారు. వీరికి సగటున గంటకు 10 డాలర్ల వరకూ చెల్లిస్తారు. మాస్టర్ ఆఫ్ సైన్స్(ఎంఎస్) చేస్తున్న విద్యార్ధి వారానికి 20 గంటలు పాటు పని చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ లెక్కన నెలకు దాదాపు రూ.70 వేల వరకూ సంపాదిస్తాడు. దీన్ని ఇంటి అద్దె, కళాశాల ఫీజు, భోజనం, రవాణా ఖర్చులకు సరిపెట్టుకోవాలి. అమెరికాలో ప్రస్తుతం ఒక సింగిల్ బెడ్రూమ్ అద్దెకు తీసుకోవాలంటే 1,700 డాలర్లు అంటే దాదాపు రూ.1.46 లక్షలు చెల్లించాలి. మెయింటెనెన్స్ ఖర్చులు అదనం. ఒక విద్యార్ధి నెలంతా పార్ట్‌టైమ్ జాబ్ చేసినా ఇంటి అద్దె, ఇతర ఖర్చులు నెగ్గుకు రావడం కష్టం. అలాంటిది ఇప్పుడు అది కూడా సంపాదించడం కుదరదని అమెరికా ప్రభుత్వం ఖరాకండిగా చెబుతుండటంతో తీవ్ర నిరాశలో కూరుకుపోతున్నారు.బతుకు భారం.. పోనీ ఎలాగోలా ఇంటి దగ్గర్నుంచి అప్పులు చేసి డబ్బు తెప్పించి చదువుకుని ఉద్యోగం తెచ్చుకున్నా వచ్చే జీతంలో ప్రతి రూ.100కి ప్రభుత్వానికి రూ.30 పన్ను కింద చెల్లించాలి. ఆ మిగిలిన దానిలోనే అన్ని ఖర్చులూ భరించాలి. అలా అయినా ఎలాగోలా గడుపుదామంటే గ్రీన్ కార్డ్ రావడం పెద్ద ప్రహసనం. మన దేశానికి ఏటా 7 వేల గ్రీన్ కార్డులు (అమెరికా పౌరసత్వం) మాత్రమే ఇస్తుండగా పోటీపడుతున్న వారు లక్షల్లో ఉన్నారు.2012లో గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి ఇప్పుడు ఇస్తున్నారంటే ఇక ఇప్పుడు దరఖాస్తు చేసుకునే వారికి రావాలంటే కనీసం 40 ఏళ్లు పడుతుంది. అప్పటి వరకూ అదనపు ట్యాక్స్‌లు కడుతూ.. హెచ్1 వీసాపై బిక్కుబిక్కుమంటూ జీవించాలి. చదవండి: అన్నంత పనీ చేసిన డొనాల్డ్ ట్రంప్!ఇంత కష్టం ఉన్నప్పటికీ అమెరికాలో చదువుకోవాలనే ఆశతో వెళుతున్న వారికి ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) షాక్ ఇస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే దాదాపు 18 వేల మందికి పైగా పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్న వారిని గుర్తించి ‘ఐస్’ టీమ్ అదుపులోకి తీసుకుంది. దీంతో భారతీయ విద్యార్ధులు అమెరికాలో పార్ట్‌టైమ్ జాబ్స్‌ను వదులుకుంటున్నారు. దండిగా డబ్బులుంటేనే రండి.. అమెరికాలో చదువుకోవాలనుకుంటే ముందుగా అంత ఆర్థ్ధిక స్తోమత ఉందో లేదో చూసుకోవాలి. ఏదో అప్పు చేసి కొంత డబ్బు సమకూర్చుకుని ఇక్కడికి రావడం సరైన విధానం కాదు. అమెరికాలో ప్రస్తుతం పార్ట్‌టైమ్ జాబ్స్ చేయడానికి ప్రభుత్వం అంగీకరించడం లేదు.కాబట్టి చదువుకుంటూ సంపాదించడం ఇక కుదరకపోవచ్చు. జాబ్ వచ్చినా ఇక్కడ ఖర్చులతో పోల్చితే సంపాదించేది ఏమాత్రం సరిపోదు. అమెరికాకు రావాలనుకునే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాలను గమనించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది’’ – మణితేజ, డాలస్, అమెరికా -
ఏఐ ‘డీప్’ వార్!
మా పరిశోధకుల్లో ఎక్కువ మంది చైనా టాప్యూనివర్సిటీల నుంచి తీసుకున్న ఫ్రెష్ గ్రాడ్యుయేట్లే. భారీపెట్టుబడులతో నవకల్పనలు పెరుగుతాయంటే పొరపాటే. అదే నిజమైతే ప్రపంచంలోని ఇన్నోవేషన్ అంతాబడా కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయేది – డీప్‌సీక్ ఫౌండర్ లియాంగ్ వెన్ఫెంగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో ఎదురులేని అమెరికా టెక్ దిగ్గజాలకు చైనా ఊహించని షాక్ ఇచ్చింది. ఏఐ రారాజు చాట్‌జీపీటీకి ఓ అనామక చైనా ఏఐ స్టార్టప్ పెను సవాల్ విసిరింది. అదే డీప్‌సీక్. దీని చౌక ఏఐ దెబ్బకు మొత్తం సిలికాన్ వ్యాలీ చివురుటాకులా వణుకుతోంది. లక్షల కోట్లు వెచ్చించి అమెరికా కంపెనీలు కడుతున్న ‘ఆర్టిఫిషియల్’కోటను బద్దలుకొట్టేందుకు డ్రాగన్ బరిలోకి దూకడంతో ఏఐ వార్‌కు తెరలేచింది. దీంతో జపాన్ నుంచి యూరప్ మీదుగా.. అమెరికా వరకు టెక్ షేర్లన్నీ కుప్పకూలాయి. విలువ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ ఎన్విడియా షేరు ఏకంగా 17 శాతం పడిపోవటంతో దాదాపు 600 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ తుడిచిపెట్టుకుపోయింది. మనదేశంలో మూడు అతిపెద్ద కంపెనీలైన రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్‌ల మొత్తం మార్కెట్ విలువ కంటే ఇది ఎక్కువ. – సాక్షి, హైదరాబాద్2023లో ఆవిర్భావండీప్సీక్ పురుడుపోసుకుని రెండేళ్లు కూడా కాలేదు. క్వాంట్ హెడ్జ్ ఫండ్ ‘హై–ఫ్లయర్’చీఫ్ లియాంగ్ వెన్ఫెంగ్ 2023లో దీన్ని నెలకొల్పారు. అతి తక్కువ ఖర్చుతో డీప్‌సీక్ రూపొందించిన ఆర్1 ఏఐ మోడల్ చైనాతోపాటు అమెరికా టెక్ దిగ్గజాలను కూడా ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఏఐ మోడల్‌ను పూర్తి ఉచితంగా అందిస్తుండటం ఓపెన్ ఏఐ వంటి కంపెనీల భవిష్యత్‌కు గొడ్డలిపెట్టులా మారింది. అమెరికాలో విడుదలైన వారంలోనే యాపిల్ యాప్ స్టోర్‌లో డీప్‌సీక్ మొబైల్ యాప్ అత్యధిక డౌన్లోడ్లతో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుని చాట్‌జీపీటీని వెనక్కి నెట్టింది. ఈ నెల 27న ఒక్కరోజే ఏకంగా 20 లక్షల మంది డౌన్లోడ్ చేసుకోవడం దీని జోరుకు నిదర్శనం. మరోపక్క టెక్ట్స్ ప్రాంప్ట్‌ను ఇమేజ్‌గా మార్చే జానస్–ప్రో–7బీతో మరో సంచలనానికి తెరతీసింది డీప్‌సీక్. అమెరికాకు ‘డీప్’ట్రబుల్.. ఏఐలో అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన వెంటనే స్టార్గేట్ ప్రాజెక్టును ప్రకటించిన విషయం తెలిసిందే. నాలుగేళ్లలో 500 బిలియన్ డాలర్లు వెచ్చించి అమెరికాను తిరుగులేని ఏఐ సూపర్‌పవర్‌గా చేసేందుకు ఓపెన్ఏఐ, ఒరాకిల్, సాఫ్ట్ బ్యాంక్, ఎంజీఎక్స్ చేతులు కలిపాయి. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కకముందే డీప్‌సీక్ కారు చౌకగా ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేసి షాకిచ్చింది. ట్రంప్ సలహాదారు మార్క్ ఆండర్సన్.. డీప్‌సీక్–ఆర్1ను ఏకంగా ‘‘ఏఐ స్పుత్నిక్ మూమెంట్’’గా (1957లో సోవియట్ యూనియన్ ప్రపంచంలో తొలి శాటిలైట్ స్పుత్నిక్ను ప్రయోగించడంతో యూఎస్, సోవియట్ మధ్య స్పేస్ వార్‌కు తెరలేచింది) అభివర్ణించడం విశేషం.దిగ్గజాలకు దీటుగా..ఎన్విడియా అధునాతన చిప్స్, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ (జీపీయూ)తో పోలిస్తే చాలా లో ఎండ్ హార్డ్‌వేర్‌తో (పాత ఎన్విడియా ఏ100 జీపీయూలు) తాము ఏఐ మోడల్స్‌ను రూపొందించామని డీప్‌సీక్ ప్రకటించింది. చైనాకు అధునాతన చిప్స్, టెక్నాలజీ ఎగుమతిపై అమెరికా విధించిన ఆంక్షలను సైతం ఎదురొడ్డి సొంతంగా దిమ్మదిరిగే ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేయడంపై నిపుణులు కూడా నోరెళ్లబెడుతున్నారు. డీప్‌సీక్ దెబ్బతో ప్రపంచ ఏఐ పరిశ్రమ స్వరూపమే మారిపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఓపెన్ సోర్స్ (డెవలపర్లు ఈ సాఫ్ట్‌వేర్‌ను మెరుగుపరచే అవకాశంతో పాటు దీని ఆధారంగా సొంత టూల్స్‌ను రూపొందించుకోవచ్చు) మోడల్ కావడంతో తక్కువ బడ్జెట్లోనే కంపెనీలు, యూజర్లకు ఏఐ అందుబాటులోకి వస్తుంది. డీప్‌సీక్ ఆర్1 ఏఐ మోడల్ మేథమెటిక్స్, కోడింగ్, రీజనింగ్, లాంగ్వేజ్ పరంగా అన్ని రకాల ప్రమాణాల్లో చాట్‌జీపీటీ, జెమిని, గ్రోక్ వంటి ఏఐ మోడళ్లకు దీటుగా నిలవడం గమనార్హం. మెటా ఏఐ మోడల్ అభివృద్ధికి 6 బిలియన్ డాలర్లు ఖర్చు చేయగా.. డీప్‌సీక్ కేవలం 6 మిలియన్ డాలర్లతోనే ఆర్1 ఏఐ మోడల్‌ను తీసుకొచ్చింది.మైక్రోసాఫ్ట్ నుంచి 13 బిలియన్ డాలర్లతో సహా, భారీగా నిధులు సమీకరించిన ఓపెన్ఏఐలో సిబ్బంది సంఖ్య 4,500. దీనికి పూర్తి భిన్నంగా ఇప్పటిదాకా డీప్‌సీక్ వెచ్చించింది 10 మిలియన్ డాలర్లే. ఉద్యోగులు 200 మంది మాత్రమే.ఎన్విడియాకు షాకెందుకు?ఏఐ మోడల్స్‌ను నడిపేందుకు హై ఎండ్ చిప్స్, జీపీయూలు, నెట్వర్కింగ్ అవసరమని ఇప్పటిదాకా ఊదరగొడుతున్నారు. ఈ రంగంలో నంబర్ వన్‌గా ఉన్న ఎన్విడియా మార్కెట్ విలువ 2023 డిసెంబర్లో తొలిసారి 500 బిలియన్ డాలర్లు దాటింది. గడిచిన ఏడాదిలోనే ఏకంగా 3.5 ట్రలియన్ డాలర్లను (మన కరెన్సీలో రూ.301 లక్షల కోట్లు) తాకి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా యాపిల్‌ను వెనక్కి నెట్టింది. డీప్‌సీక్ చౌక మోడల్ వల్ల డిమాండ్ తగ్గొచ్చనే భయంతో ఇన్వెస్టర్లు ఏఐ టెక్ షేర్లను అమ్మేసుకుంటున్నారు. దీంతో ఎన్విడియా షేర్ 17 శాతం కుప్పకూలింది. బ్రాడ్‌కామ్, ఏఎండీ, అరిస్టా నెట్వర్క్స్, నెదర్లాండ్స్ చిప్ దిగ్గజం ఏఎస్ఎంఎల్ హోల్డింగ్స్, తైవాన్ సెమీకండక్టర్స్ మాన్యుఫ్యాక్చర్స్ (టీఎస్ఎం) వంటి చిప్, నెట్వర్కింగ్ షేర్లు సైతం 15–23 శాతం పడిపోయాయి. -
ట్రంప్ రివేంజ్ పాలిటిక్స్.. 12 మంది ప్రాసిక్యూటర్ల తొలగింపు
వాషింగ్టన్:రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ట్రంప్ వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీటిలో రాజకీయ కక్ష తీర్చుకునే నిర్ణయాలు కూడా ఉన్నాయి. తాజాగా అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ 12 మంది దాకా ప్రాసిక్యూటర్లను తొలగించింది. వీరంతా గత ప్రభుత్వంలో ట్రంప్‌ను ప్రాసిక్యూట్ చేసిన లాయర్లు కావడం గమనార్హం. బైడెన్ హయాంలో ట్రంప్ పలు క్రిమినల్ కేసుల్లో విచారణను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అధ్యకక్షుడిని కేసులతో ముప్పుతిప్పలు పెట్టిన వారిని వదిలేదని లేదన్న సంకేతాలను జస్టిస్ డిపార్ట్మెంట్ ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ‘గతంలో అధ్యక్షుడు ట్రంప్‌ను ప్రాసిక్యూట్ చేసిన న్యాయవాదులను యాక్టింగ్ అటార్నీ జనరల్ సర్వీసు నుంచి తొలగించారు. అధ్యక్షుడి ఎజెండాను అమలు చేయలేరన్న కారణంతోనే వీరిని తొలగిస్తున్నాం’అని జస్టిస్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. ట్రంప్‌ను ప్రాసిక్యూట్ చేసిన న్యాయవాదులంతా ప్రత్యేక కౌన్సిల్ జాక్‌స్మిత్ నేతృత్వంలో పనిచేశారు. జాక్ స్మిత్ జనవరి మొదటి వారంలోనే తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కాగా, ట్రంప్ గత ప్రభుత్వ హయంలో ప్రముఖంగా ‘క్యాపిటల్’ తిరుగుబాటు, పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ హష్మనీ కేసులను ఎదుర్కొన్నారు. వీటిలో హష్మనీ కేసులో ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలారు. అయితే కోర్టు ట్రంప్‌కు ఈ కేసులో ఎలాంటి శిక్ష వేయలేదు. -
గురుద్వారాల్లో తనిఖీలు.. ట్రంప్‌పై సిక్కుల ఆగ్రహం
వాషింగ్టన్:ఎన్నికల ముందు చెప్పినట్టుగానే అమెరికా(America) అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలసదారులను సాగనుంపుతున్నారు. ఈ క్రమంలో అక్రమ వలసదారులను అరెస్టు చేయడానికి ట్రంప్(Trump) అనుసరిస్తోన్న విధానాలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అక్రమ వలసదారుల్ని గుర్తించే క్రమంలో అధికారులు న్యూయార్క్,న్యూజెర్సీల్లోని గురుద్వారాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాము పవిత్రంగా భావించే ప్రార్ధనా మందిరాల్లో అక్రమ వలసదారుల కోసం హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు వెతకడంపై సిక్కు సంస్థలు మండిపడుతున్నాయి. గురుద్వారాల పవిత్రతను ట్రంప్ చర్య దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.కాగా, ట్రంప్ యంత్రాంగం అమెరికాలో ఇప్పటివరకు వందలమంది అక్రమ వలసదారులను అరెస్టు చేసింది. అరెస్టయిన వారంతా ఉగ్రవాదం,డ్రగ్స్,లైంగిక నేరాలు వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నవారేనని అధికారులు చెబుతున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ(Deportation) ఆపరేషన్ చేపట్టారు.ఇప్పటికే సైనిక విమానాల్లో వందల మంది అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపించేశామని వైట్‌హౌస్ వెల్లడించింది.మరోవైపు,అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని,ఎందుకంటే అది పలురకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని ఇప్పటికే భారత్ స్పష్టం చేయడం గమనార్హం. -
బంగ్లాదేశ్‌కు ట్రంప్ బిగ్ షాక్
వాషింగ్టన్: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ షాకిచ్చారు. బంగ్లా ప్రభుత్వానికి అమెరికా సాయాన్ని రద్దు చేస్తూ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్‌లో ఆహారభద్రత, ఆరోగ్యం, విద్య తదితర కీలక రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టులు ఆగిపోనున్నాయి. 90 రోజుల పాటు పలు దేశాలకు అమెరికా సాయాన్ని నిలిపివేసే పాలసీలో భాగంగా బంగ్లాదేశ్‌కు సాయం నిలిపివేశారు. ఈజిప్ట్, ఇజ్రాయెల్‌లకు తప్ప ఇతర అన్ని దేశాలకు 90 రోజులపాటు అమెరికా సాయాన్ని నిలిపివేశారు. ట్రంప్ ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. వలసదారుల విధానాలు, ఫెడరల్ వర్కర్లు ఆఫీసు నుంచి విధులు నిర్వహించడం, లేకెన్ రిలే చట్టం అమలు, పారిస్ ఒప్పందం నుంచి తప్పుకోవడం వంటి నిర్ణయాలు వీటిలో ఉన్నాయి.వీటికి తోడు అమెరికాలో ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రపంచంలోని ఇతర దేశాలకు సాయాన్ని 90 రోజుల పాటు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో భాగంగా ట్రంప్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదీ చదవండి: 90 వేల మంది ఉద్యోగుల తొలగింపు..ట్రంప్ కఠిన నిర్ణయం -
హెచ్1బీ వీసాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్:అత్యుత్తమమైన నైపుణ్యమున్న వ్యక్తులే తమ దేశానికి రావాలని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు. మంగళవారం(జనవరి21) వైట్‌హౌజ్‌లో ట్రంప్ ఈ విషయమై ఒరాకిల్,ఓపెన్ఏఐ,సాఫ్ట్‌బ్యాంక్ సీఈవోలతో కలిసి మీడియాతో మాట్లాడారు.‘హెచ్1బీ వీసాలపై విభిన్నమైన వాదనలున్నాయి. రెండు వాదనలకు నేను మద్దతిస్తున్నాను. నేను కేవలం ఇంజినీర్ల గురించే మాట్లాడడం లేదు. అన్ని స్థాయిల్లో నైపుణ్యమున్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. హెచ్1బీ వీసాలపై నాకు వ్యక్తిగత అవగాహన ఉంది. నాణ్యమైన మానవవనరులు అమెరికాకు వచ్చేలా వలస విధానం ఉండాలి. దేశంలో వ్యాపారాల విస్తరణను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఒరాకిల్,సాఫ్ట్‌బ్యాంక్ వంటి కంపెనీలకు అత్యుత్తమ ఇంజినీర్ల అవసరం ఉంది. అత్యుత్తమ సాంకేతిక నిపుణులు వస్తారన్న అభిప్రాయంతోనే ఇలాన్‌మస్క్ హెచ్1బీ వీసాలకు మద్దతిస్తున్నారు.హెచ్1బీ వీసాల జారీని నేను ఆపడం లేదు’అని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. కాగా, హెచ్1బీ వీసాలపై ఇటీవల రిపబ్లికన్లలోనే భిన్న వాదనలు వినిపించాయి. కొందరు హెచ్1బీ వీసాల జారీని పూర్తిగా ఆపేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే అమెరికాలో స్థానికులకు ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. ఇక అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ మాత్రం హెచ్1బీ వీసాల జారీని సమర్థించారు. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వ్యక్తులు అమెరికాకు రావాల్సిన అవసరం ఉందన్నారు. #WATCH | Washington DC | On H1B visas, US President Donald Trump says, "... I like both sides of the argument but I also like very competent people coming to our country, even if that involves them training and helping others that may not have the qualifications... About HB1, I… pic.twitter.com/ALFRoHUWgD— ANI (@ANI) January 22, 2025 ఇదీ చదవండి: ట్రంప్ 2.0..భారత్‌కు దక్కిన అరుదైన గౌరవం -
ట్రంప్ 2.0..భారత్‌కు దక్కిన అరుదైన గౌరవం
వాషింగ్టన్:అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేయగానే భారత్,అమెరికా సంబంధాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత తొలి ప్రాధాన్యం భారత్‌కే లభించింది. అమెరికా కొత్త విదేశాంగ శాఖ మంత్రి మారో రుబియో తన తొలి భేటీ భారత విదేశాంగశాఖ మంత్రితోనే నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ కూడా పాల్గొన్నారు.సాధారంగా కొత్త అధ్యక్షుడు అధికారం చేపట్టగానే అమెరికా విదేశాంగశాఖ తొలి భేటీ పొరుగు దేశాలైన కెనడా,మెక్సికో లేదంటే నాటో కూటమిలోని ఏదో ఒక దేశంతో జరుగుతుంది. ఈసారి సంప్రదాయానికి భిన్నంగా భారత విదేశీవ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌తో తొలి భేటీ జరపడం గమనార్హం.అది కూడా అమెరికా విదేశాంగశాఖ మంత్రిగా మైక్ రుబియో పదవీ బాధ్యతలు చేపట్టిన గంటలోనే భేటీ జరగడం విశేషం. గంటపాటు జరిగిన ఈ భేటీలో అమెరికా,భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు.భేటీ ముగిసిన తర్వాత జైశంకర్,రుబియోలు మీడియా ముందుకు వచ్చి కరచాలనం చేసుకున్నారు.రుబియోతో భేటీ అవడం సంతోషంగా ఉందని జైశంకర్ తన ఎక్స్(ట్విటర్)ఖాతాలో పోస్టు చేశారు. Delighted to meet @secrubio for his first bilateral meeting after assumption of office as Secretary of State.Reviewed our extensive bilateral partnership, of which @secrubio has been a strong advocate. Also exchanged views on a wide range of regional and global issues.Look… pic.twitter.com/NVpBUEAyHK— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 21, 2025 ఇదీ చదవండి: జన్మతఃపౌరసత్వం రద్దు -
అమెరికాలో కాల్పులు..హైదరాబాద్ యువకుడి దుర్మరణం
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ చైతన్యపురికి చెందిన కొయ్యడ రవితేజ కాల్పుల్లో దుర్మరణం పాలయ్యారు.రవితేజ మరణవార్త విని చైతన్యపురి ఆర్కేపురం డివిజన్లో నివసిస్తున్న అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రవితేజ 2022లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగాణ్వేషణలో ఉన్నారు. ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: ఒక్కసారి కనబడు బిడ్డా -
ప్రమాణస్వీకారానికి ముందు ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్:ప్రమాణస్వీకారానికి కొన్ని గంటల ముందు అమెరికా(America)కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సంచలన ప్రకటన చేశారు. వాషింగ్టన్ డీసీలో ఆదివారం జరిగిన మేక్ అమెరికా గ్రేట్ ఎగెయిన్(MAGA) ర్యాలీని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా అమెరికాలోకి వలసలపై ట్రంప్ దూకుడుగా మాట్లాడారు.‘నేను ప్రమాణస్వీకారం చేసిన వెంటనే మన దేశంపై అక్రమ వలసదారుల దండయాత్ర ఆగిపోతుంది. సరిహద్దుల నుంచి అక్రమంగా ప్రవేశించడాన్ని ఆపేస్తాం. ఇక మన సంపదను మనమే అనుభవిస్తాం. అక్రమంగా వలస వచ్చిన వేలాది మందిని బలవంతంగా సాగనంపే కార్యక్రమం అమెరికా చరిత్రలోనే భారీగా మొదలుపెడతాం.ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. టిక్‌టాక్ యాప్‌ను మళ్లీ తీసుకొచ్చాం. మన ఉద్యోగాలు చైనాకు పోవడానికి వీల్లేదు. అందుకే టిక్‌టాక్ యాప్‌లో అమెరికా ప్రభుత్వం 50 శాతం భాగస్వామ్యం తీసుకుంటుంది. అధికారం చేపట్టకముందే ట్రంప్ ఎఫెక్ట్‌తో ఇప్పటికే కొన్ని పనులు జరిగిపోతున్నాయి. ఇది నా ఎఫెక్ట్ కాదు. మీ అందరి ఎఫెక్ట్’అని ర్యాలీకి హాజరైన వారిని ట్రంప్ తన ప్రసంగంతో ఉత్తేజపరిచారు. కాగా, గతేడాది నంబర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ట్రంప్ సోమవారం(జనవరి 20)న రెండోసారి అమెరికా అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అధికారం చేపట్టిన వెంటనే ట్రంప్ ఏ నిర్ణయాలు తీసుకుంటారన్నది ప్రపంచ దేశాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి.ఇదీ చదవండి: నేడే ట్రంప్ పట్టాభిషేకం -
బాధ్యత లేని బాల్యచాపల్యం
బాల్యావస్థ చిత్రమైనది. ఆ దశలో కంటిముందు కనబడేవన్నీ తన సొంతం అనుకునే మనస్తత్వం ఉంటుంది. మరో పదిరోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కబోతున్న డోనాల్డ్ ట్రంప్ ఈ మాదిరి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు కనబడుతోంది. అధికారంలోకి రాకముందే ఆయన వరసబెట్టి పొరుగు దేశాలకు తాఖీదులు పంపుతున్నారు. ‘మీరంతా నా దారికి రండి’ అన్నదే వాటి సారాంశం. అమెరికాలో 51వ రాష్ట్రంగా స్థిరపడటానికి కెనడా సిద్ధంగా ఉండాలట. డెన్మార్క్‌లో భాగంగా ఉన్న గ్రీన్‌ల్యాండ్ ప్రాంతాన్ని ఆ దేశం వదిలేసుకోవాలట. అలాగే పనామా అధీనంలోని పనామా కాల్వపై అమెరికాకు పూర్తి హక్కున్నదట. తన అభీష్టం నెరవేరటానికి ఆ దేశాలపై టారిఫ్ మోత మోగి స్తారట. ఫలితం రాకపోతే దురాక్రమణకు సిద్ధపడతారట. సోవియెట్ యూనియన్ దురాక్రమణకు పాల్పడే అవకాశం ఉన్నదని బెదరగొట్టి 1949లో నాటో కూటమిని ఏర్పాటుచేసింది అమెరికాయే. దాని స్థానంలో వచ్చిన రష్యావల్ల కూడా ముప్పు ముంచుకురావచ్చని ఒప్పించి నాటోను కొన సాగిస్తున్నదీ అమెరికాయే. తీరా ట్రంప్ ప్రకటనల తీరు చూశాక నిజమైన ముప్పు అమెరికానుంచే ఉండొచ్చన్న భయాందోళనలు యూరప్ దేశాల్లో కలుగుతున్నాయి. ఏడెనిమిదేళ్లుగా అమెరికా ‘నియమాల ఆధారిత’ ప్రపంచం గురించి మాట్లాడుతోంది. చైనా ప్రాబల్యాన్ని అడ్డగించటమే లక్ష్యంగా అమెరికా వాడుకలోకి తెచ్చిన ఇండో–పసిఫిక్ వ్యూహానికి ప్రాతిపదిక ‘నియమాల ఆధా రిత’ ప్రపంచమే. ట్రంప్ ప్రకటనలకూ, ఈ వ్యూహానికీ పూర్తిగా చుక్కెదురు. అమలులో ఉన్న నియ మాలను ధిక్కరించి, అంతర్జాతీయ న్యాయానికి భిన్నంగా ప్రవర్తించి ఏ దేశాన్నయినా ఆక్రమించు కోవాలనుకునే మనస్తత్వం దేనికి దారితీస్తుంది? అందుకే యూరప్ దేశాలన్నీ ట్రంప్ ప్రకటనపై విరుచుకు పడుతున్నాయి. సభ్యదేశాల్లో ఎవరిపై దాడి జరిగినా మిగిలిన దేశాలన్నీ అండగా నిలవాలన్నది నాటో నియమం. దానికి అనుగుణంగానే జర్మనీ, ఫ్రాన్స్ మొదలు అన్ని దేశాలూ ట్రంప్ తీరును ఖండిస్తున్నాయి. ఉక్రెయిన్ దురాక్రమణకు పాల్పడిన రష్యాను ఖండిస్తూ, తైవాన్ను సొంతం చేసుకోవాలనుకునే చైనాను హెచ్చరిస్తూ వస్తున్న అమెరికా ట్రంప్ ఏలుబడి మొదలయ్యాక తానే దురాక్రమణదారుగా మారుతుందా అన్నది చెప్పలేం. పూర్వాశ్రమంలో రిపబ్లికన్ పార్టీకే చెందిన నిక్సన్ అమెరికా అధ్యక్షుడిగా ఇలాంటి బెదిరింపులకే పాల్పడేవారు. తానొక ప్రమాదకారినన్న భావన కలిగిస్తే చాలు... ప్రపంచమంతా పాదాక్రాంతమవుతుందన్న భ్రమ ఆయనకు ఉండేది. దాన్ని ‘మ్యాడ్‌మ్యాన్ థియరీ’గా పిలిచేవారు. చివరకు ఆయన హయాంలోనే ఎంతో అప్రదిష్టపాలై ఉత్తర వియత్నాం నుంచి అమెరికా సైనికులు వైదొల గాల్సి వచ్చింది. ట్రంప్ మాటలు ‘మ్యాడ్‌మ్యాన్ థియరీ’వంటివేనా... నిజంగా ప్రమాదకరమైనవా అనే విచికిత్సలో పడ్డాయి యూరప్ దేశాలు. దౌత్యరంగంలో ఎవరైనా సరే... మరో దేశాధినేత వ్యక్తిగతంగా కలిసినప్పుడు తమకేం చెప్పారన్నది కాక, వారి బహిరంగ ప్రకటనలనూ, వారి ఆచరణనూ పరిగణనలోకి తీసుకుంటారు. తొలి ఏలుబడిలో సైతం ట్రంప్ ఇలాంటి హెచ్చరికలు చాలా చేసేవారు. ఉత్తర కొరియాపై నిప్పుల వాన కురిపించబోతున్నట్టు ప్రకటనలు చేయటం, చివరకు ఆ దేశానికి అతిథిగా వెళ్లి ఒప్పందం కుదుర్చుకురావటం అందరూ చూశారు. చైనా పైనా అదే తరహాలో చిందులు తొక్కేవారు. కానీ ఎప్పుడూ దాని జోలికిపోలేదు. అయితే ఇరాన్ విషయంలో అలా కాదు. ఆ దేశ అగ్రనేతల్లో ఒకరైన కాసిం సొలేమనిని హత్య చేయించారు. వేరే దేశాల నేతలపై దాడులకు పాల్పడటం, దాన్ని అధికారికంగా ప్రకటించటం అసాధారణం. కనుకనే ట్రంప్ రెండో ఏలుబడిపై అందరిలోనూ ఆందోళన నెలకొన్నది. విస్తరణవాద చాపల్యం అమెరికాకు మొదటినుంచీ ఉన్నదే. కానీ అదంతా మృదువైన భాష వెనక నడిచేది. వేరే దేశాల్లో పాలకుల్ని మార్చకుండానే తన పెత్తనాన్ని సుస్థిరం చేసుకునేది. నేరుగా బెదిరింపులకు దిగటం ట్రంప్ ప్రవేశపెట్టిన కొత్త ధోరణి. ఏటా కెనడా రక్షణకు రెండువేల కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నామని, అందువల్ల ఒరిగేదేమీ లేదన్నది ఆయన అభిప్రాయం. 51వ రాష్ట్రంగా కలుపుకొంటే అదంతా ఆదా అవుతుందని ట్రంప్ అంటున్నారు. కెనడా వాదన భిన్నంగా ఉంది. అమెరికా–కెనడా సంబంధాల వల్ల ఇరు దేశాలూ బాగుపడుతున్నాయని ఆ దేశం చెబుతోంది. తమనుంచి అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ఇంధనం మార్కెట్ ధరకన్నా తక్కువకు అమెరికాపొందుతున్నదని, వేలకోట్ల డాలర్ల విలువైన అమెరికా సరుకులు కెనడాలో అమ్ముడవుతున్నాయని, అమెరికా చేసే యుద్ధాలకు కోట్ల డాలర్ల ధనం వెచ్చిస్తున్నామని కెనడా విపక్ష నేత పియే పొలియేరా గుర్తుచేశారు. దండిగా ఖనిజ వనరులున్న గ్రీన్‌ల్యాండ్‌పై ట్రంప్ కన్నుపడింది. పద్దెనిమిదేళ్ల ట్రంప్ కుమారుడు ఆ ప్రాంతానికెళ్లి అది తమ సొంత జాగీరన్న అర్థం వచ్చేలా ప్రకటించాడు. నిజానికి గ్రీన్‌ల్యాండ్ డెన్మార్క్ అధీనంలో కూడా లేదు. 57,000 మంది నివసించే ఆ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి ఉంది. కేవలం సైనిక, ఆర్థిక వ్యవహారాలు మాత్రమే డెన్మార్క్ చూస్తుంది. పనామా కాల్వపై హక్కు వదులుకోవటానికి పనామా దేశం కూడా సిద్ధంగా లేదు. ట్రంప్ ఒక తేనెతుట్టె కదిల్చి తమాషా చూడదల్చుకున్నారా... నిజంగానే దురాక్రమణకు సిద్ధపడతారా అన్నది మున్ముందు తేలుతుంది. దురాక్రమణకు సిద్ధపడితే ఇప్పుడు పుతిన్‌కు ఉక్రెయిన్‌లో ఎదురవుతున్న పరాభవమే అమెరికాకు తప్పకపోవచ్చు. అంతకన్నా కీలకమైనదేమంటే... అమెరికా విశ్వసనీయతతో పాటు మిత్రులనూ కోల్పోతుంది. ఏకాకిగా మారుతుంది. -
నయా రాకెట్ నిశేష్ రెడ్డి...
అంతర్జాతీయ స్థాయిలో మరో యువ టెన్నిస్ ఆటగాడు దూసుకొస్తున్నాడు. అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు సంతతి కుర్రాడు నిశేష్ బసవరెడ్డి... గత సీజన్లో అనూహ్య ప్రదర్శనతో అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) యూత్ చాలెంజర్స్ టూర్ ఫైనల్స్ టోర్నీకి అర్హత సాధించడంతో పాటు... సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్‌కు వైల్డ్ కార్డు ఎంట్రీ పొందాడు. కాలిఫోర్నియాలో పుట్టి పెరిగిన 19 ఏళ్ల నిశేష్ బసవరెడ్డి డిసెంబర్లోనే ప్రొఫెషనల్ ప్లేయర్‌గా మారాడు. 457వ ర్యాంక్‌తో 2024వ సంవత్సరం టెన్నిస్ సీజన్‌ను ప్రారంభించిన నిశేష్... వరుస విజయాలతో సత్తా చాటి సీజన్ ముగిసేసరికి ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 138వ స్థానానికి చేరాడు. చాలెంజర్ టూర్ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన నిశేష్ ఈ మధ్యకాలంలో 6 టోర్నీల్లో ఫైనల్‌కు చేరి రెండింట టైటిల్ చేజిక్కించుకున్నాడు. దీంతో అతడికి ఆ్రస్టేలియా ఓపెన్‌లో బరిలోకి దిగే అవకాశం దక్కింది. ఆదివారం నుంచి మెల్బోర్న్ వేదికగా ప్రారంభం కానున్న గ్రాండ్‌స్లామ్ టోర్నీలో నిశేష్ బరిలోకి దిగనున్నాడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డాటా సైన్సెస్ అభ్యసించిన నిశేష్ కుటుంబం నెల్లూరు నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడింది. నెల్లూరుకు చెందిన నిశేష్ తండ్రి మురళీ రెడ్డి టెక్ పరిశ్రమలో పని చేస్తుండగా... సోదరుడు నిశాంత్ రెడ్డి ఐటీ కంపెనీలో ఉద్యోగి. తల్లి సాయి ప్రసన్న గృహిణి. చిన్నప్పుడు చాలాసార్లు భారత్‌కు వచ్చి వెళ్లిన నిశేష్‌కు హైదరాబాద్, నెల్లూరులో బంధువులు ఉన్నారు. చుట్టాలు, స్నేహితుల వల్ల తెలుగుపై అవగాహన పెంచుకున్న నిశేష్ స్పష్టంగా మాట్లాడలేకపోయినా సినిమాలు మాత్రం బాగా చూస్తాడు. సబ్ టైటిల్స్ లేకుండా భాషను అర్థం చేసుకుంటాడు. ఒలింపిక్ పతక విజేత రాజీవ్ రామ్ వద్ద శిక్షణ పొందుతున్న నిశేష్... భవిష్యత్తుపై భరోసా పెంచుతున్నాడు. ‘17 ఏళ్ల వయసులోనే పట్టభద్రుడిగా మారాను. చాలా అంశాలపై ఆసక్తి ఉంది. అందుకే వాటిలో మరింత మెరుగవ్వాలని నిర్ణయించుకున్నా. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దృఢంగా అయ్యేందుకు ప్రయత్నిస్తున్నా. చిన్నప్పుడు తరచూ గాయపడే వాడిని. పాఠశాల విద్య పూర్తవగానే ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్‌గా మారాలని అనుకోలేదు. కానీ అలా జరిగిపోయిందంతే. చిన్నప్పటి నుంచి టెన్నిస్ అంటే విపరీతమైన ఇష్టం. టీవీలో ఎప్పుడూ టెన్నిస్ చానల్ చూస్తూ ఉండేవాడిని. కామెంటేటర్లు చెప్పే మాటలు వింటూ ప్లేయర్ల లాగా షాట్లు ఆడేందుకు ప్రయత్నించేవాడిని. దేన్నైనా నిశితంగా పరిశీలించడం నాకు అలవాటు. దీనివల్లే ప్రత్యర్థి ఆటగాళ్ల తప్పులను గమనించి అందుకు తగ్గట్లు వ్యూహాలు రచించుకోవడం నేర్చుకున్నా. ఇది అంత సులువుగా సాధ్యం కాలేదు. నిరంతర సాధన వల్ల వచ్చిoది’ అని తాజా ర్యాంకింగ్స్‌లో 133వ ర్యాంక్‌లో ఉన్న నిశేష్ అన్నాడు. –సాక్షి క్రీడా విభాగంఆక్లాండ్ ఓపెన్‌లో శుభారంభంఈ ఏడాది ఆడుతున్న రెండో ఏటీపీ–250 టోర్నీలో నిశేష్ బసవరెడ్డి శుభారంభం చేశాడు. న్యూజిలాండ్‌లో జరుగుతున్న ఆక్లాండ్ ఓపెన్ టోర్నీలో నిశేష్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. క్వాలిఫయింగ్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో క్వాలిఫయర్‌గా అడుగు పెట్టిన నిశేష్ తొలి రౌండ్లో 6–2, 6–2తో ప్రపంచ 85వ ర్యాంకర్ ఫ్రాన్సిస్కో కమ్సానా (అర్జెంటీనా)పై గెలుపొందాడు. 69 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిశేష్ ఆరు ఏస్‌లు సంధించాడు. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయని నిశేష్ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. గతవారం బ్రిస్బేన్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలోనూ క్వాలిఫయర్‌గా మెయిన్ ‘డ్రా’లో ఆడిన నిశేష్ తొలి రౌండ్లో ఫ్రాన్స్ సీనియర్ స్టార్ ప్లేయర్ గేల్ మోన్ఫిల్స్ చేతిలో మూడు సెట్లపాటు పోరాడి ఓడిపోయాడు. -
తడబడ్డ కమలాహారిస్..వీడియో వైరల్
వాషింగ్టన్:అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ తడబడ్డారు. అమెరికా 119వ కాంగ్రెస్ ప్రారంభం సందర్భంగా సెనేట్‌లో చేసిన ప్రతిజ్ఞలో జెండా అనే పదాన్ని వదిలేసి చదివారు. హారిస్ తడబడ్డ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆమెను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అమెరికాలో 119వ కాంగ్రెస్ తాజాగా సమావేశమైంది. ఈ సందర్భంగా చేసే ప్రతిజ్ఞలో ‘నేను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జెండాకు విధేయత చూపుతాను’ అని చదవాలి అయితే హారిస్ ‘జెండా’ పదాన్ని వదిలేసి చదివారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు.హారిస్ విధేయత ప్రతిజ్ఞను సలాడ్ చేసేశారని ఒకరు కామెంట్ చేయగా సెనెట్‌లో ప్రతిజ్ఞను తప్పుగా పలికి హారిస్ దేశాన్ని అవమానించారని మరొకరు విమర్శించారు. చరిత్రలో అతి తక్కువ ఐక్యూ కలిగిన అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్ అని మరో నెటిజన్ విమర్శించారు. FLAG FLUB: Vice President Kamala Harris appears to flub the Pledge of Allegiance during the opening moments of the 119th Congress. pic.twitter.com/NlyMB6iUoz— Fox News (@FoxNews) January 3, 2025 మరో వీడియోలో హారిస్ కొత్తగా ఎన్నికైన సెనేటర్లతో ప్రతిజ్ఞ చేయిస్తుండగా అక్కడే ఉన్న అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇతర సభ్యులతో కలిసి నవ్వుతూ కనిపించారు. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీచేసిన కమలాహారిస్ ట్రంప్ చేతిలో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.JD Vance laughing as Kamala Harris swears in new U.S. Senators 🤣pic.twitter.com/LRot5mia2Z— Benny Johnson (@bennyjohnson) January 3, 2025 ఇదీ చదవండి: ప్రధానిపై విమర్శలు..మస్క్‌కు బ్రిటన్ కౌంటర్ -
‘న్యూ ఓర్లీన్స్’ దాడి..ట్రంప్ కీలక ట్వీట్
వాషింగ్టన్:న్యూ ఓర్లీన్స్లో జరిగిన ట్రక్కు దాడిపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న డెమొక్రాట్ల విధానాల వల్లే అమెరికాలో ఇలాంటి దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం(జనవరి3) ట్రంప్ ఎక్స్(ట్విటర్)లో ఓ పోస్టు చేశారు.సరిహద్దులు తెరిచి పెట్టడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు.బలహీన,అసమర్థ నాయకత్వమే ఇందుకు కారణమన్నారు.డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్(డీవోజే) ఎఫ్‌బీఐ,డెమోక్రట్ ప్రభుత్వం,న్యాయవాదులు తమ విధిని సక్రమంగా నిర్వహించక పోవడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.Our Country is a disaster, a laughing stock all over the World! This is what happens when you have OPEN BORDERS, with weak, ineffective, and virtually nonexistent leadership. The DOJ, FBI, and Democrat state and local prosecutors have not done their job. They are incompetent and…— Donald J. Trump (@realDonaldTrump) January 3, 2025అమెరికా విఫలమైందని అంతా మాట్లాడుకుంటున్నారన్నారు. న్యూ ఓర్లీన్స్లో బోర్బన్ వీధిలో నూతన సంవత్సర వేడుకలు జరుగుతుండగా అమెరికా ఆర్మీ మాజీ ఉద్యోగి జబ్బార్ ట్రక్కుతో జనంపైకి దూసుకువచ్చిన ఘటనలో 15 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడి తర్వాత పోలీసులు జరిపిన కాల్పుల్లో జబ్బార్ మృతి చెందాడు.ఈ కేసులో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్‌బీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. జబ్బార్ విదేశీ సంస్థల సహకారం లేకుండా ఒంటరిగానే ట్రక్కు దాడి చేశాడని ఎఫ్‌బీఐ తేల్చింది.అయితే ఐసిస్ ఉగ్రవాద సంస్థ నుంచి జబ్బార్ స్ఫూర్తి పొందాడని ఎఫ్‌బీఐ తెలిపింది. ఇదీ చదవండి: ట్రక్కు దాడి.. ఎఫ్‌బీఐ కీలక ప్రకటన -
కాలిఫోర్నియాలో కూలిన విమానం
కాలిఫోర్నియా: వరుస విమాన ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. కాలిఫోర్ని యాలో విమాన ప్రమాదం జరిగింది. డిస్నీల్యాండ్‌కు సమీపంలోని ఆరెంజ్ కౌంటీలో ఉన్న ఫుల్లర్టన్ మున్సిపల్ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన నిమిషంలోనే విమానం కుప్పకూలింది. ఓ వాణిజ్య భవనం పైకప్పుపై పడింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 2.09 గంటలకు ఈ ఘటన జరిగింది. సింగిల్ ఇంజన్ కలిగిన నాలుగు సీట్ల చిన్న విమానమే అయినప్పటికీ.. ఫర్నీచర్ గోదామ్పై కుప్పకూలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. విమానం కూలగానే గోదాములో మంటలు చెలరేగాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేసి సమీప భవనాలను ఖాళీ చేయించారు. గతేడాది నవంబర్‌లో మరో చిన్న విమానం టేకాఫ్ అయిన వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా విమానాశ్రయానికి అర మైలు దూరంలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. విమానంలో ఉన్న ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఇదీ చదవండి: ట్రక్కు దాడి.. ఎఫ్‌బీఐ కీలక ప్రకటన -
USA:ట్రక్కు దాడి.. ఎఫ్‌బీఐ కీలక ప్రకటన
వాషింగ్టన్:న్యూ ఓర్లీన్స్ ట్రక్కు దాడిలో విదేశీ శక్తుల కుట్ర లేదని అమెరికా అత్యున్నత దర్యాప్తు ఏజెన్సీ ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) తేల్చింది. దాడికి పాల్పడ్డ జబ్బార్ ఒంటరిగానే ఈ దుశ్చర్యకు ఒడిగట్టాడని తెలిపింది. దాడికి ముందు జబ్బార్ ఫేస్బుక్లో ఐదు వీడియోలు పోస్ట్ చేసినట్లు పేర్కొంది.దాడి దర్యాప్తు పురోగతిని అధ్యక్షుడు బైడెన్‌కు ఎఫ్‌బీఐ వివరించింది. సుమారు గంట సేపు అధికారులతో చర్చించి దర్యాప్తు వివరాలను బైడెన్ తెలుసుకున్నారు. దాడిపై స్వదేశీ,విదేశీ కుట్ర కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని వైట్‌హౌజ్ వర్గాలు తెలిపాయి. ఈ దాడి కోసం జబ్బార్ విదేశీ సంస్థలతో కలిసి పనిచేయలేదు. అయితే అతను ఐసిస్ నుంచి స్ఫూర్తి పొందాడు. ఇది వంద శాతం ఉగ్రవాద చర్యనే’అని ఎఫ్‌బీఐ కౌంటర్ టెర్రరిజం విభాగానికి చెందిన అధికారి క్రిస్టఫర్ తెలిపారు. ఐసిస్ మళ్లీ పుంజుకోకుండా సిరియాలోని అమెరికా బలగాలు ఉగ్రవాద సంస్థ నేతలపై వైమానిక దాడులు నిర్వహిస్తున్నాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు. నూతన ఏడాది వేడుకల వేళ న్యూఓర్లీన్స్‌లో అమెరికా ఆర్మీ మాజీ ఉద్యోగి జబ్బార్ పికప్ ట్రక్కుతో జనంపైకి దూసుకొచ్చిన ఘటనలో 15 మంది మరణించిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసుల కాల్పుల్లో జబ్బర్ మృతి చెందాడు. -
అమెరికాలోనూ ‘చాయ్.. సమోసా’
‘తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ’ అంటూ భారతీయ పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేందుకు అమెరికా కొత్త పల్లవి అందుకుంది. అక్కడి పర్యాటక పరిశ్రమ భారతీయుల కోసం రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఇతర దేశాల నుంచి అమెరికాకు టూరిస్టుల రాక భారీగా తగ్గడం.. అదే సందర్భంలో భారత్ నుంచి పర్యాటకుల సందడి పెరుగుతుండటం అగ్రరాజ్యానికి ఆశాకిరణంగా మారింది. ఫలితంగా అక్కడి పర్యాటక పరిశ్రమ మన సంప్రదాయాలను పుణికిపుచ్చుకుని ‘రండి.. రండి.. రండి’ అంటూ భారతీయులకు చక్కటి అతిథి మర్యాదలు చేస్తోంది.సాక్షి, అమరావతి: అమెరికా పర్యాటక పరిశ్రమ మందకొడిగా సాగుతోంది. కోవిడ్ మునుపటి స్థాయిని అందుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది. నిరంతర ద్రవ్యోల్బణం కారణంగా అమెరికన్లు విశ్రాంతి ఖర్చులను తగ్గించుకుంటున్నారు. తూర్పు ఆసియా దేశాల నుంచి పర్యాటకుల రాక గణనీయంగా పడిపోయింది. ఈ ఖాళీని భారతీయ పర్యాటకులతో భర్తీ చేయాలని అమెరికా భావిస్తోంది. అగ్రరాజ్యానికి ఆతిథ్య పరిశ్రమ ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఇందుకే అమెరికా హోటళ్లు భారతీయ సంప్రదాయ రుచులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. భారతీయ పర్యాటకులను ఆకర్షించి ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త ఆతిథి మర్యాదలు చేస్తున్నాయి.భారతీయ టీవీ చానళ్ల మోతఅమెరికా పర్యాటక పరిశ్రమలో ఆదాయాన్ని పునరుద్ధరించడానికి హోటళ్లు, ట్రావెల్ కంపెనీలు భారతీయ పర్యాటకులపైనే ఆశలు పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా అగ్రరాజ్య హోటళ్లు ‘చాయ్.. సమోసా’లను ప్రవేశపెట్టాయి. దీనికితోడు లాంజ్‌లు, గెస్ట్ రూమ్స్‌లో భారతీయ టీవీ చానళ్ల ప్రసారాల మోత మోగిస్తున్నాయి. యూఎస్ నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం ఆఫీస్ (ఎన్టీటీవో) డేటా ప్రకారం గతేడాది తొలి పది నెలల్లో సుమారు 20 లక్షల మంది భారతీయులు అమెరికాను సందర్శించారు.ఇది కోవిడ్ పూర్వపు స్థాయి కంటే 48 శాతం పెరుగుదలను నమోదు చేయడం విశేషం. ముఖ్యంగా వ్యాపార సందర్శనల కోసం జారీ చేసిన వీసాలలో 50 శాతం, హాలిడే వీసాలు 43.50 శాతం వృద్ధి చెందాయి. విస్తరిస్తున్న భారతీయ మధ్యతరగతి జనాభా, అధిక ప్రయాణ బడ్జెట్లు, పెరిగిన విమాన సామర్థ్యం భారతీయుల్లో అంతర్జాతీయ ప్రయాణ ఒరవడిని చూపిస్తున్నాయి. చైనా, జపాన్ నుంచి తగ్గుదలఆర్థిక, సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాల నుంచి వచ్చే సందర్శకుల సంఖ్య అమెరికాలో భారీగా తగ్గింది. ఇందులో చైనా నుంచి 44.50 శాతం, జపాన్ నుంచి 50.8 శాతం, దక్షిణ కొరియా నుంచి 23.90 శాతం క్షీణత నమోదైంది. వీరి స్థానాన్ని భారతీయులు భర్తీ చేస్తున్నట్టు ఆసియా అమెరికన్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ వెల్లడించింది. యూరోపియన్ పర్యాటకులు అమెరికాకు మళ్లీ తిరిగి వస్తున్నారు. అయితే యూకే, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశీయుల సందర్శన 2019 ముందుతో పోలిస్తే తక్కువగా ఉంది. గతేడాది భారతీయ ప్రయాణికులు చేసిన యూఎస్ బుకింగ్‌లు 50 శాతంపైనే పెరిగాయి. ఇది 2019 కోవిడ్ మహమ్మారి స్థాయితో పోలిస్తే మూడు రెట్లు వృద్ధిని సూచిస్తోంది. ఓఏజీ ఏవియేషన్ డేటా ప్రకారం 2019తో పోలిస్తే గతేడాది భారత్–యూఎస్ మధ్య షెడ్యూల్డ్ విమాన సామర్థ్యం 42.3 శాతం పెరిగింది. -
అమెరికా ఖజానాపై సైబర్ దాడి..!
వాషింగ్టన్:అగ్ర దేశం అమెరికా ఖజానాపై చైనా సైబర్ దాడి చేసినట్లు సమాచారం. వర్క్ స్టేషన్లు,కీలక ఫైల్స్‌పై చైనా ప్రోద్బలంతో జరిగిన సైబర్ దాడిని గుర్తించామని అమెరికా ట్రెజరీ శాఖ కాంగ్రెస్‌కు లేఖ రాసింది.ఈ లేఖ మీడియా చేతికి చిక్కడంతో అసలు విషయం బయట పడింది.డిసెంబర్ నెల ప్రారంభంలో సైబర్ దాడి ఘటన జరిగినట్లు తెలుస్తోంది.థర్డ్ పార్టీ సైబర్ సెక్యూరిటీ సర్వీస ప్రొవైడర్ పాస్‌వర్డ్‌ను కనిపెట్టిన హ్యాకర్లు బ్రేక్ చేసి వర్క్ స్టేషన్లు, కొన్ని ఫైల్స్‌లోని సమాచారాన్ని దొంగిలించారని ట్రెజరీ శాఖ అధికార ప్రతినిధి లేఖలో తెలిపారు.ఈ విషయాన్ని యూఎస్ సైబర్ సెక్యూరిటీ,ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ దృష్టికి ట్రెజరీ శాఖ తీసుకువెళ్లింది.సైబర్ దాడిపై ట్రెజరీ శాఖకు థర్డ్‌పార్టీ సైబర్ సెక్యూరిటీ సేవలందిస్తున్న బియాండ్ ట్రస్ట్ సంస్థ ఈ వ్యవహారంపై స్పందించలేదు. ఇటీవలి కాలంలో కొన్ని థర్డ్ పార్టీ సైబర్ సెక్యూరిటీ సర్వీస్ ప్రొవైడర్‌ను టార్గెట్ చేసి సైబర్ దాడులకు పాల్పడే ట్రెండ్ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. -
రూపాయి పడింది... ఫీజు భారం పెరిగింది!
సాక్షి, హైదరాబాద్: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్రమంగా పతనమవుతుండటంతో, ఇప్పటికే అమెరికాలో చదువుతున్న వారితో పాటు కొత్తగా ఎమ్మెస్ కోసం అక్కడికి వెళ్లాలని భావిస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై అదనపు భారం పడుతోంది. యూఎస్ వెళ్లేందుకు అన్ని సన్నాహాలూ చేసుకున్న విద్యార్థులు అంచనాలు తారుమారవడంతో ఆందోళన చెందుతున్నారు. 2022 ఫాల్ సీజన్ (సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్)లో డాలర్ విలువ రూ.79 కాగా ఇప్పుడది రూ.85.03కు ఎగబాకడం గమనార్హం. 2014లో డాలర్ (Dollar) విలువ రూ. 60.95 మాత్రమే కావడం గమనార్హం. రూపాయి (Rupee) విలువ తగ్గిపోవడంతో విదేశీ యూనివర్సిటీలకు చెల్లించాల్సిన ఫీజుల మొత్తం గణనీయంగా పెరిగిపోతోంది. ట్యూషన్ ఫీజు 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పెరిగిన మారకం విలువకు తగ్గట్టుగా బ్యాంకులు అదనంగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఇప్పటికే అప్పులు చేసిన విద్యార్థులు పెరిగిన భారానికి తగిన మొత్తం ఎలా సమకూర్చుకోవాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. పెరిగిన మారకం విలువకు తగ్గట్టుగా బ్యాంకులు అదనంగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఇప్పటికే అప్పులు చేసిన విద్యార్థులు పెరిగిన ఖర్చును ఎలా సమకూర్చు కోవాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. రూపాయితో పోల్చు కుంటే డాలర్ విలువ గత రెండేళ్లలోనే 8 శాతం పెరగడం విద్యార్థులపై పెనుభారం మోపుతోంది. మరోవైపు పార్ట్ టైం ఉద్యోగాలకు (part time jobs) అవకాశాలు సన్నగిల్లడంతో విద్యార్థులు భారత్‌లోని తల్లిదండ్రుల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికాతో పాటు కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ తదితర దేశాల్లో పరిస్థితి ఈ విధంగానే ఉందనే వార్తలొస్తున్నాయి. 2025లో రూ.5.86 లక్షల కోట్ల భారంభారత్ నుంచి ఏటా సగటున 13 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తున్నారు. వీరిలో 38 శాతం వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వారే ఉంటున్నారు. 2025లో ఈ సంఖ్య 15 లక్షలకు చేరుతుందని అంచనా. ఇక 2019లో విదేశీ విద్యకు భారతీయులు చేసిన ఖర్చు రూ. 3.10 లక్షల కోట్లు కాగా 2022 నాటికి ఇది 9 శాతం పెరిగి రూ.3.93 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుతం డాలర్ విలువ పెరగడంతో 2024లోఇది 8 నుంచి 10 శాతం మేర పెరిగి రూ. 4.32 లక్షల కోట్లకు చేరుతుందని భారత ప్రభుత్వం అంచనా వేసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో 2025లో ఇది రూ.5.86 లక్షల కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉందని విదేశీ మంత్రిత్వ శాఖ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఫీజుకే అదనంగా రూ. 2.40 లక్షల వ్యయంస్ప్రింగ్ (మార్చి నుంచి జూన్) సీజన్లో చదువుకు సన్నాహాలు మొదలు పెట్టినప్పుడు వర్సిటీల ఫీజు సగటున రూ.24 లక్షలుగా విద్యార్థులు అంచనా వేసుకున్నారు. అయితే ప్రస్తుతం రూపాయి నేల చూపులు చూడటంతో ఇప్పుడు కనీసం రూ.2.40 లక్షలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక వసతి ఖర్చులు దీనికి అదనం కాగా.. మొత్తం మీద అమెరికాలో రూ.43 లక్షలతో ఎంఎస్ పూర్తవుతుందని అంచనా వేసుకుంటే, ఇప్పుడదని రూ. 52 లక్షల వరకు వెళుతుందని అంచనా. ఉపాధి భరోసా ఏదీ?అమెరికా వెళ్లే విద్యార్థి ముందుగా అక్కడ ఏదో ఒక పార్ట్‌టైం ఉద్యోగం వెతుక్కుంటాడు. 2019కి ముందుతో పోలిస్తే 2023లో ఈ అవకాశాలు 40 శాతం తగ్గాయని విదేశీ మంత్రిత్వ శాఖ అధ్యయనంలో గుర్తించారు. కరోనా తర్వాత ఏ దేశం నుంచి వచ్చిన విద్యార్థి అయినా పార్ట్ టైం ఉద్యోగం కోసం పోటీ పడాల్సి వస్తోంది. దీంతో అవకాశాలకు భారీగా గండి పడింది. కెనడాలో 2.22 లక్షల మంది భారత విద్యార్థులున్నారు. చదవండి: త్వరలో హైదరాబాద్ – డాలస్ విమానంఇక్కడ అమెరికాతో పోల్చుకుంటే 30 శాతం ఫీజులు తక్కువ ఉంటాయి. దీంతో ఈ దేశానికి వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇటీవల అక్కడ అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీసా నిబంధనల్లో మార్పులు తెర్చారు. 2020–21లో చదువు పూర్తి చేసిన వారికి పార్ట్‌టైం ఉద్యోగాలు వచ్చే పరిస్థితి తగ్గింది. దీంతో విద్యార్థులు అనేక కష్టాలు పడుతున్నారు. బ్రిటన్, ఆస్ట్రేలియాలోనూ ప్రతికూల పరిస్థితులే కన్పిస్తున్నాయి. ఈ పరిస్థితి ఊహించలేదు అమెరికా వస్తున్పప్పుడు రూ. 50 లక్షల వరకు అప్పు చేశా. రూపాయి విలువ పతనంతో ట్యూషన్ ఫీజు మొత్తం పెరిగింది. ప్రస్తుతం వ్యక్తిగత ఖర్చులు తగ్గించుకోవడానికి ఒకే గదిలో నలుగురం ఉంటున్నాం. అయినా ఇబ్బందిగానే ఉంది. పార్ట్ టైం ఉద్యోగం చేసినా పెద్దగా ఆదాయం ఉండటం లేదు. ఇంటికి ఫోన్ చేయాలంటే బాధగా అన్పిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఊహించలేదు. – పాయం నీలేష్ (అమెరికాలో ఎంఎస్ విద్యార్థి)వెళ్లాలా? వద్దా? అనే డైలమాలో ఉన్నా..యూఎస్ వెళ్లడానికి బ్యాంక్ లోన్ ఖాయమైంది. కానీ ఈ సమయంలోనే రూపాయి పతనంతో యూనివర్సిటీకి చెల్లించాల్సిన మొత్తం పెరిగింది. బ్యాంకు వాళ్లు అదనంగా లోన్ ఇవ్వనన్నారు. మిగతా ఖర్చుల కోసం నాన్న అప్పుచేసి డబ్బులు సిద్ధం చేశారు. ఇప్పుడు ఆ డబ్బులు సరిపోయే పరిస్థితి లేదు. అమెరికా వెళ్లాలా? వద్దా? అనే డైలమాలో ఉన్నా. – నీలిమ (అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉన్న విద్యార్థిని)2014లో డాలర్ విలువ రూ.60.952022 (ఫాల్ సీజన్)లో రూ.792024 డిసెంబర్లో రూ.85.032025లో రూ.9 లక్షల వరకు అదనపు భారం! -
హెచ్–1బీ వీసాలకు ట్రంప్ దన్ను
వాషింగ్టన్: నిపుణులైన విదేశీ కార్మికులకు అమెరికా సంస్థల్లో ఉపాధికి ఉద్దేశించిన హెచ్–1బీ వీసాల పరిరక్షణ కోసం యుద్ధానికైనా సిద్ధమని వ్యాఖ్యానించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి మద్దతు లభించింది. హెచ్–1బీ వీసాల జారీని అమెరికాలో పలువురు వ్యతిరేకిస్తున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. నిపుణులైన ఉద్యోగులకు అమెరికాలో పని చేసుకొనేందుకు అవకాశం కల్పించే హెచ్–1బీ వీసాలను వ్యతిరేకించేవారు తమ అభిప్రాయం మార్చుకోవాలని మస్క్ సూచించడం తెల్సిందే. కేవలం నైపుణ్యత మీదనే మనగలిగే స్పేస్ఎక్స్, టెస్లా వంటి సృజనాత్మక సంస్థలకు హెచ్–1బీ వీసాదారుల అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలను ట్రంప్ సమర్థించారు. ‘‘హెచ్–1బీ వీసా ప్రక్రియను నేనెప్పుడూ ఇష్టపడతా. వాటికి మద్దతు పలుకుతా. అందుకే అవిప్పటిదాకా అమెరికా వ్యవస్థలో కొనసాగుతున్నాయి. నా వ్యాపార సంస్థల్లోనూ హెచ్–1బీ వీసాదారులున్నారు. హెచ్–1బీ వ్యవస్థపై నాకు నమ్మకముంది. ఈ విధానాన్ని ఎన్నోసార్లు వినియోగించుకున్నా. ఇది అద్భుతమైన పథకం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాలనలో సమూల సంస్కరణలే లక్ష్యంగా ట్రంప్ కొత్తగా తెస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్)కు సంయుక్త సారథులు కానున్న మస్క్, వివేక్ రామస్వామి హెచ్–1బీకి మద్దతు తెలుపుతున్నారు. దీన్ని రిపబ్లికన్ పారీ్ట సీనియర్లు తప్పుబడుతున్నారు. స్థానిక అమెరికన్లకే అధిక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్న ట్రంప్ ఎన్నికల వాగ్దానానికి ఇది విరుద్ధమంటున్నారు. వాళ్ల వైఖరిని మస్క్ తప్పుబట్టారు. హెచ్–1బీ వీసాల కోసం ఎంతకైనా తెగిస్తానని శనివారం ప్రకటించారు. -
USA:హాలిడే సీజన్‌పై టోర్నడోల ఎఫెక్ట్
కాలిఫోర్నియా:క్రిస్మస్,న్యూఇయర్ సెలవులను ఎంజాయ్ చేద్దామనుకున్న అమెరికా(America) వాసులను వాతావరణం ఇబ్బందులకు గురిచేస్తోంది. టోర్నడోలు, భారీ మంచు కారణంగా ఏకంగా 7వేల దాకా విమానాలు శనివారం(డిసెంబర్28) ఆలస్యంగా నడిచాయి. దీంతో బంధు,మిత్రులతో కలిసి సెలవులు సరదాగా గడుపుదామనుకున్నవారికి నిరాశే ఎదురైంది.అట్లాంటా,హూస్టన్లలోని విమానాశ్రయాల నుంచి విమానాలు ఆలస్యంగా నడిచాయి.ఆగ్నేయ రాష్ట్రాలైన టెక్సాస్,లూసియానా,మిసిస్సిపిలలో కనీసం పది టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. టోర్నడోల ధాటికి ఒకరు మృతిచెందగా నలుగురు గాయపడ్డారు.కాలిఫోర్నియాలోని టాహో బేసిన్లో భారీ వర్షాలతో పాటు మంచు కురవనుందని వాతావరణశాఖ తెలిపింది.కాగా ఇయర్ ఎండింగ్లో అమెరికాలో కక్రిస్మస్తో పాటు న్యూఇయర్‌ను పురస్కరించుకుని ఉద్యోగులకు వరుస సెలవులు వస్తాయి. దీంతో సెలవుల్లో సరదాగా పర్యటనలకు వెళ్లడంతో పాటు బంధు,మిత్రులను కలిసేందుకు అమెరికా వాసులు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. దీంతో ప్రస్తుతం అక్కడి విమానాశ్రయాలన్నీ కిటకిటలాడుతుంటాయి. -
టిక్‌టాక్‌పై నిషేధం ఆపండి: ట్రంప్
వాషింగ్టన్:అమెరికాలో అధికారం చేతులు మారనున్న వేళ టిక్‌టాక్(TikTok) యాప్ నిషేధం వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పదవీ బాధ్యతలు చేపట్టేవరకు టిక్‌టాక్‌పై నిషేధం విధించవద్దని ఆయన తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు.వచ్చే ఏడాది జనవరి 20న ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌పై నిషేధం కేసులో మరింత సమయం ఇవ్వాలని ట్రంప్ న్యాయవాదులు సుప్రీం కోర్టు(Supreme Court)ను కోరారు.దీనిపై రాజకీయ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వారు కోర్టుకు తెలియజేశారు. కాగా,యాప్ వినియోగదారుల డేటా సేకరిస్తున్నారనే ఆరోపణలతో భారత్ సహా పలు దేశాలు చైనాకు చెందిన టిక్‌టాక్‌పై ఇప్పటికే నిషేధం విధించాయి. గతంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికాలో టిక్‌టాక్ నిషేధానికి ప్రయత్నాలు జరిగాయి. న్యాయపరమైన చిక్కుల వల్ల నిషేధం ఆచరణలోకి రాలేదు.అప్పట్లో ట్రంప్ టిక్‌టాక్ నిషేధానికి తీవ్రంగా ప్రయత్నించారు. జాతీయ భద్రతకు టిక్‌టాక్ పెద్ద ముప్పుగా పరిణమించిందని ఆరోపణలు చేశారు.ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ టిక్‌టాక్‌పై నిషేధంపై బిల్లు ప్రవేశపెట్టారు.నిషేధానికి మద్దతుగా 352 మంది ఓటు వేయగా 65 మంది వ్యతిరేకించారు.దీంతో బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లుకు ట్రంప్ కూడా పరోక్షంగా మద్దతు పలికారు. అయితే,కొన్ని రోజుల తర్వాత అనూహ్యంగా ఆయన టిక్‌టాక్ వాడకం మొదలుపెట్టారు. దీంతో యాప్ నిషేధంపై తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇటీవల అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ టిక్‌టాక్ నిషేధంపై మాట మార్చారు. తాను అధికారంలోకి వస్తే టిక్‌టాక్‌ను నిషేధించబోనని స్పష్టం చేశారు. -
మన్మోహన్‌కు ప్రధాని,రాష్ట్రపతి నివాళి
మన్మోహన్సింగ్ పార్థివ దేహానికి ప్రధాని మోదీ నివాళులు..మన్మోహన్ సింగ్ ఇంటికి చేరుకున్న ప్రధాని మోదీమాజీ ప్రధాని పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన మోదీమన్మోహన్ సతీమణి గురుశరణ్‌కౌర్, కుటుంబ సభ్యులకు సంతాపంప్రధానితో పాటు మన్మోహన్ ఇంటికి వచ్చిన అమిత్ షా, జేపీ నడ్డా మన్మోహన్ పార్థివ దేహానికి రాష్ట్రపతి నివాళిమన్మోహన్సింగ్ పార్థివ దేహానికి రాషష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళిమన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపిన ముర్ము ఢిల్లీమన్మోహన్సింగ్ పార్థివ దేహానికి తెలంగాణ సీఎం రేవంత్ నివాళులుమన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిమన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్‌ను, ,కుటుంబ సభ్యులను పరామర్శించిన రేవంత్ రెడ్డిమన్మోహన్ నివాసానికి కాంగ్రెస్ అగ్రనేతలుమన్మోహన్ ఇంటికి వచ్చిన సోనియాగాంధీ రాహుల్‌గాంధీ, మల్లికార్జునఖర్గే, ప్రియాంకగాంధీమన్మోహన్ పార్థివ దేహానికి నివాళులర్పించిన నేతలు వ్యక్తిగతంగా నాకు తీరనిలోటు: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మన్మోహన్ లేని లోటు పూడ్చలేనిదిచాలా కాలం నుంచి మన్మోహన్ నాకు తెలుసుసభ్యతకు నిలువెత్తు రూపం మన్మోహన్సింగ్వీడియో విడుదల చేసిన మాజీ రాష్ట్రపతిఆ మాటే నిజమైంది: శశిథరూర్ మాజీ ప్రధాని మన్మోహన్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టిన శశిథరూర్చరిత్ర నా పట్ల దయతో ఉంటుందని 2014లో వ్యాఖ్యానించిన మన్మోహన్ఆయన చెప్పిన మాటలను గుర్తుచేస్తూ పోస్టు పెట్టిన కాంగ్రెస్ ఎంపీపదేళ్ల తర్వాత అదే నిజమైందని వ్యాఖ్యమన్మోహన్ దేశ సేవ..రాబోయే తరాలకు స్ఫూర్తి: సిక్కిం సీఎం తమాంగ్మన్మోహన్ మృతిపట్ల సంతాపం తెలిపిన సిక్కిం సీఎం ప్రేమ్‌సింగ్ తమాంగ్ఆర్థిక సంస్కరణలకు నాంది పలికి దేశాభివృద్ధికి గట్టి పునాది వేశారుదేశానికి మన్మోహన్ చేసిన సేవలు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని వ్యాఖ్య మాజీ ప్రధాని మన్మోహన్ మృతి పట్ల అమెరికా సంతాపంగత రెండు దశాబ్దాల్లో అమెరికా,భారత్ సాధించిన మన్మోహన్ పునాది వేశారుఅమెరికా, భారత్ పౌర అణు సహకార ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మన్మోహన్ కీలక పాత్ర పోషించారుభారత్ వేగంగా అభివృద్ధి చెందడానికి ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రజలకు గుర్తుండిపోతాయిప్రకటించిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ -
బిల్ క్లింటన్‌కు అస్వస్థత..ఆస్పత్రిలో చేరిక
వాషింగ్టన్:అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అస్వస్థతకు గురయ్యారు.చికిత్స కోసం ఆయనను వాషింగ్టన్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని క్లింటన్ వ్యక్తిగత సిబ్బంది వెల్లడించారు.బిల్ క్లింటన్ జ్వరంతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. క్లింటన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు. క్రిస్మస్ పండుగకు ఆయన ఇంటికి తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.కాగా,అమెరికా అధ్యక్షుడిగా బిల్‌క్లింటన్ రెండు సార్లు (1993-2001) పనిచేశారు. 2001 తర్వాత వైట్‌హౌస్‌ను వీడిన ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు.2004లో తీవ్ర ఛాతీ నొప్పి, శ్వాసకోస సమస్యలు రావడంతో ఆయనకు నాలుగుసార్లు బైపాస్ సర్జరీ చేశారు. ఏడాది తర్వాత ఊపిరితిత్తులు మళ్లీ దెబ్బతినడంతో తిరిగి ఆస్పత్రిలో చేర్పించారు.2010లో గుండె సంబంధిత సమస్య రావడంతో మరోసారి శస్త్రచికిత్స చేసి రెండు స్టెంట్లు అమర్చారు. తర్వాత కొద్ది రోజులకు ఆయన పూర్తిగా కోలుకున్నారు.ఇటీవల 2021లో మూత్రనాళ ఇన్ఫెక్షన్కు చికిత్స తీసుకున్నారు.నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో డెమోక్రట్ల తరఫున ఆయన చురుకుగా ప్రచారం నిర్వహించారు. -
అమెరికా అండర్–19 క్రికెట్ జట్టు కెప్టెన్ అనిక రెడ్డి
బ్రూమ్‌ఫీల్డ్ (కొలరాడో): వచ్చే ఏడాది జనవరిలో మలేసియా వేదికగా జరిగే మహిళల అండర్–19 ప్రపంచకప్ టి20 క్రికెట్ టోర్నీలో పాల్గొనే అమెరికా జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన అమెరికా జట్టుకు భారత సంతతికి చెందిన తెలుగమ్మాయి కొలన్ అనిక రెడ్డి కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. తెలుగు సంతతికి చెందిన పగిడ్యాల చేతన రెడ్డి, ఇమ్మడి శాన్వి, సషా వల్లభనేని కూడా అమెరికా జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు మలేసియాలోని నాలుగు వేదికల్లో ఈ మెగా ఈవెంట్ జరుగుతుంది. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. డిఫెండింగ్ చాంపియన్ భారత్, వెస్టిండీస్, శ్రీలంక, మలేసియా జట్లకు గ్రూప్ ‘ఎ’లో చోటు కల్పించారు. గ్రూప్ ‘బి’లో అమెరికా, ఇంగ్లండ్, పాకిస్తాన్, ఐర్లాండ్... గ్రూప్ ‘సి’లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నైజీరియా, సమోవా... గ్రూప్ ‘డి’లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నేపాల్, స్కాట్లాండ్ జట్లున్నాయి. అమెరికా అండర్–19 జట్టు: కొలన్ అనిక రెడ్డి (కెప్టెన్), అదితిబా చుదసమ (వైస్ కెప్టెన్), పగిడ్యాల చేతన రెడ్డి, చేతన ప్రసాద్, దిశ ఢింగ్రా, ఇసాని మహేశ్ వాఘేలా, లేఖ హనుమంత్ శెట్టి, మాహి మాధవన్, నిఖర్ పింకూ దోషి, పూజా గణేశ్, పూజా షా, రీతూప్రియా సింగ్, ఇమ్మడి శాన్వి, సషా వల్లభనేని, సుహాని థదాని. -
అమెరికాలో ‘చైనా’ కలకలం.. ఎంత పని చేసింది!
మన్హటన్: చైనా ప్రభుత్వం తరఫున అమెరికాలో నడిపే రహస్య పోలీస్‌స్టేషన్ ఒకటి మొట్టమొదటిసారిగా బయటపడింది. మన్‌హటన్‌లోని చైనాటౌన్‌లో 2022 నుంచి చెన్ జిన్‌పింగ్, లు జియన్వాంగ్ అనే వారు చైనా ప్రభుత్వం పబ్లిక్ సెక్యూరిటీ శాఖ తరఫున దీనిని నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. అదే ఏడాది ఫెడరల్ బ్యూరో అధికారులు దీనిని మూసివేయించారు. చెన్ జిన్‌పింగ్, లు జియాన్ వాంగ్లు తమ సెల్ఫోన్లలోని చైనా మంత్రిత్వ శాఖ మెసేజీలను పూర్తిగా డిలీట్ చేశారు.అమెరికా పౌరసత్వమున్న వీరిద్దరినీ గతేడాది ఏప్రిల్‌లో అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నెల 18వ తేదీన కోర్టులో వీరిపై విచారణ పూర్తయింది. ఆరోపణలు రుజువని తేలితే వచ్చే ఏడాది వెలువడే తీర్పులో కోర్టు చెన్కు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది. లుపై విచారణ ఇంకా పూర్తి కాలేదు. కాలిఫోర్నియాలోని ప్రజాస్వామ్య అనుకూల వాదిని గుర్తించేందుకు చైనా ప్రభుత్వానికి సాయం చేయడంతోపాటు, పరారీలో ఉన్న నేరస్తుడిని అమెరికా నుంచి తిరిగి చైనా వెళ్లిపోవాలంటూ ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకునేందుకు..ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ దేశస్తులపై నిఘా పెంచి, వారిని తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకునేందుకు చైనాలోని నియంతృత్వ కమ్యూనిస్ట్ ప్రభుత్వం దాదాపు 53 దేశాల్లో 100కు పైగా ఇటువంటి పోలీస్స్టేషన్లను నిర్వహిస్తోందని హక్కుల సంస్థలు ఆరోపిస్తున్న వేళ ఈ వ్యవహారం బయటపడటం గమనార్హం. అయితే, ఈ ఆరోపణలను చైనా ఖండిస్తోంది. విదేశాల్లోని తమ దేశస్తులకు పరిపాలనా సేవలను అందించే సర్వీస్ స్టేషన్లే తప్ప, ఇవి పోలీస్స్టేషన్లు కావని చెబుతోంది. మన్‌హటన్‌లోని చైనాటౌన్‌లో తాజాగా బయటపడిన పోలీస్ స్టేషన్ రామెన్ మాల్లోని ఓ ఫోర్ మొత్తం ఆక్రమించింది. ఇందులో చైనీయులకు పౌరసత్వ పొడిగింపు సేవలను అందిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, ఇక్కడి ప్రజాస్వామ్య అనుకూల చైనీయులను గుర్తించేందుకే వాడుతున్నట్లు అమెరికా న్యా య శాఖ ఆరోపిస్తోంది.చదవండి: పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా..ఏమాత్రం సహించం‘ఈ అప్రకటిత విదేశీ పోలీసు స్టేషన్ అమెరికా సార్వభౌమాధికారానికి అవమానం, ప్రమాదకరం. దీనిని ఏమాత్రం సహించం’అని ఆ శాఖ అసిస్టెంట్ అటార్నీ జనరల్ మాథ్యూ ఓల్సెన్ స్పష్టం చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో న్యూ యార్క్ గవర్నర్ కార్యాలయంలో పనిచేసే మాజీ ఉద్యోగిని లిండా సన్ చైనా ప్రభుత్వానికి ప్రయోజనం కలిగించేలా అధికారం దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించారు. అందుకామె ప్రతిఫలాలు అందుకున్నారని తేలింది. గతేడాది చైనా పబ్లిక్ సెక్యూరిటీ శాఖకు సాయం అందిస్తున్నట్లుగా 34 మంది అధికారులను గుర్తించి, కేసులు పెట్టారు. -
ట్రంప్ సరికొత్త లుక్.. నెట్టింట వైరల్
ఫ్లోరిడా: అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా మరికొద్ది రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ సరికొత్త అవతారంలో అభిమానులను అలరించారు. ఫ్లోరిడాలోని తన పామ్ బీచ్ గోల్ఫ్ క్లబ్లో ట్రంప్ తాజాగా కొత్త అవతారంలో దర్శనమిచ్చారు. తెలుపు రంగు గోల్ఫ్ టీ షర్ట్, బ్లాక్ ప్యాంట్, చేతిలో ఎరుపు రంగు క్యాప్ పట్టుకుని సందర్శకులతో సరదాగా మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.అయితే ఈ లుక్‌లో ట్రంప్‌లో కొత్త దనం ఏంటంటే మారిన ఆయన జుట్టు. ఎప్పుడూ కదులుతూ ఫ్రీగా ఉండే ఆయన జుట్టు స్టైల్ ఇప్పుడు పూర్తిగా మారింది. జుట్టు పైకి దువ్వి వెనక్కి సెట్ చేయడంతో ‘హ్యాట్ హెయిర్’ స్టైల్లోకి వచ్చేసింది.PRESIDENT DONALD J. TRUMP HAS A NEW HAIRSTYLE MAKEOVER pic.twitter.com/j4gXErl2KN— X Analyst (@topic_flow) December 18, 2024కాగా, ట్రంప్‌కు హష్మనీ కేసులో తాజాగా కోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఇప్పటికే దోషిత్వం రుజువైన కేసును అధ్యక్ష పదవి వచ్చినంత మాత్రానా కొట్టేయడం కుదరదని కోర్టు ఇటీవలే తేల్చి చెప్పడం గమనార్హం. -
అమెరికాలో భారీ భూకంపం
కాలిఫోర్నియా:అమెరికాలోని కాలిఫోర్నియా తీర ప్రాంతంలో అమెరికా కాలమానం ప్రకారం గురువారం(డిసెంబర్5) ఉదయం 10.44 గంటలకు భారీ భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై ఏడుగా నమోదైంది. ఫెర్నడెల్ పట్టణంలో భూకంప కేంద్రం నమోదైంది. ఈ విషయాన్ని అమెరికా జియోగ్రఫికల్ సర్వే విభాగం వెల్లడించింది.తీర ప్రాంతంలో భారీ భూకంపం రావడంతో అమెరికా సునామీ కేంద్రం ముందస్తు చర్యగా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంప ప్రభావంతో పెట్రోలియా, స్కాటియా, కాబ్ తదితర ప్రాంతాల్లో శక్తిమంతమైన ప్రకంపనలు నమోదయ్యాయి.Shocking Footage of California's 7.0 Mega Quake Captured on Cam!Mother Earth just showed off her raw power with a 7.0 shaker in Cali, and folks, it's all on camera! From swimming pools doing the wave to dogs sensing the rumble before humans, this earthquake video is the talk of… pic.twitter.com/j2hHVBj7JL— 𝕏VN (@xveritasnow) December 5, 2024ఉత్తర దిశలో వచ్చన భూ ప్రకంపనలు దక్షిణ ప్రాంతంలోని శాన్ఫ్రాన్సిస్కో దాకా వచ్చాయంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు.భూకంపం వల్ల భవనాల్లోని ప్రజలు కొంత సేపు అటుఇటు ఊగిపోయారు. భూకంపం ముగిసిన తర్వాత కూడా అనంతర ప్రకంపనలు వచ్చాయి. భూకంపం ధాటికి ప్రాణ,ఆస్తి నష్టాలు ఏమైనా సంభవించాయా అనేది తెలియాల్సి ఉంది. -
హిందువులపై దాడులు..బంగ్లాదేశ్‌కు అమెరికా కీలక సూచన
వాషింగ్టన్:బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఆందోళకర పరిణామాలపై అగ్రదేశం అమెరికా స్పందించింది. పౌరుల ప్రాథమిక స్వేచ్ఛకు భంగం కలిగించొద్దని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అమెరికా సూచించింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో దేశంలో మత,ప్రాథమిక,మానవ హక్కులను గౌరవించాలని అక్కడి మధ్యంతర ప్రభుత్వాన్ని అమెరికా కోరింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ మంగళవారం(డిసెంబర్4) మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలన్నీ చట్టాలను గౌరవించాల్సిందేనన్నారు. నిర్బంధంలో ఉన్నవారికి కూడా ప్రాథమిక స్వేచ్ఛనిస్తూ వారి మానవ హక్కులకు భంగం కలగకుండా చూడాలని పటేల్ కోరారు.కాగా, బంగ్లాదేశ్‌లో షేక్‌హసీనా ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులు మొదలైన విషయం తెలిసిందే. ఇటీవల హిందు మతానికి చెందిన చిన్మయ్ కృష్ణదాస్‌ను కూడా అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. చిన్మయ్ తరపున కేసు వాదించేందుకు వచ్చిన న్యాయవాదిపైనా దాడి జరగడం బంగ్లాదేశ్‌లో దిగజారిన పరిస్థితులను తెలియజేస్తోంది. -
అమెరికా కీలక నిర్ణయం.. టార్గెట్ రష్యా..!
వాషింగ్టన్: కొన్నిరోజుల్లో అధ్యక్ష పదవీకాలం ముగియనుందనగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ముందుగానే ఊహించి ప్రాధాన్యమున్న పనులన్నీ చకచకా చక్కబెట్టుకుంటున్నారు.ఈ క్రమంలోనే రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు రూ.6వేల కోట్ల భారీ మిలిటరీ ప్యాకేజీ ప్రకటించారు. ఈ ప్యాకేజీలో భాగంగా ల్యాండ్ మైన్లు,యాంటీ ఆర్మర్ వెపన్లను అమెరికా ఉక్రెయిన్‌కు సమకూర్చనుంది.భవిష్యత్తులో ఉక్రెయిన్‌కు ఇలాంటి సహాయం అందకపోవచ్చనే ఆలోచనతో హుటాహుటిన ప్యాకేజీ అందిస్తున్నట్లు తెలుస్తోంది.రష్యా దాడులను అడ్డుకొని,ఉక్రెయిన్ ఆత్మరక్షణ సామర్థ్యాన్ని మెరుగుపరచుకునేలా ప్యాకేజీ ఇస్తున్నామని అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. -
వియ్యంకుడికి ట్రంప్ కీలక పదవి
ఫ్లోరిడా:రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న ట్రంప్ తన టీమ్‌లో ఒక్కొక్కరిని నియమించుకుంటున్నారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కశ్యప్పటేల్గా నామినేట్ చేసిన మరుసటి రోజే తన ప్రభుత్వానికి పశ్చిమాసియా వ్యవహారాల్లో సలహాదారుగా మసాద్ బౌలోస్‌ను ట్రంప్ నియమించుకున్నారు.అరబ్,మిడిల్ఈస్ట్ వ్యవహారాల్లో అధ్యక్షుడికి సీనియర్ సలహాదారుగా మసాద్ సేవలందిస్తారని తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫాం ద్వారా ట్రంప్ వెల్లడించారు. లెబనీస్-అమెరికా వ్యాపారవేత్త అయిన మసాద్ ట్రంప్ కుమార్తె టిఫానీకి మామ,ట్రంప్‌కు వియ్యంకుడు కావడం గమనార్హం.గాజాపై ఇజ్రాయెల్ దాడుల అంశంపై అసంతృప్తిగా ఉన్న అరబ్ అమెరికన్ ఓటర్లను ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ వైపునకు మళ్లించడంలో మసాద్ కీలకంగా పనిచేశారు.జనవరి 20న ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. -
కుమారుడికి ఊరట.. బైడెన్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్:అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పదవీ కాలం మరో రెండు నెలల్లో ముగియనుందనగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్రమంగా తుపాకీ కొనుగోలు,ట్యాక్స్ అక్రమాల కేసుల్లో తన కుమారుడు హంటర్ బైడెన్‌కు క్షమాభిక్ష ప్రసాదించారు.హంటర్‌కు క్షమాభిక్ష ఇవ్వబోనని అతడు దోషిగా తేలిన సందర్భంలో స్పష్టంగా పేర్కొన్న బైడెన్ ఇప్పుడు మాట మార్చడం గమనార్హం. అక్రమంగా తుపాకీ కొనుగోలు,ఆదాయపు పన్ను విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని డెలావెర్,కాలిఫోర్నియాలో హంటర్‌పై నమోదైన కేసుల్లో అతడికి ఇప్పటికే కోర్టులు శిక్ష విధించాయి.ఒక తండ్రిగా,అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని బైడెన్ తన నిర్ణయంపై వివరణ ఇచ్చారు. కాగా,ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ట్రంప్ జనవరి 20న రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. -
కెనడా నుంచి అమెరికాలోకి.. చొరబాటుదారుల్లో ఇండియన్సే ఎక్కువ
వాషింగ్టన్:కెనడా సరిహద్దు ద్వారా అక్రమంగా అమెరికాలోకి చొరబడేందుకు ప్రయత్నించి పట్టుబడుతున్న భారతీయుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 2023-24లో కెనడా సరిహద్దు నుంచి అమెరికాలోకి చొరబడేందుకు యత్నించిన వారిలో 23 శాతం మంది భారతీయులే కావడం గమనార్హం.అక్రమ చొరబాట్ల సమస్య అమెరికా,కెనడాల మధ్య ప్రస్తుతం దౌత్యపరమైన సమస్యగా మారిందంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు.అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(యూఎస్సీబీపీ) లెక్కల ప్రకారం 2022లో కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా చొరబడేందుకు 1లక్షా9వేల535 మంది యత్నించగా ఇందులో 16 శాతం మంది భారతీయులే.2023-24లో మాత్రం ఈ సంఖ్య గణనీయంగా పెరిగి కెనడా నుంచి అమెరికాలోకి చొరబడేందుకు ప్రయత్నించిన భారతీయుల సంఖ్య ఏకంగా 47వేలకు చేరింది. ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ చొరబాట్లపై ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. -
అమెరికాలో కాల్పులు.. ఖమ్మం యువకుడి మృతి
సాక్షి,ఖమ్మంజిల్లా: తెలంగాణకు చెందిన యువకుడిపై అమెరికాలో దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు సాయితేజ అక్కడికక్కడే మృతిచెందాడు.సాయితేజ అమెరికాకు ఎమ్మెస్ చేయడానికి వెళ్లాడు. సాయితేజ మృతితో రామన్నపేటలో విషాదం నెలకొంది. మృతదేహాన్ని ఖమ్మం తీసుకురావడానికి అధికారులు కృషి చేస్తున్నారు. -
అమెరికా విద్యలో భారత్ హవా
సాక్షి, అమరావతి: అమెరికా విద్యా సంస్థల్లో అంతర్జాతీయ విద్యార్థుల చేరికల్లో భారత్ అగ్రస్థానంలో నిలుస్తోంది. దాదాపు దశాబ్దంన్నర తర్వాత అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గరిష్టస్థాయికి చేరుకుంది. 2023–24లో అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాల్లో భారత్ వాటా 29 శాతంగా ఉన్నట్లు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఓపెన్ డోర్స్ 2024 నివేదిక వెల్లడించింది. గత విద్యా సంవత్సరం 3.31 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుల కోసం వెళ్లారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 23 శాతం అధికం. 2023–24లో అంతర్జాతీయ విద్యార్థుల ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు రూ.4.22 లక్షల కోట్లు సమకూరగా ఇందులో భారత్ వాటా 20 శాతంగా ఉంది.డ్రాగన్‌ను దాటేశాం..!అమెరికా వర్సిటీలు, కళాశాలల్లో అంతర్జాతీయ విద్యార్థుల చేరికల్లో చైనాను భారత్ అధిగవిుంచింది. చైనా విద్యార్థుల సంఖ్య 2022–23లో 27.4 శాతం ఉండగా 2023–24లో 24.6 శాతానికి పడిపోయింది. 15 ఏళ్లలో ఇదే తక్కువ. గత విద్యా సంవత్సరం అమెరికాలో 11.26 లక్షల మంది అంతర్జాతీయ విద్య అభ్యసిస్తున్నట్టు నివేదిక తెలిపింది. ఇది ఆల్‌టైమ్ రికార్డుగా పేర్కొంది. ఇందులో అగ్రస్థానంలో భారతీయ విద్యార్థులు (3.31 లక్షలు) ఉండగా 2.77 లక్షలతో చైనా విద్యార్థులు, 43,149 మందితో సౌత్ కొరియా విద్యార్థులు తరువాత స్థానాల్లో నిలిచారు. 64.5 శాతం మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో పబ్లిక్ వర్సిటీలను ఎంచుకుంటున్నారు. 35.5 శాతం మంది స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్, పరిశోధనల కోసం ప్రైవేట్ వర్సిటీలకు వెళ్తున్నారు. ఈ ఏడాది 3 శాతం పెరుగుదల..ప్రస్తుత విద్యా సంవత్సరంలో అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల చేరికలు మూడు శాతం పెరిగినట్లు స్నాప్‌చాట్ నివేదిక చెబుతోంది. యూఎస్‌లోని చాలా విద్యా సంస్థలు గ్రాడ్యుయేట్ విద్యలో ప్రవేశాలను పెంచుకునేందుకు భారత్, చైనా, ఘనా, నైజీరియాలపై దృష్టి పెట్టినట్టు తెలిపింది. 2022–23లో అమెరికాకు చెందిన 2.80 లక్షల మంది విద్యార్థులు ఇతర దేశాల్లో విద్యనభ్యసించారు. ఇటలీ, యూకే, స్పెయిన్, ఫ్రాన్స్ వారి ప్రధాన గమ్యస్థానాలుగా (45 శాతం) ఉన్నాయి. ఆ తర్వాత ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్ (25 శాతం)లో ఎక్కువగా చేరికలున్నాయి. స్టెమ్ కోర్సులపై దృష్టి..భారతీయ విద్యార్థులకు అమెరికాలో అత్యంత ప్రాధాన్య విద్యా గమ్యస్థానాలుగా కాలిఫోరి్నయా, న్యూయార్క్, టెక్సాస్, మసాచుసెట్స్, ఇల్లినాయిస్ నిలిచాయి. అంతర్జాతీయ విద్యార్థులలో 56 శాతం మంది స్టెమ్ కోర్సులను అభ్యసించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌లో ఎక్కువగా ప్రవేశాలు పొందుతున్నారు. బిజినెస్ మేనేజ్మెంట్ ప్రవేశాల్లో 2 శాతం, ఫైన్, అప్లైడ్ ఆర్ట్స్‌లో 5 శాతం పెరుగుదల నమోదైంది. గ్లోబల్ డెస్టినేషన్..2014 నుంచి అంతర్జాతీయ విద్యార్థుల గ్లోబల్ డెస్టినేషన్‌గా అమెరికా కొనసాగుతోంది. కెనడా, యూకే తరువాత వరుసలో ఉన్నాయి. యూకేలో మొత్తం విద్యార్థుల్లో అంతర్జాతీయ విద్యార్థులు 27 శాతం, కెనడాలో 38 శాతం, ఆస్ట్రేలియాలో 31 శాతం ఉన్నారు. మరోవైపు భారత్‌ను అధ్యయన కేంద్రంగా ఎంచుకున్న అమెరికా విద్యార్థుల్లో 300 శాతం పెరుగుదల కనిపించింది. 2022–23లో భారత్‌లో చదువుతున్న అమెరికన్ల సంఖ్య 300 నుంచి 1,300కి పెరిగింది. -
బ్లాక్ ఫ్రైడే ఆఫర్స్ అదుర్స్
అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్లాక్ ఫ్రైడే సేల్స్ సంస్కృతి ఇప్పుడు భారతదేశ మార్కెట్లోకి ప్రవేశించింది. దసరా–దీపావళి డిస్కౌంట్ సేల్స్‌కు దీటుగా ఈసారి రిటైల్ సంస్థలు బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లో భారీ డిస్కౌంట్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు జరిగే ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లో పలు ఉత్పత్తులపై ఏకంగా 50 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్స్‌ను ఇస్తున్నాయి. ఎయిర్ ఇండియా, ఐఆర్టీసీ దగ్గర నుంచి ఆన్లైన్ రిటైల్ సంస్థలు, గృహోపకరణాల సంస్థలు ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్ సందర్భంగా ప్రత్యేక రాయితీలు ప్రకటించాయి. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2వ తేదీలోపు విమాన టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఎయిర్ ఇండియా 12 నుంచి 20 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణ టికెట్ చార్జీలపై 12 శాతం, దేశీయ టికెట్ చార్జీలపై 20 శాతం డిస్కౌంట్‌ను ఇస్తోంది. ఐఆర్టీసీ అయితే ఈ ఆఫర్ సమయంలో కన్వేనియన్స్ ఫీజులను తొలగించడంతోపాటు ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. – సాక్షి, అమరావతి బ్లాక్ ఫ్రైడే సేల్స్ అంటే..» అమెరికాలో రైతులు తమ పంటల దిగుబడి పూర్తయినందుకు సంతోషంగా ప్రతి ఏడాది నవంబర్ నాలుగో గురువారం ‘థ్యాంక్స్ గివింగ్’ పేరిట పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ రోజు ఆమెరికాలో జాతీయ సెలవు దినం. » ‘థాంక్స్ గివింగ్ డే’ మరుసటి రోజు వచ్చే శుక్రవారాన్ని ‘బ్లాక్ ఫ్రైడే సేల్స్’ పేరుతో షాపింగ్ కోసం కేటాయిస్తారు.» డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపార సంస్థలు బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లో భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తాయి. » అమెరికాలో అత్యధికంగా అమ్మకాలు జరిగేది ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లోనే. » ఇప్పుడు ఈ సంస్కృతి నెమ్మదిగా మన దేశంలోకి కూడా విస్తరించింది.ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, మింత్రా వంటి ఈ–కామర్స్ దిగ్గజ సంస్థలు భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తున్నాయి. అంతేకాకుండా శామ్సంగ్, షియోమీ, సోనీ, హెచ్‌పీ వంటి సంస్థలు కూడా డిస్కౌంట్ ఆఫర్స్‌ను ప్రకటించాయి. సామ్సంగ్ తన గెలాక్సీ ఫోన్లపై రూ.12,000 వరకు, రెడ్మీ అయితే రూ.15,000 వరకు డిస్కౌంట్లను అందిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఎంపిక చేసిన బ్యాంకుల కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే అదనపు తగ్గింపును వర్తింపజేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు 35 నుంచి 40శాతం వరకు పెరుగుతాయని ఈ–కామర్స్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. డిసెంబర్ 2న ‘సైబర్ మండే’తో ఈ డిస్కౌంట్ అమ్మకాలు ముగుస్తాయి. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. అమెరికాలో ప్రభాకర్‌రావు పిటిషన్
సాక్షి,హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చారు. ప్రస్తుతం ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్న విషయం తెలిసిందే. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు తాజాగా పిటిషన్ పెట్టుకున్నారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం తనను ఇబ్బంది పెడుతోందని పిటిషన్లో ప్రభాకర్‌రావు పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వంలో తాను కీలక స్థానంలో పనిచేశానని తెలిపారు. రాజకీయంగా తనను వేధిస్తున్నారని ఆరోపించారు. తాను తీవ్ర అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నానని ప్రభాకర్‌రావు పేర్కొన్నారు.ప్రస్తుతం తాను ఫ్లోరిడాలోని కుమారుని వద్ద ఉంటున్నానని తెలిపారు.కాగా,మరో వైపు అమెరికాలో తలదాచుకుంటున్న ప్రభాకర్‌రావును ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్‌రావుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించేందుకు పోలీసులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.ఈ కేసులో మరో నిందితుడు, టీవీఛానల్ ఎండి శ్రవణ్ రావు అమెరికాలోని చికాగోలో ఉంటున్నట్లు పోలీసులు కనిపెట్టారు. -
15 ఏళ్ల వేట.. చివరకు చిక్కిన మోస్ట్‌వాంటెడ్
వాషింగ్టన్: అమెరికా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న నేరస్తుడిని బ్రిటన్‌లో అరెస్టు చేశారు. 2009లో కాలిఫోర్నియా బయోటెక్నాలజీ సంస్థపై జరిగిన బాంబు దాడి ఘటనలో డేనియల్ ఆండ్రియాస్ ప్రధాన అనుమానితుడు. అమెరికాలో అప్పట్లో అతన్ని మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ల లిస్టులో చేర్చారు.బాంబు దాడి తర్వాత పరారీలో ఉన్న డేనియల్ను బ్రిటన్‌లోని వేల్స్లో అరెస్టు చేసినట్లు ఎఫ్‌బీఐ ప్రకటించింది.బ్రిటన్ పోలీసులు,ఎఫ్‌బీఐ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో డేనియల్ను అరెస్టు చేసినట్లు ఎఫ్‌బీఐ వెల్లడించింది.డేనియల్ 2009 నుంచి పరారీలో ఉన్నా తాము అతడిని వెంబడించడం ఆపలేదని ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే తెలిపారు.2009కు ముందు కూడా డేనియల్ పలు హింసాత్మక ఘటనలకు కారణమయ్యాడన్నఅభియోగాలుండడంతో అతడిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చారు. -
ట్రంప్ టీమ్‌లోకి మరో భారతీయుడు..ఎన్ఐహెచ్ హెడ్‌గా భట్టాచార్య
వాషింగ్టన్:రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ తన టీమ్‌లో వరుసగా ఒక్కొక్కరిని నియమిస్తున్నారు. తాజాగా అమెరికా హెల్త్‌సైన్సెస్ పరిశోధనలకు కీలకమైన నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్) డైరెక్టర్‌గా భారతీయుడైన డాక్టర్ జే భట్టాచార్యను నియమించారు. అమెరికాలో మెడికల్ సైన్సెస్‌లో కీలక పరిశోధనలు చేసే మొత్తం 27 సంస్థలకు ఎన్ఐహెచ్ నుంచే నిధులు కేటాయిస్తారు. ఎన్ఐహెచ్ ఏడాది బడ్జెట్ రూ. 4 లక్షల కోట్ల దాకా ఉంటుందంటే దాని ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు. భట్టాచార్య ప్రస్తుతం స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ మెడికల్ సైన్సెస్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.భట్టాచార్య 1968లో కోల్‌కతాలో జన్మించి అమెరికా వెళ్లారు. కొవిడ్ సమయంలో జో బైడెన్ ప్రభుత్వ పాలసీని తీవ్రంగా విమర్శించిన భట్టాచార్య రిపబ్లికన్లకు దగ్గరయ్యారు. కాగా,ఇటీవలే ట్రంప్ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా ఆర్ఎఫ్కెన్నెడీ జూనియర్ నియమితులైన విషయం తెలిసిందే.ఇప్పటికే భారత సంతతి వ్యాపారవేత్త వివేక్‌రామస్వామి ట్రంప్ టీమ్‌లో ఇలాన్ మస్క్‌తో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డీవోజీఈ) హెడ్ పదవికి ఎంపికైన విషయం తెలిసిందే. -
ట్రాన్స్జెండర్లకు ట్రంప్ షాక్..!
వాషింగ్టన్:అమెరికా రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీటిలో భాగంగా అమెరికా ఆర్మీలో ఉన్న ట్రాన్స్జెండర్లను ట్రంప్ పూర్తిగా తొలగించనున్నట్లు ది సండే టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రమాణస్వీకారం తర్వాత ట్రంప్ ట్రాన్స్జెండర్లను తొలగించే ఫైల్‌పై సంతకం చేయనున్నట్లు తెలిపింది. ఓ వైపు ఆర్మీలోకి కొత్తవారి నియామకం అంతగా లేని ప్రస్తుత సమయంలో ట్రంప్ ట్రాన్స్జెండర్లను తొలగించనుండడం చర్చనీయాంశమవుతోంది. ట్రాన్స్జెండర్లు ఆధునిక ఆర్మీ అవసరాలకు తగినట్లుగా సేవలందించడం లేదని ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించే వారు చెబుతున్నారు. ఈ మేరకు వారు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఆర్మీ నుంచి తొలగించే ముందు ట్రాన్స్జెండర్లకు అన్ని గౌరవాలు ఇచ్చి పంపిస్తారని తెలుస్తోంది.ట్రంప్ తన తొలిటర్ములో కూడా ఇలాంటి వివాదాస్పద నిర్ణయమే తీసుకున్నారు. అయితే ట్రాన్స్ జెండర్లను ఆర్మీలోకి తీసుకోవడాన్ని మాత్రమే ట్రంప్ నిషేధించారు. అప్పటికే ఉన్నవారిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను బైడెన్ అధికారం చేపట్టిన తర్వాత రద్దు చేశారు. కాగా, నవంబర్ 5న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. -
లండన్‌లో హై అలర్ట్.. అమెరికా ఎంబసీ ముందు పార్సిల్ కలకలం
లండన్:బ్రిటన్ రాజధాని లండన్‌లో హైఅలర్ట్ పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం (నవంబర్22) నగరంలో అమెరికా ఎంబసీ కార్యాలయం బయట ఒక అనుమానాస్పద ప్యాకేజీ కలకలం సృష్టించింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ద్వారా ప్యాకేజ్‌ను నిర్వీర్యం చేశారు. ఆ ప్యాకేజీ ఎక్కడినుంచి వచ్చిందనేదానిపై లండన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అమెరికా ఎంబసీ వెల్లడించింది.మరోవైపు గాట్విక్ ఎయిర్‌పోర్టులో భద్రతాపరమైన ఘటన ఇంకొకటి జరిగింది.దీంతో ఎయిర్‌పోర్టు దక్షిణ టెర్మినల్‌ను ఖాళీ చేయించామని అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే రష్యా- ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం నేపథ్యంలో మాస్కో, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి.ఈ క్రమంలోనే అమెరికాలోని డిఫెన్స్ కంపెనీలపై రష్యా దాడులు చేసే అవకాశముందని ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.ఈ మేరకు నేషనల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సెంటర్ ఓ ప్రకటనను విడుదల చేసింది. -
ఉక్రెయిన్ను రష్యా ఏం చేయబోతోంది.? ఖాళీ అవుతున్న ఎంబసీలు
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏ మలుపు తిరుగుతుందోనని ప్రపంచ దేశాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఉక్రెయిన్‌పై రష్యా మున్ముందు ఎలాంటి దాడులు చేస్తుందోనని పలు దేశాలు అప్రమత్తమవుతున్నాయి.ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో రాయబార కార్యాలయాన్ని మూసేసిన అమెరికా బాటలోనే పలు దేశాలు కూడా నడుస్తున్నాయి.ఇటలీ ,గ్రీస్,స్పెయిన్లు కూడా కీవ్‌లోని తమ ఎంబసీలను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది. కీవ్‌లోని తమ ఎంబసీపై రష్యా భారీ వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉందనే సమాచారం అందడంతో వెంటనే దానిని అమెరికా తాత్కాలికంగా మూసివేసింది. నవంబర్ 20న దాడి జరగబోతోందని తమకు అందిన కచ్చితమైన సమాచారంతోనే ఎంబసీ ఖాళీ చేసినట్లు అమెరికా వెల్లడించింది. ఈ క్రమంలోనే ఇటలీ, గ్రీస్, స్పెయిన్లు తమ ఎంబసీలను తాత్కాలికంగా మూసివేశాయి.కాగా,రష్యా అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే కీలక ఫైల్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా సంతకం చేసిన సంగతి తెలిసిందే.అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే రష్యా పరిగణించనుంది. -
టెన్షన్..టెన్షన్: హాట్‌లైన్‌పై రష్యా సంచలన ప్రకటన
మాస్కో:అమెరికా-రష్యా మధ్య అత్యవసర కమ్యూనికేషన్‌కు కీలకమైన హాట్‌లైన్ వ్యవస్థ ఇప్పుడు అందుబాటులో లేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. అమెరికా,రష్యాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తితే రెండు దేశాల అధ్యక్షులు చర్చించేందుకు ఓ సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉందని,ఇది వీడియో కూడా ప్రసారం చేయగలదని పెస్కోవ్ గతంలో చెప్పారు.అయితే ప్రస్తుతం ఇది వినియోగంలో లేదని తాజాగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు పెస్కోవ్ సమాధానమిచ్చారు. కాగా,రష్యాపై అమెరికా తయారీ లాంగ్రేంజ్ మిసైల్స్ వాడేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు బైడెన్ అనుమతివ్వడంతో యూరప్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి.దీనికి ప్రతిగా అణ్వాయుధాల ప్రయోగంపై నిబంధనలను రష్యా సరళతరం చేసింది.ఈ పరిణామాల నడుమ మంగళవారం(నవంబర్ 19) కీవ్ దళాలు రష్యా ప్రధాన భూభాగంపై క్షిపణులతో దాడులు చేశాయి.ఇందుకు ప్రతీకారంగా ఉక్రెయిన్‌పై మాస్కో దళాలు దాడి చేయవచ్చనే భయాలు పెరిగిపోయాయి. దీంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని తన దౌత్య కార్యాలయాన్ని అమెరికా ఖాళీ చేసింది.ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా,రష్యా మధ్య హాట్‌లైన్ వాడకంలో లేదన్న వార్త మరింత భయాందోళనలకు కారణమవుతోంది. -
అమెరికాలో అన్మోల్ బిష్ణోయ్ అరెస్టు.. భారత్‌కు అప్పగించేది అప్పుడే..
కాలిఫోర్నియా/ముంబయి:గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో అరెస్టైనట్లు సమాచారం. సోమవారం(నవంబర్ 18) తెల్లవారుజామున అన్మోల్ను కాలిఫోర్నియాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.తొలుత అమెరికా పోలీసులు అన్మోల్ను విచారించిన తర్వాత ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్సింగ్నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులకు అప్పగించే అవకాశం ఉందని ముంబై క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు చెబుతున్నారు. తర్వాతే భారత్‌కు అన్మోల్ను అప్పగిస్తారని ముంబై పోలీసులు భావిస్తున్నారు. గతేడాది తన అన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్‌బిష్ణోయ్ అరెస్టయిన తర్వాత అన్మోల్ భారత్ వదిలి అమెరికా పారిపోయాడు. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటనతో పాటు పంజాబ్ సింగర్ సిద్ధు మూసేవాలా హత్య సహా పలు కేసుల్లో అన్మోల్ నిందితుడిగా ఉన్నాడు.ఇతడి సూచనల మేరకే ఇటీవల ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని హత్య చేసినట్లు పట్టుబడ్డ నిందితులు వెల్లడించిన విషయం తెలిసిందే. అన్మోల్కు సంబంధించిన సమాచారమిస్తే రూ.10 లక్షలిస్తామని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. -
పోలీస్ వర్సెస్ ప్రభాకర్‌రావు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన ఆ విభాగం మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావును అమెరికా నుంచి రప్పించడానికి పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని తిప్పికొట్టడానికి ప్రభాకర్‌రావు కూడా అక్కడి నుంచే పావులు కదుపుతున్నారు. దీనితో పోలీసులు వెర్సస్ ప్రభాకర్‌రావు అన్నట్టుగా మారింది. పరిణామాలను గమనించి అమెరికా వెళ్లిపోయి.. ఎస్ఐబీకి సుదీర్ఘకాలం నేతృత్వం వహించిన టి.ప్రభాకర్‌రావు గత ఏడాది డిసెంబర్ 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసిన వెంటనే రాజీనామా చేశారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు, తర్వాతి పరిణామాలను గమనించిన ఆయన... ఈ ఏడాది మార్చిలో తిరుపతి వెళ్లి, అటు నుంచే చెన్నై మీదుగా అమెరికా వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడి టెక్సాస్‌లో ఉండి, వైద్యం చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది.ప్రభాకర్‌రావు తనపై అరెస్టు వారెంట్ జారీ చేయవద్దంటూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సమయంలో... తాను వైద్యం కోసం అమెరికా వచ్చానని, షెడ్యూల్ ప్రకారం జూన్ 26న తిరిగి వస్తానని వివరణ ఇచ్చారు. జూలైలో ఈ–మెయిల్ ద్వారా దర్యాప్తు అధికారికి లేఖ రాసిన ఆయన... తనపై తప్పుడు కేసు, నిరాధార ఆరోపణలతో ఏర్పడిన మానసిక వేదన కారణంగా ఆరోగ్యం మరింత క్షీణించిందని, ఇప్పట్లో తిరిగి రాలేనని స్పష్టం చేశారు. అప్పటి నుంచి పోలీసులు ఆయనపై రెడ్ కార్నర్ నోటీసుల జారీ కోసం ప్రయత్నాలు చేస్తూనే.. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖతోనూ (ఎంఈఏ) సంప్రదింపులు జరుపుతున్నారు. తొలుత పాస్‌పోర్ట్ ఇంపౌండ్ చేయించి... రాష్ట్ర పోలీసులు తొలుత రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం (ఆర్పీఓ) ద్వారా ప్రభాకర్‌రావు, మరో నిందితుడు శ్రవణ్‌రావుల పాస్‌పోర్టులను ఇంపౌండ్ (సస్పెన్షన్) చేయించారు. ఆపై ప్రభాకర్‌రావు పాస్‌పోర్టును పూర్తిగా రద్దు చేయాలంటూ మరో ప్రతిపాదన పంపారు. ప్రస్తుతం ఆ ఫైల్ విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) వద్ద పెండింగ్‌లో ఉంది. ప్రభాకర్‌రావు తన న్యాయవాదుల ద్వారా పాస్‌పోర్టు ఇంపౌండ్ చేయడాన్ని ఎంఈఏ జాయింట్ సెక్రటరీ వద్ద సవాల్ చేశారు. ఈ వివాదం పరిష్కారమైతే తప్ప పాస్‌పోర్టు రద్దుపై నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం లేదు. అయితే ఎవరైనా వ్యక్తిపై చార్జ్‌షీట్ దాఖలు కావడం, న్యాయస్థానం తగిన ఆదేశాలు జారీ చేయడం, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడం జరిగితే.. పాస్‌పోర్టు ఇంపౌండ్, రద్దుకు అవకాశం ఉంటుంది. ప్రభాకర్‌రావు విషయంలో ఈ మూడూ జరిగిన నేపథ్యంలో.. ఆయన పాస్‌పోర్టు త్వరలోనే రద్దవుతుందని పోలీసులు భావిస్తున్నారు. రద్దయినా ఇప్పట్లో రావడం కష్టమే! ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు రద్దు అయినా ఆ సమాచారం ఎంఈఏ, ఇమిగ్రేషన్ అధికారుల వద్ద మాత్రమే ఉంటుంది. ఆయన అమెరికా నుంచి మరో దేశానికి రాకపోకలు సాగించినా దీని ద్వారా గుర్తించలేరు. కేవలం పాస్‌పోర్టు పేజీలు అయిపోవడం, గడువు తీరిపోవడం, పోగొట్టుకోవడం వంటివి జరిగి.. ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయానికి వెళ్లినప్పుడు మాత్రమే అధికారులు దాన్ని స్వా«దీనం చేసుకుంటారు. ఎమర్జెన్సీ సర్టిఫికెట్ జారీ చేయడం ద్వారా బలవంతంగా భారత్‌కు పంపుతారు. అలా కాకుండా ప్రభాకర్‌రావు తనంతట తానుగా తిరిగి వస్తే.. విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగిస్తారు. ప్రభాకర్‌రావును అమెరికా ప్రభుత్వమే తిప్పిపంపాలంటే మాత్రం పాస్‌పోర్టు రద్దు తర్వాత కేంద్ర హోంశాఖ (ఎంహెచ్ఏ) ద్వారా అమెరికా దేశ ఏజెన్సీలను సంప్రదించాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. వీసాలో గడువులో మతలబులు ఎన్నో... కొన్నేళ్లుగా తరచూ అమెరికాకు వెళ్లి వస్తున్న, కుటుంబీకులు అక్కడే ఉంటున్న ప్రభాకర్‌రావు వంటి వారికి సాధారణంగా 10 నుంచి 15 ఏళ్ల గడువుతో కూడిన వీసాలు లభిస్తుంటాయి. అయితే ఒకసారి ఆ దేశంలో అడుగుపెట్టిన తర్వాత గరిష్టంగా 180 రోజులలోపు తిరిగి వెళ్లాలనే నిబంధన ఉంది. దీనితో ప్రస్తుతం ఆయన 179 రోజులు అక్కడ ఉండి.. సమీపంలోని కెనడా, లేదా మరో దేశానికి కొన్ని రోజులు వెళ్లి రావొచ్చు. అలా మరో 179 రోజులు అమెరికాలో ఉండొచ్చు. అయితే ప్రభాకర్‌రావు వైద్యం చేయించుకుంటున్న నేపథ్యంలో వీసా గడువు తేలిగ్గా పొడిగించుకునే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి. -
ట్రంప్ రాజకీయం.. ఇండియన్ అమెరికన్ నేత నిక్కీ హేలీకి బిగ్ షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత కీలక నిర్ణయాలు తీసకుంటున్నారు. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ ప్రచార వ్యూహకర్తను సుజీ వైల్స్‌ను వైట్‌హౌజ్ స్టాఫ్ చీఫ్‌గా ట్రంప్ నియమించారు. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి తనతో పోటీ పడిన నిక్కీ హేలీ వైట్‌హౌజ్ కార్యవర్గంలోకి తీసుకోబోనని ట్రంప్ స్పష్టం చేశారు. హేలితో పాటు మైక్ పాంపియోను కూడా తీసుకోవడం లేదని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్టు చేశారు.‘నిక్కీ హేలీ, మైక్ పాంపియోను నూతన కార్యవర్గంలోకి ఆహ్వానించడం లేదు. గతంలో వారితో కలిసి పనిచేయడం చాలా ఆనందానిచ్చింది. దేశానికి వారు చేసిన సేవకు ధన్యవాదాలు’ అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.కాగా, ట్రంప్ పోస్టుపై నిక్కీ హేలీ స్పందించారు. గతంలో ట్రంప్‌తో కలిసి పనిచేయడం తనకు ఆనందాన్నిచ్చిందని, అమెరికాను ట్రంప్ మరింత ముందుకు తీసుకువెళ్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: అరిజోనాలోనూ ట్రంప్ గెలుపు -
ఫోన్‌ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. ప్రభాకర్‌రావుకు అమెరికాలో గ్రీన్‌కార్డు?
సాక్షి,హైదరాబాద్:ఫోన్ ట్యాపింగ్ కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటివరకు విచారణకు హాజరుకాని ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు తాజాగా అమెరికాలో గ్రీన్ కార్డు వచ్చినట్లు సమాచారం. అమెరికాలో సెటిల్ అయిన కుటుంబసభ్యుల ద్వారా ఆయన కొద్దిరోజుల క్రితమే గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరయినట్టు తెలుస్తోంది.గ్రీన్ కార్డు మంజూరు విషయం తెలిసి ఫోన్‌ట్యాపింగ్ కేసు దర్యాప్తు అధికారులు ఈ విషయమై ఆరా తీశారు. ప్రభాకర్‌రావుకు గ్రీన్‌కార్డు లభించడంతో దర్యాప్తులో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు పై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు.కాగా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్‌ట్యాపింగ్ జరిగిందని ఆరోపిస్తూ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో గతంలో ఇంటెలిజెన్స్‌లో పనిచేసిన పలువురు పోలీసు అధికారులను అరెస్టు చేసి విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును కూడా విచారించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ ఆయన అమెరికా వెళ్లిపోవడంతో అది సాధ్యం కాలేదు. ఇదీ చదవండి: కేసు పెడితే పెట్టుకో.. దేనికైనా రెడీ: కేటీఆర్ -
అమెరికా నుంచి లారెన్స్‌బిష్ణోయ్ తమ్ముడి బెదిరింపులు
న్యూఢిల్లీ:గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్‌పై గురుగ్రామ్‌లో బెదిరింపుల కేసు నమోదైంది. భీమ్‌సేన చీఫ్ సత్పల్ తన్వర్‌ను విదేశాల నుంచి బెదిరించినందుకు అన్మోల్‌పై కేసు రిజిస్టర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తన్వర్‌ను ముక్కలుముక్కలుగా నరికేస్తామంటూ అన్మోల్ గ్యాంగ్ బెదిరించినట్లు సమాచారం.అన్మోల్ జింబాబ్వే,కెన్యా ఫోన్ నెంబర్లను వాడుతూ అమెరికా, కెనడాల నుంచి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు.ఈ కేసులో దర్యాప్తు కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అన్మోల్ను భారత్ తీసుకు రావడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.కాగా, అన్మోల్ బిష్ణోయ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.అతడి ఆచూకీ తెలిపితే రూ.10 లక్షల రివార్డు ఇస్తామని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్ఐఏ) పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. ఇదీ చదవండి: భీమ్ ఆర్మీచీఫ్ ప్రయాణిస్తున్న వందేభారత్ రైలుపై దాడి -
అమెరికా కొత్త ఆంక్షలు!
అనుకున్నది సాధించటం కోసం, మాట వినని దేశాలను దారికి తెచ్చుకోవటం కోసం ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించటం అమెరికాకు అలవాటైన విద్య. దాన్ని సహేతుకంగా వినియోగిస్తున్నామా... ఆశించిన ఫలితాలు వస్తున్నాయా దుష్పరిణామాలు పుట్టుకొస్తున్నాయా అనే ఆలోచన దానికి ఎప్పుడూ రాలేదు. ‘ప్రపంచంలో అగ్రజులం, మన మాట చెల్లుబాటు కావాలంతే...’ అన్న పట్టింపే అధికం. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి తోడ్పడుతున్నారని ఆరోపిస్తూ ప్రపంచవ్యాప్తంగా 400 సంస్థలపైనా, వ్యక్తులపైనా ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. ఇందులో మన దేశానికి సంబంధించి 19 ప్రైవేటు సంస్థలున్నాయి. ఇంకా ఈ జాబితాలో చైనా, మలేసియా, థాయ్‌లాండ్, తుర్కియే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తదితరాలున్నాయి. ఈ దేశాలన్నీ రష్యాకు ఉపకరణాలు, విడిభాగాలు పంపుతున్నాయనీ, వీటితో ఆయుధాలకు పదునుపెట్టుకుని రష్యా ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధం కొనసాగిస్తోందనీ అమెరికా ఆరోపణ. వీటిల్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, విమాన విడిభాగాలూ ఉన్నాయంటున్నది. పరాయి దేశాలపై ఆంక్షలు విధించేందుకు ఏ దేశానికైనా హక్కుంటుంది. కానీ ఆ దేశాలతో ఉన్న స్నేహసంబంధాలూ, ద్వైపాక్షిక ఒప్పందాలూ వగైరా చూసుకోవటం, అంతకుముందు సంబంధిత దేశాలతో చర్చించటం కనీస మర్యాద. అమెరికా ఎప్పుడూ ఈ మర్యాద పాటించిన దాఖలా లేదు.ఎప్పుడూ స్వీయప్రయోజనాలే పరమావధిగా భావించే అమెరికా తన విదేశాంగ విధాన లక్ష్యాలను నెరవేర్చుకోవటానికి ఆంక్షల్ని ఆయుధంగా మలుచుకోవటం పాత కథే. అయితే ఈమధ్యకాలంలో ఇది బాగా ముదిరిందని ఒక అధ్యయనం చెబుతోంది. దాని ప్రకారం మొదటి ప్రపంచయుద్ధానికీ (1914–18), 2000 సంవత్సరానికీ మధ్య అమెరికా 200కు పైగా ఆంక్షలు విధించిందని తేలింది. చిత్రంగా అటు తర్వాత ఈ రెండు దశాబ్దాలపైగా కాలంలో ఈ ఆంక్షలు తొమ్మిదిరెట్లు పెరిగాయని ఆ అధ్యయనం వివరిస్తోంది. అంటే ఎనిమిది దశాబ్దాల కాలంలో అమెరికా విధించిన ఆంక్షల సంఖ్య చాలా స్వల్పం. జాతీయ భద్రత, విదేశాంగ విధానం, ఆర్థికాంశాలు... ఒకటేమిటి అనేకానేక అంశాల విషయంలో ఈ ఆంక్షల జడి పెరిగిపోయింది. క్యూబా, వెనెజులా, ఇరాన్, ఇరాక్ తదితర దేశాలు ఈ ఆంక్షల పర్యవసానాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. అసలు అవతలి దేశంనుంచి ఆశిస్తున్నదేమిటో చెప్పకుండానే వీటిని వినియోగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సాఫల్య వైఫల్యాలను అమెరికా గమనంలోకి తీసుకుంటున్నదా లేదా అనే సంశయం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈ మొత్తం ఆంక్షలవల్ల నెరవేరిన ప్రయోజనాలు ఆశించిన లక్ష్యాల్లో 34 శాతం దాటవన్నది ఆ అధ్యయన సారాంశం. ఈ ఆంక్షలు వికటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఇరాక్‌లో రసాయన ఆయుధాలున్నాయని ప్రపంచాన్ని నమ్మించి ఆ దేశంపై దండెత్తిన అమెరికా అంతకుముందూ ఆ తర్వాత దాన్ని ఆంక్షల చక్రబంధంలో బంధించింది. అందువల్ల పసిపిల్లలకు పాలడబ్బాలు మొదలుకొని ప్రాణావసరమైన ఔషధాల వరకూ ఎన్నో నిత్యావసరాలు కరువై లక్షలమంది మృత్యువాత పడ్డారు. తాను ఆంక్షలు విధించటంతో సరిపెట్టక మిత్రులైన పాశ్చాత్య దేశాలను కలుపుకోవటం అమెరికా విధానం. అంతా అయినాక, ఇరాక్ పాలకుడు సద్దాం హుస్సేన్ ఉసురు తీశాక అక్కడ రసాయన ఆయుధాలున్నాయనటం పచ్చి అబద్ధమని తేలింది. మరి లక్షలమంది జనం ఉసురు తీసిన పాపం ఎవరిది? ఇరాన్లో సరేసరి... అక్కడ తన అనుకూలుడైన ఇరాన్ షా పదవీ భ్రష్టుడైంది మొదలుకొని ఆంక్షల పరంపర కొనసాగిస్తూనే ఉంది. ఇందువల్ల మన దేశం సైతం ఆర్థికంగా ఎంతో నష్టపోవాల్సి వచ్చింది. అందుకే ఈ అర్థరహిత ఆంక్షల్ని దాటుకుని, నష్టం కనిష్ట స్థాయిలో ఉండేలా తెలివిగా వ్యవహరించే దేశాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఉదాహరణకు 2017–2021 మధ్య యూరప్ దేశాలకు రష్యాతో ఉన్న వాణిజ్యం ఉక్రెయిన్ యుద్ధం తర్వాత 5 శాతం తగ్గింది. అదే సమయంలో రష్యాకు ఆర్మేనియా, యూఏఈ, కజఖ్‌స్తాన్, ఉజ్బెకిస్తాన్, హాంకాంగ్‌లతో వాణిజ్యం పెరిగింది. మరోపక్క ఈ దేశాలన్నిటితో యూరప్ దేశాల వాణిజ్యం ఎన్నో రెట్లు పెరిగింది. అంటే రష్యానుంచి కొనుగోలు చేస్తున్న సరుకంతా ఈ దేశాలు యూరప్ దేశాలకు తరలిస్తున్నాయి. ఇక ఆంక్షల ప్రయోజనం ఏం నెరవేరినట్టు? రష్యా నుంచి మన ముడి చమురు దిగుమతులు భారీగా పెరగటం, యూరప్ దేశాలకు శుద్ధిచేసిన చమురునూ, గ్యాస్‌నూ మన దేశం విక్రయించటం ఇటీవలి ముచ్చట.అసలు ఆంక్షల వల్ల ఒరిగేది లేకపోగా నష్టం ఉంటుందని అమెరికా గుర్తించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. భారత్ మిత్రదేశం. అసలే అమెరికాలో స్థిరపడిన ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర విషయంలో ఇటీవల సంబంధాలు దెబ్బతిన్నాయి. అవి మరింత దిగజారేలా ఆంక్షలకు దిగటం నిజంగా ప్రయోజనాన్ని ఆశించా లేక నాలుగురోజుల్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో గొప్పలు చాటుకోవటానికా అన్నది అర్థంకాని విషయం. ఒకపక్క ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను నిలువరించటం కోసమని తనకు తోచినట్టు చేసుకుపోతున్న అమెరికా... గాజా, వెస్ట్‌బ్యాంక్, లెబనాన్లలో రోజూ వందలమందిని హతమారుస్తున్న ఇజ్రాయెల్ విషయంలో ఎందుకు నోరెత్తటం లేదు? తనవరకూ అమలు చేసుకుంటూ పోతానంటే అమెరికా విధించిన ఆంక్షలపై ఎవరికీ పెద్దగా అభ్యంతరం ఉండదు. కానీ అదే పని అందరూ చేయాలని శాసించటం తెలివితక్కువతనం. ఈ ఇంగితజ్ఞానం అమెరికాకు ఎప్పటికి అలవడుతుందో?! -
పరువుచేటు పనులు!
అంతర్జాతీయంగా సంచలనం సృష్టించే హత్యలూ, హత్యాయత్నాలూ ఒక్కోసారి ఉలిక్కిపడేలా చేస్తాయి. వాటి వెనక ప్రభుత్వాల ప్రమేయం ఉన్నదన్న అనుమానాలు తలెత్తితే అవి మరింత ఆసక్తిని రేకెత్తిస్తాయి. చాలా సందర్భాల్లో అవి దేశాలమధ్య చిచ్చు రేపుతాయి. ఇలాంటి ఆపరేషన్లను గుట్టుచప్పుడు కాకుండా చేయడంలో ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ఆరితేరింది. చేతికి నెత్తురంటకుండా, సాక్ష్యాధారాలేమీ మిగలకుండా ప్రత్యర్థులను మట్టుబెట్టడంలో ఆ సంస్థ తర్వాతే ఎవరినైనా చెప్పుకోవాలి. అలాంటి ఉదంతంలో ఇప్పుడు మన దేశం పేరు వినబడటం ఆశ్చర్య కరమే. అమెరికాలో స్థిరపడిన ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై హత్యాయత్నం కేసులో అమెరికాలో దాఖలైన తాజా నేరారోపణ పత్రం ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. నిజానికి ఏడాదికాలంగా ఆ పంచాయతీ నడుస్తోంది. నేరుగా భారత్‌ను నిందించక పోయినా నిరుడు మే నెలలో దాఖలు చేసిన నేరారోపణ పత్రం తమ గడ్డపై తమ పౌరుడిని హత్య చేసేందుకు జరిగిన ప్రయత్నం వెనక ‘భారత ప్రభుత్వంలో పనిచేసే ఒక ఉద్యోగి ప్రమేయం ఉన్నద’ంటూ ఆరోపించింది. అప్పట్లో ఆ ఉద్యోగి పేరు వెల్లడించకుండా ‘సీసీ 1’గా మాత్రమే ప్రస్తావించింది. కానీ శుక్రవారం అమెరికా న్యాయశాఖ అతని పేరు వికాస్ యాదవ్ అనీ, భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)లో ఇంతక్రితం పనిచేశాడనీ వెల్లడించింది. వికాస్ యాదవ్ ప్రస్తుతం భారత ప్రభుత్వ ఉద్యోగి కాదని నేరారోపణ పత్రం చెప్పటం... భారత ప్రభుత్వం ఈ కేసులో తమకు సహకరిస్తున్నదని విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అనటం ఉన్నంతలో ఊరట. తమ దేశంలో స్థిరపడిన ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉన్నదని ఒకపక్క కెనడా ఆరోపిస్తున్న తరుణంలో అమెరికా సైతం ఇదే తరహా ఆరోపణ చేయటం గమనించదగ్గది. ఎన్నికల్లో సిక్కు ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని కెనడా ప్రధాని ట్రూడో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేసిన మన దేశానికి తాజా పరి ణామం ఇబ్బంది కలిగిస్తుందనటంలో సందేహం లేదు. ఎందుకంటే గురుపత్వంత్ను హతమార్చ టానికి ఏమేం చేయాలో నిందితులు చర్చించుకున్న సందర్భంలోనే నిజ్జర్ హత్యను జయప్రదంగా పూర్తిచేయటం గురించిన ప్రస్తావన వచ్చింది. ఇలాంటి వ్యవహారాలు చక్కబెట్టే వారికి వేయి కళ్లుండాలి. తాము ఎవరిని సంప్రదిస్తున్నామోక్షుణ్ణంగా తెలిసివుండాలి. కానీ ఆ సమయంలో రా సీనియర్ అధికారిగా ఉన్న వికాస్ యాదవ్ మాదకద్రవ్య ముఠాలతో సంబంధాలుండే నిఖిల్ గుప్తాకు గురుపత్వంత్ను అంతంచేసే బాధ్యత అప్పగించటం, గుప్తా దాన్ని కాస్తా కిరాయి హంతకుడనుకున్న మరో వ్యక్తికి ఇవ్వటంతో కథ అడ్డం తిరిగింది. నిఖిల్ గుప్తా చెక్ రిపబ్లిక్లో దొరికిపోవటం, అతన్ని ఆ దేశం అమెరికాకు అప్పగించటం పర్యవసానంగా మొత్తం పథకం బట్టబయలైంది. కిరాయి హంతకుడనుకున్న వ్యక్తి కాస్తా అమెరికా మాదకద్రవ్య నిరోధక విభాగం ఏజెంటు. ఆ సంగతి తెలియక హత్య కోసం అతనితో లక్ష డాలర్లకు కాంట్రాక్టు కుదుర్చుకోవటం, అందులో 15 వేల డాలర్లు చెల్లించటం నిఖిల్ గుప్తాతోపాటు వికాస్ మెడకు చుట్టుకుంది. అది మన దేశ ప్రతిష్ఠకు కూడా మచ్చ తెచ్చింది. వికాస్ సాధారణ అధికారి కాదు. రా సంస్థకు ముందు ఆయన సీఆర్పీఎఫ్లో పనిచేశాడు. వికాస్‌ను సర్వీసునుంచి తొలగించి అతనికోసం గాలిస్తున్నామని మన ప్రభుత్వం ఇచ్చిన వివరణకు అమెరికా సంతృప్తి చెందింది. ‘రా’లో ఉన్నతాధికారులకు చెప్పకుండా వికాస్ యాదవ్ ఇలాంటి పెడధోరణులకు పాల్పడ్డాడని మన ప్రభుత్వం చెబుతోంది. విదేశాల్లో గూఢచర్యం ఆషామాషీ కాదు. అలాంటి పనిలో నిమగ్నమైవుండేవారు ఉన్నతాధి కారులకు తమ కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు వర్తమానం అందిస్తే వేరే విషయం. చెప్పినా చెప్ప కున్నా అంతా సవ్యంగా జరిగితే రివార్డులు దక్కవచ్చేమో. కానీ వికటిస్తే ఆ అధికారితోపాటు దేశం పరువు కూడా పోతుంది. గురుపత్వంత్ ఖలిస్తాన్ వేర్పాటువాదే కావొచ్చు. ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తే అయివుండొచ్చు. మన దేశంలో కేసులుంటే తమకు అప్పగించాలని అమె రికాను కోరాలి. ఆ దేశ పౌరుడిగా అక్కడే స్థిరపడిన వ్యక్తిపై అంతకుమించి ఏదో సాధించాలను కోవటం తెలివితక్కువతనం. అసలు ఒక వ్యక్తిని భౌతికంగా లేకుండా చేసినంత మాత్రాన ఉద్యమం ఆగిపోతుందా? అతని సహచరులు భయకంపితులై ఉద్యమానికి దూరమవుతారా? ఏం సాధిద్దా మని వికాస్ ఇలాంటి పనికి సిద్ధపడ్డాడో తేల్చటం అవసరం. వికాస్ యాదవ్ విషయంలో ఇంత పట్టుదలగా పనిచేస్తున్న అమెరికా చరిత్ర కూడా తక్కువేమీ కాదు. 2003 నాటి రవీందర్ సింగ్ వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. ‘రా’లో సంయుక్త కార్య దర్శిగా ఉన్న రవీందర్ అమెరికా గూఢచార సంస్థ సీఐఏకు డబుల్ ఏజెంటుగా పనిచేసి పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ వగైరా దేశాల్లో రా కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం అందజేశాడు. తనసంగతి బయటపడిందని గ్రహించగానే కుటుంబంతో సహా మాయమై అమెరికాలో తేలాడు. వారికి అక్కడ మారు పేర్లతో పాస్‌పోర్టులు కూడా మంజూరయ్యాయి. విచిత్రంగా మన దేశం అతన్ని అప్పగించాలని పట్టుబట్టలేదు. ఉద్యోగంనుంచి తొలగించి అధికార రహస్యాల చట్టం కింద కేసు పెట్టడంతో సరిపెట్టింది. 2016లో ఒక రోడ్డు ప్రమాదంలో రవీందర్ మరణించాడని అంటున్నా దాన్ని ధ్రువీకరించే సమాచారం మన ప్రభుత్వం దగ్గరలేదు. మొత్తానికి గూఢచర్యం వికటిస్తే ఏమవుతుందో వికాస్ యాదవ్ ఉదంతం తెలియజెబుతోంది. -
జేబులో తుపాకీ..‘యూఎస్’లో హాట్‌టాపిక్ ఇదే
అమెరికాలో గన్‌కల్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వారు సామాన్యులపైకి తుపాకులు ఎక్కుపెడుతుంటారు. వ్యక్తిగత, ఆర్థిక, విద్వేషం,జాాత్యహంకారం ఇలా కారణమేదైనా కావొచ్చు బహిరంగ ప్రదేశాల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయకుల ప్రాణాలను అకారణంగా గాల్లో కలిపేస్తుంటారు. ఇలాంటి ఉన్మాద కాల్పులు అగ్రదేశంలో తరచూ జరుగుతూనే ఉంటాయి.సామాన్యుల మరణాలకు కారణమవుతున్న తుపాకులు దేశంలో అందరూ యథేచ్చగా వాడొచ్చా..వాటి విచ్చలవిడి అమ్మకాలపై నియంత్రణ ఉండాలా వద్దా అనే చర్చ అమెరికాలో ఎప్పటినుంచో జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ఇది హాట్‌టాపిక్‌గా మారింది. హారిస్ ఏమంటున్నారు..గన్ల విచ్చలవిడి అమ్మకాన్ని నిషేధించాలనే వాదనకు తన మద్దతుంటుందని అధ్యక్ష పోరులో తలపడుతున్న డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్ ఇప్పటికే స్పష్టం చేశారు.ఇక రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ట్రంప్ స్టాండ్ ఈ విషయంలో మరోలా ఉంది. వెనక్కు తగ్గని ట్రంప్..ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఏకంగా తనపైనే కాల్పులు జరిగినా ట్రంప్ వెనక్కు తగ్గడం లేదు. తుపాకులు ఎవరికి పడితే వారికి అమ్మడాన్ని ఆయన మద్దతిస్తున్నారు. ఇంకో అడుగు ముందుకేసి బైడన్ హయాంలో గన్ల నియంత్రణపై తెచ్చిన చట్టాలేవైనా ఉంటే వాటిని తాను పవర్లోకి రాగానే రద్దు చేస్తానని కూడా తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు మద్దతిస్తున్న టెక్ బిలియనర్, టెస్లా అధినేత ఇలాన్ మస్క్ గన్ కల్చర్‌పై ఒక ట్వీట్ చేశారు. మద్దతిస్తే 100 డాలర్లు.. ‘మస్క్’ వింత ఆఫర్ పెన్సిల్వేనియాలో ఓటర్‌గా నమోదై ఉండి వాక్స్వాతంత్రం, అందరూ తుపాకులు కలిగి ఉండడం అనే అంశాలకు మద్దతిస్తున్నవారందరికీ మస్క్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ అంశాలకు మద్దతుగా రూపొందించిన తమ పిటిషన్‌పై సంతకం పెడితే 100 డాలర్లు బహుమతిగా ఇస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు. If you’re a registered Pennsylvania voter, you & whoever referred you will now get $100 for signing our petition in support of free speech & right to bear arms.Earn money for supporting something you already believe in!Offer valid until midnight on Monday.— Elon Musk (@elonmusk) October 18, 2024 గన్ కల్చర్ ఎఫెక్ట్.. అమెరికాలో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనలివీ..ఓక్లహామాలోని ఓక్లహామా నగరంలో ఇటీవల రెండురోజుల్లో వరుసగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు.అలబామా రాష్ట్రం బర్మింగ్హమ్లోని ఓ నైట్ క్లబ్లో జరిగిన బహిరంగ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. డజను మందికిపైగా గాయపడ్డారు.టెక్సాస్‌లోని అలెన్‌లో ఓ షాపింగ్ సెంటర్లో దుండగుడు జరిపిన బహిరంగ కాల్పుల్లో 8 మంది మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు.చివరికి పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు మరణించాడు.ఇదీ చదవండి: హారిస్ సారీలు..హామీలు -
ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు అమెరికాతో భారత్ కీలక ఒప్పందం
దేశ రక్షణ రంగాన్ని పటిష్టం చేసే దిశగా అమెరికా, భారత్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. మన సాయుధ బలగాల నిఘా సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు అమెరికా నుంచి అత్యాధునిక సాయుధ ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. వీటి విలువ రూ. 32,000 కోట్లు కాగా ఈ డీల్ కింద భారతదేశంలో మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎమ్ఆర్ఓ) సదుపాయాన్ని నెలకొల్పడంతో పాటు యూఎస్ నుంచి మొత్తం 31 MQ-9B హై ఆల్టిట్యూడ్ డ్రోన్లను భారత్ కొనుగోలు చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌కు గత వారం క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) అనుమతి ఇచ్చింది. మొత్తం 31 డ్రోన్లలో 15 భారత నావికాదళానికి వెళ్తాయి. మిగిలినవి వైమానిక దళం, ఆర్మీల మధ్య సమంగా విభజించనున్నారు.కాగా డెలావేర్లో జరిగిన క్వాడ్ లీడర్స్ సదస్సు సందర్భంగా డ్రోన్ల కొనుగోలుకు సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య చర్చలు జరిగిన నెలలోపే ఈ పరిణామం చోటుచేసుకుంది. అంతేగాక ఈ డీల్ మొత్తం విలువ రూ.34,500 కోట్లకు పెరగే అవకాశం ఉంది. చెన్నై సమీపంలోని ఐఎన్ఎస్ రాజాలి, గుజరాత్‌లోని పోర్బందర్, ఉత్తరప్రదేశ్‌లోని సర్సావా మరియు గోరఖ్‌పూర్‌తో సహా నాలుగు సాధ్యమైన ప్రదేశాలలో భారతదేశం డ్రోన్లను ఉపయోగించనుంది.అయితే చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి ఉంచేందుకు ఈ డ్రోన్లు అవసరమని భారత్ భావిస్తోంది. ఈ డ్రోన్లు గరిష్టంగా గంటకు 442 కిమీ వేగంతో, దాదాపు 50,000 అడుగుల ఎత్తులో ఎగురుతాయి. సుమారు 40 గంటలకుపైగా గాల్లో ఉండగలవు. నాలుగు హెల్ఫైర్ క్షిపణులను, 450 కిలోల బాంబులను మోసుకెళ్లగలవు. ఇప్పటికే భారత్ వీటిల్లో మరోరకమైన సీగార్డియన్ డ్రోన్లను వినియోగిస్తోంది. వీటిని కూడా జనరల్ అటామిక్స్ నుంచి లీజ్‌పై భారత్ తీసుకొంది. ఈ ఏడాది జనవరిలో కాంట్రాక్టు ముగియగా.. మన నౌకాదళం మరో నాలుగేళ్లపాటు దీనిని పొడిగించింది. -
హెజ్బొల్లా చితికి పోయింది: అమెరికా
వాషింగ్టన్: కాల్పుల విరమణ అంశాన్ని ప్రస్తావించడం హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపు వెనుకంజను తెలియజేస్తోందని అమెరికా ప్రభుత్వ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. మంగళవారం(అక్టోబర్8) వాషింగ్టన్లో ఆయన మీడియాతో మట్లాడారు. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్బొల్లా చితికిపోయిందన్నారు.‘సంవత్సరం నుంచి హెజ్బొల్లాను ప్రపంచం మొత్తం కాల్పుల విరమణ చేయాలని అడుగుతోంది. దీనిని హెజ్బొల్లా తిరస్కరిస్తూ వస్తోంది. ఇప్పుడేమో హెజ్బొల్లానే కాల్పుల విరమణ అడుగుతోంది. ఈ యుద్ధానికి దౌత్య పరమైన పరిష్కారమే అంతిమంగా మేం కోరుకుంటున్నాం’అని చెప్పారు. కాగా, హెజ్బొల్లా డిప్యూటీ లీడర్ కాసిమ్ మంగళవారం ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ కాల్పుల విరమణ కోసం లెబనాన్ పార్లమెంట్ స్పీకర్ బెర్రీ చేస్తున్న ప్రయత్నాలకు తమ మద్దతుంటుందన్నారు. ఇజ్రాయెల్ తమపై భీకర దాడులు చేస్తున్నప్పటికీ ఆ దేశానికి ధీటైన జవాబిస్తున్నామని కాసిమ్ తెలిపారు.ఇదీ చదవండి: వేల మంది ఇజ్రాయెల్ పౌరులు నిరాశ్రయులవుతారు -
అమెరికాలో బతుకమ్మకు అధికారిక గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక వైభవం బతుకమ్మ ఖ్యాతి ఖండాంతరాలను దాటింది. బతుకమ్మ సంబుర ప్రాశస్త్యాన్ని, పండగలోని పరమార్థాన్ని అమెరికాలో పలు రాష్ట్రాలు గుర్తించాయి. జార్జియా, వర్జీనియా రాష్ట్రాలతోపాటు ఉత్తర కరోలినా రాష్ట్రంలోని చార్లెట్, రాలేహ్ నగరాలు బతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాల గవర్నర్లు ఈ వారాన్ని బతుకమ్మ పండుగ, తెలంగాణ హెరిటేజ్ వీక్‌గా ప్రకటించారు. బతుకమ్మ ఎంతో ప్రత్యేకమైన, ప్రాముఖ్యతగల పండుగల్లో ఒకటని.. ఈ ఉత్సవాన్ని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలే కాకుండా అమెరికాలో స్థిరపడ్డ 12 లక్షల మంది ఎన్నారైలు కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారని జార్జియా, వర్జీనియా రాష్ట్రాల గవర్నర్లతోపాటు ఉత్తర కరోలినాలోని చార్లెట్, రాలేహ్ మేయర్లలు అభివర్ణించారు. దీంతో వారికి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తెలంగాణ ఆడపడుచులకు అభినందనలు తెలియజేశారు. కొంతకాలంగా తెలంగాణ బతుకమ్మకు ఖండాంతరాల్లో గుర్తింపు తెచ్చేందుకు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్, ఇతర సంఘాలు, ప్రవాస తెలంగాణవాసులు చేస్తున్న కృషికి ఈ గుర్తింపుతో ఫలితం దక్కినట్టయింది. గతంలోనూ అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు బతుకమ్మను గుర్తించాయి. -
అమెరికా మిలిటరీ బేస్‌పై రాకెట్ల దాడి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఉన్న అమెరికా మిలిటరీ క్యాంపు మీద ఇటీవల రాకెట్ల దాడి జరిగింది. ఈ రాకెట్లను అక్కడి యాంటీ మిసైల్ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు అమెరికా మిలిటరీ అధికారులు తెలిపారు. మొత్తం మూడు కత్యూష రాకెట్లతో జరిగిన దాడిలో భవనాలు, వాహనాలు ధ్వంసంకాగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. ఇరాక్‌లో ఇప్పటికీ 2500 మంది దాకా అమెరికా సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిపై ఇరాన్ సహాయంతో కొన్ని మిలిటెంట్ గ్రూపులు తరచూ దాడులు చేస్తుంటాయి. ఇదీ చదవండి: నెతన్యాహూతో మాట్లాడిన ప్రధాని మోదీ -
టార్గెట్ ఐసిస్..సిరియాపై అమెరికా దాడులు
వాషింగ్టన్:పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి.ఓ పక్క లెబనాన్‌పై ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తుండగానే సిరియాలో ఉగ్రవాద స్థావరాలపై అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో 37 మంది ఉగ్రవాదులు హతమైనట్లు అగ్రదేశం ప్రకటించింది.మరణించిన ఉగ్రవాదులు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్(ఐసిస్),అల్‌ఖైదాతో లింకున్న సంస్థలకు చెందినవారని అమెరికా వెల్లడించింది.హతమైన వారిలో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నట్లు తెలిపింది.అల్‌ఖైదాతో లింకున్న హుర్రాస్ అల్దీన్ గ్రూపునకు చెందిన ఉగ్రవాదులు టార్గెట్‌గా వాయువ్య సిరియాపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇదీ చదవండి: హెజ్బొల్లాకు మళ్లీ షాక్..మరో ముఖ్యనేత హతం -
ఉద్యోగాలకు డిగ్రీ తప్పనిసరేం కాదు : కమలా హారిస్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఉద్యోగాలు, విద్యార్హతపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అద్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత దేశంలో కొన్ని ఫెడరల్ ఉద్యోగాలకు డిగ్రీ అర్హతను తొలగిస్తానని పేర్కొన్నారు. ఓ వ్యక్తి నైపుణ్యాలను ప్రదర్శించేందుకు డిగ్రీ తప్పనిసరి కాదని తెలిపారు.ఈ మేరకు పెన్సిల్వేనియాలోని విల్కేస్-బారేలో ప్రసంగిస్తూ.. ‘నేను అధ్యక్షురాలిగా ఎన్నికైతే.. ఫెడరల్ ఉద్యోగాల కోసం అవసరంలేని డిగ్రీ అర్హతను తొలగిస్తాను. ఇది నాలుగు సంవత్సరాల డిగ్రీ లేని వారికి ఉద్యోగాల అవకాశాలు పెంచడానికి దోహదపడుతుంది. ’ అని తెలిపారు.కళాశాల డిగ్రీ కంటే అప్రెంటిస్‌షిప్, సాంకేంతిక కార్యక్రమాలు వంటివి విజయానికి గల మార్గాల విలువను అమెరికా గుర్తించాలని అన్నారు. వ్యక్తి నైపుణ్యాలను సూచించేందుకు డిగ్రీ తప్పనిసరి కాదని తెలిపారు. అదే విధంగా ప్రైవేట్ రంగం కూడా ఇదే విధాన్ని పాటించేలా చూస్తానని భరోసా ఇచ్చారు.అయితే కమలా హారిస్ ప్రసంగానికి. నిరసనకారుల ఆందోళన వల్ల అంతరాయం ఏర్పడింది. గాజాలో 10 వేల మంది మరణానికి కారణమైన ఇజ్రాయెల్ యుద్ధానికి యూఎస్ మద్దత తెలపడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌కు ఆయుధాల రవాణాపై ఆంక్షలు విధించాలని, యుద్ధాన్ని ముగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో హారిస్ మాట్లాడుతూ..తమ ఆందోళనలను గౌరవిస్తానని చెప్పారు. కాల్పుల విరమణ, బందీల రక్షణ ఒప్పందానికి తన మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. చదవండి: పుతిన్‌పై ప్రశ్న.. రిపోర్టర్‌పై బైడెన్ ఆగ్రహంఇదిలా ఉండగా హారిస్ ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్నారు. గత అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్లకు అత్యధికంగా ఓటు వేసిన కార్యకర్తలు, ముస్లింలు, అరబ్బులతో సహా పాలస్తీనా అనుకూల అమెరికన్లు ఉన్నారు. వీరు ఈసారి తమ ఆలోచనను మార్చుకుంటే.. అది హారిస్ విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని పరిశీలకులు అంటున్నారు.అయితే 2023లో యూఎస్ సెన్సస్ బ్యూరో విడుదల చేసిన డేటా ప్రకారం.. 25 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అమెరికన్ యువతలో 62% కంటే ఎక్కువ మంది బ్యాచిలర్ డిగ్రీని కూడా కలిగి లేరు. 2020లో ఐదుగురు ఓటర్లలో ముగ్గురు కళాశాల డిగ్రీ కూడా చేయలేదు. ఇందుకు కారణం విద్యకు అధిక ఖర్చు అవ్వడమేనని తేలింది.కాగా అమెరికాలో నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ పోరులో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ పడబోతున్నారు. వీరిరువురు ఇటీవల ఓ టీవీ చర్చలో పాల్గొన్న విషయం తెలిసిందే. -
అణుబాంబుల సామర్థ్యం భారీగా పెంచుకుంటాం: కిమ్
ప్యాంగ్యాంగ్: భవిష్యత్తులో తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని భారీగా పెంచుకోనున్నట్లు ఉత్తరకొరియా నియంత కిమ్‌జోంగ్‌ఉన్ తెలిపారు. దేశ 76వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కిమ్ మాట్లాడారు. ‘యుద్ధంలో వాడేందుకు వీలుగా దేశ అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటాం. ఎంత పెంచాలనేదానికి హద్దే లేదు. దీనికి సంబంధించి పాలసీ రూపొందిస్తున్నాం. ఉనికిని కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’అని కిమ్ చెప్పారు. కొరియా ద్వీపకల్పంలో ఇటీవలి కాలంలో దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ మధ్య సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో కిమ్ అణుబాంబుల పెంపు నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. నవంబర్‌లో అమెరికా ఎన్నికలు జరగనున్న వేళ ఉత్తరకొరియా న్యూక్లియర్ బాంబు పరీక్ష జరిపే ఛాన్సుందని దక్షిణకొరియా అధ్యక్షుని భద్రతాసలహాదారు ఇటీవలే వెల్లడించారు. ఇదీ చదవండి.. ట్రంప్ వర్సెస్ కమల..హోరాహోరీ -
USA: రెండు రాష్ట్రాల్లో కార్చిచ్చు బీభత్సం
వాషింగ్టన్: అమెరికాలో రెండు రాష్ట్రాల్లో కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది. కాలిఫోర్నియా, నెవాడల్లో వేలాది ఎకరాలను కార్చిచ్చు మంటలు దహించివేస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల గవర్నర్లు అత్యవరస్థితి ప్రకటించారు. దక్షిణ కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినో కౌంటీలో ఒక్కరోజులోనే 20,553 ఎకరాల విస్తీర్ణంలో చెట్లను కార్చిచ్చుకాల్చి బూడిద చేసింది.మంటల భయంతో చాలా మంది కార్చిచ్చు ప్రాంతాలను వదిలి వెళ్లిపోతున్నారు. కార్చిచ్చు ప్రభావంతో ఈ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రత నమోదువుతోంది. ఆదివారం(సెప్టెంబర్ 8) రాత్రికి రాత్రే కార్చిచ్చు భారీగా విస్తరించింది. కార్చిచ్చును అదుపు చేసేందుకు వందలకొద్ది అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. అయినా ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. కార్చిచ్చు శరవేగంగా వ్యాపిస్తుండడంతో గవర్నర్ గవిన్ న్యూసమ్ అత్యవసర స్థితి ప్రకటించారు. కార్చిచ్చును అరికట్టేందుకు అగ్నిమాపక శాఖకు అదనపు సిబ్బంది, నిధులు, పరికరాలను అందజేశారు. గ్రీన్ వ్యాలీ, సీడర్ గ్లెన్, లేక్యారో హెడ్, క్రిస్ట్లైన్, వ్యాలీ ఆఫ్ ఎన్క్యాచ్మెంట్లను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.బేస్‌లైన్, అల్పిన్ స్ట్రీట్ వద్ద గురువారం రాత్రి అడవిలో పిడుగు పడడం వల్ల కార్చిచ్చు ప్రారంభమైనట్లు భావిస్తున్నారు. ఆ తర్వాత గాలి తోడవడంతో ఇది తీవ్రరూపం దాల్చింది. శుక్రవారం మూడు వేల ఎకరాలు, శనివారం ఏడు వేల ఎకరాలను కాల్చి బూడిద చేసింది. మరోవైపు నెవాడ రాష్ట్రంలో కూడా కార్చిచ్చుల కారణంగా అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు గవర్నర్ జోయి లాంబర్డో ప్రకటించారు. ఇదీ చదవండి.. మూడేళ్ల చిన్నారిని రక్షించడంలోడ్రోన్ సాయం -
అమెరికాకు షాక్.. డ్రోన్‌ను కూల్చేసిన ‘హౌతీ’లు
సనా: అమెరికాకు చెందిన అత్యాధునిక నిఘా డ్రోన్‌ను కూల్చేసినట్లు యెమెన్ కేంద్రంగా పనిచేసే మిలిటెంట్ గ్రూపు హౌతీ రెబెల్స్ ప్రకటించారు. యెమెన్ గగనతలంలో ఎగురుతున్న ఎమ్క్యూ-9 మానవరహిత విమానాన్ని(యూఏవీ) కూల్చేసినట్లు హౌతీల ప్రతినిధి యాహ్యా సారీ తెలిపారు. హౌతీ నియంత్రణలోని యెమెన్ భూభాగంపై అమెరికా వైమానిక దాడులకు పాల్పడినట్లు ఆరోపించారు.2014లో యెమెన్ రాజధాని సనాను హౌతీలు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికాకు చెందిన పలు డ్రోన్లు, నిఘా విమానాలను రెబెల్స్ కూల్చేశారు. ‘మారిబ్ గవర్నరేట్ గగనతలంలో రీపర్ శత్రు కార్యకలాపాలకు పాల్పడుతోంది. అందుకే దానాని కూల్చేశాం. పాలస్తీనా ప్రజలు, యెమెన్ రక్షణ కోసం హౌతీలు దాడులు కొనసాగిస్తూనే ఉంటారు’అని సారీ చెప్పారు.ఎమ్క్యూ-9 రీపర్ డ్రోన్.. ఎన్నో ప్రత్యేకతలు..అమెరికా నిఘా డ్రోన్ ఎమ్క్యూ-9 విమానాన్ని పోలి ఉంటుంది. దీన్ని రిమోట్‌తో ఆపరేట్ చేస్తారు. పైలట్లు ఉండరు. సాధారణ డ్రోన్లతో పోలిస్తే ఈ నిఘా డ్రోన్ చాలా ఎత్తులో ఎగరగలదు. 50 వేల అడుగుల ఎత్తులో 24 గంటలపాటు నిరంతరాయంగా ఎగురుతూ కీలక సమాచారం సేకరించే సామర్థ్యం దీని సొంతం. దీని విలువ సుమారు రూ.250కోట్లకు పైనే.కాగా, ఇజ్రాయెల్- పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్‌కు మధ్య జరుతున్న యుద్ధంలో హౌతీ రెబెల్స్ పాలస్తీనాకు మద్దతు పలుకుతున్నారు. ఎర్రసముద్రంలోని వాణిజ్య నౌకలు లక్ష్యంగా కొంత కాలం నుంచి హౌతీలు దాడులు చేస్తున్నారు. ఇటీవల గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో ఓ వాణిజ్య నౌకపై మిసైల్‌తో దాడి చేశారు. -
ఎట్టకేలకు గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో అ‘మెరిక’న్
న్యూయార్క్: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. ఎట్టకేలకు 2009 తర్వాత గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో అమెరికా ప్లేయర్‌ను ఫైనల్లో చూడబోతున్నాం. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో అమెరికా ఆటగాళ్లు టేలర్ ఫ్రిట్జ్, ఫ్రాన్సెస్ టియాఫో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. తొలి సెమీఫైనల్లో వీరిద్దరు ముఖాముఖిగా తలపడనున్నారు. దాంతో ఓ అమెరికా ప్లేయర్ యూఎస్ ఓపెన్ టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఖాయమైంది. 2009 వింబుల్డన్ టోరీ్నలో ఆండీ రాడిక్ తర్వాత మరో అమెరికా ప్లేయర్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి క్వార్టర్ ఫైనల్లో 12వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ 7–6 (7/2), 3–6, 6–4, 7–6 (7/3)తో నాలుగో సీడ్, 2020 రన్నరప్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ను బోల్తా కొట్టించాడు. తొమ్మిదో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)తో జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్లో 20వ సీడ్ టియాఫో 6–3, 6–7 (5/7), 6–3, 4–1తో గెలుపొందాడు. నాలుగో సెట్లో టియాఫో 4–1తో ఆధిక్యంలో ఉన్న దశలో దిమిత్రోవ్ గాయంతో వైదొలిగాడు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్), ముకోవా (చెక్ రిపబ్లిక్) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం..హైదరాబాదీల సజీవదహనం
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతిచెందారు. వీరిలో ముగ్గురు హైదరాబాద్‌కు చెందిన వారు. గత వారం జరిగిన ఈ ప్రమాద ఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన ఆర్యన్ రఘునాథ్, ఫరూఖ్, లోకేశ్ పాలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కార్ పూలింగ్ ద్వారా ఈ నలుగురు బెన్టోన్విల్లె ప్రాంతానికి వెళ్లేందుకు ఒకే వాహనంలో ఎక్కారు. తర్వాత రోడ్డుపై వీరి వాహనాన్ని వేరే వాహనాలు వెనుకనుంచి అతివేగంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. డల్లాస్‌లో బంధువును కలిసి ఇంటికి వెళ్తున్న ఆర్యన్ రఘునాథ్, భార్యను కలిసేందుకు లోకేశ్, యూనివర్సిటీకి వెళ్తున్న దర్శిని వాసుదేవన్, ఫరూఖ్ ఈ కారులో ఎక్కారు. ప్రమాదం కారణంగా వీరు ప్రయాణిస్తున్న వాహనానికి మంటలంటుకోవడంతో బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది. వీరి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. -
యూఎస్.. మనదే జోష్
భారతీయ అమెరికన్లు...టెక్నాలజీ ప్రపంచం రూపురేఖలు మారుస్తున్నారు..వైద్యుల రూపంలో ప్రాణాలు కాపాడుతున్నారు..విద్యావేత్తలుగా భావితరాలను తీర్చిదిద్దుతున్నారు..కళాకారులుగా సాంస్కృతిక రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు..మేధావులుగా జ్ఞానాన్ని పంచుతున్నారు..శాస్త్రవేత్తలుగా విశ్వం రహస్యాలను ఛేదిస్తున్నారు.. పట్టుదల.. నైపుణ్యం.. వైవిధ్యతల కలబోతగా అమెరికన్ సమాజాన్ని సమృద్ధం చేస్తున్నారు. ఈ విజయాలు, గాథలు.. అమెరికా పురోగతి, సమైక్యతల్లో భారతీయ అమెరికన్ల పాత్రకు తార్కాణాలు!!’’.. ఇది భారతీయుల గురించి మనకు మనం చెప్పుకుంటున్న గొప్పలు కాదు.. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కన్సల్టింగ్ సంస్థ బీసీజీ గ్లోబల్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వెల్లడించిన అచ్చమైన వాస్తవం.దశాబ్దాల క్రితం ఉపాధి కోసం, సంపాదన కోసం ఖండాలు దాటి అగ్రరాజ్యం అమెరికాలో అడుగిడిన భారతీయులు అక్కడి సమాజంతో మమేకమైపోయారు. భారత్‌లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంటే.. అమెరికాలో మాత్రం మనవాళ్లు ఐదో వంతు మంది ఇప్పటికీ తాతముత్తాతల ఇళ్లలోనే ఉంటున్నారు. సంపాదించే ప్రతి డాలర్లో కొంత దాచుకునే ప్రయత్నం, పిల్లలకు మంచి చదువులు చెప్పించడం వంటివి కూడా మన భారతీయ అలవాట్లే. అంతేకాదు.. ప్రతి భారతీయ అమెరికన్ తన కోసం, తన కుటుంబం బాగు కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ.. అక్కడి సమాజానికి, ఆ దేశ పురోగతి మొత్తానికి కూడా ఉపయోగపడుతుండటం విశేషం. దీనిపై ‘సాక్షి’ప్రత్యేక కథనం..భారతీయ అమెరికన్లు అమెరికా సమా జానికి, ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన స్థాయి లో సేవలు అందిస్తున్నారు. వలస వచ్చి ఒక దేశంలో బతకడమే కష్టమనుకునే పరిస్థితుల్లో.. భారతీయులు అక్కడి సమాజంతో మమేకం అవడమే కాకుండా టెక్నాలజీ, వైద్యం, విద్య, వ్యాపారాల్లో రాణించి అమెరికన్లకూ మేలు చేయగలుగుతున్నారు. సుమారు 30 కోట్ల జనాభా ఉన్న ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ)’లో భారతీయుల సంఖ్య యాభై లక్షల వరకు ఉంటుందని అంచనా. అంటే అక్కడి జనాభాలో సుమారు రెండు శాతం. కానీ ఆ దేశంలోని 60% హోటళ్లు, సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాలు ఇతర వ్యాపా రాలలో వీరికి భాగస్వామ్యం ఉంది. కోటి మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉన్నారు. వందల కోట్ల డాలర్ల విలువైన స్టార్టప్ కంపెనీలు స్థాపించగలిగారు. టాప్ టెక్నాలజీ కంపెనీల సీఈవోల నుంచి ట్రక్ డ్రైవర్ల దాకా ఎన్నో ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. అమెరికా స్థానికుల కంటే సగటు భారతీయ అమెరికన్ కుటుంబం రెట్టింపు వార్షికాదాయాన్ని కలిగి ఉందంటేనే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది.చదువే పెట్టుబడిగా..భారతీయ అమెరికన్లు తమ పిల్లలకు మంచి విద్య అందించేందుకు కృషి చేస్తున్నారు. కనీసం 70శాతం మంది బ్యాచిలర్స్ డిగ్రీ వరకూ చదువుకుంటున్నారు. 2007 నుంచి 2023 ఏప్రిల్ మధ్య 16 లక్షల మంది గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. భారతీయ అమెరికన్లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారు 40 శాతం ఉంటే.. అమెరికా స్థానికులలో ఇది కేవలం 13 శాతమే కావడం గమనార్హం. భారతీయ అమెరికన్లు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్ రంగాల కోర్సులు చేస్తున్నారు. బాగా చదువుకున్న తల్లిదండ్రులు ఉండటం భారతీయ అమెరికన్ కుటుంబాల్లోని భావితరాలకు మరో వరం అని చెప్పవచ్చు. ప్రతిష్టాత్మక స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలు 34 సార్లు జరిగితే అందులో 28సార్లు ఇండియన్ అమె రికన్లే విజేతలుగా నిలిచారు.మంచి చదువు, నైపుణ్యాలతో.. మనవాళ్లు ఏ రంగంలో స్థిర పడ్డా బాగా రాణించగలుగుతున్నారు. జీతా లు మెరుగ్గా ఉంటున్నాయి. భారతీయ అమెరికన్ కుటుంబం సగటు వార్షికా దాయం 1,23,700 డాలర్లు (కోటి రూపా యలకుపైనే) ఉంది. అమెరికా స్థానిక కుటుంబాలతో పోలిస్తే ఇది సుమారు రెట్టింపు కావడం గమనార్హం.330కోట్ల డాలర్లుఅమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో చదువుతున్నభారతీయ విద్యార్థులు పెడుతున్న ఖర్చులు, చెల్లిస్తున్న ఫీజులు కలిపి సుమారు 330 కోట్ల డాలర్లు ఉంటాయని అంచనా. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఈ సొమ్ము కూడా కీలకమే.విద్యారంగం పైనా మన ముద్రభారతీయ అమెరికన్లు అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో ఉన్నత హోదాల్లో పనిచేస్తు న్నారు. అగ్రరాజ్యంలో విద్యారంగంపై తమదైన ముద్ర వేస్తున్నారు. డాక్టర్ నీలి బెండపూడి పెన్‌స్టేట్ యూనివర్సిటీ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించగా.. ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్ యూని వర్సిటీకి చెందిన ‘డోయిర్ స్కూల్ ఆఫ్ సస్టెయిన బిలిటీ తొలి డీన్‌గా అరుణ్ మజుందార్ పనిచేస్తు న్నారు. శుభ్ర సురేశ్ కార్నెగీ మెలన్ యూనివర్సిటీ అధ్యక్షులుగా ఉండగా.. యూనివర్సిటీ అఫ్ కాలిఫో ర్నియా చాన్సలర్‌గా ప్రదీప్ ఖోస్లా వ్యవహరిస్తున్నారు. ఇదే యూనివర్సిటీ బర్క్లీ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీ డీన్‌గా ఎస్.శంకర శాస్త్రి ఉన్నారు. అంతేకాదు మరెన్నో వర్సిటీల్లో భారతీయ అమెరికన్లు అధ్యాపకులుగా పనిచేస్తు న్నారు. ఒక అంచనా ప్రకారం అమెరికాలోని యూనివర్సిటీలు, కాలేజీలన్నింటిలో కలిపి సుమారు 22 వేల మంది భారతీయ అమెరికన్ అధ్యాపకులు ఉన్నారు. మొత్తం అధ్యాపకుల్లో మనవాళ్ల వాటా 2.6 శాతం. సిలికాన్ వ్యాలీలోని హార్వర్డ్ లా స్కూల్, కార్నెగీ మెలన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ సభ్యు డిగా వివేక్ వాధ్వా సేవలందిస్తుండగా.. ఆన్లైన్ విద్య విప్లవానికి నాంది పలికిన ‘ఎడ్ఎక్స్’ కంపెనీ సీఈవో, ఎంఐటీ అధ్యాపకుడు అనంత్ అగర్వాల్ కూడా భారతీయ అమెరికనే.ఆర్థిక ఇంధనంఅమెరికా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 2023లో 27.36 లక్షల కోట్ల డాలర్లు. ఇందులో భార తీయ అమెరికన్ల వాటా సుమారు లక్ష కోట్ల డాలర్లు. ఖర్చు పెట్టగల స్థోమత, పన్నుల చెల్లింపు, వ్యాపారాల ద్వారా ఇంత మొత్తాన్ని అమెరికా ఆర్థిక వ్యవస్థకు జోడించగలుగుతున్నారు మనవాళ్లు. ఏటా భారతీయ అమెరికన్లు చెల్లించే పన్నులు 30,000 కోట్ల డాలర్లుగా అంచనా.భారతీయ అమెరికన్లు అక్కడ ఏర్పాటు చేసిన హోటళ్ల ద్వారా వచ్చే ఆదాయం 70,000 కోట్ల డాలర్లు. భారతీయ అమెరికన్లు రోజువారీ సరుకులు మొదలు.. వినోద, విహారాల దాకా ఏటా పెడుతున్న ఖర్చు 37,000 కోట్ల డాలర్ల నుంచి 46,000 కోట్ల డాలర్ల వరకూ ఉంటుంది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వానికి అందే సేల్స్ ట్యాక్స్, ఇతర పన్నుల రూపంలో భారీగానే ఆదాయం సమకూరుతోంది.పరిశోధనలు, పేటెంట్లతోనూ..యూనివర్సిటీలు, కాలేజీల పాలన, బోధన మాత్రమే కాకుండా.. పరిశోధనల ద్వారా కూడా భారతీయ అమెరికన్లు విద్యా వ్యవస్థలో భాగమవుతున్నారు. అమెరికాలో 2023లో ప్రచురితమైన పరిశోధన వ్యాసాలన్నింటిలో భారతీయ సంతతి పరిశోధకుల భాగస్వామ్యం 13 శాతానికిపైగా ఉండటం ఈ విషయాన్ని రుజువు చేస్తోంది. అలాగే పది శాతం పేటెంట్లు కూడా మనవాళ్ల పేరుతోనే జారీ అవుతున్నాయి. పరిశోధనలకు అందించే ఎన్ఐహెచ్ గ్రాంట్లలోనూ భారతీయ అమెరికన్ల వాటా 11 శాతం కంటే ఎక్కువే.విస్తరిస్తున్న వ్యాపార సామ్రాజ్యంగూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాప్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సిస్టమ్స్ శాంతను నారాయణన్.. మనం తరచూ ఈ పేర్లువింటుంటాం. ప్రపంచంలోనే టాప్ కంపెనీలను నడుపుతున్న భారతీయ అమెరికన్లు వారు. అంతేకాదు అమెరికాలో భారతీయులు సృష్టించిన వ్యాపార సామ్రాజ్యం చాలా పెద్దది. ప్రపంచం గతిని మార్చేసిన సిలికాన్ వ్యాలీ టెక్ కంపెనీల్లో 15.5 శాతం భారతీయ సంతతి వాళ్లు ఏర్పాటు చేసినవే. టెక్ కంపెనీలే కాదు.. ప్రతి వీధి చివర ఒక సూపర్ మార్కెట్, లేదంటే హోటల్ నడుపుతున్నది మనవాళ్లే. అమెరికా మొత్తమ్మీద ఉన్న హోటళ్లలో 60శాతం భారతీయులవే.ఉద్యోగ కల్పనకు ఇతోధిక తోడ్పాటుగూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి 16 పెద్ద కంపెనీలను నడిపిస్తున్న భారతీయ అమెరికన్లు.. ఉద్యోగ కల్పన విషయంలోనూ ముందున్నారు. ఈ కంపెనీల్లో సుమారు 27 లక్షల మంది అమెరికన్లు ఉద్యోగం చేస్తున్నారు. వంద కోట్ల డాలర్లకుపైగా విలువైన యూనికార్న్ కంపెనీలు అమెరికాలో 648 వరకూ ఉంటే.. అందులో భారతీయ అమెరికన్లు ఏర్పాటు చేసినవే 72. వీటి మొత్తం విలువ 195 బిలియన్ డాలర్లు. సుమారు 55,000 మంది ఉపాధి పొందుతున్నారు. మరోవైపు అమెరికాలోని హోటళ్లలో 60శాతం భారతీయ అమెరికన్లవే. ఈ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తోందని అంచనా. అంటే భారతీయ అమెరికన్లు 24 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్టు లెక్క. చిన్న దుకాణాలు, సూపర్ మార్కెట్ల ద్వారా మరో 3.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మొత్తంగా భారతీయ అమెరికన్లు కోటి మంది జీవనానికి సాయపడుతున్నట్టు అంచనా.స్టార్టప్‌ల స్థాపనలోనూ..సోషల్ నెట్వర్కింగ్ అనగానే ట్విట్టర్, ఫేస్బుక్ వంటివి గుర్తుకొస్తాయి. అలా కాకుండా ఆడియో ద్వారా కూడా సోషల్ ప్లాట్‌ఫామ్ నడపవచ్చని నిరూపించారు భారతీయ అమెరికన్ రోహన్ సేథ్. ‘క్లబ్‌హౌస్’ పేరుతో ఆయన అభివృద్ధి చేసిన అప్లికేషన్ ఇప్పుడు పాపులర్. షేర్ల వ్యాపారం చేసే రాబిన్‌హుడ్, ఇంటికే సరుకులు తీసుకొచ్చిన ‘ఇన్‌స్టాకార్ట్’ వంటి స్టార్టప్‌లు భారతీయ అమెరికన్ల బుర్రల్లోంచి పుట్టుకొచ్చినవే.టాప్ భారతీయ అమెరికన్లు వీరే..జయ్ చౌధురి సీఈవో, జెడ్ స్కేలర్ (సైబర్ సెక్యూరిటీ రంగంలో అగ్రగామి సంస్థ)వినోద్ ఖోస్లా సన్ మైక్రో సిస్టమ్స్సహ వ్యవస్థాపకుడు, ఖోస్లా వెంచర్స్ అధినేతరొమేశ్ టి.వాధ్వానీ సింఫనీ టెక్నాలజీగ్రూప్ వ్యవస్థాపకుడు, సీఈవోరాకేశ్ గంగ్వాల్ ఇండిగో విమానాల సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ సహ వ్యవస్థాపకుడుఅనిల్ భుస్రీక్లౌడ్ ఆధారిత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కంపెనీ ‘వర్క్‌డే’ సహ వ్యవస్థాపకుడునీరజ్ షా ఇంటి సామన్లు అమ్మే ఈ–కామర్స్ కంపెనీ వేఫెయిర్ సీఈవో, సహ వ్యవస్థాపకుడుబైజూ భట్ కమీషన్ లేకుండా ట్రేడింగ్ సౌకర్యం అందించే కంపెనీ రాబిన్ హుడ్ వ్యవస్థాపకుడురోహన్ సేథ్ఆడియో ఆధారిత సోషల్ నెట్వర్కింగ్ అప్లికేషన్ ‘క్లబ్‌హౌస్’ కంపెనీ సహ వ్యవస్థాపకుడు. -శాన్ఫ్రాన్సిస్కో నుంచి కంచర్ల యాదగిరిరెడ్డి -
అమెరికాలో సూర్యాపేట జిల్లావాసి మృతి
ఆత్మకూర్ (ఎస్): అమెరికాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన తప్సి ప్రవీణ్‌కుమార్ (39) ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతిచెందాడు. భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో ప్రవీణ్‌కుమార్ వారి ఇంటి సమీపంలోని స్విమ్మింగ్ పూల్ వద్ద కాలక్షేపం కోసం వెళ్లి అందులో పడి మృతి చెందినట్లు అతడి భార్య శాంతి ఆదివారం ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపారు. పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన నాగయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. మృతుడు ప్రవీణ్ చిన్న కుమారుడు. ఎమ్మెస్సీ చేసిన ప్రవీణ్ హైదరాబాద్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఉపాధ్యాయ వృత్తిలో మంచి నైపుణ్యం ఉన్న ప్రవీణ్ ఆ్రస్టేలియా ఇతర దేశాల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఐదేళ్ల క్రితం మిత్రులతో కలిసి అమెరికాకు వెళ్లిన ప్రవీణ్‌కుమార్ అట్లాంటా ప్రాంతంలో పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రవీణ్‌కుమార్ మృతితో పాతర్లపహాడ్ గ్రామంలో విషాదం నెలకొంది. -
అమెరికాలో వ్యభిచారం.. ఏడుగురు భారతీయుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో వ్యభిచారం చేస్తూ ఏడుగురు భారతీయులు పట్టుబడ్డారు. వీరిలో ఐదుగురు తెలుగు యువకులు ఉన్నట్టుగా స్థానిక అధికారులు వెల్లడించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. డెంటన్ కౌంటీ షెరీఫ్ అధికారులు వ్యభిచారాన్ని అరికట్టడానికి హాయ్‌ల్యాండ్ విలేజ్ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో మంగళవారం టెక్సాస్‌లోని డెంట¯న్లో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో మొత్తం 18 మంది నిందితులు పట్టుబడ్డారు. వీరిలో ఏడుగురు భారతీయులు ఉండగా.. అందులో ఐదుగురు తెలుగువారని అధికారులు వెల్లడించారు. స్థానిక పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో నిఖిల్ బండి, మోనిష్ గల్లా, నిఖిల్ కుమ్మరి, జైకిరణ్ మేకల, కార్తీక్ రాయపాటి ఉన్నారు. వీరిలో పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఆరోపణలపై బండి నిఖిల్, కుమ్మరి నిఖిల్‌ను అరెస్ట్ చేశామని, వ్యభిచారం చేయాలని కోరిన ఆరోపణలపై గల్లా మోనిష్, అమిత్‌కుమార్, పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకోవడంతోపాటు 18 ఏళ్లలోపు మైనర్‌ను వ్యభిచారం చేయాలని కోరిన ఆరోపణలపై మేకల జైకిరణ్ రెడ్డిని, వ్యభిచారం చేయాలని అభ్యర్థించిన ఆరోపణలపై రాయపాటి కార్తీక్, నబిన్ శ్రేష్ఠలను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. పట్టుబడిన మొత్తం 18 మందిలో ఇద్దరి వద్ద అక్రమ ఆయుధాలు సైతం ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు. ఈ వ్యభిచార ముఠాతో సంబంధాలున్న ఇతర వ్యక్తుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. కాగా, పట్టుబడిన తెలుగు యువకులు రాయపాటి కార్తీక్ చౌదరి, గల్లా మోనిష్చౌదరి టెక్సాస్ ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్ కో–ఆర్డినేటర్లు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
హసీనాపై కఠిన వైఖరి వద్దు: అమెరికాను కోరిన భారత్ !
వాషింగ్టన్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను పదవి నుంచి దించడం వెనుక అమెరికా కుట్ర ఉందన్న ప్రచారం నేపథ్యంలో అమెరికా మీడియా కథనాలు చర్చనీయాంశమవుతున్నాయి. హసీనాను ఒత్తిడికి గురిచేయొద్దని గతంలో భారత్ అధికారులు అమెరికాను కోరినట్లు వాషింగ్టన్ పోస్టు పత్రిక ఓ కథనం ప్రచురించింది. బంగ్లాదేశ్‌లో ప్రతిపక్షాలు బలపడితే ఆ దేశం ఇస్లామిక్ అతివాద శక్తుల కేంద్రంగా మారుతుందని, ఇది భారత్ జాతీయ భద్రతకు సవాళ్లను విసురుతుందని అమెరికాకు భారత్ తెలిపినట్లు కథనంలో రాసుకొచ్చారు. హసీనాపై కఠిన వైఖరి వద్దని అమెరికాను భారత విదేశాంగవర్గాలు కోరినట్లు కథనం సారాంశం. 2024 ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్‌లో పలువురిని జైళ్లలో వేయడంపై అమెరికా దౌత్యవేత్తలు విమర్శించారు. అమెరికా ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు పోలీసులపై అప్పట్లో ఆంక్షలు విధించింది. ఈ విభాగం నేరుగా హసీనా కింద పనిచేస్తుందనే ఆరోపణలున్నాయి. దేశంలో హింస చెలరేగడంతో షేక్‌హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వచ్చి ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. హసీనా దేశం విడిచిన బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నట్లు వార్తలు వస్తుండటం గమనార్హం. -
తైవాన్‌లో భూకంపం
తైపే: తైవాన్ తూర్పుతీరంలో శుక్రవారం(ఆగస్టు16) తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్డర్స్కేల్పై 6.1గా నమోదైంది. ఈ విషయాన్ని అమెరికా జియలాజికల్సర్వే తెలిపింది. హులియెన్ నగరం సమీపంలో 15 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదైనట్లు తైవాన్ కేంద్ర వాతావారణ కేంద్రం వెల్లడించింది.భూకంపం విషయాన్ని తైవాన్ వాతావరణ కేంద్రం ముందుగానే పౌరులకు మొబైల్‌ఫోన్ సందేశాల రూపంలో చేరవేసింది. ఎక్కడివారక్కడ జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తైవాన్ నేషనల్ ఫైర్ ఏజెన్సీ తెలిపింది. -
బంగ్లాదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టలేదు: అమెరికా
వాషింగ్టన్: తనను దేశం విడిచి వెళ్లేలా చేసిన కుట్ర వెనుక అమెరికా ఉందని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌హసీనా చేసినట్లు చెబుతున్న ఆరోపణలను వైట్‌హౌజ్ తోసిపుచ్చింది. ఈ విషయమై వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ జీన్పియెర్రె సోమవారం(ఆగస్టు12) మీడియాతో మాట్లాడారు. ‘బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌హసీనాను పదవి నుంచి దించడంలో మా పాత్ర ఏమీ లేదు. ఈ విషయంలో అమెరికాపై వచ్చిన ఆరోపణలేవీ నిజం కావు. భవిష్యత్తు ప్రభుత్వంపై బంగ్లాదేశ్ ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. అక్కడి పరిణామాలను గమనిస్తుంటాం’అని పియెర్రె తెలిపారు. సెయింట్ మార్టిన్స్ ఐలాండ్‌ను అప్పగించనందుకే తనను పదవి నుంచి అమెరికా దించిందని షేక్‌హసీనా ఆరోపించినట్లు మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే తన తల్లి అలాంటి ఆరోపణలేవీ చేయలేదని షేక్‌హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ చెప్పడం గమనార్హం. -
రూ.31,532 కోట్లు 30,750 ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, పలువురు ఉన్నతాధికారులతో కూడిన రాష్ట్ర బృందం అమెరికాలో చేపట్టిన పర్యటన ముగిసింది. ఈ నెల 3న అమెరికా వెళ్లిన సీఎం బృందం.. అక్కడి నుంచి దక్షిణకొరియాకు బయలుదేరింది. అమెరికా పర్యటనలో భాగంగా వివిధ రంగాల్లో పేరొందిన దిగ్గజ కంపెనీలు తెలంగాణలో రూ.31,532 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు 19 కంపెనీలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయని.. తద్వారా రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు. ఫ్యూచర్ స్టేట్‌గా తెలంగాణను, 4.0 నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామన్న సీఎం చేసిన ప్రకటనలతో అమెరికా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులకు ఆసక్తి చూపారని వెల్లడించాయి. 50కి పైగా వాణిజ్య సమావేశాలతో.. అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బృందం 50కిపైగా వాణిజ్య సమావేశాలు, మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంది. కృత్రిమ మేధ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు అమెరికన్ కంపెనీలు ఆసక్తి చూపాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దిగ్గజ సంస్థలు కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసియం, కార్నింగ్, ఆమ్జెన్, జొయిటిస్, హెచ్‌సీఏ హెల్త్‌కేర్, వివింట్ ఫార్మా, థర్మో ఫిసర్, ఆరమ్ ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాల విస్తరణ, కొత్త కేంద్రాల స్థాపనకు సంసిద్ధత వ్యక్తం చేశాయని వెల్లడించాయి. ఈ పర్యటనలో యాపిల్, గూగుల్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతోనూ సీఎం రేవంత్ బృందం చర్చలు జరిపింది. సరికొత్త భాగస్వామ్యానికి నాంది ప్రపంచంలో పేరొందిన కంపెనీలతో సంప్రదింపులు, చర్చలతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త భాగస్వామ్యానికి నాంది పలికింది. స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుతోపాటు ఏఐ సిటీ మొదలు ఫ్యూచర్ సిటీ వరకు తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న ప్రణాళికలకు అమెరికాలోని పారిశ్రామికవేత్తల నుంచి మద్దతు లభించింది. తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు తరలిరావటం శుభసూచకం. – సీఎం రేవంత్ సరికొత్తగా తెలంగాణ పరిచయం అమెరికా వ్యాపార సామ్రాజ్యానికి తెలంగాణను సరికొత్తగా పరిచయం చేయగలిగాం. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వం అందించే సహకారాన్ని ఈ పర్యటనలో చాటిచెప్పాం. మా అమెరికా పర్యటన సత్ఫలితాలను అందించింది. తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా రావడంతోపాటు అపారమైన ఉద్యోగ అవకా శాలు కూడా లభిస్తాయి. – మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌లో అమెజాన్ సేవల విస్తరణ అమెజాన్ సంస్థ హైదరాబాద్‌లోని తమ డేటా సెంటర్‌ను విస్తరించేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది. అమెరికా పర్యటనలో భాగంగా ‘అమెజాన్ వెబ్ సర్వి సెస్ (ఏడబ్ల్యూఎస్) డేటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ’వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పియర్సన్, ఇతర ప్రతినిధులతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు భేటీ అయ్యారు. తెలంగాణలో అమెజాన్ డేటా సెంటర్ కార్యకలాపాలపై చర్చలు జరిపారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు సంబంధించి హైదరాబాద్‌లో ఇప్పటికే మూడు డేటా సెంటర్లు ఉన్నాయి. తాజాగా ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ ఆధారిత సేవలతో కొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్‌ను, తమ వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలను అమెజాన్ ప్రతినిధులు వివరించారు. ఆర్టిఫిషయల్ఇంటెలిజెన్స్తో అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ సేవల వృద్ధికి హైదరాబాద్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని కెర్రీ పియర్సన్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ వృద్ధిలో ఆశించిన లక్ష్యాలను అందుకునేందుకు తమ కంపెనీ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందన్నారు. -
అమెరికాకే అందలం
పారిస్: విశ్వ క్రీడల్లో చివరిరోజు ఆఖరి మెడల్ ఈవెంట్లో అమెరికా అగ్రస్థానాన్ని ఖరారు చేసుకుంది. చివరి మెడల్ ఈవెంట్‌గా జరిగిన మహిళల బాస్కెట్‌బాల్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అమెరికా 67–66 పాయింట్ల తేడాతో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టును ఓడించింది. మహిళల బాస్కెట్‌బాల్ జట్టు స్వర్ణ పతకంతో పతకాల పట్టికలో అమెరికా జట్టు టాప్ ర్యాంక్‌ను ఖరారు చేసుకోవడం విశేషం. అమెరికా, చైనా జట్లు 40 స్వర్ణ పతకాలతో సమంగా నిలిచాయి. అయితే చైనాకంటే అమెరికా ఎక్కువ రజత పతకాలు, ఎక్కువ కాంస్య పతకాలు సాధించింది. దాంతో అమెరికాకు అగ్రస్థానం దక్కింది. ఫ్రాన్స్ జట్టుతో జరిగిన ఫైనల్లో అమెరికా మహిళల జట్టుకు గట్టిపోటీ ఎదురైంది. ఒకదశలో అమెరికాకు ఓటమి తప్పదా అనిపించింది. ఆఖరి క్వార్టర్లో నాలుగు నిమిషాలు మిగిలి ఉన్నంతవరకు ఫ్రాన్స్ 53–52తో ఒక్క పాయింట్ ఆధిక్యంలో ఉంది. ఈ దశలో తమకు లభించిన ఫ్రీ త్రోను అమెరికా పాయింట్‌గా మలిచి స్కోరును 53–53తో సమం చేసింది. ఆ తర్వాత అమెరికా కీలక పాయింట్లు సాధిస్తూ ఆధిక్యంలోకి వెళ్లింది. 17 సెకన్లు మిగిలి ఉన్నాయనగా అమెరికా 63–59తో ముందంజలో నిలిచింది. ఈ దశలో తమకు లభించిన రెండు ఫ్రీ త్రోలను ఫ్రాన్స్ ప్లేయర్ మరీన్ జోన్స్ పాయింట్లుగా మలిచింది. దాంతో అమెరికా ఆధిక్యం 63–61గా మారింది. 11 సెకన్లు ఉన్నాయనగా అమెరికా ప్లేయర్ కెల్సీ ప్లమ్ రెండు పాయింట్లు సాధించి 65–61తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఐదు సెకన్లు ఉన్నాయనగా ఫ్రాన్స్ ప్లేయర్ గ్యాబీ విలియమ్స్ మూడు పాయింట్ల షాట్ సంధించడంతో అమెరికా ఆధిక్యం 65–64కు తగ్గింది. మూడు సెకన్లు ఉన్నాయనగా ఫ్రాన్స్ ప్లేయర్ ఫౌల్ చేయడంతో అమెరికాకు రెండు ఫ్రీ త్రోలు రావడం, వాటిని పాయింట్లుగా మలచడం జరిగింది. దాంతో అమెరికా 67–64తో ముందంజలోకి వెళ్లింది. చివరి క్షణంలో ఫ్రాన్స్ ప్లేయర్ మరీన్ జోన్స్ రెండు పాయింట్లు సాధించినా ఆతిథ్య జట్టు పాయింట్ తేడాతో ఓటమి చవిచూసింది. అమెరికా జట్టులో విల్సన్ అజా 21 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలువగా... కెల్సీ ప్లమ్, కాపర్ కాలీ 12 పాయింట్ల చొప్పున సాధించారు. ఈ గెలుపుతో అమెరికా మహిళల బాస్కెట్‌బాల్ జట్టు ఒలింపిక్స్‌లో వరుసగా ఎనిమిదో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఓవరాల్‌గా అమెరికా మహిళల జట్టుకిది పదో స్వర్ణం. 1984 లాస్ ఏంజెలిస్, 1988 సియోల్ ఒలింపిక్స్‌లో స్వర్ణాలు నెగ్గిన అమెరికా జట్టు 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించింది. ఆ తర్వాత 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో అమెరికా మహిళల జట్టు పసిడి పతకాల వేట మళ్లీ మొదలై 2024 పారిస్ ఒలింపిక్స్ వరకు కొనసాగుతూనే ఉంది. మరోవైపు శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల బాస్కెట్‌బాల్ ఫైనల్లో అమెరికా జట్టు 98–87 పాయింట్ల తేడాతో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టుపై గెలిచి ఓవరాల్‌గా 17వసారి పసిడి పతకాన్ని దక్కించుకుంది. అమెరికా జట్టులో స్టీఫెన్ కర్రీ త్రీ పాయింటర్ షాట్లను ఎనిమిదిసార్లు వేయడం విశేషం. దిగ్గజ ప్లేయర్లు కెవిన్ డురాంట్ 15 పాయింట్లు, లెబ్రాన్ జేమ్స్ 14 పాయింట్లు, డేవిడ్ బుకెర్ 15 పాయింట్లు సాధించారు. 14 అమెరికా సాధించిన స్వర్ణాల సంఖ్యలో అత్యధికంగా అథ్లెటిక్స్ నుంచి 14 పసిడి పతకాలు లభించాయి. ఆ తర్వాత స్విమ్మింగ్‌లో 8, జిమ్నాస్టిక్స్‌లో 3, బాస్కెట్‌బాల్, సైక్లింగ్ ట్రాక్, ఫెన్సింగ్, రెజ్లింగ్‌లో 2 చొప్పున స్వర్ణాలు దక్కాయి. సైక్లింగ్ రోడ్, ఫుట్‌బాల్, గోల్ఫ్, రోయింగ్, షూటింగ్, సరి్ఫంగ్, వెయిట్‌లిఫ్టింగ్‌లో ఒక్కో స్వర్ణం చొప్పున లభించాయి. 19 ఇప్పటి వరకు 30 సార్లు ఒలింపిక్స్ క్రీడలు జరిగాయి. ఇందులో అత్యధికంగా 19 సార్లు అమెరికా జట్టు పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. సోవియట్ యూనియన్ ఆరుసార్లు టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. యూనిఫైడ్ టీమ్, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, జర్మనీ ఒక్కోసారి మొదటి స్థానంలో నిలిచాయి. -
USA: ఇరవై ఏళ్ల తర్వాత చిక్కిన మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్
న్యూయార్క్: అమెరికా మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్, 20 ఏళ్ల నుంచి పరారీలో ఉన్న కరుడుగట్టిన నేరస్తుడు ఒకరిని ఫేస్బుక్ పట్టిచ్చింది. 2004లో ఎల్డియాబ్లో రియానో అనే క్రిమినల్ ఒహియోలోని బార్లో ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి పారిపోయాడు. అప్పటి నుంచి రియానో పోలీసుల మోస్ట్‌వాంటెడ్ జాబితాలో ఉన్నాడు.తాజాగా ఫేస్బుక్ చూస్తున్న అమెరికా పోలీసులకు మెక్సికోలో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు అధికారి రియానో పోలికలకు దగ్గరగా ఉండటాన్ని గమనించారు. ఇంకేముంది వెళ్లి చూస్తే ఆ పోలీసు అధికారి రియానో అని తేలింది. దీంతో వెంటనే అతడిని అరెస్టు చేసి అమెరికాకు తీసుకువచ్చారు. ప్రస్తుతం అతడిని సిన్సినాటిలోని బట్లర్ కౌంటీ జైలులో ఉంచారు. -
కమలా హారిస్‌తో డిబెట్‌కు ట్రంప్ ఓకే.. ఎప్పుడంటే..!
అమెరికా అద్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీకి దిగుతున్న వైఎస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్‌తో టీవీ చర్చలో పాల్గొనేందుకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ అంగీకారం తెలిపారు. సెప్టెంబర్ 4న హారిస్‌తో కలిసి ఫాక్స్ న్యూస్ డిబెట్లో పాల్గొననున్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించారు.కాగా కమలా హారిస్,ట్రంప్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో పాల్గొనడం ఇదే తొలిసారి. అయితే గత జూన్‌లో ట్రంప్, జోబైడెన్ అధ్యక్ష చర్చలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చర్చలో బైడెన్ సరిగా మాట్లాడలేకపోయారని విమర్శలు వెల్లువెత్తాయి. ట్రంప్ మాటలకు సమాధానలు చెప్పడంలో విఫలమైనట్లు, తడబడినట్లు విశ్లేషకులు భావించారు. దీంతో ఆయన్ను అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డెమొక్రాట్ల నుంచి ఒత్తిడి వచ్చింది. అనుకున్నట్లుగానే చివరికి బైడెన్ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు.ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున కమలా హారిస్ అభ్యర్థిత్వం ఖరారైన అనంతరం ట్రంప్ నుంచి ఈ ప్రకటన వెలువడింది. శుక్రవారం డెమోక్రటిక్ పార్టీ డెలిగేట్ల ఆన్లైన్ పోలింగ్ మొదలైన నేపథ్యంలో ఆమె మెజారిటీ ఓట్లను గెల్చుకున్నారు. దాంతో అభ్యర్థిత్వం ఖరారైంది. ఇదిలా ఉండగా నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. -
గెలిచినా, ఓడినా చరిత్రే!
భారతీయ బ్రాహ్మణ మూలాలున్న కమలాదేవి హ్యారిస్‌కు అమెరికాలో జరిగింది ఒక సామాజిక అద్భుతం అని చెప్పాలి. తండ్రి వైపు నుంచే కాకుండా, తల్లి పోరాటాల రీత్యా కూడా ఆమె నల్లజాతి వారసత్వాన్ని ఎంచుకున్నారు. యవ్వనంలోనూ, ఆ తర్వాతా తెల్లజాతి జాత్యహంకార భావాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ దేశానికి తొలి నల్లజాతి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఇప్పటికే చరిత్ర సృష్టించారు. ఇది కొన్ని దశాబ్దాల క్రితం ఊహించ డానికి కూడా వీలు లేని సామాజిక దృగ్విషయం. ఇప్పుడు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా శ్వేతజాతీయ వాదులతోనూ, మహిళా వ్యతిరేకి అయిన ట్రంప్ తోనూ ఆమె పోరాడుతారు. గెలిచినా ఓడినా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది మహిళలకు రోల్ మోడల్‌గా నిలుస్తారు.‘నేను హిందువునెట్లయిత?’ అని 1996లో నేను రాసిన పుస్తకంలో, బ్రాహ్మణుడు తనను తాను దళితుడిగా మార్చుకున్నప్పుడే భారతదేశం మార్పు చెందుతుందని చెప్పాను. అలాంటిది జరుగుతుందని ఊహించలేమని కొంత మంది భారతీయ చరిత్ర, సంస్కృతి పండితులు విమర్శించారు.సంస్కృతీకరణ ప్రక్రియలో భాగంగా బ్రాహ్మణుల అన్ని జీవన విధా నాలను శూద్రులు, దళితులు అవలంబిస్తారనేది వారి వాదన. మరాఠాలు ఓబీసీ రిజర్వేషన్ పొందడానికి ‘కున్బీ’ సర్టిఫికెట్ అడగటం గురించి గానీ, చాలామంది శూద్ర ఓబీసీలు రిజర్వేషన్ కోటా కోసం ఆదివాసీ లేదా దళిత హోదా అడగటం గురించి గానీ వారు ఏం చెబుతారో నాకు తెలీదు. ఉత్తర భారత బనియాలు ఓబీసీ సర్టిఫికెట్లను తీసుకుంటూ రిజర్వేషన్ పొందడం గురించి వాళ్లేమంటారు? దీన్నిసంస్కృతీకరణ అనవచ్చా? నా దృష్టిలో అది దళితీకరణే కానీ సంస్కృతీకరణ కాదు. ఈ రోజుల్లో ఏ కులమైనా బ్రాహ్మణ సర్టిఫికెట్ కోసం అడగడం లేదు. భారతదేశంలో ఇలా జరుగుతుండగా, పాశ్చాత్య దేశా లలోని వలస భారతీయుల్లో ఏం జరుగుతోంది? భారతీయ బ్రాహ్మణ మూలాలున్న కమలాదేవి హ్యారిస్‌కు అమెరి కాలో జరిగింది ఒక సామాజిక అద్భుతం అని చెప్పాలి. ఆమె ఆఫ్రికన్–అమెరికన్ హోదాను పొందింది తన నల్లజాతి తండ్రి కారణంగానే కాదు... ఆమె తల్లి శ్యామల గోపాలన్ హ్యారిస్ తమిళ బ్రాహ్మణ వలసదారు. నల్లజాతి స్త్రీలా కనిపించేవారు. పైగా వివాహా నికి ముందు తన జీవితంలో ఎక్కువ భాగం యూసీ బర్కిలీ ప్రాంతంలోని నల్లజాతి పరిసరాల్లో జీవించారు. మార్టిన్ లూథర్ కింగ్ జూని యర్ సాగించిన పౌర హక్కుల ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. డొనాల్డ్ హ్యారిస్‌తో ఆమె వివాహం జరిగిన తర్వాత కలిగిన ఇద్దరు కుమార్తెలు కమల, మాయ నల్లజాతీయుల పరిసరాల్లోనే పెరిగారు. వారు తమ ప్రారంభ జీవితంలో నల్లజాతి ఆధిపత్య పాఠశాలలో చదువుకున్నారు. ఆమె భర్త డొనాల్డ్ హ్యారిస్ జమైకన్ అమెరికన్ ఆర్థికవేత్త. శ్యామలకు విడాకులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు జమైకాలో నివసిస్తున్న ఆయన కూడా నవ్యభావాలు కలిగిన వ్యక్తి. ఏమైనప్పటికీ, కమల తన తల్లి వైపు పూర్వీకుల బ్రాహ్మణ గోధుమవర్ణ సంప్రదాయ వారసత్వాన్ని ప్రకటించుకోవచ్చు. లేదా తల్లి, తండ్రి మాదిరిగా నల్ల వారి జీవితాలూ విలువైనవే భావనతో కూడిన క్రైస్తవీకరణ ప్రక్రియను అనుసరించవచ్చు. ఆమె నల్లజాతి వారసత్వాన్ని ఎంచుకున్నారు. తన యవ్వనంలోనూ, ఆ తర్వాతా తెల్లజాతి జాత్యహంకార భావాలకు వ్యతిరేకంగా పోరాడారు.ఆ దేశానికి తొలి నల్లజాతి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమల ఇప్పటికే చరిత్ర సృష్టించారు. ఇది కొన్ని దశాబ్దాల క్రితం ఊహించ డానికి కూడా వీలు లేని సామాజిక దృగ్విషయం. ఆఫ్రికనీకరణచెందిన నల్ల–గోధుమ బ్రాహ్మణ మహిళ అయిన కమలా హ్యారిస్, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా శ్వేతజాతీయ వాదులతోనూ, మహిళా వ్యతిరేకి అయిన ట్రంప్‌తోనూ పోరాడుతారు. ఎన్నికల్లో గెలిస్తే అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలు, తొలి నల్లజాతి మహిళా అధ్యక్షురాలు అవుతారు. 250 ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో అధ్యక్షురాలిగా వైట్‌హౌజ్‌లో ప్రవేశించడానికి శ్వేతజాతి లేదా నల్లజాతి మహిళను అమెరికా ఎప్పుడూ అనుమతించలేదు. వైట్‌హౌజ్‌లో నివసించిన మహిళలందరూ వారి అధ్యక్ష భర్తలకు సహాయక పాత్రను పోషించే ప్రథమ మహిళలు (ఫస్ట్ లేడీస్)గా ఉండేవారు. కమల గెలిస్తే తన భర్తను ప్రథమ పురుషుడి (ఫస్ట్ మ్యాన్)గా మార్చిన మహిళ అవుతారు. ఇకపై ఆయన భూమిపై ఉన్న తన అత్యంత శక్తిమంతమైన భార్యామణిని జాగ్రత్తగా చూసుకోవాలి.బరాక్ ఒబామా మొట్టమొదటి అమెరికన్ నల్లజాతి పురుష అధ్యక్షుడిగా ఎంపికైనప్పుడు, శ్వేతజాతి ఆధిపత్యవాదులు మినహా అందరూ ఆ విజయాన్ని పండుగలా జరుపుకొన్నారు. పైగా ఆయన ఎనిమిదేళ్లు విజయవంతమైన అధ్యక్షుడిగా నిరూపించుకున్నారు. అయినా అది అమెరికా ప్రాథమిక పితృస్వామ్య స్వభావాన్ని మార్చ లేదు.మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చాలామంది భార తీయ సంతతికి చెందిన పురుషులు, మహిళలు పాశ్చాత్య దేశాలలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రిషి సునాక్ ఇప్పటికే తనను తాను హిందువునని పదేపదే ప్రకటించుకుంటూ ఏడాదికి పైగా ప్రధానిగా బ్రిటన్ను పాలించారు. అయితే, కమల మత విశ్వాసం రీత్యా క్రైస్తవురాలు. ఆమె క్రిస్టియన్ కాకపోతే ఉపాధ్యక్ష పదవి వచ్చేది కాదు, అధ్యక్ష అభ్యర్థిగా అవకాశం కూడా వచ్చేది కాదు. హిందువుగా ఉంటూ వైట్‌హౌజ్‌లోకి వెళ్లాలనుకునేవారు కొందరు న్నారు. భారతీయ మూలాలకు చెందిన శాకాహార బ్రాహ్మణుడైన వివేక్ రామస్వామి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారుగానీ విఫలమ య్యారు. కమలను ‘పిల్లలు లేని పిల్లి’ అని పిలిచిన రిపబ్లికన్ల ఉపా ధ్యక్ష అభ్యర్థి జేడీ వా¯Œ ్స భార్య ఉషా చిలుకూరి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బ్రాహ్మణ మూలాలున్న మహిళ. ఆమె తన హిందూ శాకాహార సాంస్కృతిక విలువను బహిరంగంగా ప్రకటించుకున్నారు.విగ్రహాలను పూజించే సునాక్‌ను ప్రధానిగా అనుమతించిన బ్రిటన్‌లా కాకుండా, భారతదేశ ప్రధానిగా మరే విదేశీ వ్యక్తినీ అనుమ తించకూడదనే ఆరెస్సెస్/బీజేపీ నమూనాను అమెరికా కూడా అనుస రించవచ్చు. ఇతర మతవిశ్వాసం గల మరే వ్యక్తినీ అధ్యక్షుడిగా అమె రికా అనుమతించకపోవచ్చు. ఏదేమైనా, కమల వారి ఆధ్యాత్మిక భావాలకు సరిపోతారు.కమల తన ఆఫ్రికన్–అమెరికన్ ముద్రతో దేశాధ్యక్షురాలైతే, నల్లజాతి అమెరికన్లతో అంతగా సంబంధం లేని భారతీయ ప్రవా సులు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటారు. సంపన్న భారతీ యులు, ముఖ్యంగా మితవాద హిందూ భారతీయులు... ట్రంప్ దాత లుగా, ట్రంప్ ఓటర్లుగా ఉంటున్నారు. ట్రంప్ 2020లో మోదీ బల పరిచిన అభ్యర్థి. బహుశా ఇప్పటికీ ఆరెస్సెస్/బీజేపీ పంథా అదే కావచ్చు. వారు డెమోక్రటిక్ పార్టీని వామపక్ష ఉదారవాద పార్టీగా చూస్తారు. ఉపాధ్యక్షురాలిగా తన అధికారిక హోదాలో కమల భారత్‌ను సందర్శించలేదు. నలుపు, గోధుమరంగు స్త్రీ–పురుష సంబంధాలను నివారించ డానికీ, తెల్లవారితో కలిసి జీవించడానికీ భారతీయ అమెరికన్లు ప్రయత్నిస్తారు. శ్యామలా గోపాలన్, కమలాదేవిలా కాకుండా, వారు శ్వేతజాతీయుల పరిసరాల్లో లేదా వారి సొంత భారతీయ (దక్షిణా సియా కూడా కాదు) పరిసరాల్లో ఉంటూ, స్వచ్ఛమైన శాకాహార పార్టీలతో జీవించడానికి ఇష్టపడతారు. అలాంటి పార్టీలలో మగవాళ్లు సూట్లు ధరిస్తారు, మహిళలు భారతీయ నారీమణుల్లాగా చీరలు కట్టు కుంటారు. కమలా హ్యారిస్ మాత్రం అమెరికన్ వ్యక్తిలా చక్కగా డిజైన్ చేసిన ఫుల్ సూట్లో కనిపిస్తారు. ఆమె దుస్తుల కోడ్ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ, పురుషునిలాగా ఎలా ఉండాలని అమెరికన్ స్త్రీలు కూడా ఆమె నుండి నేర్చుకునేలా ఉంటుంది. అన్నిటికంటే మించి ఆమె జీవన శైలి సమానత్వంతో కూడుకున్నది.కమలా హ్యారిస్ అధ్యక్ష రేసులో గెలిచినా, ఓడినా మార్పు దోహద కారులలో ఒకరిగా మారారు. భారతీయ సంతతికి చెందిన మహిళగా ఆమె ఆఫ్రికనీకరణ, మార్పు దోహదకారి పాత్రను నేను ఎంతగానో ఆరాధిస్తున్నాను. ఆమె భవిష్యత్తులోనూ శతాబ్దాల పాటు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది మహిళలకు రోల్ మోడల్‌గా ఉంటారు. ఆమె గెలిచి తన భర్తను వైట్‌హౌజ్‌లో ప్ర«థమ పురుషుడి (ఫస్ట్ మ్యాన్)గా చేస్తారని ఆశిస్తున్నాను.-వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త - ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
ఐరాసలో రామకథాపారాయణం
న్యూయార్క్: రామచరిత మానస్‌ను ఆధ్యాత్మిక వేత్త మొరారి బాపు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో తొలిసారి పారాయణం చేయనున్నారు. ఐక్యరాజ్యసమితిలోని ప్రతినిధుల భోజనశాలలో 9 రోజుల పాటు ఈ పారాయణం జరగనుందని మొరారి బాపు తెలిపారు. శాంతిని పరిరక్షించడంతో పాటు మానసిక ఆరోగ్యానికి రామ కథలు మార్గం చూపుతాయన్నారు. రామాయణ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రపంచంలో సోదర భావాన్ని పెంపొందించి సరిహద్దులకు అతీతంగా ప్రజలను ఏకం చేయడమే లక్ష్యమన్నారు. రామచరిత మానస్‌ను ప్రముఖకవి తులసిదాస్ రచించారు. -
US: అమ్మాయి అనుకుని చాటింగ్.. భారత విద్యార్థికి 12 ఏళ్ల జైలు
న్యూయార్క్: ఉన్నత చదువులు చదవడానికి అమెరికా వెళ్లి బుద్ధి వక్రీకరించి 12 ఏళ్ల జైలు శిక్షకు గురయ్యాడు ఓ భారత విద్యార్థి. స్టూడెంట్ వీసా మీద అమెరికా వెళ్లిన ఉపేంద్ర ఆడూరు(32) భారత విద్యార్థి సోషల్ మీడియాలో 13 ఏళ్ల బాలిక అనుకుని ఓ వ్యక్తితో చాటింగ్ మొదలుపెట్టాడు. తన లైంగిక వాంఛ తీర్చుకునేందుకు మభ్యపెట్టే విధంగా సందేశాలు పంపాడు. అంతటితో ఆగకుండా ఆ ఖాతాకు అశ్లీల చిత్రాల మెసేజ్‌లు కూడా పెట్టాడు. ఏకంగా ఓ రోజు టైమ్ ఫిక్స్ చేసుకుని ఆ బాలికను కలవడానికి వెళ్లాడు. ఇక్కడే అతడికి ఎదురైంది పెద్ద ట్విస్టు. ఉపేంద్ర అనుకున్నట్లు ఆ ఖాతా 13 ఏళ్ల బాలికది కాదు.మైనర్ల మీద లైంగికనేరాలకు పాల్పడే వారిని వలపన్ని పట్టుకునేందుకు ఓ ప్రైవేట్ డిటెక్టివ్ క్రియేట్ చేసిన నకిలీ ఖాతా. ఉపేంద్ర బాలికను కలిసేందుకు మీటింగ్ స్పాట్‌కు వెళ్లగానే పోలీసులు పట్టుకున్నారు. అతడి ఫోన్ లాక్కుని అందులోని అశ్లీల వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారమంతా 2022 సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 6 మధ్యలో జరిగింది. ఈ కేసులో ఉపేంద్రకు 12 ఏళ్ల జైలు శిక్షతో పాటు రిలీజ్ అయిన తర్వాత మరో 10 ఏళ్లు పోలీసుల పర్యవేక్షణలో ఉండాలని కోర్టు తీర్పిచ్చింది. -
అమెరికా బృందం పతాకధారిగా లెబ్రాన్ జేమ్స్
పారిస్ ఒలింపిక్స్ ప్రారంబోత్సవంలో పాల్గొనే అమెరికా క్రీడాకారుల బృందానికి పతాకధారిగా బాస్కెట్‌బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్ వ్యవహరిస్తాడు. 39 ఏళ్ల లెబ్రాన్ నాలుగోసారి ఒలింపిక్స్ క్రీడల్లో పోటీపడనున్నాడు. 6 అడుగుల 9 అంగుళాల ఎత్తున్న లెబ్రాన్ 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో కాంస్యం... 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు నెగ్గిన అమెరికా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. లండన్ గేమ్స్ తర్వాత లెబ్రాన్ రియో, టోక్యో ఒలింపిక్స్‌కు దూరంగా ఉన్నాడు. ఎన్బీఏ లీగ్ చరిత్రలో అత్యధిక పాయింట్లు (48,177) సాధించిన ప్లేయర్‌గా లెబ్రాన్ రికార్డు నెలకొల్పాడు. -
రావును రప్పించగలరా?
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావును అమెరికా నుంచి వెనక్కు రప్పించడం అంత తేలిక కాదని తెలుస్తోంది. ఆయన వైద్యపరమైన కారణాలతో ఆ దేశంలో ఉండటం, ఇంటర్‌పోల్ కేవలం బ్లూకార్నర్ నోటీసు మాత్రమే జారీ చేసే అవకాశం ఉండటంతో దర్యాప్తు అధికారులు ఆయన డిపోర్టేషన్ (బలవంతంగా రప్పించడం) పై మల్లగుల్లాలు పడుతున్నారు. సుదీర్ఘకాలం ఎస్ఐబీ చీఫ్‌గా వ్యవహరించిన ప్రభాకర్‌రావు గత డిసెంబర్ 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసి రాజీనామా చేశారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు, తదితర పరిణామాలను గమనించిన ఆయన తిరుపతికి ప్రయాణమై కనీసం కుటుంబీకులకు కూడా చెప్పకుండా అటు నుంచే చెన్నై మీదుగా అమెరికా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన టెక్సాస్‌లో వైద్యం చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. గత నెల 12న ప్రభాకర్‌రావు కుమారుడిని విచారించిన పోలీసులు ఆయన తిరిగి ఎప్పుడు వస్తారని ప్రశ్నించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభాకర్‌రావు ఇటీవల ఈ–మెయిల్ ద్వారా దర్యాప్తు అధికారికి లేఖ రాశారు. జూన్ నాటికి పూర్తిగా కోలుకుని తిరిగి వచ్చేస్తానని భావించానని, నిరాధార ఆరోపణలతో కలిగిన మానసిక వేదన కారణంగా ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆ లేఖలో పేర్కొన్నారు. బ్లూ కార్నర్ నోటీసు జారీ అయినప్పటికీ... హైదరాబాద్ పోలీసులు ప్రభాకర్‌రావుపై తొలుత ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించాలని భావించారు. అయితే ఆ విభాగం దృష్టిలో ఈ కేసు అంత తీవ్రమైంది కాదనే ఉద్దేశంతో బ్లూ కార్నర్ నోటీసుల జారీ కోసం సీబీఐని ఆశ్రయించారు. ఇవి జారీ అయినా ఇంటర్‌పోల్ ప్రభాకర్‌రావు ఆచూకీ కనిపెట్టి, ఆయన కదలికలపై నిఘా ఉంచుతుంది తప్ప బలవంతంగా తిప్పి పంపదు. ఒకవేళ ఏదో ఒకవిధంగా డిపోర్టేషన్ ఉత్తర్వులు పొందినా.. అవి అమెరికా న్యాయవ్యవస్థ ఆమోదం పొందాలి. అమెరికా న్యాయవ్యవస్థ వద్ద వెయ్యికిపైగా వివిధ నోటీసులు పెండింగ్‌లో ఉండగా.. ఇప్పటివరకు కేవలం 56 నోటీసుల అమలుకే అనుమతి ఇ చ్చింది. అమెరికా వంటి దేశాల్లో వ్యక్తుల ప్రాణాలు, ఆరోగ్యానికి విలువ ఎక్కువ. ప్రభాకర్‌రావు అక్కడ మెడికల్ గ్రౌండ్స్‌పై ఉంటున్నందున ఆయనపై నోటీసు జారీ అయినా డిపోర్టేషన్‌కు అనుమతించే అవకాశాలు చాలా తక్కువే. వీసాగడువులో మతలబులుఎన్నో...తరచూ అమెరికాకు వెళ్లి వస్తున్న ఆయా వ్యక్తుల కుటుంబీకులు, అక్కడే ఉంటున్న ప్రభాకర్‌రావు వంటి వారికి సాధారణంగా 10 నుంచి 15 ఏళ్ల గడువుతో కూడిన వీసాలు లభిస్తుంటాయి. అయితే ఒకసారి ఆ దేశంలో అడుగుపెట్టిన తర్వాత గరిష్టంగా 180 రోజులలోపు తిరిగి బయటకు వచ్చేయాలనే నిబంధన ఉంది. దీంతో ప్రస్తుతం ఆయన 179 రోజులు అక్కడ ఉండి, ఆపై కెనడా లేదా మరో దేశానికి కొన్ని రోజులు వెళ్లి వస్తే.. మళ్లీ 179 రోజులు అమెరికాలో ఉండే అవకాశం దక్కుతుంది. ప్రభాకర్‌రావు వైద్యం చేయించుకుంటున్న నేపథ్యంలో వీసా గడువు తేలిగ్గా పొడిగించుకునే అవకాశం ఉంది. రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం ద్వారా ఆయన పాస్‌పోర్టు రద్దుకు ప్రయత్నాలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇది కూడా ఆశించిన ఫలితం ఇవ్వదని కొందరు నిపుణులు చెబుతున్నారు. -
‘ఐఎస్ఎస్’ కూల్చడమెందుకు? ‘నాసా’ ఏం చెప్పింది?
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్) ఫ్యూచరేంటి..? 400కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలో తిరుగుతున్న ఐఎస్ఎస్ను కక్ష్య నుంచి తప్పించి ఎలా కూలుస్తారు. ఐఎస్ఎస్ను కక్ష్య నుంచి తప్పించేందుకు సిద్ధం చేస్తున్న యూఎస్‌డీఆర్బిట్ వెహిహికిల్(యూఎస్‌డీవీ)ని ఎలా ఉపయోగిస్తారు..?అసలు ఐఎస్ఎస్ను కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది. అంతా సజావుగా జరిగి 2030లో ఐఎస్ఎస్ నింగి నుంచి మాయమైన తర్వాత అంతరిక్ష పరిశోధనల మాటేమిటి..? ఈ విషయాలన్నింటిపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అసలు ఐఎస్ఎస్ ఏంటి.. ఎందుకు..?అమెరికా, రష్యా, కెనడా, జపాన్, యూరప్‌లు 1998 నుంచి 2011వరకు శ్రమించి ఐఎస్ఎస్ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశాయి. 2000 సంవత్సరం నవంబర్ 2వ తేదీనే ఐఎస్ఎస్ కమిషన్ అయింది. అప్పటినుంచే అది అంతరిక్షంలో వ్యోమగాములకు ఆశ్రయమిస్తూ ఎన్నో పరిశోధనలకు వేదికైంది. ప్రస్తుతం 15 దేశాలు ఐఎస్ఎస్ను నిర్వహిస్తున్నాయి. అంతరిక్ష పరిశోధనల కోసం భారీ ఖర్చుతో ఐఎస్ఎస్ను నిర్మించారు. ఆశించినట్లుగానే స్పేస్ రీసెర్చ్‌లో 24 ఏళ్లుగా ఐఎస్ఎస్ గొప్పగా సేవలందిస్తోంది.డీ కమిషన్ చేయడం ఎందుకు..?ఐఎస్ఎస్ నింగిలో పనిచేయడం ప్రారంభించి 2030నాటికి 30 ఏళ్లు పూర్తవుతుంది. అప్పటికి ఐఎస్ఎస్ చాలా పాతదవుతుంది. అంతరిక్ష వాతావరణ ప్రభావం వల్ల దాని సామర్థ్యం తగ్గిపోతుంది. అందులోని చాలా విడిభాగాలు పనిచేయవు. ఐఎస్ఎస్లోని పరికరాలన్నీ నెమ్మదిస్తాయి. ఐఎస్ఎస్లో వ్యోమగాములు నివసించే మాడ్యూళ్లు పనికిరాకుండా పోతాయి. అది ప్రస్తుతం తిరుగుతున్న 400 కిలోమీటర్ల ఎత్తులోని ఆర్బిట్ నుంచి దానికదే కిందకు దిగడం ప్రారంభమవుతుంది. నిజానికి ఐఎస్ఎస్ను నిర్దేశిత కక్ష్యలో ఉంచడం మళ్లీ సాధ్యమే అయినప్పటికీ అది చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. ఇందుకే 2030లో ఐఎస్ఎస్ను డీ కమిషన్ చేయాలని నిర్ణయించారు.ఎలా కూలుస్తారు..?ఐఎస్ఎస్ను తొలుత కక్ష్యలో నుంచి తప్పించి(డీఆర్బిట్) నెమ్మదిగా భూమిపై కూల్చేస్తారు. ఐఎస్ఎస్ను కక్ష్య నుంచి తప్పించి భూమిపై కూల్చేయడం సాధారణ విషయం కాదు. దీనిని చాలా అడ్వాన్స్డ్ సైంటిఫిక్ నైపుణ్యంతో జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను ఈలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ తయరు చేస్తున్న యూఎస్‌డీఆర్బిట్ వాహనాన్ని నాసా వాడనుంది. 2030లో ఐఎస్ఎస్ను డీ కమిషన్ చేయనున్నప్పటికీ 18 నెలల ముందే డీ ఆర్బిట్ వెహికిల్ నింగిలోకి వెళ్లి ఐఎస్ఎస్తో అనుసంధానమవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఐఎస్ఎస్ను కక్ష్య నుంచి తప్పించి జాగ్రత్తగా భూ వాతావరణానికి తీసుకువస్తారు. భూ వాతావరణానికి రాగానే ఐఎస్ఎస్ మండిపోతుంది. దాని శకలాలను మనుషులెవరూ ఉండని దక్షిణ పసిఫిక్ ఐలాండ్లలో పడేలా చేస్తారు. డీఆర్బిట్ వెహిహికల్ ఎలా పనిచేస్తుంది..సాధారణంగా ఐఎస్ఎస్కు వ్యోమగాములను మోసుకెళ్లి దానితో అనుసంధానమయ్యే డ్రాగన్ కాప్స్యూల్స్‌తో పోలిస్తే డీఆర్బిట్ వెహికిల్ యూఎస్‌డీవీకి ఆరు రెట్ల ఎక్కువ శక్తి కలిగిన ప్రొపల్లెంట్ ఉంటుంది. డీ ఆర్బిట్ వెహికిల్ ఐఎస్ఎస్ డీ కమిషన్‌కు 18 నెలల ముందే వెళ్లి దానితో అనుసంధానమవుతుంది. ఇంకో వారంలో ఐఎఎస్ఎస్ డీ ఆర్బిట్ అవనుందనగా యూఎస్‌డీవీలోని ఇంధనాన్ని మండించి ఐఎస్ఎస్ను కక్ష్య నుంచి తప్పించి భూమివైపు తీసుకురావడం మొదలుపెడతారు. చివరిగా భూ వాతావరణంలోకి రాగానే ఐఎస్ఎస్ మండిపోతుంది. దీంతో ఐఎస్ఎస్ 30 ఏళ్ల ప్రస్థానం ముగిసిపోతుంది.ఐఎస్ఎస్ తర్వాత నాసా ప్లానేంటి..? పరిశోధనలు ఎలా..? ఐఎస్ఎస్ చరిత్రగా మారిన తర్వాత సొంతగా కొత్త స్పేస్ స్టేషన్లను అభివృద్ధి చేసే ప్లాన్ అమెరికాకు లేదు. ప్రైవేట్ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న స్పేస్ స్టేషన్లను అద్దెకు తీసుకుని అంతరిక్ష పరిశోధనలు చేసే అవకాశముంది. ఒకవేళ 2030కల్లా ప్రైవేట్ కంపెనీల స్పేస్ స్టేషన్లు సిద్ధం కాకపోతే డీ ఆర్బిట్ వెహికిల్‌ను వాడి ఐఎస్ఎస్ జీవితకాలాన్ని పొడిగించాలన్న ప్లాన్ బీ కూడా నాసాకు ఉండటం విశేషం. -
మైక్రోసాఫ్ట్ బగ్ ప్రభావం .... అమెరికా గగనతలం ఖాళీ!
న్యూయార్క్: అమెరికా గగనతలంలో ప్రతి రోజు విమానాల ట్రాఫిక్ ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఈ ట్రాఫిక్ ఒక్కసారిగా తగ్గిపోతే ఎలాఉంటుందో శుక్రవారం(జులై 19) అర్థమైంది. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో బగ్ సమస్య తలెత్తి అమెరికాలోని ప్రముఖ ఎయిర్‌లైన్స్ కంపెనీలైన అమెరికన్ ఎయిర్‌లైన్స్,డెల్టా,యునైటెడ్ సంస్థల విమానాలు ఎక్కడికక్కడే ఎయిర్‌పోర్టుల్లో నిలిచిపోయాయి. దీంతో అగ్రదేశ గగనతలంలో విమానాల ట్రాఫిక్ పూర్తిగా తగ్గిపోయింది. అక్కడ సాధారణ సమయంలో విమానాల రద్దీ ఎలా ఉంటుంది.. శుక్రవారం విమానాల రద్దీ తగ్గిన తర్వాత ఎలా ఉందనే 12 గంటల ఆసక్తికర టైమ్‌లాప్స్ వీడియోను ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. విమానాల ట్రాఫిక్ టైమ్‌లాప్స్ వీడియోను నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు. 12-hour timelapse of American Airlines, Delta, and United plane traffic after what was likely the biggest IT outage in history forced a nationwide ground stop of the three airlines. pic.twitter.com/wwcQeiEtVe— Colin McCarthy (@US_Stormwatch) July 19, 2024 -
అమెరికా రాజకీయంలో హింసాపర్వం
అమెరికా రాజకీయ జీవితంలో హింస ఒక భాగమైందన్నది వాస్తవం. తుపాకుల లభ్యత, వాటి యాజమాన్యంపై నియంత్రణలను సడలించారు.ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించిన కోల్ట్ ఏఆర్–15 వంటి ఆయుధాలను నిషేధించే ప్రయత్నం పదేళ్లే కొనసాగింది. ఇది కోర్టులో పదేపదే సవాళ్లను ఎదుర్కొంది. ఎక్కువగా ఇటువంటి ఆయుధాలతోనే సామూహిక కాల్పులు జరుపుతారు. 2023లో, 604 కాల్పులు జరగగా 754 మంది మరణించారు. ఇక ట్రంప్ మీద జరిగిన హత్యాయత్నం ఆయనకు రాజకీయంగా లాభిస్తుందనేది సుస్పష్టం. అలాగే ట్రంప్ వాచాలత్వం పెను మంటలు రగిలించేలా ఉందన్నదీ రహస్యం కాదు. ఆయన ఎలా వ్యవహరిస్తారనే దానిపై ప్రస్తుత పరిస్థితి చాలావరకు ఆధారపడి ఉంటుంది.అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నానికి సంబంధించిన రాజకీయ పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. అవి ఆయనకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తాయి. తనపై జరిగిన దాడి పట్ల ట్రంప్ సహజమైన, పోరాట ప్రతిస్పందనలకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఆయనను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు చుట్టుముట్టినప్పుడు, తన ముఖం మీద రక్తపు చారలతో, తన కుడి పిడికిలిని పైకెత్తి, ‘ఫైట్, ఫైట్, ఫైట్’(పోరాడు) అంటూ గర్జించారు. రక్తసిక్తమైన, ఆగ్రహోదగ్రుడైన ట్రంప్ పిడికిలి బిగించి ఉండగా, ఆయన వెనుక ఒక అమెరికన్ జెండా రెపరెపలాడుతున్న చిత్రాలు వైరల్‌గా మారాయి. రెండు వారాల క్రితం అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన చర్చలో జో బైడెన్ ప్రదర్శన, సమర్థ వంతమైన ప్రచారాన్ని నిర్వహించగల ఆయన సామర్థ్యం వల్ల అధ్యక్ష పోటీ ఇప్పటికే గందరగోళంలో పడింది.తనపై ఉన్న కేసుల కారణంగా తనను తాను అమర వీరుడు గానూ, హింసకు గురైన వ్యక్తిగానూ ప్రదర్శించుకోవడం ట్రంప్ విధానం. కాల్పుల ద్వారా మృత్యువుకు సమీపంగా వెళ్లడం అనేది ఆయనకు అమరత్వ భావనను ఆపాదిస్తుంది. అధ్యక్షుల చర్చలో పరాజయం తరువాత డెమోక్రాటిక్ అభ్యర్థిగా బైడెన్‌ను తొలగించా లనే ప్రచారంపై ట్రంప్ మీద హత్యాయత్నం తప్పక ప్రభావం చూపు తుంది. ట్రంప్ వర్గానికి అంతకంటే కావాల్సింది లేదు.ట్రంప్‌పై కాల్పుల ఘటన బైడెన్ ప్రచారాన్ని క్లిష్టతరం చేస్తుంది. ఇప్పుడు నేరుగా ట్రంప్‌పై దృష్టి సారిస్తానని అమెరికా అధ్యక్షుడు గత వారంలో అన్నారు. ట్రంప్‌ను ఓడించడానికి తానే ఉత్తమ అభ్యర్థిగా ఉన్నానని ఆయన అభిప్రాయం. ‘లక్ష్యానికి సంబంధించిన కేంద్ర స్థానంలో ట్రంప్‌ను ఉంచే సమయం వచ్చింది’ అన్న బైడెన్ మాటల్ని, తమ అధ్యక్ష అభ్యర్థిపై హింసకు పిలుపుగా ఇప్పుడు కొంతమంది రిపబ్లికన్లు ఆపాదిస్తున్నారు. ఇది ఒక విడి ఘటన కాదనీ, ట్రంప్ ‘ఏ రకంగానైనా అడ్డుకోవలసిన నిరంకుశ ఫాసిస్ట్’ అనే డెమోక్రాటిక్ పార్టీ వాచాలత్వపు అనివార్య పరిణామమనీ రిపబ్లికన్ల ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ పోస్ట్ చేశారు.అమెరికా రాజకీయ జీవితంలో హింస ఒక భాగమైందన్నది వాస్తవం. తుపాకుల లభ్యత, వాటి యాజమాన్యంపై నియంత్రణ లను సడలించడం వంటి నిర్ణయాలతో కోర్టులేమీ మేలు చేయలేదు. ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించిన కోల్ట్ ఏఆర్–15 వంటి దాడి ఆయుధాలను నిషేధించే ప్రయత్నం కేవలం పదేళ్లపాటు కొనసాగింది. ఇది కోర్టులో పదేపదే సవాళ్లను ఎదుర్కొంది. ప్రస్తుతం, కొన్ని రాష్ట్రాలు తమ సొంత చట్టాల ద్వారా అటువంటి ఆయుధాలను నిషేధించాయి. కాల్పుల ఘటన జరిగిన పెన్సిల్వే నియా వాటిలో లేదు. ఎక్కువగా ఇటువంటి ఆయుధాలతోనే సామూహిక కాల్పులు జరుపుతారు. జూలైలో ఇప్పటికే మరొక కాల్పుల ఘటన, అయిదు మంది మరణాలకు దారితీసింది. 2023లో, 604 కాల్పులు జరగగా 754 మంది మరణించారు, దాదాపు 2,500 మంది గాయపడ్డారు. అమెరికన్ సుప్రీంకోర్ట్ సహాయకారిగా లేదని చెప్పడం చిన్న మాటే అవుతుంది.బైడెన్ గెలుపొందిన ఎన్నికల ఫలితాలను ట్రంప్ మద్దతుదారులు 2021 జనవరి 6న తారుమారు చేయడానికి ప్రయత్నించిన కాపిటల్ అల్లర్ల నుండి, అమెరికా ఎన్నికల ప్రక్రియ హింసకు దారితీసింది. తిరుగుబాటును అణిచివేసేందుకు ముందు రేగిన అల్లకల్లోలంలో తొమ్మిది మంది మరణించారు. దీనివల్లనే ట్రంప్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత అమెరికన్ రాజకీయాలు లోతుగా విభజనకు గుర య్యాయి. ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ పోల్ ప్రకారం, ప్రతి రాజకీయ పక్షంలోనూ దాదాపు మూడింట రెండు వంతుల మంది... ఇతర పార్టీలలోని వారు అనైతికులనీ, నిజాయితీ లేనివారనీ, సంకు చిత మనస్తత్వం గలవారనీ నమ్ముతున్నారు.ట్రంప్ వాచాలత్వం పెను మంటలు రగిలించేలా ఉందన్నది రహస్యం కాదు. తాను వచ్చే నవంబర్ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే ‘రక్తపాతం’ ఉంటుందని మార్చ్ నెలలో ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు. తరువాత ఒక ర్యాలీలో, ‘ఇప్పుడు నేను ఎన్నిక కాకపోతే... అది దేశానికి రక్తపాత కారకం అవుతుంది’ అని పునరావృతం చేశారు. 2023 మార్చిలో, ట్రంప్ దోషిగా నిర్ధారించబడిన కేసులో మాన్ హట్టన్ జిల్లా ప్రభుత్వ న్యాయవాది తనపై అభియోగాలు మోపినట్లయితే ‘సంభావ్య మరణం, విధ్వంసం’ జరగొచ్చని మాజీ అధ్యక్షుడు హెచ్చరించారు. తనకు అన్యాయం జరిగితే ‘వీధుల్లో అల్లర్లు జరుగు తాయి’, ‘దేశంలో అల్లర్లు జరుగుతాయి’ అని బెదిరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన అనుచరులు మరోవైపున వలసదారులు, విదేశీయులు, శ్వేతజాతీయేతర జాతుల ప్రజలపై హింస గురించి మాట్లాడారు. నిజానికి, వ్యాపార లావాదేవీల్లో 34 నేరాలకు ట్రంప్ పాల్పడ్డారని మే నెలలో న్యాయస్థానం ఆయనను దోషిగా ప్రకటించిన తర్వాత, ట్రంప్ అనుకూల వెబ్సైట్లు అల్లర్లు, విప్లవం, హింసాత్మక ప్రతీకారం అనే పిలుపులతో నిండిపోయాయి.ఇటీవలి సంవత్సరాలలోని హింసలో రాజకీయ నమూనా ఉంది. 2017లో, బేస్‌బాల్ గేమ్‌లో రిపబ్లికన్ హౌస్ మెజారిటీ విప్ అయిన స్టీవ్ స్కలైస్ మీద రిపబ్లికన్ వ్యతిరేక గన్ మ్యాన్ కాల్పులు జరిపాడు (ఆ గన్‌మ్యాన్‌ను అప్పుడే కాల్చి చంపారు). 2018లో, ఫ్లోరిడాకుచెందిన ఒక వ్యక్తి నాటి అధ్యక్షుడు ట్రంప్ విమర్శకులకు పైపు బాంబు లను మెయిల్ చేశాడు. అతడు లక్ష్యంగా చేసుకున్నవారిలో బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్, కమలా హారిస్ ఉన్నారు. 2020 ఎన్నికలకు ముందు, మిషిగన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మెర్ను కిడ్నాప్ చేసి, రాజ ద్రోహ నేరం కింద ఆమెను ‘విచారణ’లో నిలబెట్టడానికి ఆరు గురు వ్యక్తులు కుట్ర పన్నారు. 2022లో, మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీని లక్ష్యంగా చేసుకున్నారు; దాడిలో ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు. దుండగుడు పెలోసీని బందీగా తీసుకోవాలని పథకం వేశాడు.ఈ పరిస్థితులలో, సగటు అమెరికన్ నిరుత్సాహానికీ, నిరాశకూ గురవుతాడు. రెండు పార్టీలలోని అతివాద శక్తులు అధికారం చేజిక్కించుకుని ఉన్నాయనీ, గతంలో అమెరికన్ రాజకీయాలకు ప్రతీకగా నిలిచిన ద్వైపాక్షికతకు పెద్దగా చోటు లేకుండా చేశాయనీ సగటు అమెరికన్లు భావిస్తున్నారు.రాబోయే రోజులూ, వారాల్లో బైడెన్ చర్చ వైఫల్యం, దానిపై పొరలుగా, ట్రంప్‌పై హత్యాయత్నం వంటి ఇటీవలి సంఘటనలకు చెందిన పరిణామాల పెరుగుదలను మనం చూస్తాం. చాలామంది సరైన ఆలోచనాపరులు ట్రంప్‌పై కాల్పుల దాడి కలిగించిన షాక్ ప్రభావం ఎంతో కొంత ప్రశాంతతను తెస్తుందని ఆశిస్తున్నప్పటికీ, అలా జరుగుతుందనడానికి ఎటువంటి హామీ లేదు. రష్యన్లు, చైనీయులు తమ వంతు పాత్రను జోడించడంతో ఇప్పటికే తప్పుడు సమాచారం, అతిశయోక్తి, తీవ్రవాదం, జాత్యహంకారం, విభజన, అపనమ్మకం లాంటివి సైబర్ ప్రపంచంలో చెడతిరుగుతున్నాయి.ట్రంప్ ఎలా వ్యవహరిస్తారనే దానిపై ప్రస్తుత పరిస్థితి చాలావరకు ఆధారపడి ఉంటుంది. తనపై హత్యాయత్నాన్ని ఆయన డెమో క్రాట్లపై దాడి చేయడానికి, విభజనలను మరింతగా పెంచడానికి ఉపయోగించవచ్చు లేదా నైతికంగా అత్యున్నత మార్గాన్ని చేపట్టి, పక్షపాత చీలికలను నయం చేయడానికి ఎంచుకోవచ్చు. కానీ ఫిర్యా దులు, ప్రతీకారం చాలాకాలంగా ట్రంప్ ఇతివృతాలుగా ఉన్నాయి. ఆయన తక్షణ ప్రతిస్పందన నెమ్మదిగానూ, తెలివిగానూ ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో ట్రంప్ ఏ దిశలో వెళ్లగలరనే దానిపై అంచనాలు ఊహకందడం లేదు.- వ్యాసకర్త న్యూఢిల్లీలోని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్లోడిస్టింగ్విష్డ్ ఫెలో (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- మనోజ్ జోషి -
ప్రధాని రష్యా టూర్.. స్పందించిన అమెరికా
వాషింగ్టన్: ప్రధాని మోదీ రష్యా పర్యటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఈ విషయమై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిథి మాధ్యూ మిల్లర్ మీడియాతో మాట్లాడారు. ‘రష్యాతో సంబంధాలపై మేం మా ఆందోళనను భారత్‌కు ఇప్పటికే స్పష్టం చేశాం. రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఏం మాట్లాడతారో చూడాలి. ఉక్రెయిన్ సార్వభౌమాత్వాన్ని,ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను గౌరవించాల్సిందిగా రష్యాతో దగ్గరగా వ్యవహరించే ఏ దేశమైనా పుతిన్‌కు చెప్పాలి’అని మిల్లర్ పేర్కొన్నారు. 2022లో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాకు దూరంగా ఉండాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి చేస్తూనే ఉంది. అయితే కొన్ని ఆర్థిక అవసరాల దృష్ట్యా రష్యాతో భారత్ సత్సంబంధాలను కొనసాగిస్తోంది. -
USA: డెమొక్రాట్లకు మళ్లీ షాకిచ్చిన బైడెన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డెమొక్రాట్లకు మళ్లీ షాకిచ్చారు. ఇప్పటికే వృద్ధాప్యం రీత్యా బైడెన్ అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. జూన్27న రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన డిబేట్లో బైడెన్ తడబడినప్పటి నుంచి సొంత పార్టీ డెమొక్రాట్లలోనే ఆయన అభ్యర్థిత్వంపై అసమ్మతి మొదలైంది. ఈ నేపథ్యంలో బైడెన్ తన వృద్ధాప్యాన్ని మరోసారి చాటుకునేలా వింతగా ప్రవర్తించారు. తాజాగా ఫిలడెల్ఫియాలోని ఓ చర్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాస్టర్ అందరినీ నిల్చోవాల్సిందిగా కోరారు.పాస్టర్ విజ్ఞప్తి మేరకు అందరూ నిల్చున్నప్పటికీ అక్కడే ఉన్న బైడెన్ మాత్రం కూర్చొనే ఉన్నారు. ఎన్నికల ప్రచార నిధుల సేకరణ కోసం పెన్సిల్వేనియా పర్యటనకు వెళ్లినపుడు ఈ ఘటన జరిగింది. దీంతో అధ్యక్ష ఎన్నికల పోటీకి బైడెన్ సామర్థ్యం మరోసారి ప్రశ్నార్థకంలో పడినట్లయింది. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది పోరు జరగనుంది. -
అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి
కల్లూరు రూరల్: ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి శ్రీనాథరాజు కిరణ్ (20) శనివారం అమెరికాలో మృతి చెందాడు. కల్లూరు మండలంలోని చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన కిరణ్ అమెరికాలో మిస్సోరీ స్టేట్‌లో ఉన్న శ్యాండిల్ ఎస్ టౌన్లో ఉంటూ ఎంఎస్ చదువుతున్నాడు. గతేడాది నవంబర్‌లో అమెరికా వెళ్లిన కిరణ్ తాను నివసిస్తున్న ప్రదేశానికి సమీపంలో ఈత కొట్టేందుకు ముగ్గురు మిత్రులతో కలిసి వెళ్లాడు. అయితే, ఈతకొలను ఎనిమిది అడుగుల మేర ఉండగా అందరూ దిగడంతో కిరణ్‌కు ఈత రాక నీళ్లలో మునిగిపోయాడు. మిగిలిన మిత్రులకు కూడా ఈత రాకపోవడంతో నీట మునుగుతున్న కిరణ్‌ను చూస్తూ నిస్సహాయులుగా మిగిలిపోయారని తెలుస్తోంది. కాగా, కిరణ్ తండ్రి లక్ష్మణ్‌రాజు గతంలోనే చనిపోగా తల్లి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటోంది. వీరి బాధ్యతలను కిరణ్ తాత కృష్ణమూర్తిరాజు చూస్తున్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కిరణ్ చనిపోయినట్లు సమాచారం అందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. -
తొలి రౌండ్ ట్రంప్‌దేనా!
లాంఛనంగానైనా కరచాలనాల్లేవు. మర్యాదకైనా చిరునవ్వుల్లేవు. అసలు ఒకరివైపు ఒకరు చూసుకున్న క్షణాలే లేవు. శుక్రవారం దాదాపు 90 నిమిషాలపాటు సాగిన అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి సంవాదం అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌లపై ఇప్పటికే ప్రజానీకంలో పాతుకుపోయిన అభిప్రాయాలను మరింత దృఢపరిచింది. బైడెన్ తన విజయాలను ఘనంగా చాటలేరు. ట్రంప్ కన్నార్పకుండా అబద్ధాలు వల్లించటం మానుకోలేరు. వృద్ధాప్య ఛాయలు తనలో మచ్చుకైనా లేవని చాటేందుకు 81 యేళ్ల బైడెన్ తాపత్రయపడితే... న్యాయస్థానం తనను అపరాధిగా నిర్ధారించినా ఆత్మవిశ్వాసం మచ్చుకైనా సడల్లేదన్న అభిప్రాయం కలిగించేందుకు 78 యేళ్ల ట్రంప్ తంటాలుపడ్డారు. చిత్రమేమంటే – ఈ అంశాల్లో ఇద్దరికిద్దరూ విఫలమయ్యారు. బైడెన్‌కి ఇప్పటికే ఉన్న పాయింట్లు ఇంకా తగ్గగా... ట్రంప్ కాస్త మెరుగుపడిన మాట నిజమే అయినా అనుకున్నంతగా లేదు. 1960లో అధ్యక్ష పదవికి పోటీపడిన జాన్ ఎఫ్ కెనెడీ, రిచర్డ్ నిక్సన్లతో ప్రారంభమైన ఈ సంవాదం ఇంత పేలవంగా సాగిన సందర్భాలు ఎప్పుడూ లేవన్నది విశ్లేషకుల మాట. వచ్చే సెప్టెంబర్ 10న జరగబోయే రెండో సంవాదం సమయానికైనా బైడెన్ మెరుగుపడతారో లేదోనన్న దిగులు డెమాక్రటిక్ పార్టీని నిలువెల్లా వణికిస్తుండగా, రిపబ్లికన్ పార్టీ మాత్రం కులాసాగా సేదతీరుతోంది. బైడెన్ వంటి బలహీనుడు ప్రత్యర్థిగా ఉన్నప్పుడు ఇక చింత ఎందుకన్నది దాని భావన కావొచ్చు. ట్రంప్‌ను మించిన గెలుపు గుర్రం లేదని ఆ పార్టీ ఎప్పుడో నిర్ణయానికొచ్చింది. అధ్యక్ష అభ్యర్థుల సంవాదంలో మన మాదిరిగా అరుపులూ, కేకలూ ఉండవు. ఎదురుగా జేజేలుకొట్టే అభిమానులూ ఉండరు. ఒకరి ప్రసంగాల్లోకి ఒకరు చొరబడే సంస్కృతి కూడా లేదు. ప్రత్యర్థి చెప్పింది పూర్తిగా విని దీటైన, సహేతుకమైన జవాబు చెప్పగలిగినవారికి మద్దతు పెరుగుతుంది. కానీ ఇద్దరికీ అది పట్టలేదు. అడిగిన ప్రశ్నల్ని దాటేసే ట్రంప్ తీరు బుల్డోజర్ని మరపిస్తే, బైడెన్‌కు మాట పెగలడమే కష్టమైనట్టు కనబడింది. ట్రంప్ సంధించిన ప్రశ్నలకు జవాబివ్వటంతో మొదలుపెట్టినా... హఠాత్తుగా సంబంధంలేని మరో అంశంలోకి వెళ్లి బైడెన్ అయోమయంలో పడిన సందర్భాలు అనేకం. ట్రంప్‌లో గతానికి మించిన మూర్ఖత్వం మూర్తీభవించివున్నదని, ఆయన్ను ఎన్నుకుంటే దేశం ప్రమాదంలో పడుతుందని చెప్పటం బైడెన్ ఉద్దేశం. కానీ అది సమర్థవంతంగా చెప్పలేకపోయారు. 2020 నాటి సంవాదం స్థాయిలోనైనా మాట్లాడలేకపోయారు. తన హయాంలోని వైఫల్యాలను కప్పిపుచ్చటమేకాదు... బైడెన్ విజయాలను మరుగుపరచటంలో ట్రంప్ విజయం సాధించారు.వేరే దేశాల ఎన్నికలు ఎవరికీ పెద్దగా పట్టవు. కానీ ప్రపంచాన్నే శాసించే అమెరికాలో జరిగే ప్రతిదాన్నీ జాగ్రత్తగా గమనిస్తారు. యూరప్ ఖండం మొదలుకొని ఉత్తర కొరియా వరకూ అందరూ ఆసక్తి కనబరుస్తారు. సహజంగానే ఉక్రెయిన్‌లో రష్యా... గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాలూ, నాటోతో సంబంధాలూ, ప్రపంచంలో అమెరికా పరువు ప్రతిష్ఠలూ చర్చకొచ్చాయి. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ, వలసలు, ద్రవ్యోల్బణం, అబార్షన్లు సైతం ప్రధాన భాగం ఆక్రమించాయి. పుతిన్‌ను ప్రోత్సహించింది నువ్వంటే నువ్వని పరస్పరం ఆరోపణలు చేసుకోవటం ఆసక్తి కలిగించే అంశం. యూరప్ దేశాలు నాటో వ్యయంలో తమ వాటా చెల్లించకపోతే సంస్థనే మూసేస్తానని ట్రంప్ బెదిరించటం పరోక్షంగా పుతిన్‌ను సమర్థించినట్టేనని బైడెన్ వాదించగా... అసలు ఉక్రెయిన్‌పై దాడికి పురిగొల్పిందే బైడెన్ అని ట్రంప్ ఎదురు దాడి చేయటం గమనించదగ్గది. అఫ్గాన్ నుంచి వైదొలగే క్రమంలో జరిగిన భంగపాటే పుతిన్‌కు ధైర్యాన్నిచ్చిందని ఆయన దబాయించారు. ఉక్రెయిన్‌కు నిధుల వరద పారిస్తూపోతే ప్రజలను మరింత కుంగదీస్తుందన్నది ట్రంప్ వాదన. అయితే ఇజ్రాయెల్ విషయంలో ఇద్దరిదీ ఒకే మాట! కాకపోతే ఆ దేశానికి అన్నివిధాలా మద్దతిస్తున్నామని బైడెన్ అంటే... అదింకా సరిపోదన్నది ట్రంప్ ప్రత్యుత్తరం. యూదు వోటర్లు గణనీయంగా ఉండటంవల్లే ఇలా ఒకరిని మించి ఒకరు ప్రేమ ఒలకబోశారు. పైగా బైడెన్ పాలస్తీనీయుడిగా మారారని ట్రంప్ ఆరోపించారు. బైడెన్ మెతకదనం ఆసరా చేసుకుని వేరే దేశాల ప్రభుత్వాలు జైళ్లు, పిచ్చాసుపత్రులు ఖాళీ చేయించి అందరినీ అమెరికా పంపుతున్నారనడంలోని అంతరార్థం శ్వేత జాతి వోటర్లను ప్రసన్నం చేసుకునేందుకే! దేశంలో ద్రవ్యోల్బణం క్రమేపీ తగ్గుతున్నా అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలను ఇంకా వేధిస్తూనే వుంది. అయితే మాంద్యం బెడద తొలగింది. ఉపాధి అవకాశాలు పెరిగాయి. ధరలూ తగ్గాయి. కానీ వీటిని బైడెన్ గట్టిగా చెప్పలేకపోగా, కార్మికవర్గం సమస్యల్లో ఉందన్న ట్రంప్ వాదనతో ఏకీభవించారు. ట్రంప్ హయాంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన వైనాన్ని అందరికీ గుర్తు చేయటంలో బైడెన్ విజయం సాధించారు. అబార్షన్‌కు వాడే మాత్రకు తాను వ్యతిరేకం కాదని ట్రంప్ చెప్పక తప్పలేదు. ఇది మహిళల ఘనవిజయం. ప్రత్యర్థితో గంటన్నరపాటు వాగ్యుద్ధానికి తలపడినప్పుడు ఏదో ఒక సమయంలో ఓటమి ఎదురయ్యే పరిస్థితి రావొచ్చు. కానీ తొలి పది నిమిషాలూ నిబ్బరంగా లేనివారు ఓటమి నుంచి తప్పించుకోలేరంటారు. సంవాదంలో బైడెన్‌కు అదే జరిగింది. ఆయన ప్రసంగం తడబాట్లతో మొదలైంది. చాలాసార్లు సణుగుడుగా మిగిలిపోయింది. ట్రంప్ అడుగుతున్నప్పుడు నోరు తెరుచుకుని ఉండటం కూడా వీక్షకులను నిర్ఘాంతపరిచింది. మొత్తానికి తొలి రౌండ్లో ట్రంప్‌దే పైచేయి. -
అమెరికా మత స్వేచ్ఛ రిపోర్టు.. రిజెక్ట్ చేసిన భారత్
న్యూఢిల్లీ: అమెరికా అంతర్గత వ్యవహారాల శాఖ విడుదల చేసిన మత స్వేచ్ఛ రిపోర్టు 2023 పూర్తిగా పక్షపాతవైఖరితో కూడినదని భారత్ విమర్శించింది. ఈ నివేదికను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ శుక్రవారం(జూన్28) ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. భారత్‌లో సామాజిక కూర్పును అర్థం చేసుకోకుండా కేవలం ఓట్‌బ్యాంకు పాలిటిక్స్ ఆధారంగా తయారు చేసిన నివేదికలా అది కనిపిస్తోందన్నారు. ‘రిపోర్టులో చాలా పొరపాట్లున్నాయి. ఎంపిక చేసుకున్న అంశాలను వారికి కావల్సిన చోట కావల్సినట్లుగా అన్వయించుకున్నారు. పక్షపాత వైఖరితో తయారు చేశారు. రాజ్యాంగ నిబంధనలను చట్టాలకు కూడా తమకు కావల్సినట్లుగా భాష్యం చెప్పారు’అని జైస్వాల్ తెలిపారు. -
అమెరికాలో కాల్పులు.. బాపట్ల యువకుడు మృతి
కర్లపాలెం/సాక్షి, అమరావతి: అమెరికాలో ఓ దుండగుడి తుపాకీ కాల్పుల్లో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ (32) మృతి చెందాడు. రైతు కూలీ కుటుంబానికి చెందిన దాసరి శ్రీనివాసరావు, లక్ష్మి దంపతుల కుమారుడు గోపీకృష్ణ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హెచ్–1బి వీసా రావటంతో సుమారు 11 నెలల కిందట అమెరికా వెళ్లాడు. ఓ వైపు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ.. మరో వైపు టెక్సాస్ రాష్ట్రం డల్లస్ సిటీలోని సూపర్ మార్కెట్లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి ఓ దుండగుడు సూపర్ మార్కెట్‌కు వచ్చి గోపీకృష్ణపై గన్‌తో కాల్పులు జరిపి ఏవో వస్తువులు తీసుకుని పారిపోయాడు. తీవ్రగాయాలైన గోపీకృష్ణ అక్కడే కుప్పకూలిపోగా స్థానికులు ఓ వైద్యశాలలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గోపీకృష్ణకు రెండున్నరేళ్ల క్రితం ప్రవల్లి కతో వివాహం జరిగింది. వీరికి ఏడాది న్నర కుమారుడు ఉన్నాడు. ్రప్రజాప్రతి నిధులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తమ బిడ్డ భౌతికకాయాన్ని త్వరగా తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని గోపీకృష్ణ కుటుంబసభ్యులు కోరుతున్నారు. గోపీకృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలిఅమెరికాలోని సూపర్ మార్కెట్లో జరిగిన కాల్పుల ఘటనలో దాసరి గోపీకృష్ణ మృతి చెందటం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోపీకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం తోడుగా నిలవాలని, అన్ని రకాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గోపీకృష్ణ కుటుంబానికి తగిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర విదేశాంగ శాఖను కోరారు. మృతుడి కుటుంబానికి వైఎస్ జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
బాల్టిమోర్ బ్రిడ్జి ఘటన.. నౌకలోని 8 మంది సిబ్బంది భారత్‌కు
వాషింగ్టన్: అమెరికాలోని బాల్టిమోర్ బ్రిడ్జిని ఢీకొట్టిన కంటెయినర్ నౌకలోని భారతీయ సిబ్బందిలో 8 మంది స్వదేశం బయలుదేరారు. వీరు ఇండియా రావడానికి కోర్టు అనుమతిచ్చింది. నౌక బాల్టిమోర్ బ్రిడ్జిని ఢీకొట్టి మూడు నెలలు కావస్తోంది. నౌకలోని మొత్తం 21 మంది సిబ్బందిలో ఇంకా నలుగురు నౌకలోనే ఉన్నారని బాల్టిమోర్ మారిటైమ్ ఎక్స్చేంజ్ తెలిపింది. మిగిలిన సిబ్బందిని మాత్రం బాల్టిమోర్‌లోని ఓ సర్వీస్ రెస్టారెంట్లో ఉంచారు. నౌక బ్రిడ్జిని ఢీకొన్న ఘటనకు సంబంధించి దర్యాప్తు జరుగుతున్నందునే వీరిని ఇంకా అక్కడ ఉంచినట్లు సమాచారం. నౌకలోని 21 మంది సిబ్బందిలో 20 మంది భారతీయులే. నౌక బాల్టిమోర్ నుంచి శుక్రవారం వర్జీనియాలోని నార్ఫోక్ బయలుదేరింది. అక్కడ దానిని రిపేర్ చేస్తారు. ఈ ఏడాది మార్చిలో అమెరికాలోని బాల్టిమోర్ ఫ్రాన్సిస్ స్కాట్‌కీ బ్రిడ్జ్‌ను కంటెయినర్ నౌక ఢీకొనడంతో బ్రిడ్జి కుప్పకూలింది. ఈ ఘటనలో బ్రిడ్జిపై పనిచేస్తున్న ఆరుగురు నిర్మాణ కార్మికులు మృతి చెందారు. -
అగ్రరాజ్యాలు కళ్లు తెరుస్తాయా?
తెగేదాకా లాగితే ఏమవుతుందో అమెరికాతోపాటు యూరప్ దేశాలు తెలుసుకోవాల్సిన సందర్భమిది. బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియాను సందర్శించి ఆ దేశంతో సైనిక ఒడంబడిక కుదుర్చుకున్నారు. ఆ మర్నాడు వియత్నాం వెళ్లి డజను ఒప్పందాలు చేసుకున్నారు. అందులో అణు పరిశోధనలకు సంబంధించిన అంశం కూడా ఉంది. వియత్నాంతో రక్షణ, భద్రత సహా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవటం తమ లక్ష్యమని కూడా పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధం ప్రారంభించిన నాటినుంచీ దాన్ని ఆంక్షల చట్రంలో బిగించి ఏకాకిని చేయాలని అమెరికా, యూరప్ దేశాలు తలపోశాయి. ఉత్తర కొరియా ఏనాటినుంచో అలాంటి ఆంక్షల మధ్యే మనుగడ సాగిస్తోంది. ఇరాన్ సరేసరి. ఇలా ఏకాకుల్ని చేయాలన్న దేశాలన్నీ ఏకమవుతున్నాయని, అది ప్రమాద సంకేతమని అమెరికా, పాశ్చాత్య దేశాలు గ్రహిస్తున్న దాఖలా లేదు. ఆసియా–పసిఫిక్ ప్రాంతానికి సరికొత్త భద్రతా వ్యవస్థ ఏర్పడాలన్నదే తన ధ్యేయమని పుతిన్ అనటంలోని ఉద్దేశమేమిటో తెలుస్తూనే ఉంది. ఉత్తర కొరియా ఆవిర్భావానికీ, దాని మనుగడకూ నాటి సోవియెట్ యూనియనే కారణం. జపాన్ వలస పాలనతో సర్వస్వం కోల్పోయి శిథిలావస్థకు చేరుకున్న కొరియా భూభాగంలోకి రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశలో సోవియెట్ సైనిక దళాలు అడుగుపెట్టాయి. ఆ వెంటనే అమెరికా సైతం అప్పటికింకా సోవియెట్ సైన్యం అడుగుపెట్టని దక్షిణ ప్రాంతానికి తన సైన్యాన్ని తరలించింది. పర్యవసానంగా ఆ దేశం ఉత్తర, దక్షిణ కొరియాలుగా విడిపోయింది. సోవియెట్ స్ఫూర్తితో సోషలిస్టు వ్యవస్థ ఏర్పడిందని మొదట్లో ఉత్తర కొరియా ప్రకటించినా అక్కడ అనువంశిక పాలనే నడుస్తోంది. ఆ దేశం గురించి పాశ్చాత్య మీడియా ప్రచారం చేసే వదంతులే తప్ప అక్కడ ఎలాంటి వ్యవస్థలున్నాయో, అవి ఏం సాధించాయో తెలుసుకునే మార్గం లేదు. ఇటు పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్లూనుకున్న దక్షిణ కొరియా, అమెరికా అండదండలతో బహుముఖ అభివృద్ధి సాధించింది. సోవియెట్ యూనియన్ కుప్పకూలి రష్యా ఏర్పడ్డాక ఉత్తర కొరియాతో ఆ దేశానికున్న సంబంధాలు క్రమేపీ కొడిగట్టాయి. ప్రచ్ఛన్న యుద్ధ దశ అంతమైందని, ఇక ప్రపంచం నిశ్చింతగా ఉండొచ్చని అందరూ అనుకున్నారు. అమెరికా, పాశ్చాత్య దేశాలు పేరాశకు పోనట్టయితే ఆ ఆశ సాకారమయ్యేది. అది లేకపోబట్టే ప్రపంచం మళ్లీ గతంలోకి తిరోగమిస్తున్న వైనం కనబడుతోంది. అనునిత్యం సమస్యలతో సతమతమయ్యే ఆ పరిస్థితులు తిరిగి తలెత్తటం ఖాయమన్న అంచనాలు వస్తున్నాయి.కొన్నేళ్లక్రితం వరకూ ఉత్తర కొరియాపై కారాలు మిరియాలు నూరుతున్న పాశ్చాత్య దేశాలను రష్యా పెద్దగా పట్టించుకునేది కాదు. పొరుగునున్న చైనానుంచే ఆ దేశానికి సమస్త సహకారం లభించేది. 1994లో తనకున్న ఒక అణు రియాక్టర్నూ మూసేయడానికి ఉత్తర కొరియా అంగీకరించింది. అందుకు బదులుగా అమెరికా నుంచి రెండు విద్యుదుత్పాదన అణు రియాక్టర్లు స్వీకరించటానికి సిద్ధపడింది. కానీ 2002లో జార్జి డబ్ల్యూ బుష్ అధికారంలోకొచ్చాక ఆ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దుచేశారు. ఈ పరిణామాల సమయంలోకూడా రష్యా మౌనంగానే ఉంది. శత్రువు శత్రువు తన మిత్రుడని ఎంచి ఇప్పుడు అదే రష్యా తాజాగా ఉత్తర కొరియాతో సైనిక ఒప్పందం కుదుర్చుకుంది. తన నేతృత్వంలోని వార్సా కూటమిని రద్దుచేసుకుని, నాటోలో చేరడానికి రష్యా సిద్ధపడినప్పుడు తిరస్కరించింది నాటోయే. తూర్పు దిశగా విస్తరించే ఉద్దేశం తమకు లేదని, దాని సరిహద్దు దేశాలకు నాటో సభ్యత్వం ఇవ్వబోమని హామీ ఇచ్చిన ఆ సంస్థ అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. పొరుగునున్న చిన్న దేశాలపై పెత్తనం చలాయించాలన్న యావ రష్యాకుంటే దాన్ని ఎలా దారికి తేవాలో ఆ దేశాలు నిర్ణయించుకుంటాయి. కానీ వాటితో అంటకాగి రష్యాను చికాకు పర్చటమే ధ్యేయంగా గత రెండు దశాబ్దాలుగా అమెరికా, పాశ్చాత్య దేశాలు ప్రవర్తించాయి. ఈమధ్య ఇటలీలో జీ–7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శాంతియుతంగా, చర్చలద్వారా ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం అన్వేషించాలని సూచించారు. కానీ వినేదెవరు? విశ్వసనీయతగల అంతర్జాతీయ సంస్థల మధ్యవర్తిత్వంలో రష్యా, ఉక్రెయిన్ల మధ్య చర్చలు జరిగితే, ఒప్పందం కుదిరితే అది ఆ రెండు దేశాలకూ మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా మంచి కబురవుతుంది. ప్రపంచం ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం అంచుల్లో ఉంది. అమెరికా, దాని ప్రత్యర్థులు రష్యా, చైనాలు ప్రధాన అణ్వస్త్ర దేశాలు. అమెరికా వద్ద దాదాపు 1,700 అణ్వస్త్రాలున్నాయి. అందులో కనీసం సగం నిమిషాల్లో ప్రయోగించేందుకు వీలుగా నిరంతర సంసిద్ధతలో ఉంటాయంటారు. అమెరికాపై ఒక్క అణ్వస్త్రం ప్రయోగించినా క్షణాల్లో యూరప్, ఆసియా దేశాల్లోని దాని స్థావరాలనుంచి పెద్ద సంఖ్యలో అణ్వస్త్రాలు దూసుకెళ్లి శత్రు దేశాలను బూడిద చేస్తాయి. రష్యా, చైనాలపై దాడి జరిగినా ఇదే పరిస్థితి. చిత్రమేమంటే ఒకప్పుడు అణ్వాయుధాలపై బహిరంగ చర్చ జరిగేది. అది ఉద్రిక్తతల నివారణకు తోడ్పడేది. 80వ దశకంలో మధ్యతరహా అణ్వాయుధాల మోహరింపు యత్నాలు జరిగినప్పుడు అమెరికా, యూరప్ దేశాల్లో భారీయెత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఫలితంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు రీగన్, నాటి సోవియెట్ అధ్యక్షుడు గోర్బచెవ్ వాటి నిషేధానికి సంసిద్ధులయ్యారు. కానీ సాధారణ ప్రజలకు సైతం యుద్ధోన్మాదం అంటించారు. ఈ పరిస్థితులు మారాలి. అగ్రరాజ్యాలు వివేకంతో మెలిగి శాంతి నెలకొనేందుకు చిత్తశుద్ధితో కృషిచేయాలి. -
సఫారీ సూపర్ విక్టరీ
నార్త్‌సౌండ్: ప్రపంచ కప్ లీగ్ దశలో పెద్ద జట్లలో కనిపించిన అలసత్వం, చిన్న స్కోరుకే పడిన ఆపసోపాలు సూపర్–8కు వచ్చేసరికి దూరమైనట్లున్నాయి. బోర్ కొట్టించిన స్కోర్ల స్థానంలో ఆసక్తికర ధనాధన్ సమరం టి20 మజాను పంచింది. దీంతో ఆడుతున్న తొలి టి20 ప్రపంచకప్‌లోనే ముందంజ వేసిన అమెరికా ఆటలు ఈ దశ (సూపర్–8)లో సాగలేదు. పటిష్టమైన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండ్ దెబ్బకు ఆతిథ్య అమెరికా ఓడింది. బుధవారం జరిగిన తొలి సూపర్–8 పోరులో సఫారీ టీమ్ 18 పరుగుల తేడాతో అమెరికా జట్టుపై విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్వింటన్ డికాక్ (40 బంతుల్లో 74; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధనాధన్ షో చేశాడు. మరో ఓపెనర్ రిజా హెండ్రిక్స్ (11) విఫలమైనా... వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ మార్క్రమ్ (32 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్) అండతో రెండో వికెట్‌కు చకచకా 110 పరుగులు జోడించాడు. తర్వాత 126 పరుగుల స్కోరు వద్ద డికాక్, మిల్లర్ (0) అవుటయ్యారు. అయితే హెన్రిచ్ క్లాసెన్ (22 బంతుల్లో 36 నాటౌట్; 3 సిక్స్‌లు), ట్రిస్టన్ స్టబ్స్ (16 బంతుల్లో 20 నాటౌట్) ధాటిగా ఆడటంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. అనంతరం అమెరికా కొంత పోరాడినా లక్ష్యానికి దూరంగా ఉండిపోయింది. ఆ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ అండ్రియెస్ గూస్ (47 బంతుల్లో 80 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు.అతనికి జోడీగా దిగిన స్టీవెన్ టేలర్ (14 బంతుల్లో 24; 4 ఫోర్లు, 1 సిక్స్) కూడా వేగంగా పరుగులు సాధించడంతో 3.2 ఓవర్లలోనే అమెరికా 33 పరుగులు చేసింది. కానీ మరుసటి బంతికి టేలర్ అవుటయ్యాక జట్టు నిలబడలేకపోయింది. నితీశ్ కుమార్ (8), కెపె్టన్ ఆరోన్ జోన్స్ (0), కోరీ అండర్సన్ (12), జహంగీర్ (3) ఇలా వచ్చి అలా వెళ్లి పోయారు.హర్మీత్ దేశాయ్ (22 బంతుల్లో 38)తో గూస్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఇద్దరు కాసేపు భారీ షాట్లతో వణికించారు. అయితే హర్మీత్‌ను రబాడ (3/18) అవుట్ చేయడంతో ఆశలు ఆవిరయ్యాయి. టి20 ప్రపంచకప్‌లో నేడువెస్టిండీస్ X ఇంగ్లండ్‌వేదిక: గ్రాస్ ఐలెట్; ఉ.గం.6.00 నుంచి భారత్ X అఫ్గానిస్తాన్ వేదిక: బ్రిడ్జ్‌టౌన్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
USA: సీక్రెట్ ఏజెంట్‌ను దోచుకున్న దొంగలు
కాలిఫోర్నియా: జేమ్స్‌బాండ్ సిరీస్ సినిమాల్లో హీరోల్లాంటి వాళ్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగంలో పనిచేసే ఏజెంట్లు. ఇలాంటి ఓ ఏజెంట్‌ను దొంగలు గన్‌తో బెదిరించి మరీ దోచుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ విచిత్ర ఘటన లాస్ ఏంజెల్స్‌లో జరిగింది. ఆదివారం(జూన్16) అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, మాజీ అధ్యక్షుడు ఒబామా కలిసి లాస్ఏంజెల్స్లో డెమొక్రాట్ల ఎన్నికల క్యాంపెయిన్ కోసం ఓ విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడికి భద్రత కల్పించి తిరిగి వెళుతున్న ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌ను టస్టిన్ ప్రాంతంలో దొంగలు అడ్డుకుని తుపాకీతో బెదిరించారు. అతని వద్దనున్న బ్యాగ్‌ను దోచుకొన్నారు. ఈ సమయంలో ఆ సీక్రెట్ ఏజెంట్ దొంగలపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన సమాచారం టస్టిన్ పోలీసులకు అందడంతో వారు అక్కడికి చేరుకున్నారు. తమకు సీక్రెట్ ఏజెంట్ బ్యాగ్ దొరకలేదని, ఏజెంట్‌ను బెదిరించి దోచుకున్న వారి ఆచూకీ ఇంకా తెలియలేదని పోలీసులు సోమవారం చెప్పారు.‘మా సిబ్బంది ఒకరు కాలిఫోర్నియాలో దోపిడీకి గురయ్యారు. ఈ క్రమంలో అతడు తన సర్వీస్ గన్‌తో ఫైరింగ్ కూడా చేశాడు. దొంగల కోసం గాలిస్తున్నాం’అని సీక్రెట్ సర్వీసెస్ ప్రతినిధి ఆంటోనీ తెలిపారు. -
గ్రహాంతరవాసుల సీక్రెట్స్ రష్యాకు తెలుసా..?
గ్రహాంతర వాసులు ఉన్నారా? లేరా? అన్న అంశంపై దశాబ్ధాలుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకించి అగ్రరాజ్యం అమెరికాతో పాటు రష్యాలో ఎందరో పరిశోధకులు గ్రహాంతరవాసుల విషయంలో ఆసక్తికర పరిణామాలకు సాక్షులుగా ఉన్నారు. గ్రహాంతర వాసులు కొన్నేళ్ల క్రితం వరకు అయితే కేవలం ఊహాజనితమైన జీవులు. కానీ కొన్ని పరిశోధనల్లోనూ...కొందరి అనుభవాల్లోనూ చోటు చేసుకున్న ఘటనలను పరిశీలిస్తే గ్రహాంతర వాసులు కచ్చితంగా ఉన్నారని తెలుస్తోంది. అగ్రరాజ్యాలు మాత్రం గ్రహాంతర వాసులకు సంబంధించిన సమాచారాన్ని ఎందుకో దాచి పెడుతున్నాయంటున్నారు పరిశోధకులు. ఈ విషయంలో అమెరికా, రష్యా రెండూ దొందూ దొందే అంటున్నారు వారు.పదిహేనేళ్ల క్రితం నాటి మాట..రష్యాలో గ్రహాంతర వాసులను ప్రత్యక్షంగా చూసిన నేవీ అధికారులు ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. అయితే ఇంత వరకు రష్యాలోని పుతిన్ ప్రభుత్వం దాన్ని బయట పెట్టలేదు. అయితే కొందరు అధికారుల ద్వారా అసలు విషయం లీక్ కావడంతో యుఎఫ్‌వో(అన్ ఐడెంటిఫైడ్ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్స్)లపై పరిశోధనలు చేస్తున్నవారికి కావల్సినంత మేత దొరికినట్లయ్యింది.అసలేం జరిగిదంటే..2009 జులైలో రష్యా నావికాదళానికి చెందిన ఓ సబ్ మెరైన్ సాగర గర్భంలో ప్రయాణిస్తోంది. హఠాత్తుగా డిస్క్ ఆకారంలో ఉన్న ఆరు వస్తువులు అత్యంత వేగంగా సబ్ మెరైన్ పక్కనుంచి వెళ్లడాన్ని దాని పైలట్ గమనించాడు. అవి నీటి గర్భంలో గంటకు 256 మైళ్ల వేగంతో దూసుకుపోవడాన్ని గమనించి సబ్ మెరైన్ పైలట్ ఆశ్చర్యపోయాడు.సబ్ మెరైన్ లోని ఇతర సిబ్బందికి విషయం చెప్పాడు. ఆ ఆకారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి ఎవరివి? శత్రుసేనలవా? అని వారు కంగారు పడ్డారు. ఆ ఆరు డిస్క్ లు విష్ణు చక్రాల్లా గిర గిరా తిరుగుతూ ముందుకు దూసుకుపోతున్నాయి. అవి ఏవైనా వాహనాలా? కొత్త రకం సబ్ మెరైన్ లా? అని వారు తమలో తాము ప్రశ్నించుకున్నారు. అవి మరోసారి సబ్ మెరైన్ కు సమీపం నుంచి దూసుకుపోయాయి. పైలట్ లో భయం మొదలైంది. ఎందుకొచ్చిందని సబ్ మెరైన్ ను అమాంతం నీటి ఉపరితలానికి తీసుకుపోయాడు. ఆ తర్వాత చూస్తే సాగర గర్భం నుంచి ఆ ఆరు వస్తువులు వేగంగా నీటి ఉపరి తలానికి దూసుకురావడమే కాకుండా గాల్లోకి ఎగిరి వేగంగా ఆకాశంవైపు వెళ్లిపోయాయి.ఆ డిస్కులు కచ్చితంగా గ్రహాంతర వాసులు ప్రయాణించే అంతరిక్ష నౌకలే కావచ్చునని నేవీ అధికారులు భావించారు.అంతరిక్షంలో ఎగరడమే కాదు నీటి గర్భంలోకి దూసుకుపోవడం అంటే గ్రహాంతర వాసుల సాంకేతిక పరిజ్ఞానం ఎంత అడ్వాన్స్ స్టేజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. తాము చూసిన దాన్ని సబ్‌మెరైన్ సిబ్బంది నేవీలోని ఇతర సహచరులకు చెప్పారు. చాలా మంది నమ్మలేదు. కానీ తర్వాత వారు దానిపై ఓ నివేదిక రూపొందించి ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఈ నివేదికను రష్యా ప్రభుత్వం చాలా సీక్రెట్‌గా దాచి పెట్టింది.అలా ఎందుకు చేసిందో ఇప్పటికీ పరిశోధకులకు అర్ధం కావడంలేదు. 27 ఏళ్ల కిందట బైకాల్ సరస్సులో వింత ఆకారాలుఈ ఘటనకు 27 సంవత్సరాల క్రితం 1982లో సైబీరియా ప్రాంతంలో మరో సంచలన ఘటన. బైకాల్ సరస్సులోకి ఏడుగురు డైవర్లు దూకి నీటి అడుక్కి వెళ్లారు. వారు 50 మీటర్ల దూరం వెళ్లే సరికి తమని ఎవరో గమనిస్తున్నారన్న అనుమానం వచ్చింది. ఎవరా అని వెనక్కి తిరిగి చూసిన డైవర్లు ఆశ్చర్యం..భయంతో ఉండిపోయారు. వారిని భారీ పరిమాణంలో ఉన్న ఓ వింత ఆకారం చూస్తోంది. ఆ ఆకారం మనిషి పోలికలతో ఉంది. కాకపోతే హెల్మెట్ వంటి పరికరాన్ని ధరించినట్లు ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్లే సరికి వింత మానవ ఆకారాలు కనిపించాయి. మనుషుల్లాగే కాళ్లూ చేతులతో ఉన్న ఆ జీవులు 9 అడుగుల ఎత్తు ఉన్నాయి. ఆ జీవులను చూసి విస్తుపోయిన డైవర్లు ధైర్యం చేసి ఓ ఆకారాన్ని పట్టుకోడానికి ప్రయత్నించారు.ఊహించని విధంగా పెద్ద శక్తి ఆ డైవర్లను అమాంతం నీటి ఉపరితలం వైపుకు చాలా బలంగా నెట్టేసింది. అంతటి శక్తి ఆ ఆకారాలకు ఎలా సాధ్యమైందో డైవర్లకు అర్ధం కాలేదు. ఆ దాడిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అసలు నీటి కింద ఆక్సిజన్ సిలెండర్ల అవసరం లేకుండా ఆ జీవులు ఎలా ఉండగలుగుతున్నాయో అర్ధం కాలేదు.గడ్డ కట్టుకుపోయే నీటిలోనూ ఆ జీవిలు మనుగడ సాగించగలగడం ఎలా సాధ్యమో తెలియలేదు. అవి కచ్చితంగా ఏదో ఓ గ్రహం నుంచి వచ్చిన గ్రహాంతర వాసులేనని డైవర్లు భావిస్తున్నారు. వారు తాము చూసింది చూసినట్లు పూసగుచ్చి అధికారులకు వివరించారు. దాన్ని ఓ నివేదిక గా రూపొందించారు. ఈ నివేదిక కూడా రష్యాప్రభుత్వం దగ్గర భద్రంగా ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం నాలుగు దశాబ్దాలు దాటినా ఈ నివేదికను గుట్టుగా ఉంచడం వెనుక కారణాలేంటో అర్ధం కావడం లేదంటున్నారు పరిశోధకులు.ఈ గ్రహాంతర వాసులేంటో..వారి శక్తి సామర్ధ్యాలేంటో.. వారి స్పేస్‌క్రాఫ్ట్‌ల ప్రత్యేకతలేంటో అంటూ సైంటిస్టులు ఇప్పటికీ జుట్టు పీక్కుంటున్నారు. మనం చూడలేదు కాబట్టి గ్రహాంతర వాసులు లేరని ఎలా అనేయగలం? అంటున్నారు గ్రహాంతర వాసులపై ఏళ్ల తరబడి పరిశోధనలు చేస్తున్న వారు. ఇటువంటి ఘటనలు రష్యాలో చాలానే చోటు చేసుకున్నాయని వారంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఓ సీక్రెట్ రీజన్ తోనే వాటిని దాచి పెడుతోందని వారు అభిప్రాయ పడుతున్నారు. -
అమెరికా ముందుకు... పాక్ ఇంటికి
లాడర్‌హిల్ (ఫ్లోరిడా): టి20 ప్రపంచ కప్‌లో అత్యంత కీలక ఫలితం! తొలిసారి ప్రపంచ కప్‌లో పాల్గొన్న ఆతిథ్య అమెరికా జట్టు సూపర్–8 దశకు అర్హత సాధించింది. గ్రూప్ ‘ఎ’లో శుక్రవారం అమెరికా, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. దాంతో ఈ గ్రూప్ నుంచి భారత్ (6 పాయింట్లు), అమెరికా (5 పాయింట్లు) ముందంజ వేశాయి. ఆడిన 3 మ్యాచ్‌లలో ఒకటే గెలిచిన 2009 చాంపియన్ పాకిస్తాన్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. గత రెండు టి20ల్లో వరల్డ్ కప్‌లలో వరుసగా సెమీఫైనల్, ఫైనల్ వరకు చేరిన పాక్ ఈసారి పేలవ ప్రదర్శనతో కుప్పకూలింది. భారత్‌తో పాటు అమెరికా చేతిలో ఓడిన ఆ జట్టు కెనడాపై మాత్రం గెలవగలిగింది. ఈ గ్రూప్‌లో బలహీన కెనడాపై నెగ్గిన అమెరికా... పాక్‌పై సంచలన విజయం సాధించి తమ అవకాశాలు మెరుగుపర్చుకుంది. తాజా ఫలితంతో ఆదివారం ఐర్లాండ్‌తో తమ చివరి మ్యాచ్ ఆడకుండానే వరల్డ్ కప్‌లో పాక్ ఆట ముగిసింది. లాడర్‌హిల్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు శుక్రవారం కూడా తెరిపినివ్వలేదు. నిర్ణీత సమయం నుంచి దాదాపు మూడు గంటల సుదీర్ఘ సమయం పాటు వేచి చూసినా ఫలితం లేకపోయింది. వర్షం తగ్గినా మ్యాచ్ కోసం మైదానాన్ని సిద్ధం చేయడం సాధ్యం కాలేదు. పదే పదే తనిఖీల తర్వాత కనీసం 5 ఓవర్ల ఆట అయినా నిర్వహించాలని ఆశించినా... మళ్లీ చినుకులు మొదలయ్యాయి. దాంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆతిథ్య జట్టు హోదాలో బరిలోకి దిగి సూపర్–8కు చేరడం ద్వారా అమెరికా 2026 టి20 వరల్డ్ కప్‌కు కూడా నేరుగా అర్హత సాధించింది. -
పచారీ కొట్లకు 10 మినిట్స్ సవాల్
సాక్షి, హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికా కంటే కూడా భారత్‌లో వివిధ డెలివరీ యాప్‌లు వేగంగా కస్టమర్లను చేరుకుని సంచలనం సృష్టిస్తున్నాయి. యూఎస్‌లోని డెలివరీ దిగ్గజ కంపెనీలు యాప్‌లపై ఆర్డర్ అందుకున్నాక లొకేషన్ ఆధారంగా అదే రోజు లేదా మరుసటి రోజు డెలివరీ చేస్తున్నట్టు వెల్లడైంది. అందుకు భిన్నంగా మన దేశంలో ‘క్విక్ సర్వీస్’అనేది నాణ్యమైన సేవకు గీటురాయిగా మారింది. స్విగ్గీ, జెప్టో, బ్లింకిట్ వంటి యాప్‌లు...చిన్న చిన్న నిత్యావసరాలను సైతం అత్యంత వేగంగా వినియోగదారుల ఇళ్లకు చేరుస్తున్నాయి. గతంలో మనదేశంలో... ఫోన్ ద్వారా ఆర్డర్లు తీసుకున్నాక అక్కడక్కడా ఏర్పాటు చేసుకున్న ఔట్లెట్ల నుంచి నిత్యావసర వస్తువులు తీసుకుని కస్టమర్లకు చేర్చేవారు. ఐతే గత దశాబ్దకాలంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటి ద్వారా ఈ–కామర్స్ ఒక్కసారిగా పుంజుకోవడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీంతో భారత్‌లో వేగంగా నిత్యావసర సరుకులు అందించే డెలివరీ సంస్థలు ఆన్లైన్ షాపింగ్‌పై అధిక నమ్మకాలు పెట్టుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్సంస్థలు ఉనికిలో నిలిచేందుకు కష్టపడుతుంటే, అదేకోవలోని భారత్ మార్కెట్ మాత్రం అంతకంతకు వృద్ది చెందుతున్నట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్–19 లాక్‌డౌన్‌తో... ప్రపంచవ్యాప్తంగా ఫాస్ట్ డెలివరీ స్టార్టప్‌లు పెరగగా..ఆ తర్వాత కొన్నిదేశాల్లో షాపులకు వెళ్లి వస్తువులు కొనుక్కునేందుకు మొగ్గుచూపడంతో అవి వెనకడుగు వేయక తప్పలేదు. భారత్‌లో మాత్రం దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఈ స్టార్టప్‌లు మరింత వృద్ది చెందడంతో పాటు సేవలో వేగం, నాణ్యతను పెంచడంపై దృష్టి పెట్టడం గమనార్హం. పచారీ కొట్లకు తప్పని పోటీ ఇప్పుడు డెలివరీ యాప్‌లు వేగం పుంజుకోవడంతో...పది నిమిషాల్లోనే కస్టమర్లు ఆర్డర్ చేసిన వస్తువులు చేరవేయడం అనే దాన్ని ఈ సంస్ధలు ఒక అలవాటుగా మార్చుకుంటున్నాయి. వినియోగదారులు ఆర్డర్ చేశాక పదినిమిషాల వ్యవధిలోనే నిత్యావసరాలను డెలివరీ ఏజెంట్లు అందజేయడాన్ని కూడా సెకన్ల వారీగా ట్రాక్ చేస్తుండటం విశేషం. ఆన్లైన్లో ఆర్డర్లను అందించే క్రమంలో ఏ కారణంచేతనైనా ఏజెంట్లు నెమ్మదిస్తే వారి ఫోన్లలో ‘ఎరుపు ఫ్లాష్’ద్వారా హెచ్చరికలు కూడా జారీ అవుతున్నాయి. దేశంలోని వివిధ డెలివరీ యాప్‌ల ద్వారా పాలు, పండ్లు మొదలు గులాబీల దాకా నిమిషాల వ్యవధిలోనే కస్టమర్ల వద్దకు చేరేలా సర్వీసులు అందిస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో పలు రకాల నిత్యావసరాలకు ఆర్డర్ అందగానే పది నిమిషాల్లో ఇళ్లకు చేర్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడికక్కడ సరుకులను నిమిషాల్లో డెలివరీ చేసే యాప్‌లు పచారీ కొట్లకు సవాల్‌గా మారాయి. సంప్రదాయ కిరాణా దుకాణాలు, వీధి చివర్లలోని షాపులకు గట్టి పోటీ తప్పడం లేదు. మనదేశంలోని వివిధ వర్గాల ప్రజలు... తమ ఇళ్లకు దగ్గరలోని షాపుల నుంచి బియ్యం, పప్పులు, ఇతర వస్తువులను తెచ్చుకోవడమో లేదా ఫోన్లో ఆర్డర్ చేసే ఆ దుకాణాల్లో పనిచేసే వారు ఇళ్లకు చేరవేయడమో చేస్తూ వచ్చారు. ఇప్పుడు డెలివరీ యాప్‌ల యుగంలో...రోజువారీ అవసరాలకు ఉపయోగపడే చిన్న చిన్న వస్తువులను సైతం ఆన్లైన్లో ఆర్డర్ చేసి నిమిషాల్లోని ఇంటి గుమ్మం వద్దకు తెప్పించుకుంటున్నారు. స్విగ్గీలో ఐతే ఒకేఒక మామిడిపండును ఆర్డర్ చేసినా దానిని కూడా కస్టమర్‌కు డెలివరీ చేస్తోంది. వేగం, కచ్చితత్వం గత ఏప్రిల్‌లో భారత్‌లోని ఆన్లైన్ సరుకుల మార్కెట్, క్విక్ డెలివరీని గోల్డ్‌మాన్ సాక్స్ విశ్లేíÙంచినపుడు... ప్రస్తుతం భారత్ ఆన్లైన్ సరుకుల మార్కెట్ 11 బిలియన్ డాలర్లుగా నిలుస్తుండగా వాటిలో క్విక్ డెలివరీ మార్కెట్ 5 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టుగా తేలింది. ఆన్లైన్ కస్టమర్ల ప్రాధాన్యతలకు తగ్గట్టుగా సరుకులను చేరవేయడంలో వేగం, కచ్చితత్వం పెరుగుదలతో 2030 కల్లా 60 బిలియన్ డాలర్లుగా చేరుకుని ఆన్లైన్ గ్రాసరీ మార్కెట్లో క్విక్ కామర్స్ 70 శాతంగా నిలుస్తుందని ఈ సంస్ధ అంచనా వేస్తోంది. దేశవ్యాప్తంగా 1.30 కోట్ల నిత్యావసర వస్తువులను విక్రయించే దుకాణాలు, షాపులు ఉండగా, వీటికి సంబంధించిన రిటైల్ అసోసియేషన్ల అంచనాల ప్రకారం... క్విక్ కామర్స్యాప్ల ద్వారా అమ్మకాలు తగ్గుదల పుంజుకోవడంతో... వివిధ ప్రధాన నగరాలు, పట్టణాల వారీగా చూస్తే సంప్రదాయ దుకాణాల్లో పది నుంచి 60 శాతం దాకా అమ్మకాలు నమోదైనట్టుగా తెలుస్తోంది. -
IND Vs USA: 7 వికెట్లతో అమెరికాపై గెలుపు.. ‘సూపర్–8’కు భారత్
బ్యాటింగ్‌కు బద్ధ విరోధిలా నిలిచిన న్యూయార్క్ పిచ్‌పై భారత్ మరోసారి తమ స్థాయి ఆటను చూపించింది. వరుసగా మూడో విజయంతో టి20 ప్రపంచకప్‌లో ‘సూపర్–8’ దశకు చేరి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పట్టుదలగా పోరాడి అమెరికా కొంత ఇబ్బంది పెట్టినా... చివరకు టీమిండియా ముందు తలవంచక తప్పలేదు. అర్ష్ దీప్తో పాటు ఇతర బౌలర్ల పదును ముందు యూఎస్ అతి కష్టమ్మీద 100 పరుగులు దాటింది. ఛేదనలో భారత బ్యాటింగ్ కాస్త తడబడి ఉత్కంఠను పెంచినా... సూర్యకుమార్, శివమ్ దూబే జోడీ మరో 10 బంతులు మిగిలి ఉండగా జట్టును గెలుపు తీరం చేర్చింది. న్యూయార్క్: టి20 వరల్డ్ కప్ వేటలో ‘హ్యాట్రిక్’ విజయాన్ని అందుకున్న భారత్ సూపర్–8లోకి అడుగు పెట్టింది. బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో యూఎస్ఏపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన యూఎస్ఏ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ (23 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్), స్టీవెన్ టేలర్ (30 బంతుల్లో 24; 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అర్ష్ దీప్ (4/9) ప్రత్యర్థిని దెబ్బ తీయగా... హార్దిక్ పాండ్యాకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 111 పరుగులు చేసి గెలిచింది. సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్ దూబే (35 బంతుల్లో 31 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) నాలుగో వికెట్‌కు 65 బంతుల్లో అభేద్యంగా 67 పరుగులు జోడించారు. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో శనివారం లాడర్‌హిల్‌లో కెనడాతో తలపడుతుంది. తలా ఓ చేయి.. గత రెండు మ్యాచ్‌లలో ఆకట్టుకున్న అమెరికాకు ఈసారి సరైన ఆరంభం లభించలేదు. అర్‡్షదీప్ వేసిన ఓవర్లో మొదటి బంతికే జహాంగీర్ (0) వికెట్ల ముందు దొరికిపోగా, చివరి బంతికి గూస్ (2) అవుటయ్యాడు. పవర్‌ప్లేలో యూఎస్ 18 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా ఇన్నింగ్స్ తడబడుతూనే సాగినా... చిన్న చిన్న భాగస్వామ్యాలు ఇన్నింగ్స్‌ను నడిపించాయి.ఫామ్‌లో ఉన్న జోన్స్ (11)ను పాండ్యా వెనక్కి పంపించగా, దూకుడుగా ఆడబోయిన టేలర్‌ను అక్షర్ బౌల్డ్ చేశాడు. పాండ్యా ఓవర్లో సిక్స్, ఫోర్‌తో కొంత ధాటిని ప్రదర్శించిన నితీశ్ ఇన్నింగ్స్ బౌండరీ వద్ద సిరాజ్ అద్భుత క్యాచ్‌తో ముగిసింది. ఆ తర్వాత ఐదు బంతుల వ్యవధిలో అండర్సన్ (15), హర్మీత్ (10) వెనుదిరిగారు. 18వ ఓవర్ ఐదో బంతికి యూఎస్ స్కోరు వంద పరుగులకు చేరింది. కోహ్లి మళ్లీ విఫలం... లెఫ్టార్మ్ పేసర్ సౌరభ్ నేత్రావల్కర్ పదునైన బౌలింగ్‌తో భారత్‌ను ఇబ్బంది పెట్టాడు. గత రెండు మ్యాచ్‌లలో 1, 4 పరుగులే చేసిన కోహ్లి (0) ఈసారి తొలి బంతికే వెనుదిరిగి టి20 వరల్డ్ కప్‌లో తొలిసారి డకౌట్ నమోదు చేశాడు. ఆ తర్వాత నేత్రావల్కర్ బౌలింగ్‌లోనే రోహిత్ శర్మ (3) కూడా అవుట్ కాగా, కుదురుకుంటున్నట్లు అనిపించిన రిషభ్ పంత్ (18; 1 ఫోర్, 1 సిక్స్)ను చక్కటి బంతితో అలీఖాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ దశలో సూర్య, దూబే కలిసి జట్టును ఆదుకున్నారు. మరీ ధాటిగా ఆడకపోయినా పిచ్‌ను బట్టి సింగిల్స్‌తో పరుగులు రాబట్టారు. 22 పరుగుల వద్ద సూర్య ఇచ్చిన క్యాచ్‌ను నేత్రావల్కర్ వదిలేయడం కూడా కలిసొచ్చింది. ఆ తర్వాత మరో అవకాశం ఇవ్వకుండా భారత ద్వయం ఆటను ముగించింది. అమెరికాకు పెనాల్టీ... తొలి వరల్డ్ కప్ ఆడుతున్న అమెరికా ఓవర్‌రేట్ నిబంధనల అమలు విషయంలో ఇంకా పరిణతి చెందలేదు. అనూహ్య రీతిలో మ్యాచ్‌లో ఆ జట్టుకు అంపైర్లు 5 పరుగులు పెనాల్టీగా విధించారు. ఓవర్ల మధ్యలో ఆ జట్టు ఒక నిమిషంకంటే ఎక్కువ సమయం తీసుకోవడం మూడుసార్లు జరిగింది. దాంతో కేవలం హెచ్చరికతో వదిలి పెట్టకుండా శిక్ష వేయడంతో భారత్‌కు 5 అదనపు పరుగులు వచ్చాయి. స్కోరు వివరాలు అమెరికా ఇన్నింగ్స్: జహాంగీర్ (ఎల్బీ) (బి) అర్ష్ దీప్ 0; టేలర్ (బి) అక్షర్ 24; గూస్ (సి) పాండ్యా (బి) అర్ష్ దీప్ 2; జోన్స్ (సి) సిరాజ్ (బి) 11; నితీశ్ (సి) సిరాజ్ (బి) అర్ష్ దీప్ 27; అండర్సన్ (సి) పంత్ (బి) పాండ్యా 15; హర్మీత్ (సి) పంత్ (బి) అర్ష్ దీప్ 10; షాడ్లీ (నాటౌట్) 11; జస్దీప్ (రనౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 110. వికెట్ల పతనం: 1–0, 2–3, 3–25, 4–56, 5–81, 6–96, 7–98, 8–110. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–9–4, సిరాజ్ 4–0–25–0, బుమ్రా 4–0–25–0, పాండ్యా 4–1–14–2, దూబే 1–0–11–0, అక్షర్ 3–0–25–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) హర్మీత్ (బి) నేత్రావల్కర్ 3; కోహ్లి (సి) గూస్ (బి) నేత్రావల్కర్ 0; పంత్ (బి) ఖాన్ 18; సూర్యకుమార్ (నాటౌట్) 50; దూబే (నాటౌట్) 31; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (18.2 ఓవర్లలో 3 వికెట్లకు) 111. వికెట్ల పతనం: 1–1, 2–10, 3–39. బౌలింగ్: సౌరభ్ నేత్రావల్కర్ 4–0–18–2, అలీ ఖాన్ 3.2–0–21–1, జస్దీప్ సింగ్ 4–0–24–0, షాడ్లీ 4–0–25–0, అండర్సన్ 3–0–17–0. టి20 ప్రపంచకప్‌లో నేడువెస్టిండీస్ X న్యూజిలాండ్వేదిక: ట్రినిడాడ్, ఉదయం గం. 6 నుంచిబంగ్లాదేశ్ X నెదర్లాండ్స్ వేదిక: కింగ్స్టౌన్, రాత్రి గం. 8 నుంచిఇంగ్లండ్ X ఒమన్‌వేదిక: నార్త్‌సౌండ్, అర్ధరాత్రి గం. 12:30 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
T20 WC 2024 USA vs IND: అదరగొట్టిన సూర్య.. అమెరికాపై భారత్ ఘన విజయం
USA vs India live updates and highlights:అమెరికాపై భారత్ ఘన విజయంటీ20 వరల్డ్‌కప్‌లో భారత్ వరుసగా మూడో విజయం నమోదు చేసింది. న్యూయర్క్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో సూపర్-8కు టీమిండియా అర్హత సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు టీమిండియా కొంచెం కష్టపడింది. బ్యాటింగ్‌కు కష్టమైన పిచ్‌పై భారత్ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేజ్ చేసింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(42), శివమ్ దూబే(28) పరుగులతో ఆఖరి వరకు ఆజేయంగా నిలిచి తమ జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో భారత టాపర్డర్ బ్యాటర్లు విరాట్ కోహ్లి(0), రోహిత్ శర్మ(3), రిషబ్ పంత్(18) పరుగులతో నిరాశపరిచారు. అమెరికా బౌలర్లలో నెత్రావల్కర్ రెండు వికెట్లు పడగొట్టగా.. అలీ ఖాన్ ఒక్క వికెట్ సాధించారు 13 ఓవర్లకు టీమిండియా స్కోర్: 60/313 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(23), శివమ్ దూబే(13) ఉన్నారు.మూడో వికెట్ డౌన్..39 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన రిషబ్ పంత్.. అలీ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. క్రీజులో శివమ్ దూబే(3), సూర్యకుమార్ యాదవ్(20) ఉన్నారు.రెండో వికెట్ డౌన్.. రోహిత్ ఔట్10 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ..త్రవల్కర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లు ముగిసే సరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 25 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(9), సూర్యకుమార్ యాదవ్(12) పరుగులతో ఉన్నారు.టీమిండియాకు బిగ్ షాక్.. కోహ్లి ఔట్111 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే నేత్రవల్కర్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.నిప్పులు చేరిగిన అర్ష్‌దీప్.. భారత టార్గెట్ 111 పరుగులుటీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా అమెరికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా భారత బౌలర్లు దాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 110 పరుగులు మాత్రమే చేసింది. అమెరికా బ్యాటర్లలో నితీష్ కుమార్(27), టేలర్(24) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. పాండ్యా రెండు, అక్షర్ పటేల్ ఒక్క వికెట్ సాధించారు.18 ఓవర్లకు అమెరికా స్కోర్: 100/718 ఓవర్లు ముగిసే సరికి అమెరికా 7 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. 17వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా ఎటువంటి పరుగులివ్వకుండా ఓ వికెట్ పడగొట్టాడు.18 ఓవర్లో అర్ష్‌దీప్ బౌలింగ్‌లో హర్మీత్ సింగ్ ఔటయ్యాడు.ఐదో వికెట్ డౌన్..81 పరుగులు వద్ద అమెరికా నాలుగో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన నితీష్ కుమార.. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి అమెరికా 5 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. నాలుగో వికెట్ డౌన్56 పరుగులు వద్ద అమెరికా నాలుగో వికెట్ కోల్పోయింది.24 పరుగులు చేసిన టేలర్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.14 ఓవర్లు ముగిసే సరికి అమెరికా 4 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. 14 ఓవర్లు ముగిసే సరికి అమెరికా 4 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. క్రీజులో కోరీ ఆండర్సన్(8), నితీష్ కుమార్(27) పరుగులతో ఉన్నారు.హార్దిక్ ఎటాక్.. అమెరికా మూడో వికెట్ డౌన్కెప్టెన్ ఆరోన్ జోన్స్ రూపంలో అమెరికా రెండో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన జోన్స్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి నితీష్ కుమార్ వచ్చాడు.6 ఓవర్లకు అమెరికా స్కోర్: 18/26 ఓవర్లు ముగిసే సరికి అమెరికా రెండు వికెట్లు కోల్పోయి 18 పరుగులు చేసింది. క్రీజులో టేలర్(5), జోన్స్(10) పరుగులతో ఉన్నారు.వారెవ్వా అర్ష్‌దీప్.. ఒకే ఓవర్లో 2 వికెట్లుటాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అమెరికాకు భారీ షాక్ తగిలింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన తొలి ఓవర్లో అమెరికా రెండు వికెట్లు కోల్పోయింది. జహీంగర్ డకౌట్ కాగా.. గౌస్ రెండు పరుగులు చేసి ఔటయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సరికి అమెరికా రెండు వికెట్లు కోల్పోయి 8 పరుగులు మాత్రమే చేసింది.తొలి వికెట్ కోల్పోయిన అమెరికా.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూఎస్ఎ తొలి వికెట్ కోల్పోయింది. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తొలి బంతికే ఓపెనర్ జహీంగర్ను క్లీన్ బౌల్డ్ చేశాడు.బౌలింగ్ ఎంచుకున్న భారత్..టీ20 వరల్డ్‌కప్-2024లో ఆసక్తికర సమరానికి రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా న్యూయర్క్ వేదికగా భారత్, అమెరికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. అమెరికా మాత్రం రెండు మార్పులు చేసింది. ఈ మ్యాచ్‌కు గాయం కారణంగా కెప్టెన్ మోనాంక్ పటేల్ దూరమయ్యాడు.అతడి స్ధానంలో జోన్స కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు స్పిన్నర్ నోస్తుష్ కెంజిగే కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. జహంగీర్, షాడ్లీ వాన్ షాల్క్విక్ తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లుభారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్అమెరికా: స్టీవెన్ టేలర్, షాయన్ జహంగీర్, ఆండ్రీస్ గౌస్(వికెట్ కీపర్), ఆరోన్ జోన్స్(కెప్టెన్), నితీష్ కుమార్, కోరీ ఆండర్సన్, హర్మీత్ సింగ్, షాడ్లీ వాన్ షాల్క్విక్, జస్దీప్ సింగ్, సౌరభ్ నేత్రావల్కర్, అలీ ఖాన్ -
‘హ్యాట్రిక్’పై భారత్ గురి
న్యూయార్క్: ‘హ్యాట్రిక్’ విజయంపై గురి పెట్టిన భారత్ దీంతో పాటే టి20 ప్రపంచకప్‌లో ‘సూపర్–8’ దశకు దర్జాగా చేరుకోవాలనుకుంటుంది. గ్రూప్ ‘ఎ’లో బుధవారం జరిగే మ్యాచ్‌లో టీమిండియా... ఆతిథ్య అమెరికాతో తలపడుతుంది. ఈ గ్రూప్‌లో ఇరు జట్లు కూడా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి అజేయంగా ఉన్నాయి. రోహిత్ బృందం వరుస విజయాలు సాధించడంలో పెద్ద విశేషమైతే లేదు కానీ... అమెరికాలాంటి కూన ఓ మాజీ చాంపియన్ పాకిస్తాన్‌ను అదికూడా... ‘సూపర్ ఓవర్’ దాకా లాక్కొచ్చి మరీ ఓడించడమే పెద్ద సంచలనం. ఎప్పుడైనాగానీ సూపర్ ఓవర్ అనేది మేటి జట్టుకే ఎక్కువ సానుకూలంగా ఉంటుంది. అలాగని భారత్‌పై కూడా మరో సంచలనం కొనసాగిస్తుందని చెప్పలేం. కానీ ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా వారికి ‘హ్యాట్రిక్’ విజయంతో పాటు ‘సూపర్–8’ బెర్త్ కూడా దక్కుతుంది. సూపర్ ఫామ్‌లో... బంగ్లాదేశ్‌తో మొదలుపెట్టిన ప్రాక్టీస్ మొదలు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ దాకా భారత్ విజయవంతమైంది. ఐర్లాండ్‌తో జరిగిన తొలి లీగ్‌లో ప్రత్యర్థి తక్కువ లక్ష్యం నిర్దేశించడంతో కెపె్టన్ రోహిత్, రిషభ్ పంత్‌ల జోరుతో సులువుగానే ఛేదించారు. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో ‘కింగ్’ కోహ్లి, టి20 స్పెషలిస్టు సూర్యకుమార్ యాదవ్ ఏమాత్రం మెరిపించలేకపోయారు. గత రెండు మ్యాచ్‌లకు బాకీ పడిన పరుగుల వానను బహుశా ఈ మ్యాచ్‌లో వడ్డీతో సహా తీర్చేస్తారేమోనని అమెరికాలోని భారత అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుమ్రా, సిరాజ్, అర్‡్షదీప్‌లతో కూడిన పేస్ త్రయానికి, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌ల స్పిన్ ద్వయానికి అమెరికా ఎదురునిలవడం అంత సులువు కాదు. సర్వశక్తులతో... ఆడుతోంది తొలి వరల్డ్‌కప్పే అయినా అమెరికా ఆట మాత్రం అద్భుతం. కెనడా, పాక్‌లపై సాధించిన విజయాలు ఏమాత్రం గాలివాటం కాదు. మొదట కెనడాపై 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి మరీ గెలిచింది. ఆండ్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. మళ్లీ పాక్‌తో రెండో మ్యాచ్‌లో కెప్టెన్ మోనంక్ పటేల్ అర్ధసెంచరీతో ఆకట్టుకుంటే గౌస్, జోన్స్ ‘టై’ అయ్యేదాకా పటిష్టమైన పాక్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నారు. ఇటు బౌలింగ్‌లోనూ కెంజిగే, సౌరభ్ నేత్రవాల్కర్, అలీఖాన్, జస్దీప్లు ఫామ్‌లో ఉండటంతో భారత్‌పై పైచేయి సాధించలేకపోయినా... ఆల్‌రౌండ్ వనరులతో గట్టి పోటీ ఇవ్వాలనే పట్టుదలతో అమెరికా బృందం ఉంది. పిచ్, వాతావరణం న్యూయార్క్ పిచ్‌లో ఏ మార్పు లేదు. తక్కువ స్కోర్లే తప్ప మెరుపులకు అంతగా అవకాశమైతే ఉండదు. చేజింగ్ కష్టం కావడంతో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కే మొగ్గు చూపడం ఖాయం. వర్షంతో పూర్తిగా ముప్పయితే లేకపోయినా... అంతరాయం తప్పదు. జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), కోహ్లి, పంత్, సూర్యకుమార్, శివమ్ దూబే, హార్దిక్, జడేజా, అక్షర్, బుమ్రా, సిరాజ్, అర్‡్షదీప్.అమెరికా: మోనంక్ పటేల్ (కెప్టెన్ ), స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్, నితీశ్ కుమార్, కోరె అండర్సన్, హర్మీత్ సింగ్, జస్దీప్ సింగ్, కెంజిగె, సౌరభ్, అలీఖాన్. 10 అమెరికాలో భారత జట్టు ఆడిన మొత్తం టి20 మ్యాచ్‌లు. ఇందులో ఎనిమిది మ్యాచ్‌లు ఫ్లోరిడా రాష్ట్రంలోని లాడర్‌హిల్ పట్టణంలో వెస్టిండీస్‌తో జరిగాయి. ఆ ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదింటిలో భారత్ గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. మరో మ్యాచ్ రద్దయింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో, పాకిస్తాన్‌తో భారత్ ఒక్కో మ్యాచ్ విజయం సాధించింది. టి20 ప్రపంచకప్‌లో నేడుశ్రీలంక X నేపాల్వేదిక: ఫ్లోరిడా; ఉదయం గం. 5 నుంచిఆ్రస్టేలియా X నమీబియా వేదిక: నార్త్ సౌండ్; ఉదయం గం. 6 నుంచిభారత్ X అమెరికావేదిక: న్యూయార్క్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
‘సూపర్’ సాఫ్ట్వేర్ ఇంజినీర్
డాలస్: టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ‘సూపర్ ఓవర్’ను అద్భుతంగా బౌల్ చేసి అమెరికాను గెలిపించిన లెఫ్టార్మ్ పేసర్ సౌరభ్ నేత్రావల్కర్‌పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. భారత్‌కు చెందిన అతను చదువు, ఉద్యోగరీత్యా యూఎస్‌కు వెళ్లి ఇప్పుడు తొలిసారి వరల్డ్ కప్ ఆడుతున్న తమ టీమ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 32 ఏళ్ల సౌరభ్ 2013లో తన తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్, శార్దుల్ ఠాకూర్, వసీం జాఫర్ ఆ మ్యాచ్‌లో అతని సహచరులు. అయితే ఎన్నో ఆశలతో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అడుగు పెట్టిన అతనికి అదే చివరి రంజీ మ్యాచ్ కూడా అయింది. అజిత్ అగార్కర్, జహీర్ ఖాన్, అవిష్కార్ సాల్వి, ధావల్ కులకరి్ణలాంటి పేసర్లు ఉన్న ముంబై టీమ్‌లో అతనికి చోటు దక్కడం కష్టమైపోయింది. అంతకు మూడేళ్ల క్రితమే అండర్–19 వరల్డ్ కప్‌లో ఆడి భారత్ తరఫున అత్యధిక వికెట్లు (9) తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయితే అతను ఆశించినట్లుగా దేశవాళీ కెరీర్ ఊపందుకోకపోగా, ఐపీఎల్ అవకాశం కూడా దక్కలేదు. నిజానికి 2009లోనే సౌరభ్ వెలుగులోకి వచ్చాడు. ఎయిరిండియా ప్రతిభాన్వేషణలో భాగంగా బెంగళూరు ఎన్సీఏలో అద్భుత బంతితో యువరాజ్ సింగ్‌ను బౌల్డ్ చేయడంతో అతనికి స్కాలర్షిప్ లభించింది. కొద్ది రోజులకే అదే ఎయిరిండియా తమ ప్రధాన జట్టులోకి తీసుకోవడంతో యువరాజ్, రైనాలతో కలిసి కార్పొరేట్ టోర్నీ కూడా ఆడాడు. తర్వాతి ఏడాది కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఉనాద్కట్, హర్షల్ పటేల్‌లలో కలిసి అండర్–19 ప్రపంచకప్‌లో పాల్గొన్నాడు. అయితే ఏకైక రంజీ మ్యాచ్ తర్వాత మళ్లీ ఆశించిన అవకాశాలు రాలేదు. మరో రెండేళ్లు క్రికెట్లో గట్టిగా ప్రయత్నిస్తానని, లేదంటే ఆటను ఆపేస్తానని సౌరభ్ తన తండ్రికి చెప్పాడు. చివరకు అదే జరిగింది. కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన అతను ఎమ్మెస్ చేసేందుకు 2015లో అమెరికాకు వెళ్లిపోయాడు. న్యూయార్క్‌లో ప్రతిష్టాత్మక కార్నెల్ యూనివర్సిటీలో అవకాశం లభించింది. చదువులో ప్రతిభతో పాటు క్రికెట్ పరిజ్ఞానంతో ‘క్రిక్‌డీకోడ్’ అనే యాప్‌ను తయారు చేయడంతో ప్రత్యేక స్కాలర్íÙప్ కూడా లభించింది. చదువు పూర్తి కాగానే అతనికి ఒరాకిల్ సంస్థలో ఉద్యోగం కూడా వచ్చింది. అమెరికా చేరాక సరదాగా వారాంతపు క్రికెట్ ఆడుతూ వచ్చిన సౌరభ్... ఆ తర్వాత ఆటపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన యూఎస్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో ఆడటంతో మరింత గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో అమెరికా తరఫున 2018లో తొలి వన్డే ఆడిన నేత్రావల్కర్ గత ఏడాది జరిగిన మేజర్ లీగ్‌లో ఆకట్టుకోవడంతో టి20 టీమ్‌లో రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. అండర్–19 వరల్డ్ కప్‌లో పాక్‌తో మ్యాచ్‌లో బాబర్ ఆజమ్‌తో తలపడిన సౌరభ్... ఇప్పుడు బాబర్ టీమ్‌ను చిత్తు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. వరల్డ్ కప్ మ్యాచ్ కోసం ఆఫీసుకు సెలవు పెట్టిన సౌరభ్ ప్రదర్శన తర్వాత సౌరభ్ కంపెనీ ‘ఎక్స్’ ద్వారా తమ ఇంజినీర్‌ను అభినందించింది. -
టీ20 వరల్డ్‌కప్ చరిత్రలోనే సూపర్ క్యాచ్.. వీడియో వైరల్
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా డల్లాస్ వేదికగా పాకిస్తాన్-యూనైటడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్‌కు అమెరికా బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. 30 పరుగులకే పాకిస్తాన్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మహ్మద్ రిజ్వాన్(9), ఫఖార్ జమాన్(11), ఉస్మాన్ ఖాన్(3) వంటి స్టార్ బ్యాటర్లు ఎటువంటి ప్రభావం చూపకలేకపోయారు. నేత్రవల్కర్,నోస్తుష్ కేంజిగే, అలీ ఖాన్ తలా వికెట్ సాధించారు.సూపర్ క్యాచ్..ఇక ఈ మ్యాచ్‌లో అమెరికా ఆటగాడు స్టీవెన్ టేలర్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్‌తో పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ను టేలర్ పెవిలియన్‌కు పంపాడు. పాక్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన నేత్రవల్కర్ మూడో బంతిని రిజ్వాన్‌కు గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. దీంతో రిజ్వాన్ లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి కాస్త లేట్‌గా స్వింగ్ కావడంతో బ్యాట్ ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో ఫస్ల్ స్లిప్‌లో ఉన్న టేలర్ తన కుడివైపునకు డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో సూపర్ క్యాచ్‌ను అందుకున్నాడు.దీంతో రిజ్వాన్ మైండ్‌బ్లాంక్ అయిపోయింది. చేసేదేమి లేక రిజ్వాన్(9) నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
TRUMP: ‘హష్ మనీ’ కేసు.. ట్రంప్‌ను దోషిగా తేల్చిన కోర్టు
న్యూయార్క్: పోర్న్‌స్టార్‌కు అక్రమ చెల్లింపులు(హష్మనీ) చేసిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ న్యూయార్క్ కోర్టు దోషిగా తేల్చింది. దీంతో ఒక క్రిమినల్ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తిగా ట్రంప్ రికార్డులకెక్కారు.అక్రమ సంబంధం గురించి పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ మాట్లాడకుండా ఉండేందుకు ఆమెకు చేసిన చెల్లింపులకుగాను తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన నేరంలో ట్రంప్ దోషిత్వం రుజువయ్యింది. ఈ కేసులో ట్రంప్‌పై మోపిన మొత్తం 34 అభియోగాలు రుజువైనట్లు 14 సభ్యుల కోర్టు జ్యూరీ ప్రకటించింది. అయితే జ్యూరీ సభ్యుల ఏకాభిప్రాయంతో కోర్టు తుది తీర్పు వెలువరించాల్సి ఉంది. జులై 11న తుది తీర్పు వెలువరించడంతో పాటు ట్రంప్‌నకు శిక్ష ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఈ కేసులో ట్రంప్‌నకు గరిష్టంగా 4 ఏళ్లు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే తరహా నేరానికి పలువురు దోషులుగా తేలినప్పటికీ స్వల్ప శిక్షలు లేదా జరిమానాలు మాత్రమే విధించారు.2006లో తనను లైంగికంగా వాడుకున్న ట్రంప్ ఆ విషయం బయటికి రాకుండా ఉండేందుకు తనకు అక్రమ చెల్లింపులు చేశారని పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ హుష్‌మనీ కేసు ఫైల్ చేసింది. శిక్ష పడ్డా ప్రచారం షరా మామూలే..ఈ ఏడాది నవంబర్ 5న జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. ట్రంప్‌కు హుష్‌మనీ కేసులో ఒకవేళ జైలు శిక్ష పడినా అది ఆయన ఎన్నికల ప్రచారానికి, అధ్యక్ష పదవిని చేపట్టడానికి ఎలాంటి అడ్డంకి కాదని తెలుస్తోంది. ఎలాంటి శిక్ష పడినా ట్రంప్ వెంటనే ఈ కేసులో పైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రంప్‌ను నవంబర్5న జరగబోయే దేశాధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా నామినేట్ చేసే రిపబ్లికన్ పార్టీ సమావేశాలు జులై 15 నుంచే ప్రారంభమవనున్నాయి. దీనికి కొద్ది రోజుల ముందే ట్రంప్‌నకు కోర్టు శిక్ష ఖరారు చేయనుండటం గమనార్హం. నేను చాలా అమాయకుణ్ణి: ట్రంప్ ‘నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను చాలా అమాయకుణ్ణి. చివరి వరకు నేను పోరాడుతూనే ఉంటా. గెలుస్తా’అని దోషిగా తేలిన తర్వాత కోర్టు బయటికి వచ్చిన ట్రంప్ మీడియాతో అన్నారు. -
డిగ్రీ పేర్లకు అంతర్జాతీయ లుక్..
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ డిగ్రీ, పీజీ కోర్సులైన బీఏ, బీకాం, బీబీఎం, ఎంఏ, ఎంకామ్, ఎంబీఏలకు త్వరలో కొత్త పేర్లు రానున్నాయి. జాతీయ నూతన విద్యావిధానం–2020 (ఎన్ఈపీ) అమల్లో భాగంగా అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా వాటి పేర్లలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇకపై ఆయా కోర్సులను అమెరికాలో పిలుస్తున్న తరహాలో బీఎస్, ఎంఎస్‌గా పిలవనున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అన్ని విశ్వవిద్యాలయాలకు సూచించింది. దేశంలో సంప్రదాయ డిగ్రీ కోర్సులు చేసిన విద్యార్థులు విదేశాల్లో ఉద్యోగాలు లేదా ఉన్నత చదువులకు వెళ్లినప్పుడు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకే ఇలా పేర్లు మార్చనున్నారు. విస్తృత కసరత్తు అనంతరం.. సంప్రదాయ కోర్సుల పేర్ల వల్ల కలిగే ఇబ్బందులపై జాతీయ నూతన విద్యా విధానం ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. క్రెడిట్ విధానం అమలు చేయాలని సూచించిన ఈ విధానం.. ప్రపంచ దేశాల్లో అమలవుతున్న విద్యావిధానం భారత్‌లోనూ ఉండాలని కేంద్రానికి సూచించింది. ఈ సూచనల మేరకు గతేడాది యూజీసీ నిపుణులతో ఓ కమిటీని నియమించింది.అమెరికాలో ఉద్యోగాల కోసం వెళ్లే భారతీయులు అక్కడ గుర్తించే డిగ్రీలకన్నా భిన్నంగా ఉండటం వల్ల కొన్ని సమస్యలొస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పేర్లు మార్చాలని ప్రతిపాదించింది. స్పెషలైజేషన్ చేసే విద్యార్థులకు దీనివల్ల అంతర్జాతీయంగా గుర్తింపు ఉంటుందని అధికారులు అంటున్నారు. యూజీసీ సూచనలు ఇలా.. » దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు డిగ్రీల కొత్త విధానంపై యూజీసీ లేఖ రాసింది. ఇప్పటివరకు దేశంలో మూడేళ్ల కాలపరిమితి డిగ్రీ కోర్సులున్నాయి. వాటి స్థానంలో ఆనర్స్ కోర్సులను ప్రవేశపెడుతున్నారు. వాటి కాలపరిమితి నాలుగేళ్లు. సంబంధిత సబ్జెక్టులో లోతుగా అధ్యయనం చేసేలా కోర్సును నిర్వహించడం ఆనర్స్ కోర్సుల ఉద్దేశం. » ఉదాహరణకు బీకాం ఆనర్స్ అనే కోర్సులో సాధారణ కోర్సుతోపాటు నిపుణులు, వివిధ వర్గాల అనుభవజ్ఞులతో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండేలా కోర్సును రూపొందిస్తారు. మన రాష్ట్రంతోపాటు అనేక రాష్ట్రాల్లో బీఏ, బీకాం ఆనర్స్ కోర్సులను ప్రవేశపెట్టారు. » ఉత్తరాది రాష్ట్రాల్లో మరికొన్ని కోర్సులూ అమల్లోకి వచ్చాయి. ఇష్టమైన సబ్జెక్టును ఆన్లైన్ ద్వారా ఏ దేశంలోని వర్సిటీ నుంచైనా చేసే వీలు కల్పి0చారు. ఇలా ప్రపంచ స్థాయిలో విద్యావిధానం ఏకీకృతం అవుతున్న నేపథ్యంలో బీఏ, బీకాంలను బీఎస్, ఎంఎస్‌లుగా మార్చాలని యూజీసీ భావిస్తోంది. » రాష్ట్రంలోనూ ఇందుకు అనుగుణంగా కొన్ని కోర్సుల్లో మార్పులు చేస్తున్నారు. మల్టీ డిసిప్లినరీ కోర్సులను ఎంచుకొనే అవకాశం కల్పిస్తున్నారు. ఉదాహరణణకు ఒక విద్యార్థి చరిత్ర, భౌతిక శాస్త్రం, కామర్స్ సబ్జెక్టులను ఎంపిక చేసుకొనే విధానం తీసుకొస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఈ డిగ్రీని స్పెషలేషన్ సబ్జెక్టులుగా పేర్కొనాల్సి వస్తోంది. కాబట్టి బీఎస్, ఎంఎస్ వంటి పేర్లు మార్చడం వల్ల అన్ని దేశాల్లో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే దీనికి అన్ని రాష్ట్రాలూ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. -
కసరత్తులు షురూ!
న్యూయార్క్: టి20 ప్రపంచకప్ వేటలో అమెరికా గడ్డపై అడుగు పెట్టిన భారత క్రికెట్ బృందం మొదటి రోజు ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మినహా మిగతా ఆటగాళ్లంతా ఇందులో పాల్గొన్నారు. కోహ్లి ఇంకా న్యూయార్క్ చేరుకోలేదు. టీమిండియా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ ఈ ట్రయినింగ్ సెషన్‌ను పర్యవేక్షించారు. ముఖ్యంగా భారత్‌తో పోలిస్తే పూర్తిగా భిన్నమైన యూఎస్ వాతావరణానికి అలవాటు పడటంపై ఆటగాళ్లు దృష్టి సారించారు.ఐపీఎల్ కారణంగా మన క్రికెటర్లంతా 90 శాతంకి పైగా డే అండ్ నైట్ మ్యాచ్‌లే ఆడారు. కానీ వరల్డ్ కప్ లీగ్ దశలో అమెరికా వేదికపై జట్టు 25–27 డిగ్రీల వాతావరణంలో అన్నీ డే మ్యాచ్‌లే (ఉదయం గం. 10:30 నుంచి) ఆడబోతోంది. ట్రయినింగ్ సెషన్లో క్రికెటర్లు స్వల్ప జాగింగ్, రన్నింగ్‌తో పాటు కొద్దిసేపు ఫుట్‌బాల్ ఆడారు.‘టైమ్ జోన్‌కు అలవాటు పడటం అన్నింటికంటే ముఖ్యం. జట్టు సభ్యులంతా కూడా దాదాపు రెండున్నర నెలల తర్వాత మళ్లీ ఒక్క చోటికి చేరారు. వారి ఫిట్నెస్ స్థితి ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానిని బట్టి మున్ముందు రోజుల కోసం ప్రణాళికలు రూపొందిస్తాను’ అని దేశాయ్ చెప్పారు. వాతావరణం చాలా బాగుందని హార్దిక్ పాండ్యా అభిప్రాయపడగా... న్యూయార్క్‌లో తొలిసారి ఆడనుండటం పట్ల రవీంద్ర జడేజా ఉత్సాహంగా ఉన్నాడు. నగర శివార్లలోని నాసా కౌంటీ స్టేడియంలో జూన్ 1న బంగ్లాదేశ్‌తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ వరకైనా కోహ్లి జట్టుతో చేరతాడా లేదా అనే విషయంలో బీసీసీఐ స్పష్టతనివ్వలేదు. జూన్ 5న అసలు పోరులో ఐర్లాండ్‌తో భారత్ ఆడుతుంది. ‘నంబర్‌వన్’ ర్యాంక్‌తో ప్రపంచకప్‌లోకి... టి20 ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా నంబర్‌వన్ ర్యాంకర్‌గా బరిలోకి దిగనుంది. బుధవారం విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టి20 ర్యాంకింగ్స్‌లో భారత్ 264 రేటింగ్ పాయింట్లతో తమ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది.రెండుసార్లు టి20 వరల్డ్ చాంపియన్ వెస్టిండీస్ రెండు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక్‌కు చేరుకుంది. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను వెస్టిండీస్ 3–0తో క్లీన్‌స్వీప్ చేయడంతో ఆ జట్టు ర్యాంక్ మెరుగైంది. దక్షిణాఫ్రికా నాలుగు స్థానాలు పడిపోయి ఏడో ర్యాంక్‌లో నిలిచింది. -
‘రైసీ’ మృతి కేవలం ప్రమాదమే: అమెరికా
వాషింగ్టన్: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం వెనుక మరొకరి పాత్ర లేదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాధ్యూ మిల్లర్ స్పష్టం చేశారు. 45 ఏళ్ల నాటి హెలికాప్టర్‌ను ఉపయోగించాలనుకోవడం.. అది కూడా వాతావరణం సరిగా లేని సమయంలో ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. అంతకుముందు ఇరాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి జావెద్ మాట్లాడుతూ హెలికాప్టర్ విడిభాగాల సరఫరాపై అమెరికా విధించిన ఆంక్షల వల్లే తమ అధ్యక్షుడు మరణించారన్నారు. కాగా, రైసీ మృతికి కారణమైన బెల్ 212 హెలికాప్టర్లో సిగ్నల్ వ్యవస్థ ప్రధాన లోపంగా కనిపిస్తున్నట్లు టర్కీ రవాణశాఖ మంత్రి అబ్దుల్ ఖదీర్ తెలిపారు. హెలికాప్టర్లో సిగ్నల్ వ్యవస్థ పని చేయడం లేదని, అసలు సిగ్నల్ వ్యవస్థ ఉందో లేదో కూడా తెలియదన్నారు. హెలికాప్టర్ సిగ్నల్ కోసం తాము తొలుత ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నారు. వీవీఐపీలు ప్రయాణిస్తున్న హెలికాప్టర్లలో సిగ్నల్ వ్యవస్థ ఉండి తీరాలని ఖదీర్ అన్నారు. -
గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
ఫుల్లు ట్రాఫిక్.. ఐదారు కిలోమీటర్లు వెళ్లాలన్నా అరగంట పట్టేస్తోంది.. హాయిగా గాల్లో ఎగిరెళితే బాగుండు అనిపిస్తుంటుంది కదా..నిజంగానే అలా ఉన్నచోటు నుంచి గాల్లో ఎగిరెళ్లిపోయే..ఫ్లయింగ్ కార్ రెడీ అయింది. దాని పేరు హెక్సా.అమెరికాకు చెందిన ‘లిఫ్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్ కార్పొరేషన్’ సంస్థ దీనిని అభివృద్ధి చేసింది. తాజాగా జపాన్‌లోని టోక్యో నగరంలో జరిగిన ‘సుషి టెక్ టోక్యో–2024’ కార్యక్రమంలో దీన్ని ప్రదర్శించారు. పది మీటర్ల ఎత్తులో తిప్పుతూ.. షోలో ఈ ఫ్లయింగ్ కార్‌ను కేవలం బొమ్మలా పెట్టడం కాదు.. గాల్లో తిప్పి మరీ చూపించారు. కారులో కూర్చున్న వ్యక్తి.. దాన్ని పది మీటర్ల ఎత్తులో అటూ ఇటూ తిప్పాడు. ఈ ‘హెక్సా’ ఫ్లయింగ్ కార్ వెడల్పు 4.5 మీటర్లు, ఎత్తు 2.6 మీటర్లు, 196 కిలోల బరువు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. గాల్లో ఎగిరేందుకు 18 ప్రొపెల్లర్లు (మోటార్లు, రెక్కలు) బిగించారు. సెకన్లలోనే ఎటు కావాలంటే అటు తిప్పగలిగేలా ఏర్పాట్లు చేశారు. ఇది రీచార్జబుల్ బ్యాటరీలతో నడుస్తుంది. ఇది గంటకు 100 కిలోమీటర్ల వరకు వేగంతో వెళ్లగలదని కంపెనీ తెలిపింది. నేల మీదేకాదు.. నీటిలోనూ సురక్షితంగా ల్యాండ్ అవుతుందని పేర్కొంది. త్వరలోనే వీటిని అమ్మకానికి పెట్టనున్నట్టు వెల్లడించింది. ఇంతకీ ధరెంతో తెలుసా.. రూ.4.12 కోట్లు మాత్రమే.భవిష్యత్తు ఫ్లయింగ్ కార్లదే.. కిక్కిరిసిపోయి, అడుగు కూడా కదలని ట్రాఫిక్ సమస్యతో అల్లాడుతున్న నగరాల్లో భవిష్యత్తులో ఇలాంటి ఫ్లైయింగ్ కార్లు దూసుకుపోవడం ఖాయమని సుషి టెక్ షోలో పాల్గొన్న నిపుణులు పేర్కొన్నారు. అత్యవసరమైన మందులు, ఇతర సామగ్రి రవాణాకూ ఇవి అద్భుతంగా తోడ్పడతాయని చెప్పారు. ముఖ్యంగా ప్రమాదాలు, విపత్తులు సంభవించినప్పుడు.. ఫ్లయింగ్ కార్లతో ఎంతో ప్రయోజనం ఉంటుందని టోక్యో గవర్నర్ యురికో కోయికే పేర్కొన్నారు. - సాక్షి, సెంట్రల్‌డెస్క్ -
అమెరికా బెదిరింపు ధోరణి
అహంకారం తలకెక్కితే బుద్ధి మందగిస్తుంది. పెత్తనం చలాయించాలన్న యావ పరిధుల్ని మరిచిపోతుంది. భారత్–ఇరాన్‌ల మధ్య సోమవారం కుదిరిన ఒప్పందంపై అమెరికా స్పందించిన తీరు దాని అహంకారానికి నిలువెత్తు నిదర్శనం. ఇరాన్‌తో ఒప్పందానికి సిద్ధపడేవారు ఆంక్షలు ఎదుర్కొనక తప్పదంటూ అమెరికా విదేశాంగ ప్రతినిధి వేదాంత్ పటేల్ చేసిన వ్యాఖ్య బెదిరింపు ధోరణిలోవుంది. 2003లో వాజపేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఇరాన్‌తో చాబహార్ ఓడరేవు నిర్మాణంపై ఒప్పందం కుదిరింది మొదలు అమెరికా అడుగడుగునా అడ్డుపడుతోంది. అందువల్లే అయిదేళ్లలో పూర్తికావాల్సిన ప్రాజెక్టు కాస్తా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంది. 2018లో పూర్తయిందనిపించి లాంఛనంగా ప్రారంభించారు. కానీ దానికి సంబంధించి రోడ్లు, రైల్వేలైన్లు మొదలుకొని వివిధ మౌలిక సదుపాయాల కల్పన, యంత్ర సామగ్రి వగైరాల విషయం అనిశ్చితిలో పడింది. మొత్తంమీద ఇప్పటికి 21 ఏళ్లయింది. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ (ఐపీజీఎల్), ఇరాన్ పోర్టులు, నౌకా సంబంధ సంస్థల మధ్య ఓడరేవు టెర్మినల్ ప్రారంభంపై ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కింద ఐపీజీఎల్ 12 కోట్ల డాలర్ల (రూ. వెయ్యికోట్లుపైగా) పెట్టుబడి పెడుతుంది. మన దేశం మరో 25 కోట్ల డాలర్ల రుణం సమకూరుస్తుంది. చాబహార్ సమీపంలో నిర్మించిన ఈ షహీద్ బెహెస్తీ పోర్టు మన దేశానికి లాభదాయకమైన ప్రాజెక్టు. అంతేకాదు... మధ్య ఆసియా, పశ్చిమాసియా, యూరప్ దేశాలకు అది ‘బంగారువాకిలి’. ఈ ప్రాజెక్టు కింద నిర్మాణమయ్యే రోడ్లు, రైల్వేలైన్లు వివిధ ఓడరేవులతో అనుసంధానమవుతాయి. సరుకు రవాణా చకచకా సాగుతూ పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తుంది.పెట్రో కెమికల్స్, ఉక్కు, ఎరువుల రంగాల్లో ఇరాన్ బ్రహ్మాండమైన అభివృద్ధి సాధిస్తుంది. మధ్య ఆసియా మార్కెట్లలో ఇప్పటికే తిష్ఠ వేసి, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్టుతో బంగారు భవిష్యత్తును కలగంటూ అందరినీ మించి ఎదగాలని దూకుడుగా వెళ్తున్న చైనాకు చాబహార్ ఓడరేవు కంట్లో నలుసు. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో పనిచేయటం ప్రారంభిస్తే బీఆర్ఐ ప్రాజెక్టుకు పెద్ద విలువుండదు. ఇంతలోనే అమెరికా కొరడా ఝళిపించటం ప్రారంభించింది. ‘మేం ఇరాన్‌పై ఆంక్షలు విధించాం కనుక దానితో ఎవరూ వాణిజ్యబంధం నెలకొల్పుకోరాద’ంటూ ఫర్మానాలు జారీచేస్తోంది. రెండు సార్వభౌమత్వ దేశాల మధ్య ఒప్పందం కుదిరితే ఎందుకీ కడుపుమంట? ఏమిటీ బెదిరింపులు? ఇరాన్లో తనకు అనుకూలమైన మహమ్మద్ రెజా పహ్లావి (ఇరాన్ షా) పాలన సాగినంతకాలమూ అమెరికా ఆ దేశంతో సఖ్యంగా వుంది. ఇస్లామిక్ విప్లవం విజయవంతం కావటంతో ఆ పాలకుడు కాస్తా నిష్క్రమించాడు. ఆ తర్వాత ఖొమేనీ కనుసన్నల్లోకి ఇరాన్ వచ్చిననాటి నుంచీ ఆ దేశాన్ని అమెరికా అష్టదిగ్బంధం చేస్తోంది. ఏదో ఒక కారణంతో కయ్యానికి దిగుతోంది. తన సమస్యను ప్రపంచ సమస్య చేసి ఎవరూ ఆ దేశంతో వ్యాపార, వాణిజ్యాలను నడపరాదంటూ బెదిరిస్తోంది. పోనీ ఈ విషయంలోనైనా నిలకడగా వున్న చరిత్ర లేదు. 2003లో ఒప్పందం కుదిరినప్పుడు మౌనంగావున్న అమెరికా, ఆ తర్వాత కాలంలో ఇరాన్‌పై ఆంక్షలు విధించింది. పర్యవసానంగా ఆ ప్రాజెక్టు మూలనపడింది. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ వచ్చేనాటికి అంతర్జాతీయంగా పరిస్థితులు చక్కబడ్డాయి. అమెరికా, యూరప్ దేశాలు ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకుని ఆంక్షలు సడలించాయి. మరుసటి ఏడాదికల్లా చాబహార్‌పై భారత్–ఇరాన్ ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది.కానీ 2017లో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. ఆంక్షల పర్వం మళ్లీ మొదలైంది. కానీ మన దేశానికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. అప్పటికి అఫ్గాన్ ఆర్థికాభివృద్ధిని, దానికి అందాల్సిన మానవతా సాయాన్ని దృష్టిలో ఉంచుకుని మినహాయింపు ఇచ్చామని అమెరికా ప్రకటించింది. సారాంశంలో క్షణక్షణమూ మారే తన చిత్తానికి అనుగుణంగా ప్రపంచ దేశాలన్నీ మసులుకోవాలని అమెరికా వాంఛిస్తోంది. ఇలాంటి పోకడలను మొగ్గలోనే తుంచే ప్రయత్నం చేసివుంటే వేరుగా వుండేది. అది లేకపోవటం వల్లనే తాజాగా మరోసారి హూంకరిస్తోంది. దేశాలకు తమవైన విధానాలుంటాయి. ధూర్త దేశంగా మారి ఇరుగు పొరుగుకే కాక ప్రపంచ శాంతికే భంగంగా పరిణమించినప్పుడు ఎవరూ అలాంటి దేశంతో కలవాలనుకోరు. గతంలో ఇరాన్ విషయంలో భారత్‌కు ఇచ్చిన మినహాయింపులకు షరతులున్నాయి. ఇరాన్నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురును వెంటనే తగ్గించుకోవాలని, మున్ముందు ఆపేయాలని అప్పట్లో అమెరికా కోరింది. అప్పటికి రోజుకు ఏడు లక్షల చమురు బ్యారెళ్లు దిగుమతి చేసుకునే భారత్... చివరకు ఆ దిగుమతిని ఆపేసింది కూడా! ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపేయాలని అమెరికా కోరినా లెక్కచేయని భారత్... మొదటినుంచీ అన్ని విషయాల్లో మద్దతుగా నిలుస్తున్న తమ విషయంలో భిన్నంగా ఉంటున్నదని ఇరాన్ ఇప్పటికే విమర్శించింది. ఇరాన్ వైఖరేమిటన్న సంగతలావుంచి మన ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చి మనవైన విధానాలు రూపొందించుకోవటం తప్పనిసరి. విదేశాంగమంత్రి జైశంకర్ అన్నట్టు అంతర్జాతీయంగా ఎన్నో దేశాల ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడే చాబహార్ పోర్టును అమెరికా సంకుచిత దృష్టితో చూడటం, మోకాలడ్డాలని ప్రయత్నించటం తగదు. మన దేశం ఇతర దేశాలతో కూడా ఈ విషయంలో చర్చించాలి. కాస్త వెనకా ముందూ కావొచ్చుగానీ ఇలాంటి అనారోగ్య ధోరణులు అందరికీ ముప్పు తెచ్చేవే! -
Donald Trump: పాత కేసులో కొత్త చిక్కులు
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ పాత కేసులో కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. హష్ మనీ కేసు ఆయన మెడకు చుట్టుకుంటోంది. గత ఎన్నికల్లో ఆయన మోసానికి పాల్పడ్డారని ప్రాసిక్యూషన్ వాదిస్తుండగా.. ఇది కుట్ర అంటూ ఎదురుదాడి చేస్తున్నారు ట్రంప్.అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మోసానికి పాల్పడ్డారా..?అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన డొనాల్డ్ ట్రంప్‌నకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. పోర్న్‌స్టార్‌తో అనైతిక ఒప్పందం కేసులో ఆయన చుట్టూ బలంగా ఉచ్చు బిగిస్తోంది. ఈ వ్యవహారంతో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మోసానికి పాల్పడ్డారన్నది ప్రాసిక్యూషన్ వాదన.స్టార్మీ డేనియల్స్‌కు డబ్బులు ఇచ్చి అఫైర్‌ను కప్పిపుచ్చిన ట్రంప్!2016 ఎన్నికల ప్రచార సమయంలో.. శృంగార తార స్టార్మీ డేనియల్స్‌కు డబ్బులు ఇచ్చి ఆమెతో శారీరక సంబంధాన్ని బయటకు రాకుండా అనైతిక ఒప్పందం చేసుకున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ట్రంప్. ఈ నాన్‌డిజ్‌క్లోజర్ అగ్రిమెంట్‌ను రద్దు చేయాలంటూ రెండేళ్ల తర్వాత కోర్టును ఆశ్రయించింది స్టార్మీ. దీనిపై న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ డొనాల్డ్ ట్రంప్‌పై నేరారోపణలు నమోదు చేసింది.2016 ఎన్నికల సమయంలో ట్రంప్ మోసానికి పాల్పడ్డారు : ప్రాసిక్యూషన్తాజాగా ఈ కేసులో వాడీవేడి వాదనలు జరిగాయి. ప్రాసిక్యూటర్ తరపున వాదించిన మాథ్యూ కోలాంగెలో.. 2016 ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ మోసానికి పాల్పడ్డారన్నారు. తన పరువు పోకుండా ఉండేందుకు శతవిధాలా యత్నించారని.. ఇందుకోసం సెక్స్ స్కాండల్‌ను కప్పిపుచ్చేలా వ్యవహరించారని ఆరోపించారు. తన గురించి చెడుగా మాట్లాడకుండా కొందరి నోళ్లు మూయించడానికి ట్రంప్ డబ్బు ఖర్చు చేశారన్నారు. చట్టవిరుద్ధంగా జరిగిన ఆ ఖర్చు ఎన్నికలను ప్రభావితం చేసే అంశమేనని.. కచ్చితంగా ఇది ఎన్నికల మోసం కిందకే వస్తుందని బలంగా వాదించారు మాథ్యూ కోలాంగెలో.డొనాల్డ్ అమాయకుడు, ఎలాంటి నేరం చేయలేదు: ట్రంప్ తరపు న్యాయవాదులుప్రాసిక్యూషన్ అభియోగాలను ట్రంప్ తరఫు న్యాయవాదులు ఖండించారు. డొనాల్డ్ అమాయకుడని, ఎలాంటి నేరం చేయలేదని, అసలు మాన్‌హట్టన్ అటార్నీ ఆఫీస్ ఈ కేసును ఏనాడూ ప్రస్తావించలేదని వాదించారు. అధ్యక్ష ఎన్నికలకు దూరం చేసేందుకు ఇది తనపై జరుగుతున్న కుట్ర అని ఆరోపించారు డొనాల్డ్ ట్రంప్.అధ్యక్ష పదవిలో ఉండగా రెండుసార్లు అభిశంసన ఎదుర్కొని నెగ్గారు ట్రంప్. యూఎస్ కేపిటల్ మీద దాడి ఘటన, వైట్‌హౌస్ నుంచి కీలకమైన పత్రాల మిస్సింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు శృంగార కుంభకోణంలో కోర్టు విచారణ ద్వారా మరోసారి చిక్కుల్లో పడ్డారు. అమెరికా మాజీ అధ్యక్షుల్లో ఇలాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న తొలి వ్యక్తిగా చరిత్రకెక్కారు ట్రంప్. -
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు నిజమే: ఇటలీ
క్యాప్రి ఐలాండ్: పశ్చిమాసియాలో రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్లో శుక్రవారం(ఏప్రిల్ 19) సంభవించిన పేలుళ్లు ఇజ్రాయెల్ పనేనని అమెరికా చెబుతోంది. ఈ దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి నిమిషంలో సమాచారం అందిందని జీ7 దేశాలకు అమెరికా తెలిపింది. ఈ విషయాన్ని ఇటలీలోని క్యాప్రి ఐలాండ్‌లో జరుగుతున్న జీ7 మీటింగ్‌లో ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు. ఇరాన్‌లోని ఇస్ఫహాన్ నగరంలోని న్యూక్లియర్ స్థావరాల సమీపంలో పలు డ్రోన్లను కూల్చివేసినట్లు ఇరాన్ తెలిపింది. డ్రోన్ల కూల్చివేత కారణంగానే పేలుళ్ల శబ్దాలు వెలువడ్డాయని వెల్లడించింది. ఇటు ఇరాన్‌పై దాడుల సమయంలోనే అటు సిరియాపైనా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. కాగా, ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేసింది. అయితే ఈ డ్రోన్లు, మిసైళ్లను ఇజ్రాయెల్ కూల్చివేసింది. ఇరాన్ దాడుల వల్లే ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగింది. ఇదీ చదవండి.. ఫ్రాన్స్: ఇరాన్ కాన్సులేట్‌లో మానవ బాంబు కలకలం -
ఇజ్రాయెల్‌తో యుద్ధం: ఇరాన్ సంచలన ప్రకటన
టెహ్రాన్: ఇరాన్,ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు తొలగిపోయినట్లేనా..ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారినట్లేనా..ఇజ్రాయెల్‌పై డ్రోన్లు,మిసైళ్లతో దాడులు జరిపిన తర్వాత ఇరాన్ మెత్తబడిందా.. అంటే ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి చేసిన ప్రకటన అవుననే చెబుతోంది. ‘ఇజ్రాయెల్‌పై మేం జరిపిన దాడుల గురించి అమెరికాకు సమాచారమిచ్చాం. ఈ దాడులు పరిమితమైనవి. కేవలం మా ఆత్మరక్షణ కోసం చేసినవేనని తెలిపాం. మిడిల్ ఈస్ట్ ప్రాంత, ప్రపంచ శాంతి కోసం ఇరాన్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగించే ఉద్దేశమేమీ మాకు లేదు. ఇజ్రాయెల్ కవ్విస్తే మాత్రం మా ఆత్మరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడం’అని ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రి అమీర్ అబ్దుల్లాహియాన్ చెప్పారు. ఆదివారం(ఏప్రిల్14) ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అబ్దుల్లాహియాన్ మాట్లాడారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన డ్రోన్,మిసైల్ దాడులను అమెరికా సహా పశ్చిమ దేశాలన్నీ ఖండించిన నేపథ్యంలో దాడులు కొనసాగించే ఉద్దేశం లేదని ఇరాన్ ప్రకటించడం గమనార్హం. కాగా, శనివారం(ఏప్రిల్ 13) అర్ధరాత్రి ఇజ్రాయెల్‌పై ఇరాన్ వందల కొద్ది డ్రోన్లు, మిసైళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ మిసైళ్లలో చాలా వాటిని ఇజ్రాయెల్ అడ్డుకుని కూల్చివేసింది. ఈ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తునేదానిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇటీవల సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఆ దేశానికి చెందిన 13 మంది ఆర్మీ అధికారులు మరణించారు. దీనికి ప్రతీకారంగానే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేసింది. ఇదీ చదవండి.. ఇరాన్ మిసైల్ దాడులు.. తొలిసారి స్పందించిన నెతన్యాహు -
ఎవరు గెలిస్తే ఇండియాకు మేలు?
భారతదేశ వ్యూహాత్మక అవసరాలు తీరేందుకు జో బైడెన్ అమెరికా అధ్యక్ష స్థానంలో ఉండటం అవసరం. అయితే డెమోక్రాట్లకు బీజేపీ అంటే అసలు పడటం లేదు. ట్రంప్‌కు బీజేపీ రాజకీయాలంటే పట్టింపేమీ లేదు కానీ.. ఎప్పుడెలా స్పందిస్తారో తెలియదు! అయితే, ట్రంప్ అధికారంలో ఉండగా ఇతర దేశాల కంటే చాలా తక్కువ నష్టం భారత్‌కు జరిగిన విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. చైనాతో ట్రంప్ తెగదెంపులు చేసుకోవడం వల్లనే ట్రంప్ ప్రభుత్వం పుల్వామా, గల్వాన్ ఘటనల్లో భారత్‌కు మద్దతుగా నిలిచింది. అయితే రెండోసారి అధికారం చేపడితే ట్రంప్ వ్యవహారశైలి ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించలేము. అలాంటి నేపథ్యంలో భారతీయ దౌత్యం అవసరం మరింత ఎక్కువవుతుంది. అమెరికా రాజకీయాలు... భారత్‌లో వాటి ప్రభావం అన్న అంశాన్ని తీసుకుంటే నాలుగు అంశాలు పరస్పర విరుద్ధంగా కనిపిస్తాయి. మొదటగా చెప్పు కోవాల్సింది చైనాను నియంత్రించే విషయంలో బైడెన్ ఇండో పసఫిక్ ప్రాంతంలో తీసుకున్న చర్యలు. ఈ చర్యలన్నీ బాధ్యతాయుతమైనవే కాదు, ఒక పద్ధతి ప్రకారం చేసినవి కూడా. కాకపోతే ఉక్రెయిన్, గాజా యుద్ధాల కారణంగా చైనాపై శ్రద్ధ కొంత తగ్గిందనడం కూడా సత్య దూరమేమీ కాదు. బైడెన్ నేతృత్వంలో క్వాడ్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. జపాన్ తన మిలిటరీ ఆధునికీకరణ చేపట్టింది. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా భద్రతాంశాలపై త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చు కున్నాయి. అలాగే జపాన్, ఫిలిప్పీన్్స, అమెరికా మధ్య కూడా ఒక ఒప్పందం కుదిరింది . ఫిలిప్పీన్్సలో అమెరికా ఉనికి మరింత పెరిగింది. ‘ఆకస్’(ఆస్ట్రేలియా, యూకే, యూఎస్) ప్రకటన జరిగింది. దక్షిణ పసిఫిక్ ద్వీపాల ప్రాముఖ్యతనూ అమెరికా గుర్తించడం గమ నార్హం. ఆసియాన్ నేతలకు వైట్‌హౌస్ ఆతిథ్యమిచ్చింది. తైవాన్‌లో ఎన్నికల నిర్వహణ సజావుగా సాగింది. వియత్నాంతో అమెరికాబంధం మరింత దృఢపడింది. అలాగే చైనాపై అమెరికా కఠినమైనటెక్ నిషేధాలు కూడా విధించింది. ఇదే సమయంలో ఘర్షణ మరింత ముదరకుండా వ్యూహాత్మకంగా ఒకవైపు చైనాతో చర్చలు కొనసా గిస్తూనే మరోవైపు ఆ దేశంతో తన పోటీతత్వానికి మరింత పదును పెట్టింది. అమెరికా ఆలోచనల్లో భారత్ కనీసం నాలుగు విధాలుగా ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తుంది. ప్రపంచస్థాయి చర్చల్లో భారత్ కీలక మైన భాగస్వామి అని బైడెన్ ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. ఈ కారణంగానే భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సమావేశాలకు పూర్తి స్థాయిలో అమెరికా మద్దతిచ్చింది. ఐఎంఈసీ, ఐ2యూ2, క్వాడ్, ఐపీఈఎఫ్, మినరల్ సెక్యురిటీ పార్ట్నర్షిప్, ఆర్టిమిస్ అకార్డ్స్ వంటి వేర్వేరు వ్యవస్థల్లో భారత్‌ను కీలకంగా మార్చింది. ఇంధనం నుంచి ఆహార భద్రత, వాతావరణ మార్పులు మొదలుకొని కోవిడ్ వంటి మహమ్మారుల నిర్వహణ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన వంటి అన్ని ప్రపంచస్థాయి సమస్యల పరిష్కారంలో భారత్ భూమిక తప్పదన్న విషయం కూడా అమెరికా గుర్తించింది. భారత్ సామర్థ్యాన్ని పెంచడం ప్రపంచ సమస్యల పరిష్కార బాధ్యతను పంచుకోవడం అవుతుందని అమెరికా భావిస్తోంది. దీనివల్ల అటు చైనాను నియంత్రించడం, దక్షిణాసియా ప్రాంతంలో భద్రతను కాపాడటం కూడా సాధ్యమన్నది అమెరికా అంచనా. అలాగే సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి తగిన వ్యవస్థలను ఏర్పాటు చేయడం, కలిసికట్టుగా తయారీ చేపట్టడం, రక్షణ రంగంలో సహకారం, అమెరికాలోని పెద్ద పెద్ద కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెడుతూండటం భారత్‌పై పెరుగుతున్న అమెరికా విశ్వాసానికి నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. భారత్ భౌగోళిక స్వరూపం, ఇరుగు పొరుగు, చరిత్ర వంటి అనేక అంశాల ఆధారంగా బైడెన్ యంత్రాంగం ఈ దేశం తన ప్రయోజనాలు సాధించుకునేందుకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తోంది. కొన్నిసార్లు విభేదించినా భూ దక్షిణార్ధగోళం మొత్తమ్మీద భారత్ పరపతి చైనా కంటేఎంతో మెరుగని అమెరికా భావిస్తోంది. ఇక రెండో విషయానికి వద్దాం. డెమోక్రాట్లు ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీతో అంత సౌకర్యంగా ఏమీ లేరు. ఇందుకు మూడు కారణాలు కనిపిస్తాయి. ప్రజాస్వామ్యం విషయంలో పార్టీ ధోరణి మారిపోవడం ఇందులో ఇకటి. యూఎస్ కాంగ్రెస్‌లోని ఐదుగురు దేశీ ప్రతినిధులు డెమోక్రాట్లే కావడం గమనార్హం. ఆధిపత్య ధోరణులకు దూరంగా ఉండాలన్న కాంక్ష, మైనారిటీలకు గుర్తింపు ఉండాలన్న భావనలు వీరిని డెమోక్రాట్ పార్టీ వైపు మళ్లించాయి. జాతి ఆధారిత నేషనలిజమ్పై కూడా వీరికి నమ్మకం లేదు. బీజేపీ ఇప్పుడు ఈ విలువలన్నింటికీ దూరమన్న అంచనా డెమోక్రాట్లలో బలపడుతోంది. రెండో కారణం అమెరికన్ ముస్లింల ప్రభావం. డెమోక్రాట్లలో భార తీయ అమెరికన్ ముస్లింల ప్రభావం కూడా క్రమేపీ ఎక్కువ అవుతోంది. బైడెన్ గాజా విషయంలో ఇప్పటికే వీరి నుంచి కొంత వ్యతిరే కత ఎదుర్కొంటున్నారు. మిషిగన్ వంటి స్వింగ్స్టేట్లో దీని ప్రభా వమూ కనిపించింది. మూడో కారణం... డెమోక్రాట్లు ట్రంప్ రాజకీ యాలను వ్యతిరేకిస్తారు. ట్రంప్ ప్రజాస్వామ్యానికి ఎలా వ్యతిరేకం అన్న విషయంపై ఈ రాజకీయాలు మొత్తం ఆధారపడి ఉంటాయి. ఫలితంగా వీరు మానవహక్కుల వంటి విషయాలకు అనుకూలంగా ఉండాల్సి ఉంటుంది. పౌరసత్వ (సవరణ) చట్టం విషయంలో ఇటీవలి కాలంలో భారత్, అమెరికా మాటా మాటా అనుకున్న విషయం ఒకసారి గుర్తు చేసుకుందాం. అయితే ఈ విషయాలన్నింటినీ తప్పుకొని మరీ పని చేసేందుకు బైడెన్యంత్రాంగం ఒక మార్గాన్ని గుర్తించింది. అంశా లను బహిరంగంగా కాకుండా, ప్రైవేట్‌గా ప్రస్తావించడం. అడపాద డపా ఎవరైనా అడిగితే నర్మగర్భంగా బహిరంగ వ్యాఖ్యలు చేయడం. అమెరికాలో భారత్‌పై ఆందోళన చెందుతున్న బీజేపీయేతర పార్టీలకు సంఘీభావ సంకేతం పంపేందుకు ఇలా చేస్తుందన్నమాట. ఉన్నతా ధికారులు, నేతలకు మాత్రం విషయం సుస్పష్టం. మూడో అంశం... డోనాల్డ్ ట్రంప్ హ్రస్వదృష్టి. ఇందులో మైనారి టీలు, మతపరమైన అంశాలు, ఎన్నికల వ్యవస్థ చేతనావస్థ వంటి వాటికి చోటు లేదు. బహుశా క్రైస్తవుల హక్కుల గురించి ట్రంప్ కొంత ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సువార్తికులకు ఈయన కొంచెం తలొగ్గుతూంటారు.అధ్యక్ష ఎన్నికల్లో కొంచెం ముందున్న ట్రంప్ భారత్ ప్రయోజనా లకు అనుకూలంగా ఉంటాడని అనుకోలేము. అయితే, ట్రంప్ అధికా రంలో ఉండగా ఇతర దేశాల కంటే చాలా తక్కువ నష్టం భారత్‌కు జరిగిన విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. చైనాతో ట్రంప్ తెగదెంపులు చేసుకోవడం వల్లనే ట్రంప్ ప్రభుత్వం పుల్వామా, గల్వాన్ ఘటనల్లో భారత్‌కు మద్దతుగా నిలిచింది. అయితే రెండోసారి అధి కారం చేపడితే ట్రంప్ వ్యవహారశైలి ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించలేము. అమెరికాలో రాజకీయపరమైన అస్థిరత, విభజన ఉండటం ఉక్రెయిన్, యూరప్ దేశాల నిరుత్సాహానికి తద్వారా అమెరికా ప్రత్య ర్థులకు బలాన్ని ఇస్తుంది. అందుకే అమెరికా ప్రత్యర్థులు... డెమో క్రాట్లు అంటే ఇష్టం లేని కొందరు అమెరికా స్నేహితులు కూడా ట్రంప్ విజయాన్ని కోరుకుంటున్నారు. ఒక ఉదాహరణ తీసుకుందాం. బీజింగ్ ఇప్పటికే అమెరికా వ్యవ హారాన్ని తిరిగి మొదలుపెట్టింది. ట్రంప్‌కు సాయపడేలా ఎన్నికల్లో తప్పుడు ప్రచారాన్ని కూడా మొదలుపెట్టిందన్న వార్తలూ ఉన్నాయి. తన ప్రయోజనాలు కాపాడేలా చేస్తే వాణిజ్య పునరుద్ధరణ సాధ్యమే అని చైనా ట్రంప్‌కు సంకేతాలిచ్చినా ఆశ్చర్యం లేదు. టిక్టోక్ విష యంలో ట్రంప్ తన మునుపటి వైఖరిని మార్చుకున్న విషయంఇక్కడ చెప్పుకోవాలి. అమెరికన్ రాజ్యాంగంపై పోరు చేస్తామన్నట్రంప్ వ్యాఖ్య, వ్యాపార వాణిజ్య వ్యవహారాల్లో దుందుడుకుతనం, ఆసియా, యూరప్‌లలోని కొన్ని మిత్రదేశాలతోనూ దురుసుగా వ్యవహరించడం వంటివి చూస్తే ట్రంప్ మరోసారి అధికారంలోకి వస్తే ప్రపంచం మరోసారి గందరగోళంలో పడుతుందనేది మాత్రం వాస్తవం. అలాంటి నేపథ్యంలో భారతీయ దౌత్యం అవసరం మరింత ఎక్కువవుతుంది. ఈ విషయంలో భారత్ ఎంతో కొంత ఆందోళనచెందాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. - వ్యాసకర్త జర్నలిస్ట్ మరియు కాలమిస్ట్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)ప్రశాంత్ ఝా -
అమెరికాలో కిడ్నాపైన నాచారం విద్యార్థి అర్ఫాత్ మృతి
మల్లాపూర్ (హైదరాబాద్): అమెరికాలో కిడ్నాప్ అయిన హైదరాబాద్‌లోని నాచారానికి చెందిన విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్(25) ఓహాయోలోని క్లీవ్‌ల్యాండ్‌లో మృతి చెందాడు. అక్కడి సరస్సులో లభ్యమైన మృతదేహం నడుము చుట్టూ పాస్‌పోర్ట్, మొబైల్‌ఫోన్, కొన్ని పత్రాలు కట్టి ఉన్నాయి. వాటిని పరిశీలించిన పోలీసులు అర్ఫాత్‌గా గుర్తించారు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారత దౌత్య కార్యాలయం మంగళవారం ‘ఎక్స్’లో వెల్లడించింది. అర్ఫాత్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసేందుకు పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రకటించింది. అర్ఫాత్ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పింది. మార్చి 7న కిడ్నాప్: నాచారానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్ గత మార్చి 7న అదృశ్యమయ్యాడు, ఉన్నత చదువులకు అమెరికా వెళ్లిన అర్ఫాత్ క్లీవ్‌ల్యాండ్ విశ్వవిద్యాలయంలో ఐటీ మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. అయి తే కిడ్నాప్‌నకు కొద్ది రోజుల ముందు తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చిందని అర్ఫాత్ తన తండ్రి మహమ్మద్ సలీంకు ఫోన్ చేసి చెప్పాడు, దీంతో వారు ఆందోళన చెందారు. ఇది జరిగిన కొద్దిరోజులకే అర్ఫాత్ కిడ్నాప్ అయ్యాడు. 1200 డాలర్లు ఇస్తేనే విడిచి పెడతామని బెదిరించారని, లేకుంటే అర్ఫాత్ కిడ్నీలు విక్రయిస్తామని కిడ్నాప్ చేసినవారు సలీంను ఫోన్లో బెదిరించారు. అయితే అర్ఫాత్‌ను రక్షించుకునేందుకు తండ్రి సలీం అంగీకరించి,...అర్ఫాత్ మీ దగ్గర ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయా అని అడిగాడు. దీంతో కిడ్నాపర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫోన్ పెట్టేశారని, వారి నుంచి మళ్లీ కాల్ రాలేదని సలీం తెలిపారు. కిడ్నాపర్ మాట్లాడటానికి ముందు ఫోన్లో ఎవరిదో ఏడుపు వినిపించిందని..అదే చివరి గొంతు అన్నారు. కిడ్నాపర్ల ఫోన్‌నంబరు అమెరికాలోని తమ బంధువులకు పంపి క్లీవ్‌ల్యాండ్ పోలీసులకు అందజేయాలని సలీం చెప్పారు. అర్ఫాత్ అదృశ్యంపై అతడి బంధువులు మార్చి 8న క్లీవ్‌ల్యాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లుకౌట్ నోటీసు జారీ చేశారు. ఇది జరిగిన దాదాపు నెలరోజుల తర్వాత విషాదవార్త వినాల్సి వచ్చిందని కుటుంబసభ్యులు రోదిస్తూ చెప్పారు. -
సూర్య గ్రహణం ఎఫెక్ట్.. అమెరికాలో భారీగా రోడ్డు ప్రమాదాలు !
వాషింగ్టన్: సూర్యగ్రహణం వేళ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అమెరికన్లను నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోమవారం(ఏప్రిల్ 8) ఉదయం ఉత్తర అమెరికాలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. 2017 సూర్యగ్రహణంతో పోలిస్తే ఈ గ్రహణ సమయంలో ఘోర రోడ్డు ప్రమాదాలు 31 శాతం దాకా పెరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం 2017లో గ్రహణం పూర్తిగా కనిపించే(ద పాత్ ఆఫ్ టొటాలిటీ) 70 మైళ్ల విస్తీర్ణం. ఈ విస్తీర్ణంలోని ప్రాంతాలకు గ్రహణాన్ని చూసేందుకు వచ్చిన వారితో కోటి 20 లక్షల మంది జన సాంద్రత ఏర్పడిందని, సోమవారం ఏర్పడే గ్రహణం 115 మైళ్ల విస్తీర్ణంలో పూర్తిగా కనిపించనుండగా మొత్తం 31.6 మిలియన్ల మంది ఈ విస్తీర్ణంలో ఉన్న ప్రాంతాలకు వచ్చి దీనిని చూస్తారని నాసా అంచనా వేసింది. అయితే గ్రహణం పూర్తిగా ఉన్న సమయంలో దానిని చూసేందుకు ఎక్కడి వారు అక్కడే ఆగి పోవడంతో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. గ్రహణానికి ముందు అది పూర్తిగా కనిపించే ప్రాంతాలకు చేరుకోవడానికి, గ్రహణం తర్వాత సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోయే సమయంలో రోడ్లపై ట్రాఫిక్ విపరీతంగా ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఈ సమయంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ప్రతి 25 నిమిషాలకు సగటున ఒక ప్రమాదం జరుగుతుండగా, ప్రతి 95 నిమిషాలకు రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు గత అనుభవాలు చెబుతున్నాయి. 2017 సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలోని కేవలం మూడు పెద్ద నగరాలకు మూడు గంటల దూరంలో పూర్తిగా కనిపించగా ప్రస్తుత సూర్య గ్రహణం కెనడాలోని టొరంటో సహా ఎనిమిది పెద్ద నగరాలకు 3 గంటల ప్రయాణ దూరంలో పూర్తిగా కనిపించనుంది. దీంతో దీనిని వీక్షించేందుకు అబ్జర్వేటరీలకు వెళ్లడానికి రోడ్డెక్కేవారి సంఖ్య భారీగా పెరగనుంది. కాగా, సంపూర్ణ సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలోని మెక్సికో, అమెరికా, కెనడాల మీద ఏర్పడనుంది. ఈ ప్రాంతాల్లో గ్రహణం ప్రభావాన్ని బట్టి పూర్తిగా చీకటి కమ్ముకోనుంది. అయితే భారత్‌లో దీని ప్రభావం లేదు. భారత కాలమాన ప్రకారం సోమవారం రాత్రి 9 గంటల తర్వాత నుంచి మంగళవారం తెల్లవారుజామున 2.22గంటల వరకు గ్రహణం ఉంటుంది. ఇదీ చదవండి.. నేడు సంపూర్ణ సూర్యగ్రహణం.. ఏయే రాశులకు ఏం జరుగుతుందంటే.. -
USA: 99 ఏళ్ల భారతీయ బామ్మకు అమెరికా పౌరసత్వం
వాషింగ్టన్: భారతీయ మహిళ దైబాయి 99 ఏళ్ల వయసులో అమెరికా పౌరసత్వం పొందారు. ఈ విషయాన్ని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రకటించింది. ‘వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అనడానికి 99 ఏళ్ల దైబాయి నిదర్శనం. మా ఓర్లాండో కార్యాలయానికి ఆమె ఉత్సాహంగా వచ్చారు. యూఎస్ కొత్త సిటిజన్‌కు మా అభినందనలు’అని యూఎస్సీఐఎస్ పోస్టు చేసింది. దైబాయికి అమెరికా పౌరసత్వం లభించడం పట్ల పలువురు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. కాగా మరికొందరు ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నిస్తున్నారు. ఇదీ చదవండి.. అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి -
USA: చిన్న పొరపాటుతో మహిళకు జాక్‌పాట్!
వాషింగ్టన్: జీవితంలో చిన్న పొరపాట్లు చేసి కోట్ల రూపాయల సంపదను పోగొట్టుకున్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు. అయితే అమెరికాలోని వర్జీనియాలో మిరియం లాంగ్ అనే మహిళకు మాత్రం తాను చేసిన చిన్నపొరపాటే భారీగా కలిసి వచ్చింది. ఒకేసారి ఏకంగా 1 మిలియన్ డాలర్(సుమారు 8 కోట్ల రూపాయలు) వర్జీనియా లాటరీ గెలుచుకునేలా చేసింది. మిరియం వర్జీనియాలోని బ్లాక్స్బర్గ్ నగరంలో ఉన్న సౌత్ మెయిన్ స్ట్రీట్‌లోని సీవీఎస్ స్టోర్‌కి వెళ్లింది. పనిలో పనిగా స్టోర్‌లో ఉన్న వర్జీనియా లాటరీ వెండింగ్ మెషిన్ వద్దకు వెళ్లి ఒక బటన్ నొక్కింది. అయితే అది రాంగ్ బటన్. నిజానికి మిరియం మెగా మిలియన్స్ లాటరీ టికెట్ కొనాల్సింది పోయి పొరపాటున వన్ మిలియన్ పవర్ బాల్ ప్రైజ్ టికెట్‌కు సంబంధించిన బటన్ నొక్కింది. దీంతో ఆమె అనుకున్నది కాకుండా వేరే టికెట్ వచ్చింది. లాటరీ డ్రా తీయగా విచిత్రంగా మిరియంకు పొరపాటున వచ్చిన టికెట్‌కే వన్ మిలియన్ డాలర్ ప్రైజ్ తగిలింది. ఊహించని విధంగా జాక్‌పాట్ తగలడంతో మిరియం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లాటరీ గెలుచుకోవడంపై మిరియం స్పందిస్తూ ‘ఇది నా జీవితంలో చేసిన చాలా మంచి పొరపాటు. ఇంత పెద్ద మొత్తం గెలుచుకున్నందుకు షాక్ తిన్నాను. నా గుండె సంతోషంతో వేగంగా కొట్టుకుంది’అని తెలిపింది. ఇదీ చదవండి.. 19 ఏళ్లకే బిలియనీర్ స్టూడెంట్.. ఆమె ఆస్తి అన్ని కోట్లా..? -
USA: ‘బాల్టిమోర్’ బ్రిడ్జి పునఃనిర్మాణానికి 480 కోట్లు
వాషింగ్టన్: ఇటీవల నౌక ఢీకొని కుప్పకూలిన అమెరికాలోని బాల్టిమోర్ వంతెన నిర్మాణం కోసం ఫెడరల్ ప్రభుత్వం ప్రాథమికంగా 60 మిలియన్ డాలర్ల(రూ.480 కోట్లు) అత్యవసర నిధులను కేటాయించింది. ఈ మేరకు మేరీ లాండ్ గవర్నర్ వెస్‌మూర్ కోరిన వెంటనే ఈ నిధులను దేశ రవాణా, హైవే మంత్రిత్వ శాఖ రాష్ట్రానికి మంజూరు చేసింది. ఈ నిధులతో వంతెన శిథిలాలను నదిలో నుంచి తొలగించడంతో పాటు కూలిన భాగాన్ని మళ్లీ నిర్మించనున్నారు. కీలకమైన బాల్టిమోర్ వంతెనను వీలైనంత త్వరగా మళ్లీ నిర్మించేందుకు అవసరమైతే భూమిని ఆకాశాన్ని ఒకటి చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలిచ్చినట్లు అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే మీడియాకు తెలిపారు. కాగా, మంగళవారం(మార్చ్ 29)న అర్ధరాత్రి ఒంటిగంటకు పటాప్కో నదిపై ఉన్న ఫ్రాన్సిన్ స్కాట్‌కీ బ్రిడ్జి భారీ కంటెయినర్ నౌక ఢీకొని కుప్పుకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బ్రిడ్జిపై పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు నదిలో పడిపోగా వారిలో ఇద్దరి మృతదేహాలు దొరికాయి. మరో నలుగురు ఆజూకీ ఇంకా తెలియలేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదీ చదవండి.. ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది దుర్మరణం -
కేజ్రీవాల్ అరెస్టు.. స్పందించిన అమెరికా
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారాన్ని గమనిస్తున్నామని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కేజ్రీవాల్ కేసులో పారదర్శక, న్యాయబద్ద, వేగవంతమైన విచారణ జరిగేలా చూడాలని భారత విదేశీ వ్యవహారాల శాఖకు సూచించినట్లు ఒక వార్తాసంస్థతో చెప్పారు. కాగా, ఇటీవలే కేజ్రీవాల్ అరెస్టు విషయంలో జర్మనీ స్పందించిన తీరు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ విషయంలో విదేశీ వ్యవహారల శాఖ భారత్‌లోని జర్మనీ రాయబారిని పిలిపించి నిరసన వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా తమ అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకోవడమేనని తెలిపింది. ఈ క్రమంలోనే అమెరికా కూడా కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించడం చర్చనీయాంశమవుతోంది. అమెరికా అధికారి వ్యాఖ్యలపై భారత్ ఎలా స్పందిస్తున్నది కీలకంగా మారింది. కాగా, ముడుపులు తీసుకుని లిక్కర్ పాలసీ రూపొందించడంలో ప్రధాన పాత్ర అరవింద్ కేజ్రీవాల్దేనన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మార్చ్ 21న ఆయనను అరెస్టు చేసింది. తర్వాత ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈడీ కేజ్రీవాల్‌ను ప్రవేశపెట్టింది. కోర్టు కేజ్రీవాల్‌ను మార్చ్ 28 దాకా ఈడీ కస్టడీకి ఇచ్చింది. ఇదీ చదవండి.. లిక్కర్ కేసు.. కేజ్రీవాల్ పిటిషన్‌ను విచారించనున్న ఢిల్లీ హైకోర్టు -
అరకు అందాలకు ‘అమెరికా’ ఫిదా
మహారాణిపేట(విశాఖ దక్షిణ): తూర్పు కనుమల్లో అమెరికా రాయబార ప్రతినిధులు ఎరిక్ గార్సెట్టి తదితరులు ఆదివారం పర్యటించారు. విశాఖలోని కైలాసగిరి, ఆర్కే బీచ్‌తోపాటు అరకు పరిసరాల్లోని పచ్చదనం, ప్రకృతి ఒడిలో అక్కడి ప్రజల జీవన విధానం చూసి ముగ్ధులైయ్యారు. విశాఖ నుంచి అరకు వెళ్లే మార్గంలో చిలకల గెడ్డ వద్ద ప్రకృతి అందాలతో పాటు పచ్చదనం లోయల్లో నీటి ప్రవాహాన్ని చూసి పరవశించిపోయారు. విశాఖ పరిసరాలు పర్యావరణానికి దగ్గరగా ఆరోగ్యకరమైన జీవనానికి చేరువగా ఉన్నట్టు యూఎస్ కాన్సులేట్ ప్రతినిధులు పేర్కొన్నారు. కాగా, భారత్–అమెరికా సైనిక సంబంధాలు, సంయుక్త విన్యాసాల ప్రదర్శనలో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి విశాఖ తీరంలో త్రివిధ దళాల సంయుక్త కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా భారత్ స్వయం సమృద్ధిగా రూపొందించిన ఐఎన్ఎస్ జలస్వ నౌకతోపాటు అమెరికాకు చెందిన యుద్ధ నౌకలపై త్రివిధ దళ సిబ్బంది విన్యాసాలు ప్రదర్శించారు. దీనిలో భాగంగా ఇప్పటికే విశాఖ చేరుకున్న బాహుబలి నౌక యూఎస్ కాన్సులేట్ భారత–అమెరికా సైనిక సిబ్బంది వివిధ అంశాలపై అవగాహన పొందారు. ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధనౌకగా గుర్తింపు పొందిన సోమర్ సెట్లో 25 యుద్ధ ట్యాంకులు, నాలుగు హెలికాప్టర్లు, అన్నివైపులా ఆయుధ ట్యాంకులు, 1000 మంది సిబ్బంది ఈ నౌకలో ఉండడం విశేషం. 2001 సెప్టెంబర్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్ర దాడుల స్మారకంగా నిరి్మంచిన ఈ యుద్ధనౌకను విపత్తుల సమయంలో రక్షణ దళాలకు ఆస్పత్రిగా సేవలు అందిస్తుంది. టైగర్ ట్రయాంప్ పేరిట ఈ నెల 31వ తేదీ వరకు సముద్రంపై విన్యాసాలు కూడా రెండు దేశాల త్రివిధ దళాలు చేయనున్నాయి. -
హౌతీల స్థావరాలపై అమెరికా దాడులు
వాషింగ్టన్ : హౌతీ గ్రూపు మిలిటెంట్లు తమ ఆయుధాలు దాచుకున్న యెమెన్‌లోని వారి భూగర్భ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు జరిపింది. ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్( సెంట్కామ్) ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దాడుల్లో హౌతీలకు చెందిన నాలుగు అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్స్ (యూఏవీ)లను ధ్వంసం చేసినట్లు అమెరికా తెలిపింది. దాడుల సమయంలో హౌతీలు ఎర్ర సముద్రంలోకి నాలుగు యాంటీ షిప్ బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించినట్లు సెంట్కామ్ వెల్లడించింది. హౌతీల దాడుల్లో నౌకలకు, సిబ్బందికి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీల దాడులను నివారించేందుకే వారి ఆయుధ స్థావరాలపై దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించింది. కాగా, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ మిలిటెంట్లు గత కొంతకాలంగా దాడులు చేస్తున్నారు. దీంతో ఆసియా నుంచి యూరప్, అమెరికా వెళ్లే నౌకలు దక్షిణాఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీంతో అంతర్జాతీయ నౌకాయాన ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. ఇదీ చదవండి.. గాజాలో కాల్పుల విరమణ.. యూఎన్‌లో వీగిన అమెరికా తీర్మానం -
మాస్కో ఉగ్రదాడిపై ముందే హెచ్చరించిన అమెరికా !
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించే అవకాశాలున్నట్లు ముందే హెచ్చరించామని అమెరికా ప్రకటించింది. ఈ విషయాన్ని వైట్‌హౌజ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి ఆడ్రియెన్ వాట్సన్ వెల్లడించారు. ‘ఈ నెల మొదట్లో అమెరికా ప్రభుత్వానికి మాస్కో ఉగ్రదాడికి సంబంధించిన సమాచారం అందింది. ప్రజలు గుమిగూడి ఉన్న ప్రదేశాల్లో ఈ దాడి జరిగే అవకాశాలున్నాయని తెలిసింది. దీంతో వెంటనే రష్యాలో ఉన్న అమెరికాన్లకు అడ్వైజరీ కూడా జారీ చేశాం. డ్యూటీ టు వార్న్ పాలసీ కింద ఇదే విషయాన్ని రష్యా ప్రభుత్వంతోనూ పంచుకున్నాం’అని వాట్సన్ తెలిపారు. మాస్కో శివార్లలో ఓ సంగీత కచేరి కార్యక్రమంలో నలుగురు ఉగ్రవాదులు చొరబడి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో పాటు గ్రెనేడ్ కూడా విసిరారు. ఈ కాల్పుల్లో 62 మంది మృతి చెందగా మరో 100 మంది దాకా గాయపడ్డారు. దాడికి తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఇప్పటికే ప్రకటించింది. ఇదీ చదవండి.. మాస్కోలో ఐసిస్ మారణహోమం -
USA: ఫ్లోరిడాలో కాల్పుల కలకలం
ఫ్లోరిడా: అమెరికా ఫ్లోరిడాలోని జాక్సెన్ విల్లా బీచ్ నగరం డౌన్ టౌన్ ప్రాంతంలో ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. కాల్పులు జరిపిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాల్పులు జరిగిన డౌన్‌టౌన్ ప్రాంతంలో ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. జాక్సన్ విల్లే బీచ్‌లో 24వేల మంది జనాభా ఉంటారు. కాగా, అమెరికాలో చిన్న చిన్న గొడవలకు కాల్పులు జరపడం సర్వసాధారణంగా మారింది. ఇటీవలి కాలంలో కాల్పుల ఘటనల్లో పలువురు మృతి చెందారు. దేశంలో వేళ్లూనుకుపోయిన గన్ కల్చర్ ప్రస్తుతం జరుగుతున్న అమెరికా అధ్యక్షల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి.. అమెరికాకు స్పేస్ ఎక్స్ నిఘా ఉపగ్రహాలు -
Red Sea: ‘హౌతీ’ల డ్రోన్‌ను పేల్చేసిన అమెరికా
వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ ప్రయోగించిన డ్రోన్‌ను కూల్చివేసినట్లు అమెరికా తెలిపింది. హౌతీల డ్రోన్ వల్ల నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. యెమెన్‌లో హౌతీల స్థావరాలపై జరిపిన దాడుల్లో హౌతీలకు చెందిన ఒక అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్(యూఏవీ)ని ధ్వంసం చేసినట్లు తెలిపింది. హౌతీల దగ్గరున్న పరికరాలన్నీ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలకు ముప్పుగా పరిణమించాయని పేర్కొంది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా ఎర్ర సముద్రం నుంచి వెళుతున్న హౌతీలు నౌకలపై గత కొంతకాలంగా దాడులకు పాల్పడుతున్నారు. హౌతీల దాడుల వల్ల ఆసియా నుంచి యూరప్ అమెరికా వెళ్లే దక్షిణాఫ్రికా నుంచి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీంతో అమెరికా, బ్రిటన్లు యెమెన్‌లోని హౌతీల స్థావరాలపై దాడులు చేస్తున్నాయి. ఇదీ చదవండి.. అమెరికాలో బుర్రిపాలెం విద్యార్థి అనుమానాస్పద మృతి