సౌందర్యలహరి శ్లోకాల పోటీలు | - | Sakshi
Sakshi News home page

సౌందర్యలహరి శ్లోకాల పోటీలు

Jun 9 2025 8:04 AM | Updated on Jun 9 2025 8:04 AM

సౌందర్యలహరి శ్లోకాల పోటీలు

సౌందర్యలహరి శ్లోకాల పోటీలు

పాలకొల్లు సెంట్రల్‌: స్థానిక క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో సనాతన భక్తి మండలి సభ్యురాలు నంబూరి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఆది శంకరాచార్య విరచితం సౌందర్యలహరి శ్లోకాల పోటీలు ఆదివారం నిర్వహించారు. 45 రోజులుగా వేసవి సెలవుల్లో 100 శ్లోకాలపై సుమారు 50 మంది చిన్నారులకు శిక్షణ ఇచ్చామని భాగ్యలక్ష్మి తెలిపారు. శ్లోకాలతో పాటు సనాతన ధర్మం, శాస్త్ర విజ్ఞానం, రుషులు, మునుల గొప్పతనం వివరించామన్నారు. శిక్షణ తరగతులకు సహకరించిన ఆలయ ఈఓ ముచ్చర్ల శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. శ్లోకాల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement