ఉద్యోగాల పేరుతో టోకరా | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరుతో టోకరా

Jun 11 2026 12:19 AM | Updated on Jun 11 2026 12:19 AM

బొండపల్లి: రైల్వేలోను, షిప్‌యార్డులోను ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపి తన నుంచి రూ.8 లక్షలు నగదు తీసుకున్న వ్యక్తుల నుంచి తన నగదు ఇప్పించాలని కోరుతూ కనిమెరక గ్రామానికి చెందిన మలిసెట్టి మహేశ్వర్రావు స్థానిక ఎస్సై యు.మహేష్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గజపతినగరానికి చెందిన పోట్టా వీర్రాజు, పోట్టా శ్రీనివాసరావుతో పాటు, పోట్టా గుణరాజులు తమ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి తన వద్ద నుంచి దఫా ధఫాలుగా రూ.8 లక్షలు తీసుకున్నారని ,ఉద్యోగాలు ఇప్పించకపోగా, డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసులను ఆరశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఽబాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

మరిపల్లి ప్రాంతంలో

ఏనుగుల సంచారం

సాలూరు రూరల్‌: మండలంలోని మరిపల్లి, రేగాపువలస గ్రామాల మధ్యలో ఏనుగులు సంచరిస్తున్నాయి. బుధవారం మరిపల్లి, గంగన్న దొర వలస గ్రామాల మధ్యలో ఏనుగుల గుంపు రోడ్డు పైకి వచ్చింది. దీంతో రోడ్డుకు ఇరువైపులా వచ్చిపోయే వారంతా కొంత సమయం ఆగిపోయారు. అలాగే పంటపొలాల్లో వ్యవసాయ బోర్లు, డ్రిప్‌ పైపులను ఏనుగులు ధ్వంసం చేసినట్లు రైతులు తెలిపారు.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

పూసపాటిరేగ : భోగాపురం మండలం చేపలకంచేరు తుఫాన్‌ బిల్డింగ్‌ సమీపంలో గుర్తు తెలియని మృతదేహాన్ని కనుగొన్నట్లు భోగాపురం సీఐ కూన దుర్గాప్రసాద్‌ బుధవారం తెలియజేశారు. మృతుడి వయస్సు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. ఎయిర్‌పోర్టులో పనుల నిమిత్తం వచ్చి వడగాడ్పుల కారణంగా తట్టుకోలేక గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడు ఎరుపురంగు బనియన్‌ ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు భోగాపురం పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement