మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
దోమ: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వడం లేదని తన భార్యతో ఘర్షణకు పాల్పడిన ఓ వ్యక్తి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన దోమ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. ఎస్‌ఐ వసంత్ జాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన బాలయ్య(47)కు మద్యం తాగే అలవాటు ఉంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి భార్య సత్యమ్మతో తాగడానికి డబ్బులు అడిగాడు. ఆమె నిరాకరించడంతో గొడవకు దిగాడు. అదే గ్రామంలో ఉంటున్న తన బంధువు ఇంటికి సత్యమ్మ వెళ్లింది. ఈ క్రమంలో బాలయ్య అర్ధరాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం ఉదయం భార్య ఇంటికి రాగా తలుపులు తెరుచుకోలేదు. దీంతో ఆందోళన చెంది చుట్టుపక్కల వాళ్లను పిలిచింది. వాళ్లొచ్చి ఇంటి తలుపులు పగుల గొట్టగా అతను ఉరి వేసుకొని కనిపించాడు. వెంటనే పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లినా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి ఓ కూతురు ఉంది. సత్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
ప్రత్యేక పూజలు
చార్మినార్: అధిక మాసంలో పూజలు నిర్వహిస్తే మిగతా నెలలన్నింటిలో లభించని పుణ్యం ఈ మాసంలో లభిస్తుందని జగద్గురు శంకరాచార్య హంపి పీఠాధిపతులు విద్యారణ్య భారతి స్వామి అన్నారు. ఆదివారం మీరాలంమండి మహంకాళేశ్వర దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


