అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి

Jun 15 2026 10:09 AM | Updated on Jun 15 2026 10:09 AM

పూడూరు: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి అన్నారు. శనివారం రాత్రి మండల పరిధిలోని మంచన్‌పల్లి అనుబంధ గ్రామమైన మాటుగూడలో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డితో కలిసి అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం వల్లనే అట్టడుగు వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు అందుతున్నాయంటే ఆ మహనీయుని పుణ్యమని చెప్పారు. రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. చీకటి బతుకుల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్‌ అని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు ఆనందం, ఆత్మకమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ రఘునాథ్‌రెడ్డి, సర్పంచ్‌ రాఘవేందర్‌, ఉప సర్పంచ్‌ ఆరీఫ్‌, ఆర్టీఐ కన్వీనర్‌ వెంకటయ్య, నాయకులు లక్కం సత్యనారాయణ, షకీల్‌, అబ్రాహం తదితరులు పాల్గొన్నారు.

మంత్రి వివేక్‌ వెంకటస్వామి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement