చందానగర్ : రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నామని చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..12 సంవత్సరాల మోదీ పాలనలో రైల్వే వ్యవస్థలో కీలక మార్పులు వచ్చాయన్నారు. కొత్త లైన్ల నిర్మాణం, రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయన్నారు.హఫీజ్‌పేట్, హైటెక్ సిటీ స్టేషన్లు రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు బుచ్చిరెడ్డి, కేశవులు, అనిల్ గౌడ్, రామరాజు పాల్గొన్నారు.
చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు
కొండా విశ్వేశ్వర్ రెడ్డి


