పీఆర్సీ ప్రకటించకపోతే యుద్ధమే | - | Sakshi
Sakshi News home page

పీఆర్సీ ప్రకటించకపోతే యుద్ధమే

Jun 15 2026 10:09 AM | Updated on Jun 15 2026 10:09 AM

అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ ప్రకటించపోతే పోరాటం తప్పదని సీఐటీయూ జిల్లా కమిటీ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌(టీఎస్‌ యూటీఎఫ్‌) ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని విద్యాపీఠ్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వెంకటప్ప మాట్లాడుతూ.. ప్రతి ఊరు, ప్రతి తండాలో పాఠశాలలు ఉండడమే తన ధ్యేయమని ముఖ్యమంత్రిగా ప్రకటించిన విషయాన్ని మరిచి, స్కూల్స్‌ సంఖ్యను కుదిస్తామని అనడం సమంజసం కాదన్నారు. 27 వేల పాఠశాలలను 4 వేలకు తగ్గిస్తామని రాష్ట్ర ప్రభు త్వం ప్రకటించడం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని పేర్కొన్నారు. జూన్‌ చివరి నాటికి పీఆర్సీ రిపోర్ట్‌ ప్రకటించకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై సమరం కొనసాగిస్తామని, ఉపాధ్యాయులంతా సిద్ధం కావా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శి రాములు, ఉపాధ్యక్షులు జమున, కోశాధికారి మొయిజ్‌ఖాన్‌, సభ్యులు కృష్ణవేణి, బాబురావు, పవన్‌కుమార్‌, వెన్నెల, రత్నం, బస్సప్ప, ముత్య ప్ప, శివరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వెంకటప్ప

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement