అప్రమత్తం.. ఓటు భద్రం | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తం.. ఓటు భద్రం

Jun 15 2026 7:40 AM | Updated on Jun 15 2026 7:40 AM

జూలై 14 వరకు ఇంటింటికీ బీఎల్‌ఓలు

2002 ఓటరు జాబితా ఆధారంగా మ్యాపింగ్‌

తిరుపతి అర్బన్‌ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) సోమవారం నుంచి జూలై 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు. బూత్‌ లెవల్‌ అధికారులు ఇంటింటికీ వెళ్లి సర్వే చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎన్యుమరేషన్‌ ఫారమ్‌–2ను ఓటరు నింపి బీఎల్‌ఓకు అందజేయాల్సి ఉంటుంది. 23 ఏళ్లుగా తాను భారతదేశంలో ఉన్నట్లు ధ్రువీకరించే వివరాలు ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలోనే పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. 23 ఏళ్ల నివాసం పేరుతో కూటమి నేతలు అక్రమాలకు పాల్పడే అవకాశముందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల ఓట్లను గల్లంతు చేస్తారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలతోపాటు ఓటర్లు సైతం అప్రమత్తంగా ఉండాలని మేధావులు సూచిస్తున్నారు.

23 ఏళ్ల తర్వాత..

2002లో చివరిసారిగా ఓటరు జాబితా సవరణ ప్రక్రి య చేపట్టారు. 23ఏళ్ల తర్వాత ఇప్పుడు సర్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా 2026 ఓట్లను 2002తో మ్యాపింగ్‌ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో రోజుకు 50 ఇళ్లను సర్వే చేయాలని బీఎల్‌ఓలకు టార్గెట్‌ పెట్టారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ తమ ఓటును మ్యాపింగ్‌ చేయించుకుని, తమ కుటుంబ సభ్యుల ఓట్లు మ్యాపింగ్‌(ఫ్యామిలీ ట్రీ) పూర్తి చేశా రా అనే అంశాలను పరిశీలించుకోవాలి. బీఎల్‌ఓలు చూసుకుంటారులే అనుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఓటు గల్లంతయ్యే ప్రమాదముంటుంది. 2002 నాటి ఓటర్‌ జాబితాలో మీ పేరు ఉంటే...ఆ వివరాలను ఎన్యుమరేషన్‌ ఫారమ్‌–2 లో నింపాలి. ఒక వేళ మీ పేరు లేకుంటే మీ తల్లిదండ్రుల పేర్లు లేదా కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేస్తూ మీ పుట్టిన తేది, ఆధార్‌ జతచేయాల్సి ఉంటుంది. చివరిగా పాస్‌పోర్ట్‌ సైజ్‌ పొటో అతికించి బీఎల్‌ఓలకు ఇస్తే...వారు ఓ రసీదు ను అందిస్తారు. దాన్ని భద్రపరచుకోవాల్సి ఉంటుంది. 1987కి ముందు ఓటరు జన్మించి ఉంటే ఏదైనా ఓటర్లు గుర్తింపు పత్రం సమర్పించాలి, లేదా 1987– 2004 మధ్య జన్మించి ఉంటే ఓటరుతోపాటు తల్లి లేదా తండ్రి గుర్తింపు పత్రాన్ని స్వీకరిస్తారు. 2004 తర్వాత జన్మించిన ఓటరుతోపాటు తల్లిదండ్రులు ఇద్ద రు గుర్తింపు పత్రాలను సమర్పించాలి. ఇంటికి తాళం వేసి ఉన్నప్పటికి బీఎల్‌ఓలు వివరాలు, పత్రాలు సేకరణ కోసం మూడుసార్లు రావాల్సి ఉంటుంది.

నేటి నుంచి సర్‌ ప్రక్రియ ప్రారంభం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement