వినాశకాలే విపరీత బుద్ధి : వీసీ సజ్జనార్‌ చీవాట్లు | youth dangerous bike stunts Hyderabad vc sajjanar reacts on twitter | Sakshi
Sakshi News home page

వినాశకాలే విపరీత బుద్ధి : వీసీ సజ్జనార్‌ చీవాట్లు

Apr 28 2026 12:35 PM | Updated on Apr 28 2026 12:51 PM

youth dangerous bike stunts Hyderabad vc sajjanar reacts on twitter

సాక్షి, హైదరాబాద్‌: పెట్రోల్ బంక్ లాంటి అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి బైక్ స్టంట్లు చేసిన వైనం నెట్టింట ఆగ్రహానికి తావిస్తోంది. ఇది సాహసం కాదు, పచ్చి మూర్ఖత్వం. ఇలాంటి ప్రదేశాలలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, లేదా ఘర్షణలకు దిగడం ప్రాణాపాయానికి దారితీస్తుంది. 

దీనిపై హైదరాబాద్‌ సీపీ వీసీసజ్జనార్‌ స్పందించారు. ఇలాంటి మూర్ఖత్వపు సాహసాలు తగదు అంటూ యువతను హెచ్చరించారు. వినాశ కాలే విపరీత బుద్ధిః అని పెద్దలు ఊరికే అనలేదు అంటూ చురకలేశారు. 

‘‘పెట్రోల్ బంక్ లాంటి అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి బైక్ స్టంట్లు చేయడం సాహసం కాదు.. అది పచ్చి మూర్ఖత్వం! మీ ఒక్క క్షణపు షో కోసం అక్కడ ఉన్న అమాయకుల ప్రాణాలు బలి కావాలా!? గుర్తుంచుకోండి.. మీరు చేసే Wheelings ఇంట్లో మీ కోసం ఎదురుచూసే తల్లిదండ్రుల కళ్లలో కన్నీటి Feelings మిగల్చకూడదు. బాధ్యతగా ఉండండి!’’అంటూ ట్విటర్‌లో ఒక సందేశాన్ని పోస్ట్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement