తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం | Tg Govt Reconstituted The Admission And Fee Regulatory Committee | Sakshi
Sakshi News home page

తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

Apr 9 2026 1:05 PM | Updated on Apr 9 2026 1:13 PM

Tg Govt Reconstituted The Admission And Fee Regulatory Committee

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ పునర్‌వ్యవస్థీకరించిన ప్రభుత్వం.. ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ ప్రొఫెషనల్ కాలేజీల ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టింది. రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎ. గోపాల్ రెడ్డి చైర్మన్‌గా కమిటీ ఏర్పాటు చేసింది.

మొత్తం 11 మంది సభ్యులతో కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్‌కు సభ్యత్వం లభించింది. జేఎన్టీయూ, ఓయూ, ఎంజీయూ, కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌ వైస్ చాన్స్‌లర్లకు కమిటీలో చోటు కల్పించింది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement