ఢిల్లీ: తెలంగాణ నుంచి 8 కొత్త రైళ్లు నడుస్తాయని రైల్వేశాఖ ప్రకటించింది. భాగ్యనగరంలోని వివిధ స్టేషన్ల నుంచి ఈ కొత్తరైళ్లు వీక్లీ ట్రైన్స్‌గా ప్రయాణికులకు సేవలందిచనున్నాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి, తిరుచానూరు (ఆంధ్రప్రదేశ్), శ్రీ గంగానగర్, జైపూర్ (రాజస్థాన్), భువనేశ్వర్ (ఒడిశా)లకు రెగ్యులర్ ట్రైన్స్ నడపాలని డిమాండ్లు కూడా ఉన్నాయి.
కొత్త సర్వీసులు బయలుదేరే సమయం, వారం, గమ్యస్థానం
17607/17608 నెంబరు: కాచిగూడ నుంచి ప్రతి గురువారం రాత్రి 9.30 గంటలకు తిరుచానూరు (ఆంధ్రప్రదేశ్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 15 నుంచి ప్రారంభం కానుంది.
17601/17602 నెంబరు: కాచిగూడ నుంచి ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు శ్రీ గంగానగర్ (రాజస్థాన్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ జులై 14 నుంచి ప్రారంభం కానుంది.
17047/17048 నెంబరు: చర్లపల్లి నుంచి ప్రతి బుధవారం సాయంత్రం 6.55 గంటలకు తిరుచానూరు వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 7 నుంచి ప్రారంభం కానుంది.
17441/17442 నెంబరు: చర్లపల్లి నుంచి ప్రతి బుధవారం రాత్రి 9.20 గంటలకు తిరుపతి వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 14 నుంచి ప్రారంభం కానుంది.
17443/17444 నెంబరు: చర్లపల్లి నుంచి ప్రతి శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు తిరుపతి వెళ్లే.. వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 15 నుంచి ప్రారంభం కానుంది.
17059/17060 నెంబరు: ప్రతి ఆదివారం రాత్రి 9.15 గంటలకు చర్లపల్లి నుంచి తిరుచానూరు వెళ్లే.. వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 11 నుంచి ప్రారంభం కానుంది.
17067/17068 నెంబరు: ప్రతి సోమవారం సాయంత్రం 6.10 నిమిషాలకు చర్లపల్లి నుంచి భువనేశ్వర్ (ఒడిశా) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్.. మే 5 నుంచి ప్రారంభం కానుంది.
17079/17080 నెంబరు: ప్రతి శుక్రవారం రాత్రి 7.50 గంటలకు నాంపల్లి నుంచి జైపూర్ (రాజస్థాన్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ రైలు ప్రారంభ తేదీని దక్షిణ మధ్య రైల్వే త్వరలోనే ప్రకటించనుంది.


