విద్యార్థినిపై టీచర్‌ ప్రేమ.. ఆమె కోసం అర్ధరాత్రి.. | Nalgonda Teacher Love Story Full Details | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై టీచర్‌ ప్రేమ.. ఆమె కోసం అర్ధరాత్రి..

Apr 26 2026 12:36 PM | Updated on Apr 26 2026 1:20 PM

Nalgonda Teacher Love Story Full Details

సాక్షి, నల్లగొండ: ఉన్నత విలువలు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే తాను చదువు చెబుతున్న విద్యార్థినిపై ప్రేమ పెంచుకుని అర్ధరాత్రి వేళ ఆమె ఇంట్లోకి చొరబడేందుకు యత్నించాడు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి జరగగా.. శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కనగల్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని చండూరు పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. వేసవికాలం కావడంతో సదరు పాఠశాలకు సెలవులు ఇచ్చారు. అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వ్యక్తి సదరు విద్యార్థినిపై ప్రేమ పెంచుకున్నాడు. ఎలాగైనా విద్యార్థినిని కలవాలని బుధవారం అర్ధరాత్రి ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. తలుపు తీస్తున్న క్రమంలో శబ్దం రావడంతో బయటే నిద్రిస్తున్న విద్యార్థిని తండ్రి టీచర్‌ను గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేశాడు.

దీంతో ఆ టీచర్‌ తప్పించుకొని సొప్ప చేను, గడ్డివాముల్లో తలదాచుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా ఏకమై గ్రామాన్ని జల్లెడ పట్టి సదరు టీచర్‌ను పట్టుకొని దొంగగా భావించి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి విచారించగా.. తాను దొంగను కాదని, విద్యార్థిని కోసమే వచ్చానని సదరు టీచర్‌ అసలు విషయం చెప్పాడు. ఈ ఘటనపై కనగల్‌ ఎస్‌ఐ రాజీవ్‌రెడ్డిని వివరణ కోరగా.. సదరు టీచర్‌ విద్యార్థిని కోసమే ఇంట్లోకి చొరబడినట్లు ఒప్పుకున్నాడని, విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు.

ప్రోగ్రెస్‌ కార్డులు ఇవ్వకుండా జాప్యం 
చండూరు పట్టణంలోని అన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రోగ్రెస్‌ కార్డులు ఇవ్వగా.. సదరు ఉపాధ్యాయుడు చదువు చెప్పే పాఠశాలలో మాత్రం ఇప్పటివరకు ప్రోగ్రెస్‌ కార్డులు ఇవ్వడం లేదు. ఈ విషయం అందరికీ తెలియడంతో.. ప్రోగ్రెస్‌ కార్డులకు వచ్చే తల్లిదండ్రులు స్కూల్‌ యాజమాన్యంపై తిరగబడే అవకాశం ఉండడంతోనే జాప్యం చేస్తున్నట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement