హైదరాబాద్: తనను పెళ్లి చేసుకోవాలంటూ వివాహితను వేధిస్తున్న ఓ వ్యక్తిపై ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన మేరకు.. నాగర్‌కర్నూల్ జిల్లా అంకిరావుపల్లె గ్రామానికి చెందిన డేగరాజు (25), ఫిలింనగర్‌లో నివాసముంటున్న ఒక వివాహిత (24)ను కొంతకాలంగా ఫోన్ ద్వారా వేధిస్తూ అసభ్యకర మెసేజ్‌లు పంపుతున్నాడు.
భర్తను వదిలి తనతో రావాలని, పెళ్లి చేసుకోవాలని మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తన కదలికలను గమనిస్తూ, దారిపొడవునా అడ్డగిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించింది. నిందితుడి వల్ల తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు డేగరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


