సూర్యాపేటటౌన్ : జిల్లాలోని ప్రభు త్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం గ్రంథాలయాలను మంజూరు చేసింది. వాటికి సంబంధించిన గ్రాంట్లను విడుదల చేసింది. ప్రభుత్వ ఉన్నత, ప్రాథమి కోన్నత, ప్రాథమిక పాఠశాలల్లోని లైబ్రరీలలో కొత్త పుస్తకాల కొనుగోలుకు వీటిని ఖర్చు చేయనున్నారు.
903 స్కూళ్లకు నిధులు
సూర్యాపేట జిల్లాలో 220 ఉన్నత పాఠశాలలు ఉండగా ఒక్కో పాఠశాలకు రూ.5,198 చొప్పున, 683 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా ఒక్కో దానికి రూ.1,171 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో విద్యార్థులకు ఉపయోగపడే సబ్జెక్టు పుస్తకాలు, సాహిత్య గ్రంథాలు, పోటీ పరీక్షల పుస్తకాలు, బాలల కథల పుస్తకాలను కొనుగోలు చేయనున్నారు.
పఠనాసక్తి పెంపొందించేందుకే..
విద్యార్థులు మొబైల్స్‌కు ఆకర్షితులవుతున్న తరుణంలో వారిలో పఠనాసక్తి పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి పాఠశాలలో లైబ్రరీని ఏర్పాటు చేసింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కమిటీలు విద్యార్థుల వయస్సు, అభ్యసన స్థాయికి అనుగుణంగా పుస్తకాలను ఎంపిక చేయనున్నారు.
ఉన్నత పాఠశాలకు రూ.5198
పీఎస్, యూపీఎస్‌కు రూ.1,171 చొప్పున గ్రాంట్ విడుదల


