‘ఇండియన్‌ వెల్స్‌’ చాంప్స్‌ బదోసా, కామెరాన్‌ నోరి

Norrie, Badosa are 1st-time winners at Indian Wells - Sakshi

కాలిఫోర్నీయా: ప్రతిష్టాత్మక ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ ప్రీమియర్, ఏటీపీ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీలో పౌలా బదోసా (స్పెయిన్‌), కామెరాన్‌ నోరి (బ్రిటన్‌) చాంపియన్స్‌గా అవతరించారు. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో పౌలా బదోసా 7–6 (7/5), 2–6, 7–6 (7/2)తో మాజీ నంబర్‌వన్‌ అజరెంకా (బెలారస్‌)పై గెలిచింది. తాజా గెలుపుతో బదోసా 14 స్థానాలు ఎగబాకి 27వ ర్యాంక్‌ నుంచి 13వ ర్యాంక్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో 26వ ర్యాంకర్‌ కామెరాన్‌ నోరి 3–6, 6–4, 6–1తో బాసిలాష్ విలి (జార్జియా)పై గెలిచి ఈ టోర్నీ చరిత్రలో విజేతగా నిలిచిన తొలి బ్రిటన్‌ ప్లేయర్‌గా నిలిచాడు. చాంపియన్స్‌ బదోసా, నోరికి 12,09,730 డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ దక్కింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top