వైరల్‌: ఒకప్పుడు 134 కేజీల బరువు.. ఇప్పుడు 104!

Vivek Raj Singh Kukrele IPS Shared Video Of His Weight Loss Journey	 - Sakshi

న్యూఢిల్లీ: పోలీస్‌ ఉద్యోగం అంటే నిత్యం సవాళ్లతో కూడుకుని ఉంటుంది. ఇతర ఉద్యోగాలతో పోలీస్తే వీరికి ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో​ వీరు అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతారు. ఈ శాఖలో కొంత మంది అధిక బరువును కల్గి ఉండటం వల్ల దొంగలను పట్టుకువటానికి ఇబ్బంది పడుపడ్డ సంఘటనలు చూశాం. అయితే, ఇక్కడో పోలీస్‌ అధికారి తాను ఏవిధంగా బరువు తగ్గాడో ఫెస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివేక్‌ రాజ్‌ సింగ్‌ కుక్రెలే అనే ఐపీఎస్‌ ఆఫీసర్‌ చిన్నప్పటి నుంచి లావుగా ఉండేవాడినని, చిన్నతనం నుంచి మంచి ఆహారం తినడం అంటే ఎంతో ఇ‍ష్టమని తెలిపారు.

అందుకే మిగతా వారికన్నా కొంచెం లావుగా ఉండేవాడినని తెలిపారు. పెద్ద అయ్యాక కూడా లావుగా ఉండేవాడినని, ఈ క్రమంలో సివిల్స్‌కి ప్రిపెర్‌ అయ్యి ఐపీఎస్‌కు ఎంపీకైనట్లు చెప్పారు. ఆ తర్వాత ఐపీఎస్‌ శిక్షణ కోసం నేషనల్‌ పోలీస్‌ అకాడమిలో చేరారని, అక్కడ 46 వారాల పాటు అనేక కఠిన శిక్షణ కొనసాగిందన్నారు. ఈ క్రమంలో మొదట్లో 134 కేజీలుగా ఉన్న తన బరువు.. ప్రస్తుతం 104 కి తగ్గిందని తెలిపారు. 43 కేజీలు తగ్గానని, అది నాకు గొప్పగా అనిపిస్తుందని పేర్కొన్నారు.

తనకు చిన్న తనం నుంచి ఆహరాన్ని వృథా చేయడం నచ్చేది కాదన్నారు. కాగా, ఇప్పుడు ఆకలి కన్న ఎక్కువగా తినడాన్ని కూడా తాను నేరంగా భావిస్తున్నానని అన్నారు. అయితే నేనిప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని.. బీపీ కూడా అదుపులో ఉందని పేర్కొన్నాడు. అనేక అధికారిక కార్యక్రమాలలో నడవటానికి ప్రాధాన్యత ఇస్తున్నానని, అందుకే బరువు క్రమంగా తగ్గుతూ వస్తుందని తెలిపారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘ఆరోగ్యం పట్ల మీ నిబద్ధతకు హ్యట్సఫ్‌’, ‘ప్రస్తుతం స్లిమ్‌గా బాగున్నారు’, ‘బరువు తగ్గించు కోవడంతో మీరు మిగతా పోలీసు వారికి ఆదర్శం ’ ‘మీరు చేసిన పనికి మేము ఫిదా’ అంటూ  నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 
చదవండి: Viral: నేను పులిరాజును.. అయితే నాకేంటి!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top