టీవీకే విజయ్‌పై మద్రాస్‌ హైకోర్టు ఆగ్రహం | Madras High Court While Issuing Notice On Plea Against TVK Chief Vijay | Sakshi
Sakshi News home page

టీవీకే విజయ్‌పై మద్రాస్‌ హైకోర్టు ఆగ్రహం

Apr 20 2026 4:01 PM | Updated on Apr 20 2026 4:47 PM

Madras High Court While Issuing Notice On Plea Against TVK Chief Vijay

సాక్షి, చెన్నై: టీవీకే అధినేత విజయ్‌పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయ్‌ ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు వెల్లడిపై మండిపడింది. ఈ మేరకు విజయ్‌కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

విజయ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెరంబదూర్‌, తూర్పు తిరుచ్చి‌ ఈ రెండు అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఇందులో ఒక చోట రూ.111కోట్లు..మరో చోట రూ.220 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదే అంశంపై మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దాఖలైన పిటిషన్‌లో విజయ్‌ దాదాపూ 100కోట్ల ఆస్తుల వివరాలు దాచారంటూ కోర్టు తెలిపారు. ఆ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.  

విచారణలో ఒక చోట రూ.111కోట్లు ఒక చోట రూ.220 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో ఆస్తుల వివరాల ఎందుకు వెల్లడించారని విజయ్‌ని మద్రాస్‌ హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఇది క్లరికల్‌ పొరటపాటు అనుకోవడానికి వీల్లేదు. రూ.100కోట్ల ఆస్తుల వివరాల్ని ఎందుకు వెల్లడించలేదో వివరణ ఇవ్వాలని విజయ్‌కు జారీచేసిన నోటీసుల్లో సూచించింది. విజయ్‌తో పాటు ఆదాయపు పన్ను, ఎన్నికల సంఘానికి నోటీసులు పంపింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement