పెట్టుబడుల మాసం.. | - | Sakshi
Sakshi News home page

పెట్టుబడుల మాసం..

Jun 10 2026 1:13 AM | Updated on Jun 10 2026 1:13 AM

జిల్లాలోని సాగు వివరాలు

పాఠశాలలు, విద్యార్థుల

వివరాలు

ములుగు: ఒకవైపు పిల్లల చదువులకు.. మరో వైపు వ్యవసాయానికి పెట్టుబడి ఖర్చులకు తప్పనిసరిగా అప్పులు చేయాల్సిన పరిస్థితి అన్నదాతలకు నెలకొంది. ఈ నెల 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో ఇప్పటికే ఆడ్మిషన్లు, పుస్తకాలు, యునిఫాంల కోసం పాఠశాలల వైపు విద్యార్థుల తల్లిదండ్రులు పరుగులు తీస్తున్నారు. వానాకాలం సాగు పనులు కూడా ప్రారంభం కావడంతో దుక్కులు దున్నడం, విత్తనాలు, ఎరువులను ముందస్తుగా కొనుగోలు చేసి నిల్వ చేసుకునేందుకు రైతులు తహతహలాడుతున్నారు. జిల్లాలో జూన్‌ నెల వచ్చిందంటే పెట్టుబడుల కోసం అప్పులు చేసేందుకు వేలాది మంది రైతులు, మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి నెలకొంది. పిల్లల భవిష్యత్‌ కోసం విద్యపై రాజీ పడలేరు. అటు పంటల కోసం సాగు పనులను ఆపలేరు. ఈ నెలలో చాలా కుటుంబాలు ఇలాంటి తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

రైతులకు రెండింతలు..

వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ పనులు మొదలు పెడుతున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ట్రాక్టర్ల అద్దె, కూలీల వేతనాలు వంటి ఖర్చులు ఒకేసారి రావడంతో రైతులపై ఆర్థిక భారం పెరుగుతోంది. యాసంగి పంటలను ఇప్పుడిప్పుడే అమ్మేసి డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకా జిల్లాలో కొన్ని గ్రామాల్లో ఽపూర్తి స్థాయిలో ధాన్యం, మొక్కజొన్న పంటల డబ్బులు చేతికి రాలేదు. దీంతో అప్పులు చేసైనా పిల్లల చదువులు, సాగు పనులను ముందుకు సాగించేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. అంతేకాకుండా వర్షాకాలం సీజన్‌ కావడంతో ఇళ్లకు మ రమ్మతులు చేపట్టడంతో పాటు ఇతరత్రా ఖర్చులు అదనంగా మారి కుటుంబ బడ్జెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.

ఆందోళనలో విద్యార్థుల వివరాలు

జిల్లాలోని 10 మండలాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు 507 ఉన్నాయి. వీటిల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు 34,858 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందిస్తున్నప్పటికీ నోట్‌బుక్స్‌, గైడ్స్‌, సమయానికి యునిఫాం అందకపోవడంతో కొంతమేర విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో ప్రతీ ఒకటి డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పుస్తకాలు, నోట్‌బుక్స్‌, యునిఫాం, వ్యాన్‌ ఫీజులు, స్కూల్‌ ఫీజులతో తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. ఒక్కొక్క విద్యార్థి చదువుకు సగటున రూ.20వేల నుంచి రూ.40వేల వరకు తల్లిదండ్రులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. పదో తరగతి వరకే ఇలా ఉంటే ఇంటర్‌, డిగ్రీ, ఇతర చదువులకు మరింత ఖర్చులు అధికం కానున్నాయి.

ఎకరానికి రూ.20 నుంచి

రూ.40వేల వరకు పెట్టుబడి

జిల్లాలో 1,63,229 ఎకరాల్లో వివిధ పంటలు సాగు అవుతుండగా అత్యధికంగా వరిపంట సాగవుతుంది. వరిపంటకు ఎకరానికి సుమారు రూ.20వేల వరకు రైతులు పెట్టుబడి పెడుతుండగా, పత్తికి ఎకరానికి సుమారు రూ.40 వేల వరకు రైతులు పెట్టుబడి పెడుతున్నారు. మిర్చి పంట అయితే ఎకరానికి సుమారు లక్ష రూపాయాల పెట్టుబడి పెట్టాలి. పంటలు సాగు చేసే రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొ ప్పున ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం కూడా సమయానికి అందకపోవడంతో జూన్‌ మా సం అన్నదాతలకు అగమ్యగోచరంగా మారింది.

ఈనెల 15 నుంచి పాఠశాలల

పునఃప్రారంభం

విద్యార్థులకు ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం

మొదలైన వానాకాలం సాగు పనులు

రైతులకు ఎరువులు, విత్తనాల ఖర్చులు

పంట సాగు(ఎకరాల్లో) పెట్టుబడి(ఎకరానికి)

వరిపంట 1,07,700 రూ.20వేలు

పత్తిపంట 28,600 రూ.40వేలు

ప్రభుత్వ

పాఠశాలలు

475

ప్రైవేట్‌

పాఠశాలలు

32

విద్యార్థులు 26,858

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement