'వారణాసి' స్పెషల్‌ వీడియో.. ఫ్యాన్స్‌కు నిరాశ | Varanasi Movie Special Video Will Not Digital Streaming | Sakshi
Sakshi News home page

'వారణాసి' స్పెషల్‌ వీడియో.. ఫ్యాన్స్‌కు నిరాశ

Apr 25 2026 10:46 AM | Updated on Apr 25 2026 10:59 AM

Varanasi Movie Special Video Will Not Digital Streaming

మహేష్ బాబు-రాజమౌళి సినిమా వారణాసి ప్రపంచ వేదికపై తొలి ప్రదర్శన జరిగింది. అత్యంత భారీ బడ్జెట్‌తో  కె.ఎల్‌.నారాయణ, ఎస్‌.ఎస్‌.కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టైటిల్‌ గ్లింప్స్‌కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ క్రమంలో శనివారం ఉదయం మెక్సికోలో జరిగిన ప్రఖ్యాత కామిక్‌కాన్‌ ఎక్స్‌పీరియన్స్‌ - 2026లో  ‘వారణాసి టు ది వరల్డ్‌’ పేరుతో తొలి ప్రపంచ ప్రదర్శన కార్యక్రమం జరిగింది. అందులో ఈ మూవీ నుంచి కొన్ని వీడియోలను ప్రదర్శించారు.

మెక్సికో ఈవెంట్‌లో ,  వారణాసి మూవీకి సంబంధించిన ప్రత్యేకమైన వీడియోను ప్రదర్శించారు. అయితే, అది  కేవలం ఆ ఈవెంట్‌ వరకు మాత్రమే పరిమితం చేశారు. కానీ, డిజిటల్‌గా విడుదల చేయబడదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే,  వారణాసి తెరవెనుక దృశ్యాలను చూడటానికి అభిమానులు మరికొంత కాలం వేచి ఉండాల్సిందే.

వారణాసిలో రుద్ర, శ్రీరాముడిగా మహేష్ బాబు రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న విడుదల కానున్న ఈ మూవీకి సంగీతం ఎం.ఎం.కీరవాణి అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement