రజనీకాంత్‌కు విలన్‌గా..? | Director S Shankar Turns Villain in Rajinikanth Film with Cibi Chakravarthy | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌కు విలన్‌గా..?

Apr 27 2026 5:52 AM | Updated on Apr 27 2026 5:52 AM

Director S Shankar Turns Villain in Rajinikanth Film with Cibi Chakravarthy

ఇన్ని రోజులు కెమెరా వెనకాల యాక్షన్, కట్‌ చెప్పిన దర్శకుడు శంకర్‌ ఇక తెరపై నటుడిగా కనిపించనున్నారనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. సిల్వర్‌ స్క్రీన్‌పై విలన్‌ రోల్‌లో నటించేందుకు ఆయన రెడీ అవుతున్నారట. రజనీకాంత్‌ హీరోగా సీబీ చక్రవర్తి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కమల్‌హాసన్, ఆర్‌. మహేంద్రన్‌ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. 

ఈ సినిమాలోని విలన్‌ రోల్‌లో శంకర్‌ నటించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ప్రస్తుతం దర్శకుడిగా శంకర్‌ ఓ హిస్టారికల్‌ మూవీ తీయాలని స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నారట. ఇందుకు సమయం పడుతుందట. ఈలోపు విలన్‌గా ఈ అవకాశం రావడంతో చేయాలనుకుంటున్నారని టాక్‌. ఇదిలా ఉంటే... కొంతకాలం క్రితం వచ్చిన ‘సీత, ప్రేమికుడు, కాదల్‌ వైరస్, శివాజీ’ వంటి చిత్రాల్లో శంకర్‌ జస్ట్‌ అలా కనిపించారు. ఇప్పుడు రజనీకాంత్‌ సినిమాలో పూర్థి స్థాయి నటుడిగా కనిపిస్తారా? త్వరలోనే క్లారిటీ రావొచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement