హీరోగా యాత్ర.. కుమారుడి ఎంట్రీపై ధనుష్‌ రియాక్షన్‌ | Actor Dhanush Responds To His Son Yatra’s Film Debut Rumours, Says I Can’t Decide His Future | Sakshi
Sakshi News home page

హీరోగా యాత్ర.. కుమారుడి ఎంట్రీపై ధనుష్‌ రియాక్షన్‌

Apr 28 2026 7:16 AM | Updated on Apr 28 2026 9:33 AM

Dhanush Comments On His Son Yatra Career in Movie Industry

తమిళ నటుడు ధనుష్‌ మల్టీ టాలెంటెడ్‌. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు.. కథా రచయిత, గీత రచయిత, గాయకుడు, దర్శకుడు, నిర్మాతగా మెప్పించిన విషయం తెలిసిందే. అయితే, కొద్దిరోజులుగా ధనుష్‌ పెద్ద కుమారుడు యాత్ర హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కథనాలు వచ్చాయి. తనను ధనుష్‌నే లాంచ్‌ చేయబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో తాజాగా ఇదే అంశం గురించి ధనుష్‌ను ప్రశ్నించగా ఆయన స్పందించారు.

ధనుష్‌ కొత్త సినిమా కర.. ఈ మూవీ ఏప్రిల్‌ 30న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్స్‌ కార్యక్రమంలో పాల్గొన్న ధనుష్‌కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. కుమారుడు యాత్ర సినిమాల్లోకి ఎప్పుడొస్తారనే ప్రశ్నపై ఆయన ఇలా స్పందించారు. 'నేను 16ఏళ్లకే సినిమా పరిశ్రమలోకి వచ్చాను. అందుకు కారణం మా కుటుంబ పరిస్థితులే.. ప్రస్తుతం యాత్ర వయసు 19ఏళ్లు. కానీ, వాడు నాకు చిన్నపిల్లోడిలానే కనిపిస్తాడు. రాబోయే రోజుల్లో వాడు ఏమవుతాడనేది  నేను చెప్పలేను. సినిమా పరిశ్రమలోకి వస్తాడా అనేది కూడా చెప్పలేను. సమయం ఇంకా  ఉంది. వాడు (యాత్ర) తన కెరీర్‌ గురించి ఎలాంటి  నిర్ణయం తీసుకుంటాడో దానిని అమలు చేస్తాను.' అని ధనుష్‌ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement