రూమర్స్‌ వేళ ప్రేమ గురించి త్రిష కొటేషన్‌ | Actress Trisha Krishnan sher love quotations | Sakshi
Sakshi News home page

రూమర్స్‌ వేళ ప్రేమ గురించి త్రిష కొటేషన్‌

Apr 6 2026 7:11 AM | Updated on Apr 6 2026 8:31 AM

Actress Trisha Krishnan sher love quotations

కొద్దిరోజులుగా నటి త్రిష పేరు నెట్టింట వైరల్‌ అవుతుంది. టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్‌తో ఆమె సన్నిహితంగా ఉన్నారంటూ కోలీవుడ్‌ మీడియాలో రూమర్స్‌ వచ్చాయి. ఆపై తమిళనాడు బీజేపీ నేత నాగేంద్రన్ త్రిషపై నోరుపారేసుకుని ఆ తర్వాత క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.  ఒక నటితో విజయ్‌ సహజీవనం చేస్తున్నాడని ఆయన సతీమణి సంగీత సంచలన ఆరోపణలు చేయడంతో త్రిష పేరును కొందరు తెరపైకి తీసుకొచ్చారు. అలా తన ప్రేమేయం లేకుండానే త్రిషకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఆమె చేసిన ఒక పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది.

త్రిష పట్ల ఇప్పటికీ రూమర్స్‌ వస్తున్న సమయంలో ప్రేమకు సంబంధించిన ఓ కోటేషన్‌ను సోషల్‌మీడియాలో త్రిష పోస్టు చేశారు. 'ప్రతిదీ ప్రేమ కాదు. కానీ, ప్రేమ లేకపోతే దేనికీ అర్థం లేదు' అని చెబుతూనే ‘ఫ్యాక్ట్‌’ (వాస్తవం) అని పేర్కొన్నారు.  దీంతో నెట్టింట ఆ పోస్ట్‌ వైరల్‌ అవుతుంది. తనపై రూమర్స్‌ వస్తున్న సమయంలో ఇలాంటి కొటేషన్‌ను ఆమె ఎందుకు షేర్‌ చేశారని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement