పండుగాడు వస్తున్నాడు | 20 years for pokiri Rereleasing on August 9 | Sakshi
Sakshi News home page

పండుగాడు వస్తున్నాడు

Apr 29 2026 2:02 AM | Updated on Apr 29 2026 2:02 AM

20 years for pokiri Rereleasing on August 9

‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అయిపోద్దో ఆడే పండుగాడు’ అంటూ ‘పోకిరి’ సినిమాలో మహేశ్‌బాబు చెప్పిన డైలాగ్‌ ఎంతపాపులర్‌ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకంటే పండుగాడు (మహేశ్‌పాత్ర నిక్‌ నేమ్‌) మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు వస్తున్నాడు. మహేశ్‌బాబు హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘పోకిరి’. ఇలియానా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, సాయాజీ షిండే, నాజర్, ఆశిష్‌ విద్యార్థి, అజయ్‌ ఇతరపాత్రలు పోషించారు.

 ఇందిర సమర్పణలో వైష్ణో అకాడమీ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌ నిర్మించిన ఈ సినిమా 2006 ఏప్రిల్‌ 28న విడుదలై, మహేశ్‌బాబు కెరీర్‌లోనే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రత్యేకించి ఈ చిత్రంలో మహేశ్‌ మేనరిజమ్, డైలాగ్స్‌  ఇప్పటికీపాపులరే. మణిశర్మ సంగీతం, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా విడుదలై మంగళవారంతో 20 ఏళ్లు పూర్తయ్యాయి.

ఇదిలా ఉంటే... మహేశ్‌బాబు బర్త్‌ డే (ఆగస్టు 9) సందర్భంగా ‘పోకిరి’ సినిమాని పీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ద్వారా రీ రిలీజ్‌ చేస్తున్నారు. డాల్బీ, 4 కె వెర్షన్‌లో రీ రిలీజ్‌ కానుంది. కాగా మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటిస్తున్నారు. కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్‌ 7న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement