మద్యం అమ్మకాలకు బహిరంగ వేలం | - | Sakshi
Sakshi News home page

మద్యం అమ్మకాలకు బహిరంగ వేలం

Jun 13 2026 1:11 PM | Updated on Jun 13 2026 1:11 PM

నిబంధనలకు విరుద్ధం

రూ.8.30 లక్షలకు కై వసం చేసుకున్న వ్యక్తి

రామాయంపేట(మెదక్‌): నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలకు నిజాంపేట మండలం నస్కల్‌ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం బహిరంగ వేలం నిర్విహించారు. వేలం పాటలో పాల్గొన్న 15 మంది ముందుగా రూ. ఐదు వేల చొప్పున డిపాజిట్‌ చేశారు. అందరి కంటే ఎక్కువగా రూ. 8.30 లక్షలకు పాట పాడిన అదే గ్రామానికి చెందిన వ్యక్తి టెండర్‌ కై వసం చేసుకున్నాడు. కాగా, ఇంతకుముందు గ్రామంలో పది మంది వరకు బెల్ట్‌షాపులు నిర్వహించేవారు. దీంతో పంచాయతీకి ఎలాంటి ఆదాయం సమకూరడం లేదనే ఉద్దేశంతో గ్రామస్తులు సమావేశమై ఈనిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టెండర్‌ తీసుకున్న వ్యక్తి కాకుండా ఇతరులు ఎవరైనా మద్యం అమ్మితే రూ. 50 వేల జరిమానాతో పాటు ఇతర చర్యలు తీసుకుంటామని గ్రామ పెద్దలు హెచ్చరించినట్లు తెలిసింది. ఈవిషయమై తమకు సమాచారం లేదని సర్పంచ్‌ పేర్కొన్నారు. ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌ను సంప్రదించగా, మద్యం అమ్మకాలకు వేలం పాట నిర్వహించడం నిబంధనలకు విరుద్దమన్నారు. ఈవిషయమై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement