అందుబాటులో యూరియా | - | Sakshi
Sakshi News home page

అందుబాటులో యూరియా

Jun 13 2026 1:11 PM | Updated on Jun 13 2026 1:11 PM

ఓపెన్‌ అయిన బుకింగ్‌ యాప్‌

చిన్నశంకరంపేట(మెదక్‌): వానాకాలం సీజన్‌కు అవసరమైన యూరియా రైతులకు అందుబాటులో ఉందని వ్యవసాయశాఖ అధికారులు ప్రకటించారు. తాజాగా ఫర్టిలైజర్‌ యాప్‌ సైతం ఓపెన్‌ అయిందని, జిల్లాలో 6,490 మెట్రిక్‌ టన్నుల యూరియా ఉందని తెలిపారు. ఇప్పటికే 11 మండలాల్లో యూరియా యాప్‌ ఓపెన్‌ కాగా, మరో 10 మండలాల్లో శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చినట్లు తెలిసింది. మెదక్‌ మండలంలో 217.62 మెట్రిక్‌ టన్నులు, పాపన్నపేట 287.55, రామాయంపేట 29.25, చిన్నశంకరంపేట 94.59, హవేళిఘణాపూర్‌ 20.25, నర్సాపూర్‌ 193.14, కౌడిపల్లి 293.17, కొల్చారం 79.38, శివ్వంపేట 86.62, చిలప్‌చెడ్‌ 28.98, మనోహరాబాద్‌ 20.25, తూప్రాన్‌ 99.85, చేగుంట 28.98, పెద్దశంకరంపేట 102.24, అల్లాదుర్గం 310.81, రేగోడ్‌ 76.72, టేక్మాల్‌ 620.37 మెట్రిక్‌ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. కాగా నార్సింగి, మాసాయిపేట, నిజాంపేట, వెల్దుర్తి మండలాల్లో ఇప్పటివరకు యూరియా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం రైతులు నారుపోసే దశలో ఉన్నారని, నాట్లు వేసిన నెలకు యూరియా అవసరం పడుతుంది. రైతులు ముందే కొనుగోలు చేసి స్టాక్‌ చేసుకోవద్దని అధికారులు చెప్పారు. ఎల్లవేళలా యూరియా అందుబాటులో ఉంటుందని గ్రహించాలన్నారు. ఇప్పటివరకు ఫార్మర్‌ రిజిస్ట్రీ చేసుకోని రైతులు వెంటనే రైతు వేదికల్లో అందుబాటులో ఉన్న ఏఈఓల వద్ద చేసుకోవాలన్నారు. రైతులు యాప్‌ ద్వారానే యూరియా బుక్‌ చేసుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement