సేంద్రియ సాగుకు ప్రాధాన్యమివ్వాలి | - | Sakshi
Sakshi News home page

సేంద్రియ సాగుకు ప్రాధాన్యమివ్వాలి

Jun 12 2026 7:19 AM | Updated on Jun 12 2026 7:19 AM

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

శివ్వంపేట(నర్సాపూర్‌): సేంద్రియ సాగుకు రైతులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అన్నారు. గురువారం మండలంలోని ఉసిరికపల్లిలో సేంద్రియ సాగు చేస్తున్న రైతు బాలేశ్‌ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. రైతు తయారు చేస్తున్న జీవామృతం, ఘన జీవామృతం, వర్మీ కంపోస్ట్‌, సేంద్రియ కషాయాలు తదితర సహజ ఎరువుల తయారీ విధానాలను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలన్నారు. నేల సారవంతం పెరగడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు జరుగుతుందన్నా రు. వ్యవసాయ అధికారులు రైతులకు సాంకేతిక సూచనలు అందిస్తూ సేంద్రియ సాగును విస్తరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదే శించారు. కలెక్టర్‌ వెంట జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్‌, ఏఓ లావణ్య, సిబ్బంది ఉన్నారు.

ఖిల్లాకు దేశస్థాయిలో గుర్తింపు తేవాలి

మెదక్‌ కలెక్టరేట్‌: ఖిల్లాను దేశస్థాయిలో గుర్తింపు సాధించేలా పర్యాటకంగా అభివృద్ధి పర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ తెలిపారు. గురువారం ఖిల్లాను సందర్శించి చారిత్రక అంశాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ మా ట్లాడుతూ.. రాష్ట్ర టూరిజం సెక్రటరీ వాణిప్రసాద్‌ సహకారంతో మెదక్‌ ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరిచి రాష్ట్ర, దేశస్థాయిలో గుర్తింపు తీసుకొస్తామన్నారు. లేజర్‌ లైటింగ్‌ ఏర్పాటు చేసి, భవిష్యత్‌లో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అనువైన ప్రదేశంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కార్యక్రమంలో మెదక్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాధిక, వైస్‌చైర్మన్‌ నరేష్‌గౌడ్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement