చిన్నశంకరంపేట(మెదక్): తెలంగాణ ఉద్యమకారుడు మురళీధర్ దేశ్‌పాండే బుధవారం బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. దీంతో నార్సింగి మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పట్లో రామాయంపేట నుంచి ఎన్నికల బరిలో నిలిచేందుకు బీజేపీ టికెట్ ఆశించి భంగపడిన ఆయన సంజయ్ విచార్ మంచ్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. ఓటమితో నార్సింగి నుంచి తన నివాసం హైదారాబాద్‌కు మార్చారు. మలిదశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ ముక్తి మోర్చాను ఏర్పాటు చేసి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు సైకిల్ యాత్ర నిర్వహించారు. అనంతరం టీఆర్‌ఎస్ ఆవిర్భావంతో తన పార్టీని అందులో విలీనం చేసి టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. తర్వాత కేసీఆర్‌తో విభేదించి బయటకు వచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతం పోరాటం చేస్తూ ముందుకు సాగారు. ఆయన అంత్యక్రియలు హైద రాబాద్‌లో గురువారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


