మోదీ 12 ఏళ్ల పాలనకు పూజలు | - | Sakshi
Sakshi News home page

మోదీ 12 ఏళ్ల పాలనకు పూజలు

Jun 11 2026 7:53 AM | Updated on Jun 11 2026 7:53 AM

సారూ.. ఈ బాలలు మరి

నర్సాపూర్‌: ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరాయంగా 12 సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని హనుమాన్‌ ఆలయంలో బుధవారం పూజలు నిర్వహించారు. ప్రధాని పేరుపై అర్చన చేయించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. అభివృద్ధి, పారదర్శక పాలన, దేశ భద్రత, పేదల సంక్షేమం కోసం మోదీ చేపట్టిన కార్యక్రమాలు దేశ ప్రగతికి దోహదపడ్డా యని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అల్లాదుర్గం(మెదక్‌): బడీడు పిల్లలు చాలా మంది బడి బయటే ఉంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు విద్యా శాఖ చేపట్టిన ‘బడిబాట’ మొక్కుబడిగా సాగుతుందనే విమర్శలు ఉన్నాయి. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి, విద్యార్థుల తల్లిదండ్రులతో మా ట్లాడి పిల్లలు బడిలో చేరేలా చూడాలి. అయితే చాలా చోట్ల ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించినట్లు ఫొటో దిగి అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. బుధవారం బడిబాటకు ఉపాధ్యాయులు వచ్చిన సమయంలోనే రోడ్లపై విద్యార్థులు ప్లాస్టిక్‌ బాటిళ్లు ఏరుకుంటూ కనిపించారు. టీచర్లకు వీరు కనిపించక పోవడం గమనార్హం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement