రామాయంపేట(మెదక్): ప్రజల సహకారంతో రామాయంపేటను చెత్త రహిత పట్టణంగా రూపు దిద్దుతామని మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని ఒకటి, ఆరు, ఏడో వార్డులో నిర్వహించిన వార్డు సభల్లో పాల్గొని ఆమె పాల్గొని మాట్లాడారు. పట్టణవాసులు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయవద్దని, తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందజేయాలని సూచించారు. తాగు నీటి సరఫరా, వీధి లైట్లు ప్లాస్టిక్ నివారణ, తడి, పొడి చెత్తను వేరు చేసే విషయమై కమిషనర్ రవీందర్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ నవనీత, కౌన్సిలర్లు నాగరాజు, సందీప్, రవి, శంకర్‌గౌడ్, రంజిత్, శ్యామల, కోఆప్షన్ సభ్యు లు యాదగిరి, గౌస్ పాషా, మున్సిపల్ మేనేజర్ రఘువరన్ తదితరులు పాల్గొన్నారు.
తూప్రాన్: ఆర్డీఓగా బవయ్య బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు విధులు నిర్వర్తించిన ఆర్డీఓ జయచంద్రారెడ్డిని ప్రభుత్వం పదోన్నతిపై ఎన్నికల సంఘంలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈసందర్భంగా బవయ్య మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.


