ప్రైవేట్‌ ఆస్పత్రులపై తనిఖీలు పెంచుతాం | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ ఆస్పత్రులపై తనిఖీలు పెంచుతాం

Jun 11 2026 7:59 AM | Updated on Jun 11 2026 7:59 AM

పీహెచ్‌సీల్లో నాణ్యమైన

వైద్యసేవలు అందిస్తాం

నూతన డీఎంహెచ్‌ఓగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ శ్రీనివాస్‌

పాలమూరు: జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి(ఇన్‌చార్జి)గా డాక్టర్‌ శ్రీనివాస్‌ బుధవారం కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. గతంలో డీఎంహెచ్‌ఓగా ఉన్న డాక్టర్‌ కృష్ణ నాగర్‌కర్నూల్‌కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో నారాయణపేట జనరల్‌ ఆస్పత్రిలో సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఓగా పని చేస్తున్న డాక్టర్‌ శ్రీనివాస్‌ జిల్లాకు బదిలీపై రాగా.. ఆయన 2016 నుంచి 2017 వరకు డీఎంహెచ్‌గా జిల్లాలో పని చేయడం విశేషం. ఆ తర్వాత బదిలీపై వనపర్తి డీఎంహెచ్‌ఓగా వెళ్లారు. నూతనంగా బాధ్యతలు తీసుకున్న డాక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్యసేవలు అందించే విధంగా కృషి చేస్తామని, మెడికల్‌ ఆఫీసర్లు సమయపాలన పాటించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని తెలిపారు. ప్రధానంగా జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు, క్లినిక్‌లు, నర్సింగ్‌ హోంలలో నిత్యం తనిఖీలు చేస్తూ నిబంధనల ప్రకారం నడిచే విధంగా దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ దగ్గర ఫారమ్‌–ఎఫ్‌ ఎంత మంది సమర్పిస్తున్నారు అనే విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement