● కూలిపోయిన ఇంటిని కట్టుకోనీయకుండా టీడీపీ నేతల అడ్డంకులు ● తెల్లకాగితాలపై సంతకాలు తీసుకుని బ్లాక్‌మెయిల్‌ ● ఎస్సీ, ఎస్టీ కేసు వాపసు తీసుకోవాలని డిమాండ్‌ ● కృత్తివెన్ను మండలం దోమనగొందిలో దళిత కుటుంబం ఆవేదన | - | Sakshi
Sakshi News home page

● కూలిపోయిన ఇంటిని కట్టుకోనీయకుండా టీడీపీ నేతల అడ్డంకులు ● తెల్లకాగితాలపై సంతకాలు తీసుకుని బ్లాక్‌మెయిల్‌ ● ఎస్సీ, ఎస్టీ కేసు వాపసు తీసుకోవాలని డిమాండ్‌ ● కృత్తివెన్ను మండలం దోమనగొందిలో దళిత కుటుంబం ఆవేదన

Jun 15 2026 7:28 AM | Updated on Jun 15 2026 7:28 AM

● కూలిపోయిన ఇంటిని కట్టుకోనీయకుండా టీడీపీ నేతల అడ్డంకులు ● తెల్లకాగితాలపై సంతకాలు తీసుకుని బ్లాక్‌మెయిల్‌ ● ఎస్సీ, ఎస్టీ కేసు వాపసు తీసుకోవాలని డిమాండ్‌ ● కృత్తివెన్ను మండలం దోమనగొందిలో దళిత కుటుంబం ఆవేదన

పెడన: దళిత కుటుంబంపై పచ్చ పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యలు దిగుతున్నారు. కృత్తివెన్ను మండలం గరిశపూడి పంచాయతీ శివారు దోమనగొందికి చెందిన సరేళ్ల ఆదిలక్ష్మికి ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు. ఆమెకు నిడమర్రు పంచాయతీలో తాడివెన్ను పరిధిలో ఎల్‌పీ నంబరు 229లో 89 సెంట్ల భూమి ఉంది. 30 ఏళ్లుగా ఆ భూమిని సాగుచేస్తున్నారు. ఆదిలక్ష్మి తన మూడో కుమారుడు సుబ్బారావు వద్ద ఉంటోంది. తమకున్న స్థలంలో ఉన్న రేకుల షెడ్డు కూలిపోవడంతో చిన్న ఇల్లు నిర్మించుకోవాలని భావించారు. ఇంతలో భూమి గురించి కుటుంబంలో గొడవలయ్యాయి. 2025 డిసెంబర్‌లో తల్లిపై, సుబ్బారావుపై కొంతమంది రౌడీలతో రెండో కుమారుడు గంగరాజు దాడి చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

దారి అడ్డుగా ముళ్ల కంపలు

ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న గంగరాజు స్థానిక టీడీపీ నేతలతో చేతులు కలిపి కుటుంబ సభ్యులపై కక్ష సాధింపు చర్యలకు దిగాడు. దారికి అడ్డంగా ముళ్లకంపలు వేశాడు. కుటుంబీకులు.. తమను వేధిస్తున్న కొంత మంది టీడీపీ నేతలపై ఫిర్యాదు చేయగా, పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. కొందరు పెద్దలు న్యాయం చేస్తామని చెప్పి తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నారని, ఆ తర్వాత తాము సాగుచేసుకుంటున్న భూమిలో 20 సెంట్ల భూమిని గంగరాజుకు ఇవ్వాలని, అతనిపై కేసు ఎత్తేయాలని బెదిరిస్తున్నారని చెప్పారు. తాము సంతకాల కాగితాలను ఇచ్చేయాలని కోరుతున్నా ఇవ్వకుండా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపో యారు. సమస్యపై కృత్తివెన్ను తహసీల్దారు నాగమల్లేశ్వరరావుతో ‘సాక్షి’ మాట్లాడగా.. కొత్తగా బాధ్యతలు తీసుకున్నానని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement