ఏటీఎస్‌లలో నిర్వహించే ఫిట్‌నెస్ పరీక్షలపై రవాణాశాఖ అధికారులకు ఎటువంటి అధికారాలు లేవు. ఫిట్‌నెస్ పరీక్షలకు వెళ్లే ముందు వాహనాలను 29 అంశాలతో కూడిన చెక్‌లిస్ట్ ఆధారంగా మాత్రమే పరిశీలిస్తాం. ఫిట్‌నెస్ పరీక్షలకు వచ్చిన బస్సుల్లో లోపాలు గుర్తించి, వాటిని సరిచేసుకుని రావాలని వెనక్కి పంపాం. విద్యార్థుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. సోమవారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేస్తాం.
– ఎండీఎల్ సిద్ధిక్, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, మచిలీపట్నం


