● భక్తుల నుంచి డబ్బులు వసూలు ● దుర్గగుడిలో ఓ మాజీ హోంగార్డు నిర్వాకం | - | Sakshi
Sakshi News home page

● భక్తుల నుంచి డబ్బులు వసూలు ● దుర్గగుడిలో ఓ మాజీ హోంగార్డు నిర్వాకం

Jun 15 2026 7:28 AM | Updated on Jun 15 2026 7:28 AM

● భక్తుల నుంచి డబ్బులు వసూలు ● దుర్గగుడిలో ఓ మాజీ హోంగార్డు నిర్వాకం అపార్టుమెంట్‌పై నుంచి పడి విద్యార్థిని మృతి పెనమలూరు: కానూరులో ప్రమాదవశాత్తు అపార్టుమెంట్‌పై నుంచి పడి విద్యార్థిని మృతి చెందింది. పెనమలూరు సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం కానూరుకు చెందిన కమ్మని రమణయ్య అమరావతి కాలనీలోని ఓ అపార్టుమెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. కుమార్తె దీప్తి(17) ఇంటర్మీడియెట్‌ రెండో సంవత్సరం చదువుతుంది. శనివారం అపార్టుమెంట్‌లో నాల్గవ అంతస్తులు ఫంక్షన్‌ జరుగుతుండటంతో తల్లితో పాటు దీప్తి వెళ్లింది. అక్కడ దీప్తి కాలు జారి ప్రమాదవశాత్తు నాల్గవ అంతస్తు నుంచి కిందకు పడిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్చగా అక్కడ వైద్యం పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందింది. ఈ ఘటనపై దీప్తి తండ్రి రమణయ్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్‌ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం పెనమలూరు: యనమలకుదురు కొండ వెనుక ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం యనమలకుదురు కొండ వెనుక రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ట్రాక్టర్‌ ఢీ కొట్టడంతో అతను మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వయస్సు 40 సంవత్సరాలు ఉంటుందని, ఛాతిపై బెంగాలీ అక్షరాలతో రాసి ఉందన్నారు. అతని చేతులపై టాటూలు ఉన్నాయని, ఎరుపు రంగు బనియన్‌, నలుపు రంగు నైట్‌ ప్యాంట్‌ ధరించి ఉన్నాడన్నారు. అతని పర్స్‌లో కుటుంబ సభ్యుల ఫొటో ఉందని తెలిపారు. అతని వివరాలు తెలిసిన వారు 75697 10417 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలని సీఐ సూచించారు. వీఐపీ దర్శనాల పేరిట టోకరా

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వీఐపీ దర్శనం చేయిస్తానంటూ భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి.. వారిని ఆలయంలో వదిలేసిన ఘటన ఆదివారం దుర్గగుడిలో చోటుచేసుకుంది. గతంలో వన్‌టౌన్‌ పీఎస్‌లో హోంగార్డుగా చంద్రశేఖర్‌ విధులు నిర్వహించే వాడు. అయితే చంద్రశేఖర్‌ హోంగార్డు ఉద్యోగం తర్వాత గతంలో ఉన్న పరిచయాలతో ఆలయంలో తిరుగుతూ భక్తులకు దర్శనాలు చేయించసాగాడు. ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉన్న తరుణంలో మహా మండపం దిగువన టికెట్‌ కౌంటర్‌ వద్ద నిల్చుని వీఐపీ దర్శనాలు చేయిస్తానంటూ కొంత మంది భక్తుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. డబ్బులు చెల్లించిన నాలుగు బృందాలను లిఫ్ట్‌ ద్వారా కొండపైకి తీసుకువెళ్లి వారిని ఆలయ ప్రాంగణంలో వదిలేశాడు. డబ్బులు చెల్లించిన భక్తులు చంద్రశేఖర్‌ కోసం ఎదురు చూసినా అతని జాడ కనిపించలేదు. దీంతో మోసపోయామని గ్రహించిన భక్తులు ఆలయంలో అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆలయ ప్రాంగణంలోని పోలీస్‌ అవుట్‌పోస్టులో సిబ్బందికి సైతం విషయం తెలియజేశారు. వెంటనే అప్రమత్తమైన అవుట్‌ పోస్టు సిబ్బంది చంద్రశేఖర్‌ కోసం ఆలయ ప్రాంగణంలో, దేవస్థాన సీసీ కెమెరాలో వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో విసుగుపోయిన భక్తులు వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు బృందాల్లో మొత్తం 15 మంది భక్తుల నుంచి రూ.500 చొప్పున రూ. 7500 వసూలు చేసినట్లు భక్తులు పేర్కొంటున్నారు. అయితే ఉదయం నుంచి కూడా చంద్రశేఖర్‌ పలువురికి వీఐపీ దర్శనాలు చేయించినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో కొంత మంది ఆలయ సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు ఆలయ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రశేఖర్‌ ఫోన్‌ నంబర్‌ ఆధారంగా అతని ఆచూకీ తెలుసుకునే పనుల్లో పోలీసులు నిమగ్నమయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement