ప్రజల్లో రక్తదానంపై మరింత అవగాహన పెరగాల్సి ఉంది. 18 నుంచి 60 ఏళ్ల ఆరోగ్యవంతులు ప్రతి మూడు నెలలకోసారి రక్తదానం చేయొచ్చు. ప్రభుత్వాస్పత్రికి వచ్చే పేద రోగులకు అవసరమైన రక్తాన్ని వీలైనంత మేరకు అందించగలుగుతున్నాం. ప్రైవేటు బ్లడ్ బ్యాంకు నుంచి మాకు రావాల్సిన 30 శాతం యూనిట్లు పూర్తిస్థాయిలో రావడం లేదు. అవికూడా వస్తే రోగులకు మరింత బ్లడ్ యూనిట్స్ అందుబాటులో ఉంటాయి. మా బ్లడ్‌బ్యాంకు నుంచి ప్రసూతి విబాగానికి అత్యధికంగా యూనిట్లు కేటాయిస్తున్నాం.
– డాక్టర్ ఎం.అనిత, బ్లడ్ బ్యాంకు ఇన్‌చార్జి, జీజీహెచ్


