రక్తదాతకు అవార్డు | - | Sakshi
Sakshi News home page

రక్తదాతకు అవార్డు

Jun 14 2026 11:43 AM | Updated on Jun 14 2026 11:43 AM

రక్తదాతకు అవార్డు

చల్లపల్లి: ఉమ్మడి కృష్ణాజిల్లాలోనే అత్యధికసార్లు రక్తదానం చేసిన వ్యక్తిగా చల్లపల్లికి చెందిన కస్తూరి విజయ్‌ కుమార్‌ శనివారం రెడ్‌క్రాజ్‌ జిల్లా అధ్యక్షుడు, కలెక్టర్‌ డి.కె.బాలాజీ, చైర్మన్‌ డాక్టర్‌ డీఆర్కే ప్రసాద్‌ చేతులు మీదుగా అవార్డు అందుకున్నారు. స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తగా సమాజ సేవలో పాల్గొనే విజయ్‌కుమార్‌ ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేస్తుంటాడు. ఇప్పటి వరకూ 80 సార్లు రక్తదానం చేసి ఉమ్మడి జిల్లాల్లోనే అత్యధిక సార్లు రక్తదానం చేసిన వ్యక్తిగా గుర్తింపుపొందారు. ఇందులో భాగంగా ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ బాలాజీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement