దంపతుల మృతి.. మాగల్లులో విషాదం | - | Sakshi
Sakshi News home page

దంపతుల మృతి.. మాగల్లులో విషాదం

Jun 14 2026 11:43 AM | Updated on Jun 14 2026 11:43 AM

● క్యాన్సర్‌ బారిన పడిన భార్య ● ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మనోవేదన ● భార్యాభర్తల ఆత్మహత్య

● క్యాన్సర్‌ బారిన పడిన భార్య ● ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మనోవేదన ● భార్యాభర్తల ఆత్మహత్య

నందిగామ రూరల్‌: క్యాన్సర్‌ వ్యాధి ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. క్యాన్సర్‌ బారిన పడిన భార్యకు వైద్యం చేయించిన ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మనస్తాపంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మాగల్లు గ్రామంలో చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన గుర్రం శ్రీనివాసరావు (52) వ్యవసాయంతో పాటు గ్రామంలోనే ఎరువులు, పురుగు మందుల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. భార్య శైలజ (48) గత కొంత కాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతోంది. ఆమెను పలు హాస్పిటల్స్‌లో వైద్యం చేయించినా ఆరోగ్యం కుదుట పడలేదు. ఏకై క కుమారుడు వినోద్‌ను ఉన్నత చదువుల నిమిత్తం ఈ ఏడాది ఏప్రిల్‌లో యూకే వెళ్లాడు. శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో దంపతుల మాటల మధ్యన మెరుగైన వైద్యం చేయించాలని భార్య కోరింది. ఆమె ఆరోగ్య పరిస్థితి తెలిసిన శ్రీనివాసరావు మనస్తాపం చెంది గడ్డి మందు తాగడంతో గమనించిన భార్య భార్య శైలజ సైతం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. దంపతుల పరిస్థితిని గమనించిన చుట్టుపక్కల వారు బంధువులకు సమాచారం అందించగా హుటాహుటినా వారిని విజయవాడ తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శ్రీనివాసరావు శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందగా శైలజ శనివారం మృతి చెందారు. ఎంతో కలివిడిగా ఉండే భార్యాభర్తలు ఒకేసారి మృతి చెందటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి.శ్రీను తెలిపారు.

శ్రీనివాసరావు (ఫైల్‌)

శైలజ (ఫైల్‌)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement