చిలకలపూడి(మచిలీపట్నం): రక్తదానం సమాజ హితానికి గొప్ప సేవగా నిలుస్తోందని కలెక్టర్, రెడ్‌క్రాస్ అధ్యక్షుడు డీకే బాలాజీ అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం మీ కోసం సమావేశ మందిరంలో రక్తదాతల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత రెడ్‌క్రాస్ పితామహుడు హెన్రీడ్యూనాన్ట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాతలను ఘనంగా సత్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వయంగా రక్తదానం చేయడంతో పాటు తమతో మరో వ్యక్తిని కూడా రక్తదానం చేసేలా ప్రోత్సహించాలన్నారు. రక్తదానం ప్రాణదానమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో ఉండటం అత్యంత కీలకమన్నారు. రక్తదానంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు కొత్త జీవితం లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా డీఎల్‌ఏటీవో అంబటి వెంకట్రావు, జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ డాక్టర్ బీఆర్కే ప్రసాద్, ట్రెజరర్ సుకుమార్, సెక్రటరీ శంకర్‌నాథ్, మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు బి.వెంకటేశ్వరరావు, బి.విష్ణువర్ధన్, డాక్టర్ శర్మిష్ట, డాక్టర్ వీరేంద్రనాథ్, లీల బ్రహ్మేంద్ర, పి.శ్రీరామ్ ప్రసాద్, పి.సుందరరామయ్య, సబ్ బ్రాంచ్ చైర్మన్లు శేషుబాబు, మాధవి, సుబ్బారావు, డాక్టర్ శివప్రసాద్, లైఫ్ సభ్యులు తదితరులుపాల్గొన్నారు.
కలెక్టర్ డీకే బాలాజీ


