నేడు యూరో ఆంకాలజీ రాష్ట్ర సదస్సు | - | Sakshi
Sakshi News home page

నేడు యూరో ఆంకాలజీ రాష్ట్ర సదస్సు

Jun 14 2026 11:43 AM | Updated on Jun 14 2026 11:43 AM

లబ్బీపేట(విజయవాడతూర్పు): యూరాలజీలో అత్యాధునిక చికిత్సా విధానాలపై వైద్యులకు సమగ్ర అవగాహన కలిగించేందుకు ఆదివారం నగరంలో యూరో– ఆంకాలజీ రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు సదస్సు ఆర్గనైజింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంవీ కృష్ణకిషోర్‌ తెలిపారు. ఈ సదస్సులో మూత్రపిండాలు, ప్రోస్టేట్‌, మూత్రాశయ క్యాన్సర్ల చికిత్సలో అత్యాధునిక వైద్య విధానాలు, రోబోటిక్‌ శస్త్రచికిత్సలు, శాసీ్త్రయ ఆధారాలతో కూడిన వైద్య నిర్ణయాలు, శస్త్రచికిత్స నైపుణ్యాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా లబ్బీపేటలోని ప్రశాంత్‌ హాస్పిటల్స్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్‌ కృష్ణకిషోర్‌ మాట్లాడుతూ సొసైటీ ఆఫ్‌ జెనిటో యూరినరీ సర్జన్స్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (సోగస్‌–ఏపీ) ఆధ్వర్యంలో, విజయవాడ అసోసియేషన్‌ ఆఫ్‌ జెనిటో యూరినరీ సర్జన్స్‌ (వేగస్‌) సహకారంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సులో రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన 200ల మందికి పైగా యూరాలజిస్టులు, శస్త్రచికిత్స నిపుణులు పాల్గొంటారని తెలిపారు. వేగస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, సైంటిఫిక్‌ కన్వీనర్‌ డాక్టర్‌ పి.శ్రీమన్నారాయణ, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ కె.ప్రియతమ్‌, ఆర్గనైజింగ్‌ ట్రెజరర్‌ డాక్టర్‌ కె.ధీరజ్‌, పేట్రన్‌ డాక్టర్‌ కె.ప్రశాంత్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement