పెనమలూరు: తాడిగడప గ్రామంలో రెండు కార్లు ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలకు గాయాలు కావడంతో పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం తాడిగడపకు చెందిన విమల అనే మహిళ తన తల్లితో కలిసి కారులో పోరంకికి బయలుదేరింది. కారు క్వాలిటీ ఐస్‌క్రీమ్ వద్దకు రాగా ఎదురుగా వచ్చిన మరో కారు వీరి కారును ఢీ కొట్టింది. దీంతో వీరి కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలో పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న విమల చేయి విరగ్గా, ఆమె తల్లికి గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదులతో పోలీసులు కేసు నమోదు చేశారు.


