మా స్వస్థలమైన మిర్యాలగూడలోనే దాదాపు నా చదువంతా కొనసాగింది. పాఠశాల విద్య సమయంలో వేసవి సెలవులు వస్తున్నాయనగానే ఆ తర్వాత ఏడాదికి ముందుగానే సీనియర్ల నుంచి పుస్తకాలు సేకరించుకునేవాళ్లం. అలా వేసవి సెలవుల్లోనే ఆ పుస్తకాలను చదవడం ఇష్టంగా ఉండేది. ఇక పాఠశాలలు మొదలయ్యాక కూడా ఏ రోజు ఏం పాఠం చెబుతారనే ఉత్సాహంతో వెళ్లేవాళ్లం. ఇంటి నుంచి రెండు, మూడు కి.మీ. సైకిళ్లపై పాఠశాలకు వెళ్లిన రోజులు ఉన్నాయి. ఏటా నూతన విద్యాసంవత్సరంలో పాత స్నేహితులతో పాటు కొత్తగా పలువురు కలిసేవారు. స్కూల్ ముగిశాక ఇంటికి వెళ్లే సమయాన అంతా కలిసి ఐస్‌క్రీమ్స్ కొనుక్కుని తినేవాళ్లం. పాఠశాల నాటి రోజులు గుర్తుకొస్తే ఇప్పటికీ ఆనందంగా ఉంటుంది. – జి.జ్యోతి,
డీబీసీడీఓ, ఎస్సీ డీడీ, ఖమ్మం


