అన్నయ్య చేయి పట్టుకుని నడిచా.. | - | Sakshi
Sakshi News home page

అన్నయ్య చేయి పట్టుకుని నడిచా..

Jun 15 2026 12:11 AM | Updated on Jun 15 2026 12:11 AM

అన్నయ్య చేయి పట్టుకుని నడిచా..

మాది వరంగల్‌ జిల్లా ఖిలా వరంగల్‌ మండలం తిమ్మాపూర్‌. అమ్మానాన్న యాదగిరి – భాగ్య వ్యవసాయం చేస్తూ నన్ను, అన్నయ్య రాజును చదివించారు. చిన్నప్పుడు స్కూల్‌కు వెళ్లేందుకు మారాం చేసేవాడిని. కానీ అన్నయ్య సర్దిచెప్పి వెంట తీసుకెళ్లేవాడు. మా ఊరి ప్రభుత్వ పాఠశాలలోనే తెలుగు మీడియంలో 10వ తరగతి, ఇంటర్‌ వరంగల్‌లో చదివి ఓపెన్‌ డిగ్రీ పూర్తిచేశా. 2007లో హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ 2009లో ఎస్‌ఐగా ఎంపికవడంతో తొలి పోస్టింగ్‌ కరకగూడెంలో వచ్చింది. ఈ జిల్లాలోని పలు స్టేషన్లలో విధులు నిర్వర్తించాక సీఐగా పదోన్నతిపై హైదరాబాద్‌ వెళ్లినా, మళ్లీ డీఎస్పీగా పదోన్నతితో భద్రాచలంలో పోస్టింగ్‌ వచ్చింది. మా అన్నయ్య రాజు జనగామ ్ల రెవెన్యూ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. అన్నయ్య ప్రోత్సాహంతోనే చదువు పూర్తిచేసి ఈ స్థాయికి చేరగలిగా.

– అరుణ్‌కుమార్‌, భద్రాచలం డీఎస్పీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement