కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్‌ నేతలు | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్‌ నేతలు

Jun 14 2026 7:16 AM | Updated on Jun 14 2026 7:16 AM

ఖమ్మం వైరారోడ్‌: జిల్లాలోని పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శనివారం కలెక్టర్‌ దివాకరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఖమ్మంలో అఘాయిత్యానికి గురైన బాధిత బాలిక కుటుంబానికి తక్షణ సాయం అందిండమే కాక నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, రైతులకు సకాలంలో యూరియా, విత్తనాలు అందేలా చూడాలని, యూరియా యాప్‌ ద్వారా కాకుండా నేరుగా సరఫరా చేయాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో నాయకులు బెల్లం వేణుగోపాల్‌, ఉన్నం బ్రహ్మయ్య, పాల వెంకట్‌రెడ్డి, భాషబోయిన వీరన్న, పోట్ల శ్రీనివాసరావు, డేరంగుల బ్రహ్మం, డేరంగుల వెంకటరమణ, పగుట్ల వేంకటేశ్వరరావు, రెంటాల ఆనంద్‌, లింగాల కృష్ణ, చుంచు విజయ్‌ కుమార్‌, దుర్గయ్య, గవర్రాజు శంకర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement