ఎండోమెంట్‌ ఈఓ నరసింహారావుకు పదోన్నతి | - | Sakshi
Sakshi News home page

ఎండోమెంట్‌ ఈఓ నరసింహారావుకు పదోన్నతి

Jun 13 2026 7:32 AM | Updated on Jun 13 2026 7:32 AM

ఖమ్మంగాంధీచౌక్‌: ఖమ్మం రోటరీనగర్‌ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం (పర్ణశాల)లో గ్రేడ్‌–2 ఈఓగా విధులు నిర్వర్తిస్తున్న వీ.వీ.నర్సింహారావుకు గ్రేడ్‌–1 ఈఓగా పదోన్న తి లభించింది. రాష్ట్రంలో పదోన్నతి పొందిన అధికారులకు శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉత్తర్వులు అందజేశారు. ఇందులో భాగంగా మంత్రి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజారామయ్య, కమిషనర్‌ ఎం. హన్మంతరావు చేతుల మీదుగా నర్సింహారా వు ఉత్తర్వులు అందుకున్నారు. ఆయనను ఉమ్మడి జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ మేకల వీరస్వామి తదితరులు అభినందించారు. కాగా, ఈ నెలాఖరు నాటికి గ్రేడ్‌–3 ఈఓలకు గ్రేడ్‌–2 ఈఓలుగా పదోన్నతి లభించే అవకాశముందని తెలిసింది.

రోడ్డు నిర్మాణానికి రూ.6.50 కోట్లు

కల్లూరురూరల్‌: కల్లూరు మండలంలోని చెన్నూ రు వద్ద నిర్మాణంలో ఉన్న ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌కు రహదారి నిర్మాణం కోసం రూ.6.50కోట్ల మంజూరు పత్రాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయికి పంచాయతీరాజ్‌ శాఖ ఈఎన్‌సీ జోగారెడ్డి, జిల్లా ఎస్‌ఈ వెంకట్‌రెడ్డి శుక్రవారం అందజేశారు. స్కూల్‌కు వెళ్లే మార్గంలో రహదారి నిర్మాణానికి ఇప్పటికే సర్వే పూర్తయింది. అయితే, కొందరు రైతులు అభ్యంతరం తెలపగా వారిని ఒప్పించడంతో స్థలం ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో అడ్డంకులు తొలగిపోగా ప్రభుత్వం రహదారి నిర్మాణానికి రూ. 6.50 కోట్లు కేటాయించింది.

‘శ్రీచైతన్య’

అధ్యాపకుడికి అవార్డు

ఖమ్మంరూరల్‌: మండలంలోని పొన్నేకల్‌లోని శ్రీచైతన్య ఇంజనీరింగ్‌ కళాశాల ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధ్యాపకుడు డి.హతిరామ్‌ చైన్నె ఐఐటీ నుంచి అవార్డు అందుకున్నారు. ఎన్‌పీటీఈఎల్‌ కార్యక్రమం ద్వారా ఆయనకు మోటివేటెడ్‌ లెర్నర్‌ అవార్డు ప్రకటించారు. అధ్యాపక వృత్తిలో కొనసాగుతూనే ఏఐ, డేటా సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ రంగాల్లో అధ్యయనం చేస్తూ ఆన్‌లైన్‌ కోర్సులు పూర్తి చేసిన ఆయన అవార్డుకు ఎంపికయ్యా రు. ఈ సందర్భంగా హతీరామ్‌ను కళాశాల చైర్మన్‌ మల్లెంపాటి శ్రీధర్‌, డైరెక్టర్‌ శ్రీవిద్య, ఈడీ డాక్టర్‌ సాయిగీతిక, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జె.లక్ష్మీనారాయణ అధ్యాపకులు అభినందించారు.

జాబితా సవరణలో

బీఎల్‌ఓలే కీలకం

ఏన్కూరు: సమగ్ర ఓటరు జాబితా సవరణ, అర్హుల పేర్లతో జాబితా తయారీలో బీఎల్‌ఓలదే కీలకపాత్ర అని అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ తెలిపారు. మండలంలోని భగవాన్‌నాయక్‌తండా, అక్కినపురం తండాల్లో సమగ్ర సర్వే మ్యాపింగ్‌ను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. బీఎల్‌ఓలు సహాయకులుగా వలంటీర్లను నియమించుకోవచ్చని తెలిపారు. బీఎల్‌ఓల పనితీరును సూపర్‌వైజర్లు పరిశీలిస్తూ తప్పులు దొర్లకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఏన్కూరు తహసీల్దార్‌ సీహెచ్‌ శేషగిరిరావు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement