సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

Jun 13 2026 7:32 AM | Updated on Jun 13 2026 7:32 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): సైబర్‌ మోసాలపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ రీజినల్‌ మేనేజర్‌ పీజీఎన్‌ శర్మ అన్నారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో శుక్రవారం సైబర్‌ మోసాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సురక్షితమైన డిజిటల్‌ వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఎస్బీఐ రెండేళ్లుగా ఖాతాదారులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సైబర్‌ మోసం జరిగితే మొదటి గంటలోనే 1930 నంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. త్వరగా ఫిర్యాదు చేస్తే నష్టపోయిన మొత్తాన్ని తిరిగి పొందే అవకాశాలు పెరుగుతాయన్నారు. అనుమానాస్పద కాల్స్‌, మెసేజ్‌లు, లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జిల్లాలోని ఎస్‌బీఐ బ్రాంచిల సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్బీఐ రీజినల్‌ మేనేజర్‌ పీజీఎన్‌ శర్మ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement