చేనేత కార్మికుల సమస్యలపై మంత్రికి వినతి | - | Sakshi
Sakshi News home page

చేనేత కార్మికుల సమస్యలపై మంత్రికి వినతి

Jun 13 2026 7:32 AM | Updated on Jun 13 2026 7:32 AM

ఖమ్మంమామిళ్లగూడెం: చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి కోరారు. అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కందగట్ల స్వామి, గడ్డం జగన్నాథం తదితరులతో కలిసి శుక్రవారం ఆయన రాష్ట్ర చేనేత, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. దీంతో ఆయన శాఖ కమిషనర్‌ శైలజా రామయ్యర్‌కు ఫోన్‌లో సూచనలు చేశారు. అనంతరం నాయకులు ఆమెను కలిసి సమస్యలను విన్నవించారు. ఇప్పటికే 2.50 లక్షల బెడ్‌ షీట్లు, కార్పెట్ల తయారీకి ఆర్డర్‌ ఇచ్చామని, మరో రెండు లక్షల బెడ్‌షీట్ల ఆర్డర్‌ కూడా ఇస్తామని తెలిపారు. అలాగే, ఈ ఏడాది మార్చి నుంచి చేనేత సహకార సంఘాల కార్మికులకు పెంచిన వేతనాలు అమవుతాయని, సహకార సంఘాల ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని వెల్లడించారు. అంతేకాక పెండింగ్‌ బిల్లులు, మృతి చెందిన కార్మికులకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపుపై చర్చించారు. కార్యక్రమంలో నాయకులు అవ్వారి భాస్కర్‌, మాచర్ల రామచందర్‌రావు, కందగట్ల భిక్షపతి, గుర్రం శ్రావణ్‌, వడ్నాల నరేందర్‌, అంబటి శ్రీనివాస్‌తో పాటు పలు జిల్లాల బాధ్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement